పుదినా ఓ దివ్య ఔషధం.. తరుచూ తింటే పలు రకాల జబ్బులను దూరం చేస్తుంది. నోటి దుర్వాసనను మటుమాయం చేసి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచుతుంది.
మామూలు వంటలను సైతం తన సువాసనతో ఘుమఘుమ లాడించే పుదీనాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వంటల్లో వాడేందుకే కాకుండా, వివిధ రకాల జబ్బులను నివారించే దివ్య ఔషధంలా పుదీనా పనిచేస్తుంది. కూరల్లో వేసుకునే వివిధ రకాల ఆకు కూరల్లో పుదీనాకు ప్రత్యేక ఔషధ గుణాలున్నాయని ప్రాచీన కాలానికి చెందిన గ్రీకు, రోమన్లు తొలుత గుర్తించినట్లు చెబుతారు. రోమన్లు సువాసన కోసం పుదీనాను వంటల్లో ఉపయోగించడమే కాకుండా దాని రసాన్ని డైనింగ్ టేబుల్‌పై చల్లుకొని ఆహ్లాదం పొందేవారు. దీని ఆకులు తింటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారి నమ్మకం. ఎథెన్స్ నగరానికి చెందిన ప్రజలు తమ శరీరం నుంచి వస్తున్న చెమట వాసనను తొలగించేందుకు పుదీనా రసాన్ని స్ప్రేగా ఉపయోగించేవారట!
• పుదీనా ప్రత్యేకతలు..
పుదీనా ఆకులు శరీరంలోని వివిధ రోగకారక క్రిములను నాశనం చేసే ఔషధంలా పనిచేస్తాయిని పలు పరిశోధనలు నిగ్గు తేల్చాయి. దీని నుంచి తీసే మెంథాల్‌ను తల, గొంతు నొప్పి నివారణకు వాడుతున్నారు.
• దుర్వాసనకు చెక్.. !
పుదీనా ఆకులు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మితే నోటి నుంచి వచ్చే దుర్వాసనను నివారించవచ్చు. వీటి ఆకులు నమిలితే పళ్ల చిగుళ్లు గట్టి పడడమే కాక, చిగుళ్లకు సంబంధించిన వ్యాధులూ దూరమవుతాయి.
5,480 మైక్రో గ్రాముల విటమిన్లు
పుదీనా ఆకుల్లో సుమారు 5,480మైక్రో గ్రాముల విటమిన్లు జిటా కెరోటిన్ రూపంలో వెలువడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే ఖనిజ లవణాలు ముఖ్యంగా కాల్షియం 200, గ్రంధకం 0.84, భాస్వరం 0.62, మెగ్నీషియం 60, ఇనుము 15.6, మిల్లీ గ్రాముల్లో లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో విటమిన్ సీ 33మిల్లీ గ్రాములు ఉంటాయి. ఈ ఆకుల్లో ఉన్న పీచుపదార్థాలు పెద్ద మొత్తంలో ఉన్న మాంసకృత్తులను సైతం సులభంగా జీర్ణం చేసేందుకు దోహదపడతాయి.
• ఇంకెన్నో లాభాలు...
పుదీనా టీలో కొంచెం తేనె కలిపి తాగితే అరగని పదార్థాలు సులువుగా జీర్ణమవుతాయి.
కడుపు నొప్పితో బాధపడుతున్న వారు మరిగించిన పాలలో పుదీనా ఆకులను వేసి పంచదార కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
వేడివేడి పుదీనా టీ తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు పుదీనా ఆకులను ఆహారంలో అప్పుడప్పుడు తీసుకుంటే చాలా మంచిది.
Friday, October 9, 2015
ఖర్జూరం పండ్లలో ఆరోగ్యంగా ఇలా!
శరీరానికి తక్షణ శక్తినిచ్చే 'ఖర్జూరం'!
పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.
ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.
ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ 'ఎ' కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా మంచి ఫలితాన్నిస్తాయి.
ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అందుకే రంజాన్ ఉపవాస దీక్షల సమయంలో ముస్లింలు ఈ పండుని ఆహారంగా తీసుకుంటారు. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా!
మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ 'కె' కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది. కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.
మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.

మధుమేహ వ్యాధికి(sugar) వేపను మించిన చక్కటి మందు:
మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!
మనకు షుగర్ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం _/|\_
*బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-
పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాసి రుద్ది తే ఎర్రదనం , వాపు తగ్గుతాయి .
కందిరిగా కుట్టిన, పాము కాటు వేసిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విశాం విరుగుడు అవుతుంది .
అధెవిధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదుల ప్రదేశం లో ఈ బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ ని రాస్తే తగ్గుతాయి .
*బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-
బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి ( ఒక గ్లాస్ నీటికి అర – సగం నీరు వచ్చేంతరవరకు కాయలి ) తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు ఏమిన ఉన్న పోతాయి . క్యాన్సర్ ని రానివ్వధు మరియు షుగర్ వ్యాధి ని రాని వద్దు .
*బిళ్ళ గన్నేరు పువ్వులు :-
బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 పువ్వులని తీసుకొని నీటిలో వేసి కషాయం ( ఈ కషాయం లేత పచ్చరంగు లోకి రావాలి ) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు క్యాన్సర్ , మరుయు షుగర్ వ్యాధి రానివ్వదూ .మరియు behaviour disorder వారికి కోడా ఉమాయోయగా పడుతుంది .
మరియు చిముతో ఉన్న మొలలు కోడా తగ్గుతాయి . పెద్ద పేగు క్యాన్సర్ అయిన తగ్గుతుంది .
మొలల దగ్గర ఎరపడిన చీము తో పుల్లూ మరియు పగ్గులు లాంటివి ఉంటే ఈ కాషయ౦ లో మిరియాల పొడి వెయ్యకుండ పువ్వుల తో పాటు ఆకులు కోడా వేసి కాషాయం చేసి ఈ నీటి తో కదుకుంటే తగ్గుతాయి

Thursday, October 8, 2015
దగ్గుకు దండోపాయ మార్గాలివే..!
దగ్గుకు దండోపాయ మార్గాలివే..!
వాతావరణంలో కలిగే మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల పలురకాల ఆరోగ్య సమస్యల బారిన పడడం సర్వసాధారణం. వీటిలో దగ్గు గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది దగ్గు తగ్గించుకోవడానికి మాత్రలు వేసుకోవడం, దగ్గుమందు తాగడం, గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కిలించడం.. ఇలా దాదాపు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయినా దగ్గు ఏమాత్రం తగ్గకుండా వేధిస్తుంటుంది. ఇలాంటి సమయంలోనే దగ్గుపై ఆఖరి అస్త్రంగా ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు పనికొస్తాయి. ఇవి దగ్గుపై ప్రభావాన్ని చూపి, సమస్య నుంచి సత్వర ఉపశమనాన్నిస్తాయి. మరి అవేంటో తెలుసుకుని మనమూ ఓసారి ప్రయత్నిద్దామా..!
• ఆగకుండా వస్తోందా?
కొంతమంది నిమిషం గ్యాప్ లేకుండా నిరంతరాయంగా దగ్గుతూనే ఉంటారు. ఇలాంటివారు కొద్దిగా అల్లాన్ని తీసుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఒక కప్పు నీటిలో వేసి కాసేపు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, ఆ తర్వాత తీసుకోవాలి. దీనికి అవసరమైతే కాస్త తేనె, నిమ్మరసం కూడా కలుపుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు.. దగ్గు తగ్గే వరకు నిర్ణీత వ్యవధిలో కొద్ది కొద్దిగా అల్లం లేదా వెల్లుల్లి ముక్కల్ని నమలడం వల్ల కూడా సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
• పొడిదగ్గుకు..
పొడిదగ్గు చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎవరితోనైనా ఏమైనా మాట్లాడదామని నోరు తెరిస్తే చాలు.. మాటల కంటే ముందు దగ్గు వచ్చేస్తుంటుంది. ఇలా ఎక్కువగా దగ్గడం వల్ల ఛాతిలో మంట కూడా వస్తుంది. ఇలాంటి వారికి పసుపు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పాత్రలో అరకప్పు నీటిని వేడిచేయాలి. నీరు మరుగుతున్న సమయంలో చెంచా పసుపు, పావు చెంచా మిరియాల పొడి, రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసి.. కనీసం ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని మరిగించాలి. దీన్ని ఒక గ్లాసులో వడకట్టి, గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి చెంచా తేనె కలుపుకొని తాగాలి. లేదంటే గోరువెచ్చటి నీటిలో కాస్త పసుపు, కాస్త తేనె వేసుకుని బాగా కలుపుకొనైనా తాగచ్చు. ఇలా క్రమంగా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్య నుంచి బయటపడచ్చు.. ముఖ్యంగా పొడిదగ్గుతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.
• ఛాతీలో మంటా?
అలాగే నిరంతరంగా దగ్గడం వల్ల ఛాతీలో మంట రావడం సర్వసాధారణం. మరి దగ్గుతో పాటు దీన్ని కూడా తగ్గించుకోవాలంటే కాస్త వేడిగా ఉండే పాలలో కొద్దిగా తేనె వేసి బాగా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్, పొడిదగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే పరగడుపున ఒక చెంచా తేనె తీసుకున్నా ఫలితం ఉంటుంది.
• మరిన్ని..
* రాత్రంతా నానబెట్టిన బాదంపప్పుల్ని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం దీనికి ఒక చెంచా వెన్న కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని రోజుకు నాలుగైదు సార్లు సమస్య తగ్గేంతవరకూ తీసుకోవాలి.
* కొబ్బరినూనె, నిమ్మరసం.. కొద్ది మోతాదుల్లో తీసుకుని దానిలో కాస్త తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే చక్కటి ఫలితం ఉంటుంది.
* క్యారట్ జ్యూస్ ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. దగ్గునూ తగ్గిస్తుంది. దీన్ని మామూలుగా తాగడం అంత రుచిగా అనిపించకపోతే ఇందులో కాస్త తేనె కలుపుకోవచ్చు.
* పుదీనాతో తయారుచేసిన టీ తాగినా లేదంటే మరిగించిన నీటిలో రెండు మూడు చుక్కల పుదీనా నూనెను వేసి ఆవిరి పట్టినా దగ్గు నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.
దగ్గును తగ్గించుకునే కొన్ని సహజసిద్ధమైన మార్గాలేంటో తెలుసుకున్నారు కదా! అయితే ఈ చిట్కాలన్నీ ప్రయత్నించినప్పటికీ ఒకటి రెండు వారాల వరకు దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
Monday, October 5, 2015
రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..
రాగులు తినండి …వయసు తగ్గించుకోండి..
ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు.
మిల్లెట్ అనే రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల యంటీ ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు.
రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది.
సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్నేన్ సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు

బిళ్ళ గన్నేరు. అపోసైనేసి కుటుంబానికి చెందిన చిన్న పొద.
దీని వ్యవహారిక నామం మెడగాస్కర్ పెరివింకిల్,సంస్కృత నామం నిత్య కళ్యాణి,శాస్త్రీయ నామం కథరాంథస్ రోజియస్.
మధుమేహ వ్యాధికి(sugar) చక్కటి మందు.ప్రతి రోజు 4-6పచ్చి ఆకులు పరగడుపున నమిలి మ్రింగుచున్న రక్త శర్కర(blood sugar) నియంత్రణలో ఉంటుంది అని యోగా గురువులు శ్రీ Raghavanand Mudumba గారు నిన్న స్వచ్చభారత్ కార్యక్రమంలో ఒక గ్రౌండ్‌లొ కొన్ని మొక్కలు పొదలు తోలగిస్తుంటే వీటిని గురించి వీటీ విషిస్ఠతగురించి వివరించారు,
వెంటనే వేపను మించిన దివ్య ఔషధం గురించి అందరికి తెలియడం లేదు అని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ పోస్ట్ పెట్టాను...!! మీరు కూడా మీ ఆత్మీయ శ్రేయోబిలాషులకు తెలిపేలా షేర్ చేయండి ప్లీజ్ _/|\_
మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని లేదా ఒక్క పుష్పానికి గల రేకుల్ని మాత్రమే తినమని చెప్పండి క్రమేనే మోతాదు పెంచుకుంటే సరిపోతుంది అంటా...!!
మనకు షుగర్ లేకపోయిన మన ఆత్మీయులు బందువులు ఎందరికో వుంటుంది కధ అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన సంతోషంలో మనంకూడా బాగస్తులౌదాం

Sunday, October 4, 2015
భయంకరమైన వ్యాది పక్షవాతం గురించి పూర్తి వివరణ ( చదివి స్పందించండి )
పక్షవాతం నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. శరీరములోని వివిధ అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను 'పక్షవాతము' (Paralysis) అంటారు.శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగి పోవడం, కాళ్లు చేతులు మెలితిరిగి పోవడం, గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాతప్రభావం ఉంటుంది.ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తోంది.ప్రతి ఆరు సెకెండ్లకు ఒకరు పక్షవాతంతో మృతి చెందుతున్నారు.మన దేశంలోనూ ఈ వ్యాధి వల్ల రోజుకు రెండు వేల మంది చనిపోతున్నారు.కేవలం 10 శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉంది.దీని వల్ల సగానికి పైగా తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతున్నారు.పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.ప్రస్తుతం పక్షవాతం కేసుల్లో 25 నుంచి 30 శాతం వరకు చిన్నవయసు వారుంటున్నారు.అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారికి పక్షవాతం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది.కళ్ళు తిరగటం, తాత్కాలికంగా దృష్టి మందగించడం, లేదా రెండుగా కనిపించడం, కాళ్ళూ, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటల్లో తడబాటు వంటివన్నీ పక్షవాతానికి ముందస్తు సంకేతాలు.ఈ లక్షణాలు కనిపించిన వెంటనే కనీసం గంటలోపు స్ట్రోక్ యూనిట్ సౌకర్యం ఉన్న వైద్యశాలకు తీసుకురాగలిగితే వారికి త్రాంబోలైటిక్ థెరపీ ద్వారా రక్తప్రసరణ పునరుద్ధరించి, మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా కాపాడవచ్చు.అయితే దురదృష్టవశాత్తు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల 10 శాతం మంది కూడా గంటలోపు ఆసుపత్రికి రావడం లేదు. కొన్ని వ్యాధుల్లో లక్షణాలు ముందే బయటపడతాయి. వాటిని గుర్తించి త్వరగా చికిత్స తీసుకోగలిగితే నష్టాన్ని నివారించడానికి సాధ్యమవుతుంది. అలాంటి సమస్యల్లో ముఖ్యమైనది పక్షవాతం(స్ట్రోక్). పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు మొదటి మూడుగంటల్లో ఆసుపత్రికి చేరుకోగలిగితే మెదడుకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు.
మెదడుకు రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినపుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాల సమూహాన్ని కలిపి స్ట్రోక్ అని పిలుస్తారు. మెదడులోని రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడటం మూలంగా రక్తసరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. రక్తసరఫరా తగ్గడమే కారణం స్ట్రోక్ వచ్చిన వారిలో మెదడుకు రక్తం సరఫరా తగ్గడం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది. రక్తం సరఫరా తగ్గడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అందదు. ఫలితంగా మెదడు నుంచి సంకేతాలు అందక కొన్ని అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
తిమ్మిర్లు రావడం, ఒక కాలు, చేతిలో శక్తి తక్కువ అయినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపించడం జరుగుతుంది.
మాట్లాడలేకపోతారు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినపుడు బ్యాలెన్స్ తప్పినట్టు అవుతుంది. తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది.
45 ఏళ్లు పైబడిన వారిలో రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో రిస్క్ మరింత ఎక్కువ.
ఎవరిలో రిస్క్ ఎక్కువ
కుటుంబ చరిత్ర : తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లు, తాతయ్య, నానమ్మలో ఎవరైనా స్ట్రోక్ బారినపడినట్లయితే పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఒకవేళ తండ్రి లేక అన్న 55 ఏళ్లు పైబడకముందే, తల్లి లేక చెల్లె 65 ఏళ్లు పైబడక ముందే హార్ట్ఎటాక్ బారినపడినట్లయితే పిల్లలకు రిస్క్ ఎక్కువే ఉంటుంది.
రక్తపోటు : రక్తపోటు 140/90 కన్నా ఎక్కువున్నా, రక్తపోటు ఎక్కువ ఉందని వైద్యులు ధృవీకరించినా రిస్క్ పెరిగినట్లే.
ధూమపానం : పొగతాగే అలవాటు ఉన్నా జాగ్రత్తపడాల్సిందే.
మధుమేహము : ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 ఎమ్‌జీ/డీఎల్ ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నట్లే.
కొలెస్ట్రాల్ : కొలెస్ట్రాల్ స్థాయి 240 ఎమ్‌జీ/డీఎల్ ఉన్నా, మంచి కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్) 40 ఎమ్‌జీ/డీఎల్ కంటే తక్కువ ఉన్నా ముప్పు ఉన్నట్లే.
శారీరక వ్యాయామం : రోజూ కనీసం అరగంటపాటు వ్యాయామం చేయకపోయినట్లయితే స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
అధిక బరువు : ఎత్తుకు తగిన బరువు కన్నా 10 కేజీలు అదనంగా ఉన్నా రిస్క్ ఉంటుంది.
ఆరోగ్య చరిత్ర : గతంలో ఒకసారి స్ట్రోక్ , ట్రాన్సియెంట్ ఇష్కెమిక్ అటాక్ వచ్చింది. కాలి రక్తనాళాలకు సంబంధించిన జబ్బు ఉంది. ఎర్రరక్తకణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సికిల్ సెల్ ఎనీమియా ఉంది. ఒకసారి హార్ట్ఎటాక్ వచ్చింది. ఇలాంటి మెడికల్ హిస్టరీ ఉన్నవారిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీవనవిధానంలో మార్పులు చేసుకోవాలి.
ముఖపక్షవాతం
****************
ముఖ కండరాలకు సరఫరా చేసే ఏడవ క్రేనియల్ నాడీకి వచ్చే సమస్యలు (ఇన్‌ఫ్లమేషన్) వల్ల మూతి వంకరపోతుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో బెల్స్ పాల్సి అంటారు.చలికాలంలో రాత్రులు బస్సులో ప్రయాణిస్తుంటే కిటిక పక్కన కూర్చున్న వారి చెవిలోకి చలిగాలిపోయి నరంపై ఒత్తిడి తగిలి బెల్స్ పాల్సి వచ్చే అవకాశం ఉంది. 'హెర్పస్ జోస్టర్ వైరస్' ఇన్‌ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో సమస్యగా మారొచ్చు.బెల్స్ పాల్సి (ముఖ పక్షవాతం)కి గురైన వారిలో ముఖంలో ఒకవైపు కండరాలు చచ్చు బడిపోతాయి. చెవి దగ్గర కొద్దిగా నొప్పి ఉంటుంది. పెదవుల చుట్టూ తిమ్మిర్లు, కళ్లు ఎండిపోయినట్లు వుండొచ్చు. నాలుక పక్కకు ఉంటుంది. కన్ను మూయలేక పోవడం వల్ల దుమ్ముపడి 'కెరిటైటిస్' అనే సమస్య వచ్చి కళ్ల వెంట నీరు కారుతుంది. కుడివైపు ముఖ పక్షవాతం వచ్చినవారు నవ్వినప్పుడు మూతి ఎడమవైపునకు లాగినట్లు వంకరపోయి కనిపిస్తుంది. బెలూన్ ఊదలేకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, దవడలో ఆహారం ఉంచుకోలేకపోవడం జరుగుతాయి. మాటలో మార్పు కనిపిస్తుంది. నుదురుమీద ముడతలు ఏర్పడవు. ఈలవేయలేరు. పెదవుల్లో కదలికలు మందగిస్తాయి.
మెదడులో సునామీ
********************
పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయి.ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. అదే నిమిషం సమయంలో నాడీకణాల -న్యూరాన్లు- మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి, మెదడుకు రక్త ప్రసారం తగ్గిపోవడమే పక్షవాతానికి మూలం.పక్షవాతంతో మెదడుకు తీవ్ర నష్టం కలిగే అవకాశం నాడీకణాలు మరణించే సంఖ్యపైనే ఆధారపడి ఉండుంది. అందుకే పక్షవాతం లక్షణాలు కనబడిన వెంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతానికి గురైన మొదటి మూడు గంటల్లో రక్తపు గడ్డలను కరిగించే మాత్రలను వేసుకుంటే, దీనివల్ల అవయవాలు చచ్చుబడిపోవడం లాంటి నష్టాలు చాలావరకు తగ్గుతాయని వైద్యుల వివరిస్తున్నారు.శరీరంలోని ఏదైనా అవయవానికి ఇలా రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకి ఏర్పడితే ఆ అవయవానికి సంబంధించి స్ట్రోక్ సంభవిస్తుంది. స్ట్రోక్స్‌లో గుండెపోటు, పక్షవాతం ముఖ్యమైనవి. తర్వాత ఊపిరితిత్తులు, కాళ్లలో ఇలాగే రక్తం గడ్డకట్టే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటోంది. ఇలా ఒంట్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చినా ఆస్పిరిన్ మాత్ర వేసుకోవాలట.ఛాతీలో గుండెనొప్పి వచ్చినప్పుడు ఆస్ప్రిన్ మాత్ర వేసుకుంటే మరణాన్ని తప్పించుకోగలిగినట్లే పక్షవాతం వచ్చిన సందర్భాల్లో కూడా ఆస్ప్రిన్ మాత్ర చప్పరిస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటాయి.
కారణాలు
***********
పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు:అధిక రక్తపోటు, మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, ప్రమాదాలు, వెన్నెముకలలోని కొన్ని లోపాలు మరియు కొన్ని రకాల విష పదార్ధాలు.నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు, యువతుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికమట.
వైద్యం
******
దీనికి పనిచేసే మందులు:క్షీరబల తైలం, హెపారిన్.న్యూరాలజి చికిత్సతోపాటు ఫిజియోథెరపీ చికిత్స . న్యూరోమస్కులార్ ఎలక్ట్రికల్ స్టిములేషన్‌తో పనిచేయని కండరాల్లోని శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. కండరాలను ఉత్తేజపరచడానికి థెరప్యూటిక్ మసాజ్, మాన్యువల్ థెరపీ ముఖ కండరాలకు వ్యాయామం చేయిస్తారు. దీని వల్ల ముఖ కండరాల్లో శక్తి పెరుగుతుంది.
రోగి శ్వాస తీసుకోవడం, రక్తపోటు ఎలా ఉంది పరీక్షించాలి.
రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించాలి.
ఆక్సిజన్ అవసరమైతే ఇవ్వాలి. ఈసీజీ, షుగర్ టెస్ట్ చేయించాలి. తరువాత సీటీ స్కాన్ చేయించాలి.
సీటీ స్కాన్‌లో రక్తనాళం చిట్లినట్లయితే తెలిసిపోతుంది. బ్లీడింగ్ లేనట్లయితే రక్తం సరఫరా తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవచ్చు. హైబీపీ ఉంటే నెమ్మదిగా తగ్గించాలి. అదే సమయంలో మెదడులో ఒత్తిడిని తగ్గించడానికి మందులు ఇవ్వాలి. షుగర్ ఉంటే నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
మెదడులో మైక్రోచిప్
********************నిశ్చలనంగా పడిఉన్న పక్షవాతం రోగుల మదిలోభావాలను గ్రహించి తదనుగుణంగా నాడీవ్యవస్థను చైతన్యపరచే 'మైక్రోచిప్'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు సెంటీమీటరు వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్‌ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనను పసిగట్టే ఈ మైక్రోచిప్... ఆ సంకేతాలను అచేతన అవయవాల కదలికలుగా మార్చేస్తుంది .

Subscribe to:
Posts (Atom)