గోళ్ల రక్షణకు సులభ మార్గాలు..!
గోళ్లపై మచ్చలు, గుంటలు, పగుళ్లు, గోరు చుట్టూ చీము పుట్టడం.. లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్, ఎగ్జిమ మొదలైన చర్మ వ్యాధులతో పాటు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వల్ల అందమైన గోళ్లు పాడవుతుంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయటం వల్ల గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్లు నానడం, కడిగిన గిన్నెలనే పదే పదే కడగటం చేసే స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ.
• సులభ చికిత్సలు
మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకొని గోళ్లకు రాత్రి పూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని తెల్లగుడ్డను చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీని వల్ల ఫంగస్ ఏర్పడిన పిప్పి గోళ్లు, పగుళ్లు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.
పై పొరను తీసిన బంగాళదుంపను మెత్తగా నూరాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి ఉదయాన్నే కడగాలి. ఇలా చేస్తే ఫంగస్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.
కొద్దిగా పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి ముద్దగా చేసి వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి రాత్రి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొద్దిసేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు రావు. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా ఉంటుంది.
పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.
కూరల్లో వాడుకునే దోసకాయ ముక్కల్ని తరచుగా తింటుంటే పిప్పి గోళ్లు, గోళ్ల పగుళ్లు, మచ్చలు తగ్గిపోతాయి.
Thursday, September 17, 2015
Tuesday, September 15, 2015
పుదీనా - ఆరోగ్యానికి నజరానా
ప్రకృతి మనకు ఎన్నో రకాల పదార్థాలను ప్రసాదించింది. వాటిలో కొన్నిటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటే.. మరికొన్నిటిలోని ఔషధ గుణాలు శరీరంలో ఉన్న వ్యాధులనూ తగ్గించేస్తాయి. అలాంటి గుణాలు కలిగిన వాటిలో 'పుదీనా' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. అంతేకాదు పుదీనా వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి.
• అజీర్తి నివారణలో...
అజీర్తి సమస్యలను నివారించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పుదీనా కీలక పాత్ర వహిస్తుంది. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు తలెత్తే కడుపునొప్పి, వికారం వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఆహారం జీర్ణమయ్యే సమయంలో పైత్య రసాలు ఎక్కువగా విడుదలైతే, అది సులభంగా జీర్ణమై ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. పొట్టలో ఈ ప్రక్రియను ప్రేరేపించి, సులభంగా ఆ రసాలను ఎక్కువ మోతాదులో విడుదల చేయించే గుణం పుదీనాలో ఉంది. దీంతో తీసుకున్న ఆహారం జీర్ణమై, ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.
• అలర్జీలకు దూరంగా..
వాతావరణం మారినప్పుడల్లా మనిషి శరీరంలోనూ అనేక రకాల మార్పులు సంభవిస్తుంటాయి. కొందరైతే చిన్న మార్పులకూ తట్టుకోలేరు. వెంటనే అనారోగ్యాల బారిన పడిపోతుంటారు. పుదీనా ఆకుల్లో ఉండే రొస్మారినిక్ ఆమ్లం వివిధ రకాల అలర్జీలను రూపుమాపడంలో కీలక పాత్ర వహిస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. అందుకే వివిధ రకాల అలర్జీలతో ఇబ్బందిపడేవారు రోజూ పుదీనాను ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.
• వీటినీ తగ్గిస్తుంది..
పుదీనాలో జలుబు, దగ్గును తగ్గించే శక్తి ఉంది. గొంతు నొప్పి, మంట, తలనొప్పి దరిచేరకుండా చేసే ఔషధం ఇది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పుదీనా టీని తీసుకోవడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు. అలాగే దగ్గు ఎక్కువగా ఉన్పప్పుడు వేడి నీళ్లలో కాస్త పుదీనా రసం వేసి ఆ నీళ్లతో ఆవిరిపడితే సమస్యను అధిగమించవచ్చు.
• నోటి సమస్యలకు చెక్
రోజూ కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన, దంతక్షయం వంటి సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అంతేకాకుండా నాలుక, దంతాలను శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది. అందుకే కొన్ని టూత్‌పేస్ట్ తయారీ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల్లో పుదీనాను ఉపయోగిస్తున్నాయి. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగానే ఇది నోటి సమస్యకు సరైన ఔషధంలా పనిచేస్తుంది.
• ఆ సమయంలోనూ...
నెలసరి సమయంలో కొందరు అమ్మాయిలు వాంతుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీంతో ఏదీ తినాలనిపించక, నీరసపడిపోతారు. ఇలాంటి వారికి పుదీనా టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. రోజుకు నాలుగైదు సార్లు దీన్ని తీసుకోవడం వల్ల వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. పుదీనాలోని యాంటీ స్పాస్మోడిక్ గుణాల కారణంగా దీన్ని తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పినీ తగ్గించుకోవచ్చు. పుదీనా టీ వల్ల కండరాలకు సైతం ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు గర్భిణులు సాధారణంగా ఎదుర్కొనే వాంతులు, వికారం వంటి సమస్యలను కూడా తగ్గించే లక్షణం పుదీనాలో ఉంది. దీనికోసం చేయాల్సిందల్లా.. రోజూ పొద్దున్నే కొన్ని పుదీనా ఆకులను చేత్తో బాగా నలిపి, వాటి వాసన పీల్చిస్తే చాలు.
• చర్మ సంరక్షణకు..
పుదీనా రసం చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలపై దీని రసాన్ని రాస్తే త్వరగా తగ్గుతాయి. వీటితో పాటు దోమ, తేనెటీగ, కందిరీగ వంటి కీటకాల కాటు వల్ల కలిగే ఎరుపుదనం, మంట నుంచి పుదీనా రసం మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉండే నాణ్యమైన పుదీనా ఆయిల్‌తో ముఖంపై మర్దనా చేసి, కడుక్కుంటే చర్మం శుభ్రపడడంతో పాటు నిగారింపును సంతరించుకుంటుంది.
• ఇవే కాకుండా..
ఆకలి మందగించినప్పుడు పుదీనా పచ్చడిని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులోని ఔషధ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌ను అరికట్టడంలో సహకరిస్తాయి. శరీర బరువును నియంత్రించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, తలనొప్పి, ఆస్తమాని తగ్గించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలెన్నో.. అందుకే మీరు కూడా దీని వాడకాన్ని పెంచి, ఆరోగ్యంగా ఉండండి.
ఆకలి మందగించినప్పుడు పుదీనా పచ్చడిని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులోని ఔషధ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌ను అరికట్టడంలో సహకరిస్తాయి. శరీర బరువును నియంత్రించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, తలనొప్పి, ఆస్తమాని తగ్గించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలెన్నో.. అందుకే మీరు కూడా దీని వాడకాన్ని పెంచి, ఆరోగ్యంగా ఉండండి.
Monday, September 14, 2015
* సమకాలీన రుగ్మతల నివారణకు దివ్య ఔషదమే '' గ్రీన్ టీ ''
* ‘గ్రీన్ టీ’ తో స్థూలకాయం మటుమాయం..
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. గ్రీన్ టీ అంటే .... ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ (తేయాకు).
రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశఆలు తక్కువ. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీలో ఉంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజు గ్రీటన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొటం వల్ల మార్కెట్లో గ్రీన్ టీతో తయారు చేసిన సబ్బులు, షాంపూలు, డియోడరెంట్స్, క్రీములు కూడా లభ్యమౌతున్నాయి.
కావలసిన పదార్ధాలు:
పుదినా ఆకులు: అర కప్పు
నీళ్ళు: కప్పు
గ్రీన్ టీ బ్యాగులు: మూడు
తేనే: రెండు టేబుల్ స్పూన్లు
గ్రీన్ టీ తయారు చేయు విధానము:
1. ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
2. తర్వాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
3. ప్లేవర్ కోసం ఆకులతో బాటు 1/2టీ స్పూన్ నిమ్మరసం, పంచదార తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
4. రెండు నిమిషాల తర్వాత వడబోసుకుని త్రాగేయటమే.
ప్లేవర్స్:
నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు గ్రీన్ టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి. గ్రీన్ టీ అంటే .... ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది . శారీరక శ్రమలేని ఆధునిక యుగ జీవితం రోగాలమయంగా వుంది. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ (తేయాకు).
రెగ్యులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశఆలు తక్కువ. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీలో ఉంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజు గ్రీటన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొటం వల్ల మార్కెట్లో గ్రీన్ టీతో తయారు చేసిన సబ్బులు, షాంపూలు, డియోడరెంట్స్, క్రీములు కూడా లభ్యమౌతున్నాయి.
కావలసిన పదార్ధాలు:
పుదినా ఆకులు: అర కప్పు
నీళ్ళు: కప్పు
గ్రీన్ టీ బ్యాగులు: మూడు
తేనే: రెండు టేబుల్ స్పూన్లు
గ్రీన్ టీ తయారు చేయు విధానము:
1. ఒక కప్పు నీళ్ళు బాగా మరగబెట్టి దింపుకోవాలి.
2. తర్వాత ఒక చిన్న చెంచాడు గ్రీన్ టీ ఆకులను అందులో వేసి 1,2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
3. ప్లేవర్ కోసం ఆకులతో బాటు 1/2టీ స్పూన్ నిమ్మరసం, పంచదార తేనె కలుపుకుంటే ఆరోగ్యకరం.
4. రెండు నిమిషాల తర్వాత వడబోసుకుని త్రాగేయటమే.
ప్లేవర్స్:
నిమ్మరసంతో బాటుగా రెండు మూడు పుదీనా ఆకులను కూడా వేసుకుంటే అమోఘంగా ఉంటుంది.
నిమ్మరసంతో పుదీనాకు బదులు చిన్న అల్లం ముక్క తొక్కి వేసుకున్నా బాగుంటుంది.
నిమ్మరసం వాడకపోయినా పుదీనాకు బదులు నాలుగు తులసి ఆకులు కూడా వాడవచ్చు.
Sunday, September 13, 2015
ఆరోగ్యానికి కొత్తిమీర జ్యూస్
ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి , కట్ చేసి పెట్టుకోవాలి, రెండు టీ స్పూన్ల నిమ్మరసం , ఒక అర టీ స్పూన్ ఉప్పు , ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అన్నిటిని మిక్సర్ లో మెత్తగా గ్రైండ్ చేయాలి. వడ పోయకుండా అలానే త్రాగాలి. ప్రతి రోజు ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళికడుపుతో తీసుకోవాలి.అరగంట ఏమీ తినకూడదు.
1) షుగర్ , కొలెస్ట్రాల్ , బీపి కంట్రోల్ ఉంటాయి.
2) మొటిమలు , మచ్చలు , చర్మ వ్యాధులు , స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.
3) గ్యాస్ ప్రాబ్లం , కడుపునొప్పి ,పొట్ట సమస్యలు ,
అల్సర్లు ,అజీర్ణం , వాంతులు , వికారం తగ్గుతాయి.
4) నోటి అల్సర్లు , నోటి పూత , నోటి దుర్వాసన తగ్గుతుంది.
5) ఫైల్స్ , మలబద్దకం తగ్గుతుంది.
6) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
7) కంటి చూపు మెరుగుపడుతుంది.
8) శరీరం నుండి విష పదార్ధాలను బయటికి toxins రూపంలో పంపిస్తుంది.
9) శరీరం యొక్క సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
10) కాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది. స్త్రీలో ఋతుచక్ర సమస్యలు , PCOD ని పరిష్కరిస్తుంది.
చూసారా ఒక్క జ్యూస్ లో ఎన్నో లాభాలు , ప్రతి రోజు ఒక మూడు రూపాయలు ఖర్చు అంతే
Wednesday, August 12, 2015
ఆరోగ్యఫలం.
పీచూ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే ఖర్జూరపండ్లను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల పొట్ట, కాలేయ, మూత్రనాళ, క్లోమ, అండాశయ క్యాన్సర్లు రావనీ వచ్చినా వాటిని నివారించే శక్తి కూడా వీటికి ఉందనీ తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
ఖర్జూరంను పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తక్షణ ఉపశమనం పొందవచ్చు.అంతే కాదు, ఇందలో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది పీరియడ్స్ లోపాలను తగ్గించడానికిఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
* వారానికి మూడుసార్లు ఖర్జూరాలను తింటే మలబద్ధకం తగ్గుతుందట.
* ఎడారిఫలాల్లో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం... వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* ఖర్జూరాల్లోని నికోటిన్ పేగుకు సంబంధించిన వ్యాధుల్ని రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బ్యాక్టీరియా పెరిగేలానూ చేస్తాయివి. ఇందులోని అమైనో ఆమ్లాలు జీర్ణక్రియకూ దోహదపడతాయి.
* ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, రక్తహీనతనీ నివారిస్తాయి. తద్వారా అలసటనీ నీరసాన్నీ తగ్గిస్తాయి.
* ఖర్జూరాల్లో సల్ఫర్ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలూ, సైనస్‌లతో బాధపడేవాళ్లకి ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు.
* ఖర్జూరాల్లో చక్కెరలూ, ప్రొటీన్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండటంవల్ల బరువు తక్కువగా ఉండేవాళ్లకు పుష్ఠినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి సుమారుగా 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి.
* ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరుని ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకే వయసురీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి మంచి ఆహారం.
* గుండె పనితీరునీ మెరుగుపరుస్తాయివి. ముఖ్యంగా గుండె బలహీనంగా ఉన్నవాళ్లు రాత్రిపూట ఎండుఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్టులా చేసుకుని తినడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృద్రోగాలు రాకుండా చేస్తాయి.
* ఖర్జూరాలు లైంగికశక్తికీ తోడ్పడతాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకులపొడి జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు.
* దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడేవాళ్లు ఖర్జూరపండ్లు తింటే, వాటిల్లోని పొటాషియంవల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
* దంతాలమీద ఉండే ఎనామిల్ పూతను సంరక్షించడంలో ఖర్జూరాల్ని మించినవి లేవు. నిజానికి ఈ ఎనామిల్ ఎముకకన్నా దృఢమైన హైడ్రాక్సీఎపటైట్స్ అనే పదార్థాలతో రూపొందుతుంది. అయినప్పటికీ ఆహారంలోని బ్యాక్టీరియా కారణంగా అది కొంచెంకొంచెంగా పోతుంటుంది. అదే ఖర్జూరాల్ని ప్రతిరోజూ తినడంవల్ల అందులోని ఫ్లోరిన్ దంతాలమీద పాచి చేరకుండా చూడటంతోబాటు ఎనామిల్‌తో చర్యపొంది హైడ్రాక్సీఫ్లోరోఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
* రోజుకో ఖర్జూరం తినడం కళ్లకీ మంచిదే. ఇందులో పుష్కలంగా ఉండే ఎ-విటమిన్ రేచీకటినీ నివారిస్తుంది.
* గర్భిణుల ఆరోగ్యానికి ఎడారిఫలాలు ఎంతో మేలు. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచించేలా చేయడంతోబాటు, బిడ్డపుట్టాక పాలు పడేందుకూ కారణమవుతాయి. గర్భస్థశిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకూ సాయపడతాయి.
* వీటిల్లో ఉండే ఫ్లేవొనాయిడ్ పాలీఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లూ పొట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి.
కొత్తిమీర జ్యూస్ హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహఆయపడుతుంది. అలాగే, పీరియడ్స్ లో నొప్పిని కూడా తగ్గిస్తుంది.
Thursday, August 6, 2015
రాగులతో మేలైన ఆరోగ్యం...!
తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావా ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగులను మన మెనూలో చేర్చడం ద్వారా ఈ లాభాలు పొందవచ్చు.
రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి.
రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి.
రాగి జావని డైట్‌లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్‌ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు.
రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా రాగులు కంట్రోల్ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రాగులది ప్రధాన పాత్ర.
రాగుల్లోని అమినోఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వుపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెసా్ట్రల్‌ను రాగులు పోగొడతాయి. హైపర్ టెన్షన్, బ్లడ్‌ప్రెషర్‌ని రాగులు చక్కగా నియంత్రిస్తాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్, అమినో యాసిడ్స్ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పిలాంటివి దరికి చేరవు. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది.
కాల్షియంతో పాటు ఐరన్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్‌తో పాటు ముఖ్యమైన అమినోయాసిడ్స్ ఉంటాయి. అందుకే రాగులతో చేసిన ఆహారం తినటం వల్ల కండరాలు గట్టిగా ఉంటాయి.
రాగుల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ్ట్ట
వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ్ట్ట
Sunday, July 19, 2015
సహజ అందానికి తేనె ...!
సహజ అందానికి తేనె ...!
తేనె సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. చెంచా తేనెలో రెండు చెంచాల బాదంనూనె, అరచెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తరవాత కడిగేయాలి.
• తేనె, నిమ్మరసం మిశ్రమం మొటిమలను తగ్గిస్తుంది. రెండు చెంచాల తేనెకి చెంచా నిమ్మరసం చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమల సమస్య ఉండదు.
• రెండు చెంచాల తేనెకి చెంచా ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాసి పావుగంట తరవాత శుభ్రం చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది. చెంచా తేనె, రెండు చెంచాల చొప్పున పాలూ, కీరదోస గుజ్జూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా తేనెకి రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో శుభ్రం చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.
Subscribe to:
Posts (Atom)






