Saturday, June 11, 2016

• సోయాపాలు.

బరువు తగ్గాలన్నా.. ఎముకలు బలంగా ఉండాలన్నా.. ఈస్ట్రోజన్‌లోపాన్ని అధిగమించాలన్నా సోయాపాలు మేలంటున్నారు నిపుణులు. 

ఎందుకంటే....!

ఈ పాలల్లో ఫ్యాటీ ఆమ్లాలూ, మాంసకృత్తులూ, పీచు, విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినందివ్వడమేకాదు, చురుగ్గా పనిచేసేందుకూ తోడ్పడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడతాయి.

* ఇందులోని ఒమెగా 3, 6 ఫ్యాటీయాసిడ్లు, అత్యంత శక్తిమంతమైన ఫైటో - యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. దీనివల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతమవుతుంది.

* సహజంగానే చక్కెర తక్కువగా ఉంటుంది సోయాపాలల్లో. అంతేకాదు కెలోరీల పరంగా ఇది వెన్నతీసిన పాలతో సమానం! కాబట్టి బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరానికి పీచూ అందుతుంది కాబట్టి.. తరచూ ఆకలి కూడా ఉండదు.

* మెనోపాజ్‌ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోతుంటుంది. హృద్రోగం, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు వీళ్లని వేధిస్తుంటాయి. సోయాపాలు ఇలాంటివాటికి చక్కటి ఉపశమనం. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరిస్తుంది.

* వయసు పెరిగేకొద్దీ చాలామంది మహిళల్లో కనిపించే మరో సమస్య ఆస్టియోపోరోసిస్‌. ఆ సమస్య తీవ్రతను కొంతవరకూ తగ్గించుకోవాలంటే.. సోయాపాలు సరైన పరిష్కారం. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌ ఎముకలకు తగిన క్యాల్షియం క్యాల్షియం అందేలా తోడ్పడుతుంది.

Tuesday, June 7, 2016

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకర

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. కాకర జ్యూస్‌ను రోజూ ఒక గ్లాస్ తీసుకుంటూ వస్తే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. అలాగే రెండు స్పూన్ల కాకర రసంతో కాసింత నిమ్మరసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చు.
ఇంకా కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది. ఇంకా కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. అలాగే కాకర డయాబెటిస్‌కు చెక్ పెడుతుంది. పండిన కాకర రక్తం, మూత్రంలో కలిసిన చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కాకర చెట్లలో ఇన్సులిన్ దాగివుండటంతో మధుమేహానికి చెక్ పెడుతుంది
ఇకపోతే కంటి సమస్యలనుకూడా కాకర నయం చేస్తుంది. కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇంకా కాలేయ వ్యాధికి కూడా కాకర చెక్ పెడుతుంది.
ఇంకా అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది.

Hair loss control tips in Telugu

మీ జుట్టు అందంగా పొడువుగా, బలంగా లేదని బాధపడుతున్నరా……..? బ్యుటిపార్లకి వెల్లె సమయం లేదా………….? జుట్టును అసలు పట్టించుకోవడం లేదా…..? చుండ్రు సమ్యస…? వీటన్నిటికి మన ఇంటిలోనె అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయెగించి, చుండ్రు నుండి నివారణ పొందటానికి, బలమైన, దృఢమైన జుట్టును మీ సొంతం చేసుకోవడానికి చిట్కాలు ఎంటో……తెలుసుకుందామా……. మీ జుట్టు పొడవుగా, దృఢంగా, నిగ నిగ లాడుతు ఉండడానికి సూత్రాలు
వారానికి తప్పనిసరి:- కోడిగుడ్డులో తెల్లని సొనను మత్రమే జుట్టుకు బాగ పట్టించి 20 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యండి వారంలో కనీసం ఒకసారి అయీన మీ జుట్టుకు ఈ పాక్ వెసుకొనిన యెడల ఎప్పుడు నిగ నిగ లడే జుట్టున్ని మీ సొంతం చెసుకోవచ్చూ.
పొడవాటి నిగ నిగ లాడే జుట్టు మీ సొంతం:-ఒక అరటిపండు గుజ్జులో ఒక కోడి గుడ్డు ను మూడు స్పూన్ ల పాలు మరియు మూడు స్పూన్ ల తేనె ను వేసి బాగ కలపండి, కలిపిన దాన్ని జుట్టు కి బాగా పట్టించండి. 30 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యండి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెసి, పొడవాటి నిగ నిగ లడే జుట్టున్ని మీ సొంతం చెసుకోండి.
రెండు కోడి గుడ్లు మరియు ఐదు స్పూన్ ల ఆలీవ్ అయిల్ ఒక గిన్నె లొ వెసి బాగ కలిపిన మిస్రమ్మాన్ని జుట్టు కి బాగా పట్టించి 30 నిమిషములు తర్వతా షాంపూతో వాష్ చెయ్యాలి.
కోడి గుడ్డు- నిమ్మ రసంతో చుండ్రు నివారణ-మేరిసె జుట్టు:- ఒక కోడి గుడ్డు మెత్తంను మరియు ఒక నిమ్మకాయ రసంను బాగా కలపండి తరువాత దాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషములు తరువాత షాంపూతో వాష్ చేస్తె చుండ్రు నివారణ మరియు మేరిసె జుట్టు మీ సొంతం.
దృఢమైన పొడువాటి జుట్టు:- ఒక గిన్నెలో మూడు కప్పుల మెహంది పౌడర్, 1/4 స్పూన్ ఉప్పు, Daber Amla Hair Oli ఒక కప్పు ఐదు స్పూన్ల తేనె,ఒక కప్పు టీ పౌడర్, రెండు కోడి గుడ్లు మొత్తంను బాగా కలిపి జుట్టుకి బాగా పట్టించి ఒక గంట తరువాత షాంపూతో వాష్ చెయ్యాలి అలా కనీసం నెలకి ఒకసారి చేస్తె మీ జుట్టు బలంగా, పొడవుగా, దృఢంగా మరియు తొందరగా పెరిగే అవకాశం ఉంది.
జుట్టు రాలకుండ-నివారణ:- ఉసిరి రసం(Amla Juice) లో మూడు స్పూన్ల నిమ్మ రసంను కలిపి జుట్టు కుదుళ్ల భాగంలో బాగా పట్టించి 30 నిమిషములు తర్వతా నీటితో శుభ్రం చెయ్యాలి ఇలా వారంలో కనీసం రెండు సార్లు చెస్తె మీ జుట్టు రాలకుండా ఉంటుంది.

శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌

ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.
బాదం పప్పు...
బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.
రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
జీడిపప్పు...
శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష...
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూరపు పండ్లు...
ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.
అంజీర్‌ పండు....
ఎండిన అంజీర్‌ పండులో పీచు, రాగి, మంగనీస్‌, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్‌-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.

Sunday, May 15, 2016

వాము మొక్క

వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది
వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దది
ఔషధోపయోగాలు
వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు

Saturday, May 7, 2016

కంటి చుట్టూ ఉన్న నరాలు ఆరోగ్యంగా ఉండడానికి చిట్కాలు

1) మన కళ్ళు చుట్టూ ఉన్న ప్రకృతిని చూడడానికి దేవుడు ప్రసాదించిన వరం.దేవుడు ఇచ్చిన ప్రతి అవయవాన్ని కాపాడుకోవడం మన భాద్యత.
2) కళ్ళు అతి సున్నితమైన అవయవాలు.అవయవాల్లో ఎక్కువ అలిసిపోయేవి కళ్ళు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు చూస్తూ అలిసిపోతూ ఉంటాయి.
3) మొబైల్ రేడియేషన్ , కంప్యూటర్ రేడియేషన్ , టీవీ రేడియేషన్ , తగినంత నిద్ర లేకపోవడం, న్యూట్రిషన్ లోపం ఇవ్వన్ని కళ్ళను ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి.వీటిని తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
4) ప్రతి రోజు సాయంత్రం లేదా కళ్ళు అలసటకు గురి అయినప్పుడు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని వేడి చేసి , గోరు వెచ్చగా అయ్యాక , కళ్ళు మూసి రెప్పలపై , కనుబొమ్మలపై , కంటి చుట్టూ చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
5) ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నరాలు బలంగా తయారవుతాయి.కళ్ళ కింద నలుపు , వలయాలు , కంటి కింద ముడతలు తగ్గుతాయి.
6) కంటి ఆరోగ్యం బాగుండాలంటే A విటమిన్ ఉన్న పండ్లు , కూరగాయలు
ఆహరంలో భాగం చేసుకోవాలి.రోజులో తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.మొబైల్ , కంప్యూటర్ అవసరానికి మాత్రమే వాడుకోవాలి.
7) ముఖ్యంగా క్యారట్ , బీట్స్ , ఆకుకూరలు , బొప్పాయి , పాలు , గ్రుడ్లు , చేపలు , సోయాబీన్స్ లాంటివి తీసుకోవాలి.
ఇలా పాటిస్తే కంటి చూపు మెరుగుపడి , కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరోగ్య చిట్కాలు

రాత్రి నీటిలో నానబెట్టిన బాదంను మరుసటి రోజు ఉదయం పరగడుపు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది . ఇందులో విటిమన్స్, మినిరిల్స్ అధికంగా ఉంటాయి . ఇంకా మెగ్నీషియం, మరియు ఐరన్ కూడా అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే ఎంజైమ్స్ రెస్పిరేటర్ హీలింగ్ పవర్ ను నయం చేస్తాయి . కాబట్టి మీరు బ్రొకైటిస్ తో బాధపడుతుంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.