మృదువైన శిరోజాల కోసం ఈ చిట్కాలు పాటించండి. మన వంటింట్లో ఉండే మెంతులు మన శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తాయి.
జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడానికి పావు
కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో
సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకుని అరగంట తర్వాత తలారా స్నానం చేయాలి.
దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలావరకూ తగ్గించవచ్చు.
అలాగే తలలో ఏవైనా ఇన్‌ఫెక్షన్లు ఉంటే అలాంటి వాటిని తగ్గించడానికి తలకు
వేప నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలకు వేపాకును మెత్తగా నూరి
పట్టించినా కూడా సమస్యను నివారించవచ్చు. గోరింటాకును ఇలా వాడినా కూడా మంచి
ఫలితం ఉంటుంది.
అలాకాకున్నా వేపాకుల్ని గిన్నెలో సగం వరకూ నీళ్లు
తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి,
ఆ నీటితో తలను కడుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను
తగ్గించడానికి అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే
జుట్టురాలే సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జును కూడా ఇలా తలకు
పట్టిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇంకా తలస్నానం చేసేముందు
కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా
మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి జుట్టు
కుదుళ్లు గట్టిపడతాయి.
Sunday, May 4, 2014
స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా?
ఉరుకుల పరుగుల జీవన విధానం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం మందిలో స్థూలకాయం
పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి అన్వేషణ పెరిగింది. అందం, ఆరోగ్యం
పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నప్పుడు మొదట వినపడే
మాట, 'మొలకలు తినండి' అనే! ఆ తరువాత పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు...
వగైరా వగైరా. మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల
పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి
సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి.
కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు
ఆరోగ్యకరమే! కానీ, ఏ విధంగానో తెలుసుకోవాలిగా! మొలకలు పోషకాహారంగా
ఎల్లప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్,
సోయాగింజలు, బ్రఖోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ
పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకల వల్ల
అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మొలకలు మనల్ని
కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్థ్యం కల్గి ఉన్నాయని కనుగొన్నారు.
మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు క్రింద
తెలపబడ్డాయి: సమృద్ధిగా అత్యవసర పోషకాలు: మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి,
విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్,
ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా
ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా
ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ
స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు, మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్ ఎ
ఎనిమిది రెట్లు పెరుగుతుంది. ఎంజైముల అద్భుతమైన మూలాలు: మొలకలలో మన
శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి.
ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా
మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి. అధిక మాంసకృతులు: మొలకలలో
మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు.
నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు
జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల
మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది.
ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు
చేయబడ్డాయి. తేలికగా జీర్ణమౌతాయి: మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి
ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య
ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా
ఉత్తమమైనవి. బరువు తగ్గడానికి ఎంతో మంచివి: మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో
ఉండి, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించుకొనే ప్రణాళికకు ఎంతో
సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే
పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం
మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి
ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు
మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహార
ప్రణాళికలో మొలకలను జత చేయండి. మొలకల్లో కొవ్వు వుండదు. ప్రోటీన్లకు
మొలకలు పెట్టింది పేరు. సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు
తయారు చేసుకోవడానికి మార్గాలే! గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు,
పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ
ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. ఫైబర్, ఐరన్, నియాసిన్, కేల్షియమ్
-ఇవన్నీ మొలకల్లో పుష్కలం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి.
కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్
బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్పరస్ పళ్లకు, ఎముకలకు ఉపయోగ
పడుతుంది.
Friday, May 2, 2014
తెల్ల జుట్టు
1) వెల్లుల్లి
పొట్టు -10 g ,ఆలివ్ నునే -100 ml వెల్లుల్లి పొట్టు ను బూడిద చేసి ఆలివ్
నూనెలో కలిపి 10 రోజులు ఉంచాలి .తరువాత రాత్రి పూట తలకు నూనె రాసుకొని ఉదయం
తల స్నానం చెయ్యాలి.
2) బోడతరం తైలం ¼ spoon సేవిస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారును .
3) చిన్న పిల్లల్లో వెంట్రుకలు తెల్లగా మారడాన్ని బాలనెరుపు అంటారు . ఇది తగ్గడానికి తేనే,నెయ్యి,పాలు,గోమూత్రం కలిపి రోజు రెండు పూటలు త్రాగాలి
4) బోడతరం కషాయం 100 ml ,నువ్వుల నునే 100ml చిన్న మంటమీద తైలం చెయ్యాలి .దీనిని గోరఖ్ నాద్ తైలం అంటారు .ఈ తైలం ను 3 చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేయాలి.మరియు భోజనానికి గంట ముందు spoon తైలం సేవించాలి
5) తిప్పతీగ,ఉసిరి,పల్లేరుకాయలు సమానంగా చూర్ణం చేసి spoon పొడిని spoon తేనే కలిపి తినాలి.
6) కామంచి ఆకురసం ,గుంటగలగర రసం సమానంగా కలిపి తలకు రాయాలి .తరువాత స్నానం చెయ్యాలి .ఇలా 15 రోజులు చెయ్యాలి
7) బోడతరం పూల చూర్ణం ,spoon తేనే లో కలిపి రోజు సేవించాలి
8) త్రిఫల చూర్ణం ,నీలి ఆకుల చూర్ణం, లోహ చూర్ణం, గుంటగలగర చూర్ణం ఈ నాల్గింటిని గొర్రె మూత్రం లో నానబెట్టి తలకు రాయాలి .ఇది గొప్ప అనుభవం. దీనిని కేసరంజక చూర్ణం అంటారు.

బట్టతల
బూరుగు చెట్టు జిగురు ,నేలతాడి దుంపలు ,తామర గింజలు అన్నిటిని గుజ్జు చేసి బట్టతల ఫై రాయాలి
జటామాంసి-100 g ,పుష్కరమూలం-100g ,నల్లనువ్వులు-100g ,సుగందపాల వేర్లు-100 g ,తామర గింజలు 100g కొద్దిగా నీరు కలిపి గుజ్జుగా చేయాలి దీనిలో నెయ్యి 500 g కలిపి దీనిని తలకు పట్టించాలి
అతిమధురం 20 g ,చెంగల్వ కోష్టు-20g ,సారపప్పు-20g,మినపప్పు-20 g ,తెల్ల గురివిందలు-20 g ,సైందవలవణం-20 g,అన్నిటిని చూర్ణం చేసి దీనిలో కొబ్బరి పాలు వేసి గుజ్జు చేసి బట్టతలకు రాయాలి
కలబంద రసం లో జీలకర్ర,పసుపు కలిపి 90 రోజులు సేవిస్తే బట్టతలఫై జుత్తు వచ్చును
మర్రి ఊడలు-50g,జటామాంసి 50g నూరి పేస్టు చేసి బట్టతల ఫై రాయాలి
ఉసిరి,నల్ల నువ్వులు,పల్లేరుకాయలు నూరి లేపనంగా రాయాలి
బట్టతల ఫై ముల్లంగి ముక్కతో రుద్దితే మళ్ళి వెంట్రుకలు వస్తాయి
అతిమడురం 20g, చెంగల్వ కోస్టు 20g,సారపప్పు 20g, మినపప్పు 20g ,తెల్లగురివిందలు 20g, సైందవ లవణం 20g, దీనిలో కొబ్బరి పాలు కలిపి మెత్తగా గుజ్జు చేసి రాత్రి పూట తలకు మర్దన చెయ్యాలి
మర్రి ఊడలు 50g, జటామాంసి 50g, నూరి తలకు రాయాలి
ఉసిరి, నల్లనువ్వులు, పల్లేరు కాయలు నూరి తలకు రాయాలి 2 గంటలు తరువాత కడగాలి.100రోజులు చెయ్యాలి

అశ్వగంధ
శుద్ధి చేసే విదానం : వేరును పాలతో మరిగించి తరువాత ఎండబెట్టాలి . ఇలా 7 సార్లు చేయాలి .
తగ్గించే వ్యాధులు :
1) బరువు తగ్గుట: 3 రోజులకు ఒకసారి spoon చొప్పున ఆకుల రసం ఉదయం పరగడుపున తీసుకోవాలి .ఇలా 15 సార్లు పాటిస్తే అధిక బరువు తగ్గును.
2) మానసిక వత్తిడి : వేరు పొడిని spoon చొప్పున పాలతో 40 రోజులు రెండు పూటలు తీసుకోవాలి .
3) గర్బసంచి శుభ్రపరుచును : వేరు పొడిని రెండు పూటలు పాలతో 40 రోజులు తీసుకొంటే స్త్రీలకూ గర్భసంచి శుభ్రం అగును.
4) తెల్లరక్త కణాలను పెంచును : శుద్ధి చేసిన అశ్వగంధ వేరు పొడిని రెండు పూటలు పాలతో 120 రోజులు తీసుకొంటే తెల్లరక్త కణాలు పెరుగును .
5) కాన్సర్ తగ్గించును : శుద్దిచేసిన వేరు పొడిని నిత్యం పాలతో తీసుకొంటే cancer తగ్గుతుంది .మరియు రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
6) high BP తగ్గించును : వేరు పొడి-100 గ్రాములు మరియు మిరియాలు -50 గ్రాములు రెండిటిని పొడి చేసి రెండు పూటలు నీటితో సేవిస్తే high BP తగ్గును.
7) క్షయ వ్యాధి తగ్గును : అశ్వగంధ వేరు పొడి,పిప్పళ్ళు ,పటిక పంచదార మూడింటిని సమానంగా కలిపి తేనెతో రెండు పూటలు తినాలి .
8) సెగగడ్డలు తగ్గడానికి : ఆకులను నూరి సెగగడ్డలు ఫై రాస్తే తగ్గుతుంది .

సుగందపాల
రసాయనాలు: హెమిడేస్మాల్,హేమిడేస్టిరాల్,రెసిన్,సపోనిన్
1) రక్త శుద్ధి కోసం : వేరు పొడిని నీటితో 40 రోజులు సేవిస్తే రక్తశుద్ది జరుగును.
2) high BP : వేరు పొడిని నీటితో సేవించాలి .
3) మూత్ర నాళ సమస్యలను తగ్గించును:వేరు పొడి నీటితో 40 రోజులు సేవిస్తే మూత్ర నాళ సమస్యలు తగ్గును
4) వాత నొప్పులు తగ్గును: వేరు పొడిని నీటితో 40 రోజులు సేవిస్తే శరీరానికి వచ్చే అన్ని రకాల వాత నొప్పులు తగ్గును.

Tuesday, April 29, 2014
ప్రకృతి
జబ్బుల
నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన
ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు
ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు
చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల
కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే..
నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ,
ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి
తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో
రాసుకుంటాం..
ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు.
curd-పెరుగుతో పొట్ట క్షేమం
మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
Herbal Tea - హెర్బల్ టీ
తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.
cherries -చెర్రీతో కీళ్లు భద్రం
చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.
Turmeric - పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..
ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.
Ginger - ఆర్థరైటిస్‌కి అల్లం
జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
fish - నడుంనొప్పికి చేప
మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Subscribe to:
Posts (Atom)