Wednesday, December 11, 2013

బలాన్ని ఇచ్చే బాదం

బలాన్ని ఇచ్చే బాదం బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం. ఎలా వాడితే మంచిది?
వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.
బాదంపాలు: బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.
మంచి టానిక్‌: బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.
కొన్ని సూచనలు: ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.

Friday, December 6, 2013

యోగాతో లాభాలెన్నో...

యోగాతో లాభాలెన్నో... యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్నకొద్దీ శరీరం తేలికవుతుంది, ఆలోచనలు దారికి వస్తాయి, జీవనశైలిలో మంచి మార్పొస్తుంది. యోగా వల్ల కలిగే ముఖ్యమైన తొమ్మిది లాభాలు ఇవే...
ఆల్‌రౌండ్ ఫిట్‌నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతౌల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారనే దే ఆరోగ్యానికి కొలమానం.
ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం - ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజ్‌గా దానికి దోహదపడతాయి.
బరువు తగ్గడం : దరికీ కావాల్సిందిదే. సూర్యనమస్కారాలు, కపాలభాతి ప్రాణాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా యోగా చేసేటపుడు మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది. దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి నివారణ : ఉదయాన్నే కొద్దిసేపు యోగా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. శరీరంలోని మలినాలను వదిలించడంతో పాటు మనస్సు పరిశుభ్రంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుంది.
ప్రశాంతత : ప్రకృతిలోని ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశాలంటే మన అందరికీ ఇష్టమే. కాని ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు, అది మనలోనే ఉంటుంది. రోజుకోసారి లోపలికి ప్రయాణించి దాన్ని అనుభూతి చెందవచ్చు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపరచడానికి యోగాను మించిన సాధనమేదీ లేనేలేదు.
రోగనిరోధక శక్తి : శరీరం, మనసు, మేథ - అన్నీ కలిస్తేనే ఆరోగ్యం. యోగా అవయవాలకు సరిపడా శక్తినిస్తుంది, కండరాలను దృఢం చేస్తుంది. శ్వాస టెక్నిక్‌లు, ధ్యానం ద్వారా స్ట్రెస్ తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అవగాహన : మన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. గతం, భవిష్యత్తులకు సంబంధించిన అనేక అంశాలతో అది పరుగులు పెడుతూ ఉంటుందేగాని వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. యోగ, ప్రాణాయామాల వల్ల ఈ సత్యం అవగాహనలోకి వస్తుంది. దాంతో ఆలోచనలను నియంత్రించడం సులువు అవుతుంది. అప్పుడే వర్తమానం మీద ఫోకస్ చెయ్యగలుగుతాం.
మెరుగైన సంబంధాలు : జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు - ఇలా చుట్టూ ఉన్న అన్ని బంధాలనూ మెరుగు చెయ్యడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రశాంతమైన మనసు, అదుపులో ఉండే భావోద్వేగాల వల్ల ప్రేమ, అనుబంధాలు దృఢమవుతాయి.
ఎక్కువ శక్తి : ఒకేసారి నాలుగు రకాల పనులు చెయ్యడంతో రోజంతా పనిచేసిన తర్వాత పూర్తిగా అలసిపోయి, శక్తినెవరో లాగేసినట్టు అయిపోతారు చాలామంది. కొద్దిసేపు యోగా చేస్తే మళ్లీ తాజాగా, ఉత్సాహంగా ఉంటారు.
ఫ్లెక్సిబిలిటీ : ఉరుకులుపరుగులు నిండిన జీవనశైలి వల్ల చిన్నాపెద్దా అందరికీ సాయంత్రానికల్లా ఒంటి నొప్పులు సాధారణమైపోయాయి. యోగా కండరాలను బలోపేతం చేసి టోన్ చేస్తుంది. నడిచినా, నిలబడినా, కూర్చున్నా సరైన భంగిమలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. దానితో ఒంటి నొప్పులు ద రికి చేరవు.

Saturday, November 2, 2013

అల్పాహారం ........ ఎంత అయితే అంత ఆరోగ్యం...!

అల్పాహారం ........
ఎంత అయితే అంత ఆరోగ్యం...!
అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

Tuesday, October 15, 2013

Drs Chandu

మన చర్మం రంగు అనేక కారణాల వల్ల తన సహజత్వాన్ని కోల్పోతుంది ఈ చర్మపు రంగు మారడానికి గల కొన్ని కారణాలు ... చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు., ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి కొన్ని చిట్కాలు #

1) కేరెట్ గుజ్జును, ముల్తానా మట్టితో (ఫుల్లర్ మట్టి) కలిపి ఒక చిక్కటి గుజ్జుగా తయారు చేయండి. ఒక విటమిన్ సి బిళ్ళను పొడి చేసి కలపండి. మీ ముఖం పైన పూసి, కడగడానికి ముందు ఇరవై నిముషాల పాటు ఉంచండి. ఇలా ప్రతి వారం చేయండి.
2) 4 టీ స్పూనుల పాల పిండిని తీసుకొని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లా చేయండి. దీనికి గ్లిసరిన్ కలిపి చర్మం రంగు మారిన ప్రదేశాలలో పూయండి. దీనిని 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఔషధాల దుకాణాల్లో సులువుగా లభ్యమౌతాయి.
3) ఒక బంగాళదుంపను తోలు తీసి కొన్ని చుక్కల నీటిని దాని పైన వేయండి. చర్మం పైన మచ్చలుగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. బంగాళదుంప రసం చర్మం పై ఉన్న మచ్చల రంగును తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
4) ఓట్ మీల్ పొడిని, పెరుగుతో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం, టమోటా రసం కూడా కలపండి. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారానికొకసారి దీనిని ప్రభావిత ప్రాంతాలలో పూయండి.
5) తులసి ఆకులను, నిమ్మరసంతో కలిపి చర్మం రంగులోని మచ్చలను తగ్గించడానికి ప్రభావితప్రాంతాలలో పూయండి.
6) ఆలివ్ ఆయిల్ లో కలిపిన పంచదారతో మీ శరీర౦ పై రుద్దండి. పంచదార పూర్తిగా కరిగే దాక రుద్దాలి. దీన్ని మీ చేతులు, కాళ్ళు, మెడ, శరీరంలోని ఇతర ప్రభావిత ప్రాంతాలలో వాడవచ్చు.
7) నిమ్మరసం, తేనే, బాదం నూనె ప్రతీదీ ఒక టీ స్పూన్ తీసుకోండి. సహజసిద్ధమైన మెరిసే చర్మం కోసం దీనిని మీ ముఖంపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయండి.
తగినన్ని మంచి నీళ్ళు తాగడం వలన మీ శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. తద్వారా అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది
9) పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స.
10) మజ్జిగతో మొహాన్ని కడగడం వలన కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.

Drs Chandu

సున్ని పిండి తయారు చేసుకునే పద్ధతి
 సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం.
శనగపిండి, పెసరపిండి వీటికి తోడు కచ్చూరాలని బజారులో దొరుకుతాయి వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడి కాని, కుంకుడు కాయ పొడి కాని కలిపివాడుకోవచ్చు.
దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.
సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో తల రుద్దు కుంటే జిడ్డు తొందరగా వదులుతుంది.
తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత స్నానం చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది.
మట్టి శరీరం మీద చెమటతో కలిసి నల్లగా పేతుకుపోతుంది, ఇది పోవాలంటే, సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి శుభ్రపరచు కోవటం కష్టం , అందుకు వారు నూనె రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు సౌందర్యానికి సౌందర్యం
!

Drs Chandu మెంతి ఔషధ గుణాలు #

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు.
మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
మెంతి ఆకుల ఔషధ గుణాలు #
*‌ ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
*‌ పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
*‌ కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
*‌ ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
*‌ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
*‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
*‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.

మెంతి గింజలు #
*‌ రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
*‌ నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
*‌ కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
*‌ పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
*‌ మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
*‌ మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
*‌ మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.

100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు #
పిండిపదార్థాలు 44.1 శాతంప్రోటీన్లు 26.2 శాతంకొవ్వు పదార్థాలు 5.8 శాతంఖనిజ లవణాలు 3 శాతంపీచు పదార్థం 7.2 శాతంతేమ 13.7 శాతం
కాల్షియం, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మెంతి ఆకుల్లో ఏ విటమిన్‌ అధికంగా ఉంటుంది.
100 గ్రాముల ఆకుల్లో పోషక విలువలు #
పిండి పదార్థాలు 60 శాతంప్రోటీన్లు 4.4 శాతంకొవ్వు పదార్థాలు 1 శాతంఖనిజ లవణాలు 1.5 శాతంపీచు పదార్థం 1.2 శాతం
మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి.

Drs Chandu ఆకుకూరలతో కలిగే మేలు

ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.
ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చు.
వండిన ఆకుకూరలను శిశువులకు తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని తొలగించవచ్చు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు. ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు. అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో వేపుడు చేయరాదు.
ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి.అందరికి అవసరమైనవి.
ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.తద్వారా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి అనువైనవి.మునగ చెట్టు,అవిసె చెట్టు లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి ఆకులను సేకరించడం సులువుగా ఉంటుంది.