Friday, February 21, 2014

బీట్రూట్ రసంతో నిత్య యవ్వనం!


వయసు పెరుగుతున్నప్పటికీ యవ్వనంతోనే ఉండాలని ఉందా?.. దీనికి మీరు ఏ అమృతం కోసమో పాకులాడాల్సిన పని లేదు. రోజూ ఓ గ్లాసు బీట్రూట్ రసాన్ని తాగండి.. మీ వయసు పెరుగుతున్నప్పటికీ.. మీరు మాత్రం కుర్రాడిలాగా చలాకీగానే ఉంటారు. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు తాజాగా ఈ విషయాన్ని కనుగొన్నారు. "మానవ దేహంలో రక్తనాళాలు బాగా విచ్చుకొని.. రక్త ప్రసరణ సమగ్రంగా జరిగేలా బీట్రూట్ రసం దోహదపడుతుంది. ముదిమి మీదపడుతున్న వారు, ఊపరితిత్తుల సమస్యలు, హృద్రోగంతో బాధపడే వారు.. ఈ రసాన్ని బాగా తాగాలి.

శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా.. పెద్ద వయసు వారు కూడా కుర్రాళ్లలా చలాకీగా ఉండేందుకు బీట్రూట్ రసం ఉపకరిస్తుంది'' అని బ్రిటన్‌లోని ఎక్సెటర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు క్యాటీ లాన్స్‌లే అన్నారు. బీట్రూట్ రసంలో నైట్రేట్ నిల్వలు అధిక స్థాయిలో ఉంటాయి. దాంతో బీట్రూట్ రసం తాగిన వాళ్ల శరీరంలో రక్త నాళాలు మరింతగా విచ్చుకొనేలా ఈ నైట్రేట్ దోహదపడుతుంది.
ఫలితంగా అలాంటి వారిలో రక్తపోటు తగ్గి.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలా వారి శరీరంలోని అవయవాలన్నింటికీ అధిక స్థాయిలో ఆక్సిజన్ అందుతుంది. నిజానికి.. కేవలం బీట్రూట్‌లోనే కాకుండా.. ఆకు కూరల్లో కూడా నైట్రేట్ లభ్యమవుతుంది. అయితే.. ఆకు కూరలను వండుకొని తినడం కన్నా.. బీట్రూట్ రసాన్ని ఎక్కువ మోతాదులో తాగడం తేలిక. కాబట్టి రోజూ బీట్రూట్ రసాన్ని తాగడాన్ని ఓ అలవాటుగా చేసుకోవాలని పెద్ద వయసు వారికి పరిశోధకులు సూచిస్తున్నారు. కాగా.. ఈ పరిశోధకులు తమ అధ్యయన ఫలితాలను 'జర్నల్ ఆఫ్ ఆప్లైడ్ ఫిజియాలజీ' అనే వైద్య పత్రికలో ప్రచురించారు.

Sunday, February 16, 2014

గుండె నొప్పి వస్తే ఏం చేయాలి ?


బీపీ, షుగర్, పని ఒత్తిళ్ల వల్ల హృద్రోగాలు వస్తున్నాయి. గుండె కండరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడటం వల్ల గుండె నొప్పి వస్తుంటుంది. కారణాలేవైనా ఆకస్మాత్తుగా గుండె నొప్పితో సృహ కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొందరు గుండెనొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు గుండెనొప్పి వచ్చిన రోగులు, వారి పక్కన ఉన్న వారు ఏం చేయాలనే విషయాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఎవరైనా సృహ కోల్పోయినప్పుడు పక్కన ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అంబులెన్స్‌ను పిలిచి, జాప్యం లేకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలా కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడవచ్చు. కార్యాలయంలోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నప్పుడు గుండె నొప్పితో పడిపోతే సమీపంలో ఉన్న వారు చేయాల్సిన ప్రాథమిక చికిత్సలపై అందరికీ అవగాహన అవసరం. వివిధ రకాల హృద్రోగాల వల్ల ఓ వ్యక్తి గుండె ఆగి మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు రక్త సరఫరా నిలచినప్పుడు సృహ కోల్పోతాడు. అలాంటప్పుడు పక్కనున్న వారు కార్డియాక్ రెసిస్టేషన్ కోసం ప్రాథమిక చికిత్స చేయటం వారి కర్తవ్యంగా భావించాలి. ఛాతీ వద్ద రెండు చేతులు ఒకదానిపై ఒకటి పెట్టి అదుముతుండాలి. అలా నిమిషానికి 60 నుంచి 70 సార్లు చేయాలి. నోటి నుంచి నోటి ద్వారా సృహ కోల్పోయిన రోగికి శ్వాస కల్పించాలి. రోగి మెడ వెనుక చేయి పెట్టి డీఫిబ్రిలేటర్ మిషన్ సాయంతో షాక్ ఇవ్వాలి. దీనివల్ల ఆగిపోయిన గుండె బ్రెయిన్‌డెడ్ కాకముందే స్టిములేట్ అయి పనిచేయటం ఆరంభిస్తుంది. దీంతోపాటు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, సత్వరం రోగిని ఆసుపత్రికి చేర్చాలి.
శ్వాస పీల్చి వదలాలి...
ఆకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినపుడు మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే దీర్ఘంగా శ్వాస పీల్చి వదులుతుండాలి. తన రెండు చేతులతో గుండెను అదుముతూ కంప్రెషన్ చేసుకుంటే మంచిది. దీంతోపాటు వెంటనే ఫోన్ చేసి, అంబులెన్స్‌ను తెప్పించుకొని, వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి. గుండెనొప్పి వచ్చినపుడు ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో తీసుకునే బేసిక్ లైఫ్ సపోర్టు రోగి ప్రాణాలు కాపాడేందుకు దోహదం చేస్తుంది. గుండెనొప్పి వచ్చినపుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అందరిలో చైతన్యం రావాలి. అమెరికాలోని విమానాశ్రయాలు, బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, షాపింగ్ మాల్స్, పెద్ద కార్యాలయాల్లో డీఫిబ్రిలేటర్ మిషన్‌లు ఉంటాయి. దీని వల్ల ఆగిపోయిన గుండెను పనిచేయించేందుకు ఇవి ఉపయోగపడతాయి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు హృద్రోగులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.
తక్షణ వైద్య చికిత్స
గుండెనొప్పి వచ్చిన రోగికి ఆసుపత్రికి తీసుకొచ్చాక తక్షణ వైద్య చికిత్స చేయించాలి. నోరు లేదా ముక్కులో నుంచి ట్యూబ్ పంపించి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తారు. తొడ లేదా మెడలోని చిన్న రక్తనాళం ద్వారా గుండె లోపలకు పేస్‌మేకర్ ద్వారా విద్యుత్తు ఇచ్చి గుండెలో రక్తం పంపింగ్‌ను పెంచుతారు. బెలూన్ పంపు, ఇంప్లెల్లా డివైజ్‌ల ద్వారా గుండె ఎడమ వైపు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరాను పెంచుతారు. ఈ చికిత్స వల్ల ఆక్సిజన్‌తోపాటు రక్త సరఫరా మెరుగుపడి హృద్రోగి కోలుకుంటాడు.
గుండె నొప్పికి కారణాలెన్నో...
ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావటానికి పలు కారణాలున్నాయి. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో గుండె కండరం మందంగా మారి హార్ట్‌బీటింగ్ ఎక్కువ అవుతుంది. లాంగ్ క్యూటీసిండ్రోమ్ వల్ల కూడా రోగికి గుండెనొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా ఆగిపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గి గుండె నొప్పి వస్తుంది. దీన్ని పల్మమనరీ అంబాల్కిమ్ అంటారు. కొందరికి పుట్టుకతోనూ హృద్రోగాలు వస్తుంటాయి.
ముందస్తు పరీక్షలు
సాధారణంగా గుండెకు సంబంధించి సమస్యలు వచ్చాయని అనుమానమున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి కార్డియాలజిస్ట్‌ల పర్యవేక్షణలో ఈసీజీ, 2డి ఇకో, టీఎంటీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, కొరోనరీ యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేయించుకోవాలి. హృద్రోగులు అనుక్షణం అప్రమత్తంగా ఉండటంతోపాటు గుండెనొప్పి వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్సతోపాటు వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రాథమిక చికిత్స, సత్వర వైద్యంతో రోగి ప్రాణాలు కాపాడవచ్చని అందరూ గ్రహించాలి.

సైనస్ ఇన్ఫెక్షన్: ఆయుర్వేద నివారణలు


సైనస్ ఇన్ఫెక్షన్: ఆయుర్వేద నివారణలు
మీకు దగ్గు,తుమ్ములు నిరంతరాయంగా వస్తున్నాయా? మీకు మీ అలెర్జీ చికాకు కలిగిస్తున్నదా? చివరగా, మీరు ఒక వైద్యుడుని సందర్శించాలని ఆలోచిస్తున్నారా? జలుబు కోసం మీ మందులు పనిచేయకపోతే మరియు మీరు మీ శరీరం నొప్పులు మరియు అలెర్జీలతో కఠినముగా ఉంటే,అప్పుడు మీరు సైనసిటిస్ గా భావించాలి. మీరు మందుల కొరకు ప్లానింగ్ చేసుకోవాలి. మీరు వాడే మందులు వొండరింగ్ చేస్తాయా? అవి అల్లోపతిక్, హోమియోపతి లేదా ఆయుర్వేదం కావచ్చు. మీకు చికిత్స గురించి గందరగోళం లేకుండా మేము కొన్ని మార్గదర్శకాలను చెప్పుతున్నాము. సైనసిటిస్ వచ్చినప్పుడు ఆయుర్వేదం ఉత్తమమైనది. సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. సైనసిటిస్ చికిత్సలో ఆయుర్వేద మందులు ఖచ్చితంగా మీకు కొంత ఉపశమనం కలిగిస్తాయి. తరువాత,మీరు ఉదయం మేల్కొన్నప్పుడు తుమ్ములు,దగ్గు లేదా ఒక చెడు తలనొప్పి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రింద సైనసిటిస్ చికిత్స కు కొన్ని ఆయుర్వేద నివారణలు ఉన్నాయి. ఎలర్జీకి కారణాలు మరియు లక్షణాలు, నివారణ చిట్కాలు:క్లిక్ చేయండి
1. అను తైలం సైనసిటిస్ చికిత్సలో ఆయుర్వేద మందులలో అను తైలం ఒకటిగా ఉన్నది. మీరు సైనసిటిస్ గురించి ఫిర్యాదు చేసినప్పుడు ఒక ఆయుర్వేద విధానంలో ఖచ్చితంగా అను తైలంను సిఫారుసు చేయవచ్చు. ఇది కంజెషన్ తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఈ నూనెలు ముక్కు ద్వారా ప్రయాణించడం వలన బ్లాక్స్ తొలగించడానికి తగినంత మంచివి. తొలుత మీకు ముక్కు నుండి నిరంతరం తుమ్ము ఉన్నప్పటికీ,కొన్ని రోజుల్లో ఉత్తమంగా పనిచేస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ కు ఆయుర్వేద చికిత్స ప్రభావం ఉంటుంది.
2. ఖదిరాది వాతి ఈ సైనస్ ఇన్ఫెక్షన్ కొరకు ఆయుర్వేద చికిత్స కోసం వెళ్ళితే మీ డాక్టర్ సిఫార్సు చేసే తదుపరి ఔషధంగా ఖదిరాది వాతి ఉంటుంది. ఈ మెడిసిన్ ప్రధానంగా వాపు తగ్గించటానికి వైద్యుడు సిఫారుసు చేస్తారు. ఇదే ప్రయోజనాన్ని కలిగిన కాంచనార గుగ్గులు మరియు వ్యొశాది వాతి వంటి ఇతర మందులు కూడా ఉన్నాయి.
3. చ్యవన్ ప్రశా చ్యవన్ ప్రశా ఆయుర్వేద చికిత్సలలో సిఫార్సు చేసిన సాధారణ మందుగా ఉంది. సైనసిటిస్ చికిత్స ఆయుర్వేద మందులలో చ్యవన్ ప్రశాకు ఎటువంటి మినహాయింపు లేదు. నాసికా అలెర్జీలు,శరీర నొప్పి వంటి అనారోగ్యాలు చ్యవన్ ప్రశా ద్వారా నయమవుతాయి. శరీర నొప్పి వంటి రోగాల చికిత్సకు అబ్రాఖ బష్మ మరియు లక్ష్మీ విలాస్ రాస్ వంటి ఇతర మందులు కూడా ఉన్నాయి.
4. చిత్రాక హరీతకి ఇది లేహ్య రూపంలో అందుబాటులో ఉన్న ఒక ఔషధం. ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో ముఖ్యమైనది ఏమిటంటే మీ డాక్టర్ చెప్పిన రూపంలో క్రమం తప్పకుండా సేవించాలి. సాధారణంగా దీనిని రెండు టేబుల్ పాలతో పాటు ఒక మోతాదులో వినియోగిస్తారు. క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్:క్లిక్ చేయండి
5. జీవంధార కర్పూరం మరియు మిథనాల్ కలయిక కలిగిన జీవంధారను సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు.ఈ మెడిసిన్ ఆవిరితో నాసిక పీల్చడం జరుగుతుంది. ఇది ఉత్తమ సైనస్ ఇన్ఫెక్షన్ ఆయుర్వేద చికిత్సలో ఒకటి. ఒక వారంలో రెండుసార్లు పీల్చినట్లయితే చాలా మంచిది. మీకు ఖచ్చితంగా కొంత ఉపశమనం కలిగిస్తుంది.
6. ఒక మిశ్రమం మీ శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకు మీరు వ్యాధి నిరోధకత మొదటి అడుగు నిర్మించడానికి అవసరం అయిన విషాన్ని శరీరం నుండి తీసివేయాలి. మీరు రోజంతా నీరు త్రాగటం ద్వారా తేలికగా చేయవచ్చు. కొంత అదనపు ఉపశమనం కోసం మీరు త్రాగే టీ లో పుదీనా,లవంగాలు,అల్లం జోడించండి. అంతేకాకుండా మీరు ఉడికించిన ఆహారంలో పసుపు,నల్ల మిరియాలు,సోపు,జీలకర్ర, ధనియాలు,అల్లం వెల్లుల్లిని జోడించండి. సైనసిటిస్ ఒక కఠినమైన మరియు మంచి ఆహారం ద్వారా చికిత్స చేయవచ్చు. అలాగే దీనికి ఈ ఆయుర్వేద చికిత్సలు బాగా పని చేస్తాయి. మీరు మంచి ఫలితాలు కోసం కొన్ని రోజులు ఖచ్చితంగా దీనిని ప్రయత్నించవచ్చు.

Saturday, February 8, 2014

2005 కు ముందు వైద్య రంగం లోని ప్రముఖులు, శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పారు. ఏంటంటే,,,, 2010 తర్వాత భారత్ లో ఎక్కువ మరణాలు గుండెపోటు వల్ల కాకుండా, కాన్సర్, మరియు, ఉపిరితిత్తుల వ్యాధుల వల్ల సంభవిస్తాయి అని. 2005 కు ముందు భారత్ లో గుండెపోటు మరణాలు ఎక్కువ ఉండేవి. అయితే ఇప్పుడు వాళ్ళ మాట నిజమైంది అనుకోవాలి. ఇప్పుడు సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ శాతం ఈ రెండు వ్యాధుల మూలంగానే జరుగుతున్నాయి. వీటికి ముఖ్యమైన కారణం కాలుష్యం. కాలుష్యం అంటే కేవలం వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు. మనం తినే అన్ని ఆహారపదార్ధాలు కల్తివె కావడం . నిరు, గాలి అన్ని కూడా కాలుష్యం బారిన పడుతున్నాయి. జనాభా పెరగడం, అవసరాలు పెరగడంతో వాహనాల సంఖ్య పెరిగింది. అవి వదులుతున్న carbon monaxide ప్రమాదకర స్థాయిని మించుతోంది. కాలుష్యం ఉపిరితిత్తుల వ్యాధులకు మూలకారణం అవుతోంది.
ఇక కాన్సర్ అంటే మన శరీరం లోని కణాల అనవసర పెరుగుదలను కాన్సర్ అంటాము. దీనికి కొంత వరకు, మన జీవన శైలి కారణం. packed foods , జంక్ ఫుడ్, carbonated డ్రింక్స్--ఇవి మనకు మేలు చేయకపోగా, మన ఆరోగ్యానికి హాని చేస్తాయి. మన జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కాన్సర్ బారి నుండి తప్పించుకోవచ్చు.
వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, టమాటాలు, వీటన్నిటికి కాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంది. అందువల్ల మన రోజువారి ఆహారంలో విటన్నిటిని భాగం చేసుకోవాలి. ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి.
రోజు కొంత సేపైనా వ్యాయామం చేయాలి. తప్పనిసరిగా నడక అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సమయం కేటాయించలేకపోతే, కనీసం 15 నిముషాల చొప్పున రోజుకు 3,4 సార్లు వాకింగ్ చేయాలి.
ఈరోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా దృష్టి లోపాలు ఏర్పడుతున్నాయి. పిల్లలకి కూడా ఆకుకూరలు, రోజుకి ఏదో ఒక పండు కానీ, మిల్క్ షేక్ కానీ అలవాటు చేయండి. అందరిని వేధిస్తున్న మరో సమస్య ఊబకాయం. పాశ్చ్యాత్య దేశాల జీవన శైలిని అనుకరిస్తున్న మనం వారి జబ్బులను కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఊబకాయం ఒకప్పుడు విదేశాలలో ఉన్న సమస్య. ఇప్పుడు మన ముంగిట్లోకి వచ్చేసింది.
కంటి జబ్బులకు, ఊబకాయ నివారణకు ఆయుర్వేదం లోని "త్రిఫల చూర్ణం" చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు పెద్దలు, ప్రతిరోజూ ఒక చెంచా త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే ఊబకాయం తగ్గుతుంది. అనేక జీర్ణ సమస్యలను దూరంగా ఉంచుతుంది. థైరాయిడ్ వంటి హార్మోనులకు సంబంధించన వ్యాదులలో సహాయకారి. త్రిఫల చూర్ణం 2 చెంచాలు ఒక కప్పు నీళ్ళలో వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించి వాటితో రోజు కళ్ళు కడుక్కుంటే దృష్టి లోపాలు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు చుక్కలు కంట్లో వేసుకున్న మంచిదే. త్రిఫల చూర్ణం వేసి మరింగించిన నీళ్లు జుట్టుకు కూడా చాల మంచిది. ఊబకాయ సమస్యకు తేనే, నిమ్మరసం అనాదిగా వస్తున్నా ఒక వైద్యం. రెండు కలిపి గోరువెచ్చని నీళ్ళలో ఖాలీ కడుపు మిద తీసుకుంటే బరువు తగ్గుతారు అని ఒక నమ్మకం. త్రిఫల చూర్ణం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాగా పనిచేస్తుంది.
ఉసిరి మనకు ప్రక్రుతి ఇచ్చిన సుగుణాల ఖజానా. ఉసిరి నయం చేసే జబ్బుల జాబితా చాల పెద్దది. మన శరీరం లోని ఎ భాగం అనారోగ్యానికి గురి అయినా, ఉసిరిని తీసుకోవటం వలన నయం అవుతుంది. ఉసిరిని, పచ్చడి గానే కాక జ్యూస్, జామ్, మురబ్బ, ఉసిరి పలుకులు, ఇలా ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు.
ఇక తులసి.....దీని విషయం భారతీయులకు వేరే చెప్పనక్కరలేదు. దీని గొప్పతనాన్ని మన పూర్వులు గుర్తించి తులసి ని మన పెరట్లో పెంచుకోవాలి అని చెప్పారు. ఇంగ్లిషు వాళ్ళు కూడా ఈ మొక్కని holy basil అని పేర్కొన్నారు. మన దేవాలయాల్లో కూడా మన ఆరోగ్యం గురించే తులసి ఆకులు, విత్తనాలు వేసిన తీర్థం ఇస్తారు. ఇప్పుడు బజార్లో "తీర్థం పొడి" అని దొరుకుతోంది. అది నీళ్ళల్లో కలుపుకుంటే ఇంట్లోనే తీర్థం రెడీ. తులసి నీళ్ళల్లో ఉండే ఫ్లోరైడ్ శాతం తగ్గిస్తుంది అని ఇటీవలే గుర్తించారు.
ఇక మనం వర్జించవలసిన పదార్థాలలో ముఖ్యమైనది మైదా..... ఇది శరీరానికి హాని చేస్తుంది. ఇందులో ఎ రకమైన పీచు పదార్ధం లేకపోవడం వలన ఊబకాయానికి తోడ్పడుతుంది. ఇంకా జంక్ ఫుడ్, వేపుడులు, ఎక్కువ నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువ సార్లు మరిగించిన నూనె, కొవ్వు పదార్ధాలు కూడా తీసుకోవడం తగ్గించాలి .
అందుచేత మన ప్రతిరోజూ ఆహారం లో పసుపు, వెల్లుల్లి, మిరియాలు, అల్లం, ఉసిరి, ఆకుకూరలు, టమాటాలు, తాజా పండ్లు, త్రిఫల చూర్ణం అన్ని కొంచెం ఎక్కువ మోతాదులో వాడడం వలన ఎన్నో జబ్బులను అరికట్టవచ్చు.

Thursday, February 6, 2014

క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-

క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-
*చర్మానికి: ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్‌ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్‌ రసం తోడ్పడుతుంది.
*శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. *శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.
* కంటికి కూడా చాల మంచిది. ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ ని సేవించిన ఎడల కళ్ళజోడు తో అవసరమే ఉండదు. కంటికి సంబంధిచిన జబ్బులని ప్రాలదోలుతుంది.

Sunday, February 2, 2014

బరువు తగ్గేందుకు అద్భుత ఔషధం

బరువు తగ్గేందుకు అద్భుత ఔషధం

బరువు పెరగడానికి ప్రధాన కారణం శరీరంలో జీవ(న)క్రియలు సక్రమంగా పని చేయకపోవడమే. శరీరంలో జీవ(న) క్రియలను సక్రమపరిచి స్థూల కాయాన్ని తగ్గించే అపురూప ఔషధం అమృతం స్లిమిన్.

నేటి జీవన పరిస్థితుల్లో బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేస్తే మోకాళ్లు అరిగిపోతున్నాయి. కొత్తగా నొప్పులొస్తున్నాయి. తిండి తగ్గిస్తే శరీరంలో పోషకాలు తగ్గిపోయి ఇతర వ్యాధులు వస్తున్నాయి. 'ఆహా ఏమి రుచి? తినరా మ
ైమరిచి..' అని పాడుకుంటూ జిహ్వచాపల్యంతో లాగించేస్తే వస్తోంది ఒబేసిటి. దీంతో జీవితం భారమైపోతోంది. శరీరం 'లేవలేని అత్తకు వంగలేని కోడలు' అన్నట్టు తయారవుతుంది. అందుకే మీ కోసం... మీసమస్య పరిష్కారం కోసం సూక్ష్మంలో మోక్షంలా.. అమృతం ఆయుర్వేద నిలయం. లావు, బరువు తగ్గడానికి ఓ దివ్యౌషధాన్ని అందిస్తోంది. అదే 'అమృతం స్లిమిన్'!
బరువు పెరగకుండ ఉండాలని అందరికీ ఉన్నా ఎలాంటి జాగ్రత్తలు పాటించరు. ఒకవేళ పెరిగినా దానిని ఎలా తగ్గించుకోవాలో తెలియదు. అతి బరువును ఆయుర్వేద పరంగా స్థూలకాయం అంటారు. ఈ రోగాన్ని ఆయుర్వేదంలో కఫరోగాలలో మొట్టమొదటి రోగంగా చెప్పారు. ఇలాంటిది ఒక స్థాయి దాటిన తరువాత తగ్గడం అసాధ్యం అని కూడా చెప్పారు. అందుకే అసాధ్య స్థాయికి చేరకుండా ముందు జాగ్రత్త పడితే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. స్థూలకాయం అనేది ఒక రోగం దానికి సరైన ఔషధం వాడకుండా ఎన్ని ప్రయాసలు పడ్డా వాకింగ్ చేసినా, డైటింగ్ చేసినా బరువు తగ్గడం సాధ్యపడదు.
బరువు పెరగ డానికి కారణమయ్యే వాటికి దూరంగా ఉండి తగ్గడానికి సక్రమమైన మార్గాలు తెలుసుకుంటేనే సాధ్యపడుతుంది. వ్యాధి ఏదైనా వస్తే దానికి చికిత్స ఏమిటి? అనేది ముందుగా తెలుసుకోవాఇ. అలాకాకుండా ఇది వాడిచూద్దాం. అది వాడి చూద్దాం అని ఏదో ఒకటి వాడుతూ కాలక్షేపం చేస్తే ఆలోపు వ్యాధి ముదిరిపోయి అసాధ్యస్థాయికి చేరిపోతుంది. అప్పుడు ఏ చికిత్సకూ లొంగకుండా పోతుంది. నిజంగా స్థూలకాయం లేని వారికి గాలిలో ఎగిరి పోవాలనిపిస్తుంది. ఏ మాత్రం స్థూలకాయం ఉన్నా లేవడానికి సైతం కిందకు చేతులు ఆనిచ్చి నాలుగుకాళ్ల జంతువులా పనిచేస్తుంది.
శరీరం బరువు పెరగడానికి కారణాలు అనేకం
వ్యాయామం చేయకపోవడం, తినే ఆహారం శరీరానికి అనుకూలంగా జీర్ణం కాకపోవడం, శరీరంలో జీవ(న)క్రియలు (మెటబాలిజమ్)సక్రమంగా జరగకపోవడం వల్ల, పోషకాలుగానూ, వ్యర్థాలుగానూ విచ్చిన్నక్రియ జరగదు. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి పోషకాలను తీసుకుని వ్యర్థాలను వదిలేసే విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేకపోవడమే లావు పెరగడానికి ప్రధానకారణం. దీనిని ఆయుర్వేదపరంగా సారభాగం, కిట్ట భాగం సక్రమంగా విచ్ఛిన్నం కాకపోవడం అంటారు.
అతి బరువు వల్ల వచ్చే రోగాలు
ఆయుష్షు క్షీణించుట, ఉత్సాహం తగ్గుట, లైంగిక శక్తి తగ్గుట, సంతానసమస్యలు, శరీరం దుర్గంధం రావడం, అధిక ఆకలి, అధిక దప్పిక, ఆయాసం, అధిక నిద్ర, గురక, స్వరం మారుట, శరీరం ఆకారం మారుట, బీపీ, షుగర్ ఇంకా మరెన్నో...
పరిష్కారాలుబరువు తగ్గడానికి మందులు లేవు అని అందరూ చెప్పవచ్చు. మార్కెట్లో మభ్యపెట్టేవి ఎన్నో ఉండవచ్చు. ఈ ఒక్క నిజం అందరికీ తెలియాలి. బరువు పెరగడం అనేది ఒక వ్యాధి. దీనిని సాధారణ సమస్యగా పరిగణించలేము. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా ఒక ఔషధం వాడాలి. అలాంటి ఆహార ఔషధం 'అమృతం స్లిమిన్' చాలా మంది ఆహారం బాగా తింటారు. అదనంగా చిరుతిళ్లు, ఫలహారాలు తింటుంటారు. కాని బరువు పెరగరు. కొంతమంది మాత్రం తక్కువగా తింటారు. ఎలాంటి అదనపు ఆహారాలు తినకపోయినా నెలనెలా బరువు పెరుగుతుంటారు.

కారణం ఏమిటి?

శరీరంలో జీవనక్రియలు సక్రమంగా జరగకపోవడం
కొంతమందికి చిన్న చిన్న జీర్ణసంబంధ సమస్యలు వస్తుంటాయి.

మరికొంతమందికి చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి. మరికొంతమందికి ఆహారం సహించదు. అయినా ఏదోలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి భవిష్యత్తులో పెద్దపెద్ద వ్యాధులకు కారణమవుతుంటాయి. చిన్న సమస్యగా ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

ఆయుర్వేదంపై అపోహలు

ఆయుర్వేద ఔషధం అనగానే కఠోర ప«థ్యాలు చేయాల్సి ఉంటుందని, వేడి చేస్తుందని అనేక రకాల అపోహ లుంటాయి. కాని అమృతం స్లిమిన్ వాడే వారికి అలాంటి పథ్యాలుండవు. వేడి చేయదు. ఇతర దుష్ఫలితాలుండవు. అంతకన్నా దీనిలో వాడిన ఔషధ మూలికలన్నీ మనం నిత్యం ఉపయోగించుకోగలిగేవే. ప్రతి సంవత్సరం సీజనల్‌గా వచ్చినపుడు సేకరించి ఉపయోగించుకోవాలి. దీనిలోని మూలికలు అలాంటి సమయంలో సేకరించడం వల్ల సత్ఫలితాలొస్తున్నాయి. అయితే వాటిని బరువు తగ్గడానికి అనువైన పద్ధతిలో తయారుచేయడంలోనే దాని ఫలితాలు దాగి ఉన్నాయి. అందుకనే దీనిని మీరు ఒక ఆహారంగా పరిగణించాలి. బరువు పెరగడం ఒక వ్యాధి కనుక రోగానికి తగిన ఔషధం అని చెప్పాల్సి వస్తుంది.

చాలా మంది కొన్ని రకాల ఔషధాలు వాడి తగ్గక ఇక తగ్గదేమో అని నిశ ్చయానికి వచ్చేసి ఇంకేదిలేదు అనుకుంటుంటారు. ఎవరో తిప్పతీగ చూర్ణం వాడితే తగ్గుతారు అని చెప్పి ఉంటారు. అది వాడి తగ్గకపోతే ఆయుర్వేదం ఇంతే అనుకుంటుంటారు. మీరు స్వయంగా సేకరించి కొన్ని రకాల మూలికలతో ఔషధం తయారుచేసుకుని వాడి చూడండి. తప్పకుండా పనిచేస్తుంది.

అన్నింటికన్నా ప్రధానమైనది ఔషధం వాడే విధానం. ఉదాహరణకు మీకు రోజుకు 2700 క్యాలరీలు కావలసి వస్తే ఆ మాత్రం క్యాలరీలు ఇవ్వగల రెండు మాత్రలను తింటే మీకు పనిచేస్తుందా? చేయదు. భోజనం చేస్తేనే తృప్తి. అలాగే బరువు తగ్గాలంటే తగినవి వాడితేనే పనిచేస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం మాత్రం కష్టమవుతుంది. 5 వేల సంవత్సరాలకు పూర్వమే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో చెప్పిన విధానం మాత్రం అందరూ ఒప్పుకునే విధానం. దానినే నేటి ప్రజలకు అనుకూలంగా తయారేచేసి అందిస్తున్నాం. ఒక్కసారి ఉపయోగించి చూడండి. దీనికి మించినది మరొకటి లేదు అని మీరే అంటారు.

ఆహారనియమాలు

కఠోర ఉపవాసాలు అక్కర్లేదు. మూడు పూటలు తినవచ్చు కూడా. బరువును పెంచేవి మాత్రం తినకూడదు.

అమృతం స్లిమిన్ ప్రత్యేకత ఏమిటి?

నేటి జీవనపరిస్థితుల్లో ఆహారం తక్కువ తీసుకున్నా శరీరం లావుగా తయారు కావడానికి జీవనక్రియలు సక్రమంగా జరగకపోవడం ప్రధానకారణం.

శరీరానికి పోషకంగా ఉపయోగపడని ఆహారం తినడం, అలాంటి ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేసి శరీరానికి శక్తిగా మార్చకపోవడం వల్ల జీవనక్రియలు సక్రమంగా పనిచేయకపోగా తక్కువ తిన్నా, వ్యాయామం చేసినా బరువు పెరుగుతారు. అలాంటి జీవనక్రియలను సక్రమపరిచే ఒక అపురూప ఔషధం 'అమృతంస్లిమిన్' ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అనవసరమైన మలినాలు బయటకుపంపడం. రోగకరంగా ఉండే వాటిని ఆరోగ్యకరంగా చేయడం చికిత్సలో ప్రధానభాగం. ఈ పని అమృతం స్లిమిన్ చేస్తుంది. అమృతం స్లిమిన్ కావలసినన్ని తయారు చేయగలిగేది కూడా కాదు. కొన్ని అరుదైన మూలికలు సేకరించి తయారుచేస్తుంది. కనుక అన్ని చోట్ల మార్కెట్లో లభించేలా చేయడానికి వీలుపడదు. ఔషధాన్ని సక్రమంగా తయారేచేయడంలోనే దానిలో రోగాన్ని తగ్గించే గుణం దాగి ఉంటుంది. 'అమృతంస్లిమిన్'లో ఉపయోగించిన మూలికలకు ఒక్కో ప్రత్యేక ఔషధ గుణం ఉంది. వాటిని కఫహరంగా పనిచేసేట్టు తయారుచేయడం వల్ల అవి మరింత ఉత్తేజంగా పనిచేసి బరువు తగ్గిస్తుంది. మీరు సక్రమంగా ఉపయోగించుకోగలిగితే మళ్లీ బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు.
అమృతంస్లిమిన్ ఉపయోగించే విధానం
'అమృతంస్లిమిన్' ఒక సాచెట్ తీసుకుని మరిగించి దించుకున్న అరలీటర్ లేక ఒక లీటర్ వేడినీటిలో వేయాలి. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని కొంత కొంత చొప్పున తాగుతుండాలి. నీరు పూర్తిగా అయిపోయేదాకి సాచెట్‌ను అలాగే నీటిలో ఉంచవచ్చు. రుచించలేని వారు కొద్దిగా తేనెను, నిమ్మరసాన్ని, అల్లంరసాన్ని లేదా పుదీనా కలుపుకోవచ్చు. ఈ ఔషధ పానీయాన్నీ ఉదయం లేచిన దగ్గరి నుంచి సాయంత్రం వరకు ఉపయోగించవచ్చు. ఆహారంకు ముందు, తరువాత ఆహారంతో పాటు కూడా తాగవచ్చు. సాయంత్రం మరో సాచెట్‌ను కూడా అలాగే ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి రోజుకు 3 సాచెట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. 'అమృతంస్లిమిన్' వాడటం వల్ల ఇతర దుష్ఫలితాలు ఎండవు. సైడ్ బె నిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి.

అమృతంస్లిమిన్ ఉపయోగాలు

- శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.
- పొట్ట బరువుగా లేకుండా తేలికగా తయారవుతుంది.
- శరీరంలోని జీవక్రియలను క్రమపరుస్తుంది. సక్రమంగా పనిచేయిస్తుంది.
- శరీరంలో అనవరసమైన మలినాలను ఉంచకుండా మూత్రం, మలం, స్వేదం ద్వారా బయటకు పంపుతుంది.
- శరీరరంగును ఇనుమడింపచేస్తుంది, మంగును సైతం తొలగిస్తుంది.
- తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా పూర్తిగా జీర్ణం చేసి పోషకాలను, మలినాలను వేరు చేస్తుంది. నోటి దుర్వాసన తొలగిస్తుంది. గురక తగ్గుతుంది.
- రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దానివల్ల గుండె జబ్బుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
- చర్మం ముడతలు తగ్గిపోతాయి. వేలాడుతున్నట్లున్నది తగ్గుతుంది.
- ఏ వ్యాధితో బాధపడుతున్నా దీనిని ఉపయోగించవచ్చు.
- ఇతర ఔషధాలు వాడుతున్నా 'అమృతంస్లిమిన్' ఉపయోగించవచ్చు.
- శరీర బరువు వారి శరీరతత్వమును అనుసరించి 90 రోజుల్లో 5 నుంచి 12 కేజీల బరువు వర కు తగ్గవచ్చు.
ఇప్పటికే వాడిన వారి అనుభవాలు
బరువుగా ఉన్నవారు శరీరాన్ని మోస్తున్నట్లు అనుభూతి ఉండేది. అమృతంస్లిమిన్ వాడిన తరువాత ముందుగా చెప్పిన మాట శరీరం తేలికయిందని. మోస్తున్నట్లు అనుభూతి లేదని అంటున్నారు. సక్రమంగా వాడిన వారిలో నెలరోజుల్లోనే 3 నుంచి 4 కేజీల బరువు తగ్గిందంటున్నారు. ఇది సుమారు 600-700 మంది చెప్పిన మాట. వేలాడుతున్నట్లుగా శరీరం కొంత కొంతగా పటిష్టంగా తయారవుతోందని అంటున్నారు. ఇంకేం కావాలి. నిజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఔషధం లేదని ఘంటాపదంగా చెప్పవచ్చు.

Monday, January 27, 2014

కంటి కింది చారలకు కీర....!


చిన్న వయసులోనే కళ్ల కింద నల్లచారలొస్తే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి ఇంటివైద్యాన్ని చేసుకుంటే తగ్గుముఖం పడతాయి.
- మార్కెట్‌లో నిత్యం మనకందరికీ అందుబాటులో ఉండేవి కీరా దోసకాయలు. తాజా కీర దోసను తీసుకుని అప్పటికప్పుడు ముక్కలుగా కోసి కాసేపు కళ్ల మీద ఉంచుకోవాలి.
- కీర దోస రసాన్ని కళ్ల కింది నల్లచారలకు పట్టించి.. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఉపశమనం లభిస్తుంది.
- దోసరసంలో బంగాళదుంప రసాన్ని కలిపి ఇలాగే చేయొచ్చు. దీనివల్ల కూడా నల్లచారల సమస్య తగ్గుతుంది.
- నల్లచారలకు మరింత మంచి ఫలితాన్ని అందించే జ్యూస్‌లలో టొమాటో జ్యూస్ ఒకటి. టొమాటోలోని ఔషధగుణాలు శరీరం మీదున్న నల్లమచ్చల్ని తొలగించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌తో మర్దన చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలకు నీటితో శుభ్రం చేసుకోవాలి.
- టీ బ్యాగ్స్‌తో కూడా కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. చల్లటి నీటిలో టీ బ్యాగ్స్‌ను ముంచి, కళ్ల కింద కాసేపు ఉంచితే మంచిది.
- మార్కెట్‌లో దొరికే ఆల్మండ్ ఆయిల్ చక్కటి ఔషధం. జుట్టుకు మాత్రమే కాదు. కళ్ల కింద నలుపు చారల్ని వదిలించుకునేందుకు ఈ నూనెను వాడుకోవచ్చు.
- ఆరెంజ్ జ్యూస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ జ్యూస్‌లో కాస్త గ్లిజరిన్ కలిపి వారానికి మూడుసార్లు రాసుకుంటే ఊహించని ఫలితం వస్తుంది.
ఇవన్నీ చేస్తూనే మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, కంటినిండా నిద్రపోవడం, సమతులాహారాన్ని తీసుకోవడంతో పాటు వీలైనన్ని మంచినీళ్లను తాగితే కళ్ల చారల సమస్య నుంచి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు.