Sunday, March 10, 2013

* బాదంపప్పు ( Almond )


* బాదంపప్పు ( Almond )
బాదం పాలు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. బాదం నూనె వాడితే చర్మం నునుపుగా తయారవుతుంది. బాదం పప్పు ఉపయోగిస్తే స్వీట్లకు మంచి రుచి వస్తుంది. రాయల్ దినుసుగా పేరున్న బాదంపప్పు మన వంటింటి దినుసుల్లో మహారాజ వైభోగం దక్కించుకోవడం వెనకాల పెద్ద కథే ఉంది.

గుండెకు, మెదడుకు మేలు చేసేదిగా, ఆరోగ్యప్రదాయినిగా ఏ పప్పుకూ లేనన్ని సుగుణాలు బాదం పప్పుకు ఉన్నాయి. అహ్.. అంటూ అందరిచేత భేషైన ప్రశంసలు అందుకుంటున్న బాదం చెట్టు రొససెయె కుటుంబానికి చెందినది. బాదం పుట్టుక మధ్యధరా ప్రాంతమైనా అక్కడి నుంచి ఉత్తర ఆఫ్రికా, దక్షి యూరప్ దేశాలకు విస్తరించి అటు నుంచి రవాణా సదుపాయాల ద్వారా ప్రపంచమంతా తిరిగింది. బాదం పప్పు ఎంత పాతదంటే క్రీ.పూ 1325 లో ఈ డ్రై ఫ్రూట్ ఈజిప్టు టూంబ్స్‌లోనూ చోటుచేసుకున్నట్టు పురాతత్త్వశాస్త్రవేత్తలు కనిపెట్టి మరీ తెలిపారు. యురోపియన్ దేశాలలోని రాయల్ బొటానికల్ గార్డెన్‌లో బాదం చెట్టుకి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. జర్మనీ, నార్త్ ఐలాండ్ దేశాలలోనూ దీనికి విరివిగా ప్రాచుర్యం ఉన్నట్టు తెలుస్తోంది.

లాటిన్‌లో అమండోలా, గ్రీక్‌లో అమిగ్డాలా, ఇటాలియన్‌లో మండోర్లా, బ్రిటన్‌లో అ్‌హ-మండ్, తెలుగులో బాదం అని పిలుచుకునే ఆల్మండ్‌కు పోషకాల లిస్టే కాదు పేర్ల లిస్ట్ కూడా ఎక్కువే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాదంపప్పు దిగుబడి 2006లో 1.76 మిలియన్ టన్నులు ఉన్నట్టు లెక్క తేలింది. అయినా భారతదేశంలో వీటి దిగుబడి గురించి పెద్దగా పేరు వినిపించడం లేదు. కాకపోతే మనవాళ్లు గుండెకు, మెదడుకు బాదం చాలా మంచిదని భావిస్తారు.

బాదం పూలు తెల్లగా ఉండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింక్ కలర్‌లో ఉంటాయి. నాటిన ఐదు సంవత్సరాలకు దిగుబడి మొదలవుతుంది. పుష్పించిన ఆరేడు నెలల తర్వాత కాయలు పక్వానికి వస్తాయి. బాదంకాయ పై భాగం పీచు కలిగిన గట్టి పెంకు ఉండి లోపల బాదం గింజ ఉంటుంది. దీనిలో కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి.

బాదంపప్పే ఖరీదు ఎక్కువైనప్పుడు, ఇక దీని నూనెకు ఎంత ఉండాలి... అందుకే బాదం నూనెను వంటలలో ఉపయోగించరు. చర్మ సంరక్షణిగా, కేశసంవర్ధినిగా ఉపయోగిస్తారు. బాదం నూనె ఎసెన్సియల్ ఆయిల్ వర్గానికి చెందినది. దీనిని అరోమా థెరపీ, మసాజ్ థెరపీలలో ఉపయోగిస్తారు. సుగంధ నూనెలు వాసన త్వరగా కోల్పోకుండా ఉండటానికి బాదం నూనెను కలుపుతారు.

బాదం నూనెను మేనికి మర్దనా చేయడం వల్ల మెరుపు వస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. కళ్లచుట్టూ నల్ల చారికలను తగ్గిస్తుంది. పెదవుల పగుళ్లను, చర్మం ముడతలను తగ్గిస్తుంది. చిన్న పిల్లల సబ్బులలోనూ, మర్దనా నూనెలలోనూ బాదం నూనెను ఉపయోగిస్తారు. అంతేకాదు కొన్ని హాట్ హాట్ వంటకాలలోనూ బాదంపప్పును పిండి చేసి మరీ ఉపయోగిస్తారు. ఖరీదులోనే కాదు, రుచిలోనూ అగ్రభాగంలో ఉంటుంది బాదంపప్పు.

తలనొప్పికి టానిక్‌ ... మంచినీరు


తలనొప్పికి టానిక్‌ ... మంచినీరు

మనలో చాలామంది తగినంత నీరు తాగరు. ముఖ్యంగా స్ర్తీలు పనుల్లో పడిపోయి దీని గురించి అంతగా పట్టించుకోరు. ఒకోసారి దాహం వేస్తున్నా ఏమతుందిలే అని తేలికగా తీసేకుసుకంటారు. కానీ ఒంట్లో ఏమాత్రం నీటి శాతం తగ్గినా (డీహైడ్రేషన్‌) మూడ్‌ మారిపోవటానికి కారణమవుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

ఏకాగ్రత దెబ్బతినటం, అలసట, తలనొప్పి వంటివి వస్తాయని తాజా అధ్యయనంలో తెలిసింది. ఇందులో ఆరోగ్యవంతులైన యువతలను ఎంచుకొని పరిశీలించారు. నీటిశాతం మామూలుగా ఉన్నప్పుడు, తగ్గిన తర్వాత వీరిలో ఏకాగ్రత, మూడ్‌, జ్ఞాపకశక్తులను పరీక్షించారు. ఇలా 28 రోజుల తేడాతో మూడుసార్లు ప్రయోగాలు చేశారు.

ఒంట్లో నీరు తగ్గినపుడు వీరిలో మానసిక సామర్థ్యంలో ఎలాంటి తేడా కనిపించలేదు గానీ ఏకాగ్రత మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. లక్ష్యాలను గుర్తించే పరీక్షలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడ్‌ మారిపోయి ఉత్సాహం తగ్గిపోవటం, అలసట పెరిగిపోవటం వంటి లక్షణాలు కనిపించాయి. ఇవి చివరికి తలనొప్పికి దారితీస్తుండటం గమనార్హం. తేలికపాటి వ్యాయామాలు చేసినా, కంప్యూటర్‌ ముందు పనిచేస్తున్నా సరే.. మహిళలు ఎక్కువగా అలసటకు గురవుతుంటారని కనెటికట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఒకరు చెబుతున్నారు. అందువల్ల ఆహారం తినేటప్పుడే కాదు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు నీళ్లు తాగటం మంచిదని సూచిస్తున్నారు.

నిజానికి మనకు దాహం వేసే సమయానికే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి ఉంటుందని గుర్తించాలి. తలనొప్పి, అలసట ఉన్నాయంటే మరింత ఎక్కవ నీళ్లు తాగాలి. కాబట్టి నిరంతరం పనుల్లో మునిగిపోయే స్ర్తీలు, వ్యాయామాలు చేసే మహిళలు తరచుగా నీళ్లు తాగటం మేలు. దీంతో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు.

* బెల్లం


* బెల్లం

నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకపోయినా, వాటిని వండటానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలు. ఆ పూటకు పనైపోతుంది. దేవతలను సైతం సంతృప్తిపరిచే బెల్లం మానవుడికి అత్యంత ప్రీతికరమైనది. హిందువుల పండగల్లోనూ, పలహారాల్లోనూ ప్రశస్థమైనదిగా పేరు కొట్టేసింది బెల్లం. తీపి వంటకాల్లో మేలైనదిగా, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అగ్రభాగాన ఉన్న బెల్లం కథ బహుతీపిగానూ ఉంటుంది. ఎందుకంటే బెల్లం మనది, మన దేశానిది, మన ఇంటిది. రకరకాల రూపాల్లో తయారయ్యే బెల్లాన్ని ఫారనర్స్ పార్శిళ్లు కట్టి మరీ మన దగ్గర నుంచి తీసుకెళుతుంటారు.

బెల్లం తయారికి ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి పెట్టింది పేరు. అయితే ఉత్పత్తిలో అధికంగా ఉండి దేశంలోనే మహారాష్ట్ర అగ్రగామిగా నిలిచింది. ఇంకా మన దేశంలో వెస్ట్ బెంగాల్, దక్షిణభారత దేశాలలోనూ బెల్లం ఉత్పత్తి బాగానే ఉంది. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లోనూ బెల్లాన్ని అధికంగానే ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం. ఈ వివరాలను బట్టి చూస్తే ఆసియా దేశాలలో బెల్లం పేరు విరివిగా వినిపిస్తోంది. తక్కిన దేశాలలో పంచదారే తప్ప బెల్లం తీపి పెద్దగా తెలియదనే చెప్పాలి.

మన పండుగల్లో ఎన్నో వంటకాలకు చక్కని తీపిని తీసుకువచ్చే బెల్లాన్ని పండగ పూట కొన్ని ప్రాంతాల్లో కుటుంబాలు ఇచ్చిపుచ్చుకుంటాయి. దీని ద్వారా తమ మధ్య బంధాలు పదిలం కావాలని ఆశిస్తాయి. దీనిని బట్టి చూస్తే మన దగ్గర బెల్లం ప్రత్యేకత ఎంతటిదో ఊహించవచ్చు. ఆంగ్లంలో జగ్గరీగా పిలిచే బెల్లంను చెరుకు రసం నుండి తయారు చేస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్ల నుంచి కూడా బెల్లాన్ని తయారు చేస్తారని కథనాలు ఉన్నాయి. మనకు తెలిసినంతవరకు బెల్లం అంటే చెరకు నుంచి తీసి, తయారుచేసినది. చెరుకును కట్ చేసి, పైనున్న ఆకులను తీసేసి గానుగ వద్దకు చేర్చుతారు. ఇలా తెచ్చిన చెరుకు నుంచి రసం తీసి, వెడల్పాటి పేద్ద ఇనుప బాండీలో పోసి, గట్టిపడేవరకు బాగా కాగబెడతారు. అటు తర్వాత అచ్చులలో పోసి, బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, నల్లగానూ, మెత్తగానూ, గట్టిగా తయారవుతుందన్నమాట.

బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తహీనతకు దివ్యౌషధంగా బెల్లం పేరే చెబుతారు. అయుర్వేద వైద్యశాస్త్రంలో బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడుతారు. ఆరోగ్యాన్ని తద్వారా ఆయుష్షును, అనుబంధాలను పెంచే బెల్లంతో ఈ పూటకు ఏ వంటకం తయారుచేయాలో చిన్న బెల్లం ముక్క బుగ్గన పెట్టుకొని, ఆ తీపిలోని పసందును అనుభవిస్తూ ఆలోచించండి.

Saturday, March 9, 2013

* మెదడుకు బలం యాపిల్‌






*
మెదడుకు బలం యాపిల్‌
శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజేసే శక్తి యాపిల్‌కు ఉంది. దానిలో లభించే భాస్వరం, ఐరన్‌ మెదడుకు,శరీరానికి ఉత్సాహాన్ని పుష్టిని కలుగ జేస్తుంది. మండకోడి తనాన్ని నిర్మూలించి కాలెయాన్ని చైతన్యవంతం చేసి శరీర, మెదడుకు శక్తి సామర్థ్యా లను అధికం చేస్తుంది. జ్వరంతో బాధపడే వారికి యాపిల్‌ ఉష్ణాన్ని తగ్గించి క్రమపరుస్తుంది. ధీశక్తిని పెంచుకోవాలనుకుంటే రోజుకు మూడు, నాలుగు యాపిల్‌ పళ్లు తీసుకోవాలి.
* అద్భుత ఫలం :
భారతీయ శాస్తవ్రేత్తల ప్రకారం యాపిల్‌ పండు పోషక విలువల భాండాగారం, యాపిల్‌ పండు చర్మం ఫాలీఫె నాల్స్‌, పరమాణువులతో కలిస్తే కేన్సర్‌ను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. యాపిల్‌ ఫలాలు కాలేయం, పేగు కేన్సర్‌ నివారణలో ఉపయుక్తంగా ఉంటుంది. సి విటమిన్‌, క్యాల్షియం తదితర ఎన్నో పోషకాలను అందిస్తుంది. టూత్‌బ్రష్‌తో తోమడం కన్నా యాపిల్‌ తినడం వల్ల పళ్ళు మరింత శుభ్రమవుతాయి. అది హృద్రోగాలను కూడా అడ్డుకుంటుంది. అంతేకాకుండా యాపిల్‌లో మ్యాలిక్‌ యాసిడ్‌ కండరాలు, కీళ్ళ వ్యాధు నుంచి కూడా విముక్తినిస్తుంది.

సర్వరోగ నివారిణి... నిమ్మ


సర్వరోగ నివారిణి... నిమ్మ
నిమ్మ ఆరోగ్య ప్రదాయని. 100 గ్రాముల నిమ్మపండు నుంచి 40 కేలరీల శక్తి లభిస్తుంది. నిమ్మలోని పోషక విలువలు మెదడు చురుకుగా పనిచేయడానికి, దంతాలు ఎముకలు పటిష్టంగా పని చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. రోజూ నాలుగుసార్లు నిమ్మరసం తాగితే పచ్చ కామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం పిండి తాగినట్టయితే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ లోపాలకు నిమ్మ మంచి ఔషధం. సుగుణాల రాశి నిమ్మను ఆహారంలో భాగం చేసుకోవడం మరవకండి.

* మునగాకులూ మహా ఔషధాలే


* మునగాకులూ మహా ఔషధాలే
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో మునగాకుఒకటి. మనలో చాలా మందికి మునగాకులో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయనే విషయం తెలీదు. మునగాకు శరీరానికి మేలు చేసే మొనగాడుగా చెప్పవచ్చు. తోటల్లో మునగచెట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుతారు. కానీ ఆకును కూరగా వండుకుంటారని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. దీనిలో అధికంగా శరీరానికి లవణాలు, విటమిన్లు, శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి బలానిస్తుంది. మునగాకులో విటమిన్‌-ఎ, విటమిన్‌-సి, కాల్షియం, ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మాంసకృతులు కూడా ఉన్నాయి. మునగాకులో ఔషధ గుణాలు విస్తారంగా ఉన్నాయి.

* నారింజ .... యవ్వనాన్నిచ్చే నారింజ


* నారింజ .... యవ్వనాన్నిచ్చే నారింజ

నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. మన తెలుగు దేశంలో నంద్యాల, కోడూరు, వడ్లమూడి మొదలగు ప్రాంతాలలో బాగా పండిస్తున్నారు. నారింజపండ్లు కాలం గడుస్తున్న కొద్దీ ప్రకృతిరీత్యా మార్పులు చెందుతూ వస్తున్నాయి. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. దీన్ని నిమ్మకన్నా కాస్త ఉత్తమం అంటారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది.

నారింజ పండులో ఈ క్రింది పోషక విలువలున్నాయి.

తేమ - 87.8%
సున్నము - 0.5% మై.గ్రా
మాంసకృత్తులు - 0.9%
పిండి పదార్ధలు - 10.6%
భాస్వరము - 0.2% మై.గ్రా
క్రొవ్వు - 0.3%
ఇనుము - 01% మై.గ్రా
సేంద్రియ లవణాలు - 0.4%
విటమిన్‌ - ఏ - 350 I.U.
విటమిన్‌ - బి1 - 120 I.U.
విటమిన్‌ - సి - 68 I.U.
పనస పండు ఇచ్చే శక్తి - 49 కేలరీలు

నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల, దీనికి ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది. విటమిన్ ‌- ఏ, బి స్వల్పంగా, విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. ఆరు ఔన్సుల నారింజ రసం త్రాగితే చాలు, మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్‌ లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని కాల్షియం దేహ ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది. నారింజ తొనల చర్మంలో కాల్షియం ఎక్కువ. తీపి నారింజలో చక్కెర ఎక్కువ. కాబట్టి అది కాస్త ఎక్కువ శక్తిని ఇస్తుంది. సూర్యరశ్మిలో పండినప్పుడు, నారింజలోని పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి కాబట్టి, నారింజ సులభంగా జీర్ణ అవుతుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే, దేహానికి కావలసిన రీతిగా అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. ఆహారనాళ్ళలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని చంపివేస్తూ ఉంటుంది.

మలబద్ధకం, చాలా రోగాలకు దారి తీస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది. మలబద్దకం పోతుంది. కేవలం తీపి నారింజ ద్వారా ఉబ్బసాన్ని, శ్వాసనాళ వ్యాధులను వైద్యులు తగ్గిస్తూ ఉంటారు. జీర్ణం కాని కఠిన తిను పదార్ధలను, వేళాపాళా లేకుండా అతిగా తినటం వల్ల, ఈ రోగాలు సంక్రమిస్తుంటాయి. వారికి తేలికగా జీర్ణమయ్యే రోగ నిరోధక శక్తిగల నారింజ పండ్లను ఇస్తే, ఆ రోగాలు ఉపశమిస్తాయి. 'పయోరియా' వంటి దంతవ్యాధులు నారింజ రసాన్ని సేవిస్తే తగ్గిపోతాయి. నారింజలో రెండు రకాలున్నాయి - పుల్ల నారింజ, తీపి నారింజ. పుల్ల నారింజ కాయలలో నీరు అధికంగా ఉంటుంది, లవణాలు తక్కువగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కాస్తుంటాయి. తీపి నారింజలు వేసవిలో కాస్తాయి. వీటిలో నీటి భాగం తక్కువ. లవణాలు ఎక్కువ. ఇది దేహానికి మేలు మేస్తాయి. కాబట్టి వేసవి కాలంలో కాచే నారింజ పండ్లను తినటం ఎక్కువ శ్రేయస్కరం.

నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులోఊరించి, ఎండించి, కారం మరియు మెంతి చేరిస్తే, ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. దీనిని సంస్కృతంలో "నారంగ-ఐరావతి:" అంటారు. హిందీలో "నారంగీ, సంతరా" అంటారు. బంగ్లాలో "కమలా రేఖ" అంటారు. ఇంగ్లీషులో "ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌" అన్న సాంకేతిక నామం దీనికుంది.