Saturday, November 2, 2013

అల్పాహారం ........ ఎంత అయితే అంత ఆరోగ్యం...!

అల్పాహారం ........
ఎంత అయితే అంత ఆరోగ్యం...!
అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

అల్పాహారానికి యూరోపియన్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బ్రేక్ ఫాస్ట్ లో అధిక పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆనేక పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు ఎనిమిది గంటలపాటు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి కడుపు నిండా అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. రాత్రి భోజనం తగ్గించుకుని, భారీగా అల్పాహారం తీసుకుంటే ఊబకాయం రాదని టెల్ అవివ్ విశ్వ విద్యాలయంలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అల్పాహారం కడుపు నిండా తినేవారి ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని, చెడు కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ డేనియేల జాకుబోవిచ్, ఆమె సహచరులు ఈ పరిశోధన చేశారు. స్ధూలకాయం ఉన్న 93 మంది మహిళల్లో కొందరికి అధిక అల్పాహారం, కొందరికి అధిక రాత్రి ఆహారం ఇచ్చి 12 వారాల పాటు పరిశీలించారు. అల్పాహారం ఎక్కువగా తీసుకున్న వారు బరువు తగ్గి ఆరోగ్యం పెంచుకున్నట్టు వెల్లడైంది.

Tuesday, October 15, 2013

Drs Chandu

మన చర్మం రంగు అనేక కారణాల వల్ల తన సహజత్వాన్ని కోల్పోతుంది ఈ చర్మపు రంగు మారడానికి గల కొన్ని కారణాలు ... చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు., ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి కొన్ని చిట్కాలు #

1) కేరెట్ గుజ్జును, ముల్తానా మట్టితో (ఫుల్లర్ మట్టి) కలిపి ఒక చిక్కటి గుజ్జుగా తయారు చేయండి. ఒక విటమిన్ సి బిళ్ళను పొడి చేసి కలపండి. మీ ముఖం పైన పూసి, కడగడానికి ముందు ఇరవై నిముషాల పాటు ఉంచండి. ఇలా ప్రతి వారం చేయండి.
2) 4 టీ స్పూనుల పాల పిండిని తీసుకొని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లా చేయండి. దీనికి గ్లిసరిన్ కలిపి చర్మం రంగు మారిన ప్రదేశాలలో పూయండి. దీనిని 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఔషధాల దుకాణాల్లో సులువుగా లభ్యమౌతాయి.
3) ఒక బంగాళదుంపను తోలు తీసి కొన్ని చుక్కల నీటిని దాని పైన వేయండి. చర్మం పైన మచ్చలుగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. బంగాళదుంప రసం చర్మం పై ఉన్న మచ్చల రంగును తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
4) ఓట్ మీల్ పొడిని, పెరుగుతో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం, టమోటా రసం కూడా కలపండి. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారానికొకసారి దీనిని ప్రభావిత ప్రాంతాలలో పూయండి.
5) తులసి ఆకులను, నిమ్మరసంతో కలిపి చర్మం రంగులోని మచ్చలను తగ్గించడానికి ప్రభావితప్రాంతాలలో పూయండి.
6) ఆలివ్ ఆయిల్ లో కలిపిన పంచదారతో మీ శరీర౦ పై రుద్దండి. పంచదార పూర్తిగా కరిగే దాక రుద్దాలి. దీన్ని మీ చేతులు, కాళ్ళు, మెడ, శరీరంలోని ఇతర ప్రభావిత ప్రాంతాలలో వాడవచ్చు.
7) నిమ్మరసం, తేనే, బాదం నూనె ప్రతీదీ ఒక టీ స్పూన్ తీసుకోండి. సహజసిద్ధమైన మెరిసే చర్మం కోసం దీనిని మీ ముఖంపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయండి.
తగినన్ని మంచి నీళ్ళు తాగడం వలన మీ శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. తద్వారా అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది
9) పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స.
10) మజ్జిగతో మొహాన్ని కడగడం వలన కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.

Drs Chandu

సున్ని పిండి తయారు చేసుకునే పద్ధతి
 సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం.
శనగపిండి, పెసరపిండి వీటికి తోడు కచ్చూరాలని బజారులో దొరుకుతాయి వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడి కాని, కుంకుడు కాయ పొడి కాని కలిపివాడుకోవచ్చు.
దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.
సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో తల రుద్దు కుంటే జిడ్డు తొందరగా వదులుతుంది.
తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత స్నానం చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది.
మట్టి శరీరం మీద చెమటతో కలిసి నల్లగా పేతుకుపోతుంది, ఇది పోవాలంటే, సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి శుభ్రపరచు కోవటం కష్టం , అందుకు వారు నూనె రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు సౌందర్యానికి సౌందర్యం
!

Drs Chandu మెంతి ఔషధ గుణాలు #

ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు.
మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.
మెంతి ఆకుల ఔషధ గుణాలు #
*‌ ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
*‌ పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
*‌ కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
*‌ ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
*‌ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
*‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
*‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.

మెంతి గింజలు #
*‌ రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
*‌ నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
*‌ కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
*‌ పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
*‌ మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
*‌ మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
*‌ మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.

100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు #
పిండిపదార్థాలు 44.1 శాతంప్రోటీన్లు 26.2 శాతంకొవ్వు పదార్థాలు 5.8 శాతంఖనిజ లవణాలు 3 శాతంపీచు పదార్థం 7.2 శాతంతేమ 13.7 శాతం
కాల్షియం, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మెంతి ఆకుల్లో ఏ విటమిన్‌ అధికంగా ఉంటుంది.
100 గ్రాముల ఆకుల్లో పోషక విలువలు #
పిండి పదార్థాలు 60 శాతంప్రోటీన్లు 4.4 శాతంకొవ్వు పదార్థాలు 1 శాతంఖనిజ లవణాలు 1.5 శాతంపీచు పదార్థం 1.2 శాతం
మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి.

Drs Chandu ఆకుకూరలతో కలిగే మేలు

ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.
ఆకుకూరలు పిల్లలకు విరేచనాలు కలిగిస్తాయనేది కొందరి అపోహ. ఈ కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలను ఆకుకూరల నుంచి దూరం చేస్తారు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. నేల, నీరు ద్వార ఆకుకూరలను సూక్ష్మక్రిములు (బాక్టీరియా), కీటకాలు కలుషితం చేస్తాయి. వీటిని శుభ్రం చేయకుండా వినియోగిస్తే విరేచనాలు కలుగుతాయి. కనుక వినియోగించడానికి ముందు ఆకుకూరలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత వినియోగించినట్లయితే ఎలాంటి రుగ్మతలు రాకుండా నివారించవచ్చు.
వండిన ఆకుకూరలను శిశువులకు తినిపించే ముందు వాటిలో పీచు పదార్ధం లేకుండా జాగ్రత్తపడాలి. ఆకుకూరలను వండిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి వడపోయడం ద్వారా పీచు పదార్ధాన్ని తొలగించవచ్చు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలోకానీ ఎక్కువసేపుగాని వండితే ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. వండిన తర్వాత మిగిలే నీటిని పారేయరాదు. ఆహారం వండుతున్నప్పుడు గిన్నెపై మూత ఉంచండి. ఆకుకూరలను ఎండలో ఎండబెట్టరాదు. అలాచేస్తే అందులోని కెరోటిన్ అనే పోషకం నశిస్తుంది. ఆకుకూరలను నూనెలో వేపుడు చేయరాదు.
ఆకుకూరలు పోషకాల పరంగా అత్యంత శ్రేష్టమైనవి.అందరికి అవసరమైనవి.
ఆకుకూరల పెంపకాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి.తద్వారా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి.పెరటి తోట,ఇంటి డాబా పైన,పాఠశాలలోని తోట,ఆవరణ లాంటి ప్రదేశాలు ఆకుకూరల పెంపకానికి అనువైనవి.మునగ చెట్టు,అవిసె చెట్టు లాంటి వాటిని ఇంటి పెరట్లో నాటి పెంచినట్లయితే, వాటినుంచి ఆకులను సేకరించడం సులువుగా ఉంటుంది.

Thursday, September 26, 2013

ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.
ఉసిరితో ఎంతో మేలు :
ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
సమస్యలను తొలిగిస్తుంది.
ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధితఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Sunday, September 22, 2013

'పండ్లు తినండి. ఆరోగ్యంగా జీవించండి'

కొందరికి భోజనం చేస్తూనే పండ్లు తినడం అలవాటు. ఇది మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కడుపు నిండుగా ఉన్నప్పుడు పండ్లు తింటే, అందులోని పోషకవిలువలు శరీరానికి సరిగా అందవు. త్వరగా జీర్ణం కావు. అందుకే, భోజనానికి కనీసం గంట ముందు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. అప్పుడు పండ్లలోని పోషక విలువలు పూర్తీగా శరీరానికి అందుతాయి. ఒకవేళ భోజనం చేశాక పండ్లు తినాలనిపిస్తే.. రెండు గంటలు విరామం ఉండేలా చూసుకోవాలి.
పొద్దున్నే లేస్తూనే గ్లాసు మంచినీళ్లు తాగాక పండ్లు తింటే ఇంకా ఉత్తమం. దీనివల్ల ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మరింత మెరుగుపడుతుంది. మరికొందరు రకరకాల పండ్ల ముక్కల్ని సలాడ్‌లాగ కలుపుకు తింటుంటారు.
జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్లు, మధుమేహులు ఇలా చేయకపోవడమే మంచిది. ఇలాంటి సమస్యలేవీ లేకపోతే పండ్ల ముక్కల మీద కాస్త ఉప్పు చల్లుకుని తినొచ్చు.
ఒక మనిషి వారంలో ఏ రకమైన పండ్లు తినాలన్న సంగతికొస్తే - నాలుగు రోజుల్లో మూడు అరటి పండ్లు, వారానికి ఒకసారి ఆపిల్, రెండు రోజులకు ఒకసారి సపోటా, బత్తాయి, బొప్పాయి తినవచ్చు. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్‌లో తింటే బావుంటుంది. వీటితోపాటు మధ్యాహ్న భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు వీలైనంత వరకు పండ్లు తగ్గించడం మేలు.