ఉపశమనానికే
పరిమితం కాకుండా చర్మ వ్యాధులను పూర్తిగా నివారించేందుకు ఉపయోగపడేవి Äౌగిక
తైలాలు. కొన్ని రకాల వనమూలికల బెరడు, ఆకులు, గింజలు, పండ్లతొక్కలు,
పూరేకులు దంచి ముద్దగా చేసి దానికి తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె లేదా
ఆముదపు నూనె లేదా కొబ్బరి నూనె తీసుకుని మంచి నీళ్లుగానీ లేదా అదే మూలికా
కశాయాన్నిగానీ కలిపి ఆయుర్వేద వైద్యులు ఈ తైలాలను తయారు చేస్తారు.
చర్మవ్యాధి చికిత్సలో ఈ Äౌగిక తైలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
మహా మరిచాది తైలం
మిరియాలు, తెగడ, దంతీ, జిల్లేడు పాలు, పేడరసం, దేవదారు, పసుపు, మాను
పసుపు, జటామాంసీ, కోష్టు, గంధం, వెర్రిపుచ్చ, గన్నేరు, హరితాలకం, మనశ్శిలా,
చిత్రకం, లాంగలి, వాయు విడంగాలు, కొడిసెపాల, వేపచెక్క, సప్తపర్ణి, ఆకు
జెముడు పాలు, తిప్పతీగ, ఆరగ్వధ, కానుగ, తుంగముస్తలు, చండ్ర చెక్క,
పిప్పళ్లు, వస, మాల్కంగినీ, వత్సనాభి, మొదలగు మూలికల కల్కానికి తగిన
నిష్పత్తిలో నువ్వుల నూనె, గోమూత్రం చేర్చి 'తైలపాక విధి'లో ఆయుర్వేద
నిపుణులు తయారుచేస్తారు.
ఉపయోగాలు:
వ్రణశోధ
(సెల్యులైటిస్), కాలిన పుండ్లు, దెబ్బ తగిలిన గాయాలు, రసిగారే పుండ్లు,
కురుపులు, లసీకా గ్రంధిత శోధ (లింఫాడినైటిస్) మొదలగు వివిధ చర్మ వ్యాధుల
పైన ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
పొడిబారినవి లేదా దురదతో ఉన్న పుండ్లు లేదా దద్దులు (అర్టికేరియా) దుష్టవ్రణాలు (రాచపుండ్లు) ఈ తైలంతో ఉపశమిస్తాయి.
చి స్త్రీలలో రుతుశూల ఉన్నప్పుడు ఈ నూనె ఓ 10 చుక్కలు తీసుకుని కాస్త వేడి
చేసి, బొడ్డులో వేసి, ఆ పైన పొట్టపైన సున్నితంగా మర్ధన చే స్తే కడుపు
నొప్పి తగ్గే అవకాశం ఉంది.
సూచన:
ఈ నూనె కళ్లకు అంటితే ప్రమాదం. అందుకే తైలాన్ని మర్ధన చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
జాత్యాది తైలం:
సంపెంగ ఆకులు, వేపాకులు, పొట్లాకులు, కానుగాకులు, కానుగ విత్తులు,
యష్టిమధు, చెంగల్వ కోష్టు, పసుపు, మానుపసుపు, కుటికీ, మంజిష్ఠా,
పద్మకాష్టం, లొద్దుగచ, కరక్కాయ, నీల కమలం, తుత్తం, సుగంధిపాల ఇవన్నీ కలిపి
ఒక భాగ ంగా, కల్కంగా సిద్ధం చేసిన దానికి నాలుగు రెట్లు నూనె, నూనెకు
నాలుగు రెట్లు మంచినీళ్లు కలిపి 'తైలపాక విధి'లో ఆయుర్వేద నిపుణులు
తయారుచేస్తారు.
ఉపయోగాలు:
చి లోతుగా ఉండే నాడీ వ్రణాలు
(సైనస్), అగ్ని దగ్ధ వ్రణాలు, తీవ్రమైన భాధను కల్గించే వ్రణాలు, ఈ తైలంతో
చేసే డ్రెస్సింగ్‌తో మానిపోతాయి.
చి విష జంతువుల కాటుతో ఏర్పడిన
గాయాలు మొదలు కాళ్లూ చేతుల్లో మేకులు గుచ్చుకోవడం వల్ల అయిన గాయాల వరకు
అన్ని రకాల గాయాలకూ ఈ తైలం ఉపశమనాన్నిస్తుంది.
సోమరాజీ తైలం
బావంచాలు, పసుపు, మానుపసుపు, తెల్ల ఆవాలు, చెంగల్వ కోష్టు, కానుగ విత్తులు,
ఆరగ్వధ ఆకులు వీటి చూర్ణాలను నీటితో తడిపి ముద్దగా చేసి నాలుగు రె ట్లు
నూనె, నూనెకు నాలుగు రెట్లు మంచి నీళ్లు కలిపి తైలపాక విధిలో ఆయుర్వేద
వైద్యులు తయారు చేస్తారు.
ఉపయోగాలు :
ఈ తైలంతో మర్ధన సమస్త చర్మ వ్యాధులకు, నాడీ వ్రణాలకు, దుష్టవ్రణాలకు ఉపయోగపడుతుంది.
ముఖం పైన నల్లబొంగు లేదా మచ్చలు, దద్దులు రోజూ ఈ తైలంతో మర్ధన చేస్తే తగ్గిపోతాయి.
ఒంటిపై దద్దులు, వృషణాలపై కచ్ఛూ ( చర్మం చెడడం) ఎగ్జిమా కూడా నివారింపబడుతుంది.
వజ్రిక తైలం
వజ్రి అనేది ఆకుజెముడు అని కూడా పిలిచే ఒక ఎడారిమొక్క . ఈ మొక్క నుంచి
తీసిన పాలతో పాటు జిల్లేడి పాలు, ఉమ్మెత్త, చిద్రమూలం రసాలు, అలాగే గేదెపేడ
రసం, ఆవుమూత్రం అన్నింటినీ ద్రవభాగంగా తీసుకుంటారు. దీనికి నాలుగో వంతు
గంధకం, చిద్రమూలం, మనశ్శిల, తాలకం, విడంగం, అతివిష, వస్తనాభి, కోశాతకి,
చెంగల్వకోష్టు, వచ, జఠామాంసి, త్రికటు, దేవదారు, యష్టిమధు, సర్జక్షారం,
జీరక మూలికల చూర్ణాన్ని ముద్దగా చేసి కలుపుతారు. ఈ మొత్తం మిశ్రమాన్ని
తైలపాక విధిని అనుసరించి తైలం మాత్రమే మిగులునట్లు తేలికపాటి మంటపై కాచి
ఆయుర్వేద వైద్యులు తయారుచేస్తారు.
ఉపయోగాలు
ఈ తైలంతో రోజూ
డ్రెస్సింగ్ చేస్తే దీర్ఘకాలికంగా వేధించే దుష్టవ్రణాలు (రాచపుండ్లు)
కొద్ది వారాల్లోనే తగ్గిపోతాయి. ప్రత్యేకించి డయాబెటిక్ కార్బన్‌కుల్ట్,
లెప్రసీ, గ్యాంగ్రిన్, వేరికోసిల్ అల్సర్, ఎగ్జిమా సమస్యలను సమర్ధవంతంగా
తగ్గిస్తాయి. అయితే ఈ తైలంతో రోజూ డ్రెస్సింగ్ చేస్తూనే మరోవైపు ఆయా
అల్సర్లకు సంబంధించిన ప్రధాన వ్యాధులకు కూడా కడుపులోకి కొన్ని మాత్రలు
తీసుకోవాలి. అప్పుడే అవి పూర్తిగా తగ్గిపోతాయి. కొంత మందిలో ఉండే చెడు
రక్తాన్ని జలౌకా విధానంలో తొలగించవలసి (రక్తమోక్షణ) రావచ్చు.
Friday, February 21, 2014
ఇంట్లో కూరగాయలతో సౌందర్యపోషణ
అందాన్ని
ద్విగుణీకృతం చేసుకోవడానికి బోలెడు ఖరీదు వెచ్చించి సౌందర్య సాధనాలు కొని
తెచ్చుకోకుండా.. ఇంట్లో సామగ్రిని ఎంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన
వంటిల్లే ఇందుకు ఖజానా. ఇంట్లో మిగిలినపోయిన కూరగాయలు వృథాగా పక్కన
పెట్టేయక వాటితో సౌందర్యపోషణకు సిద్ధంకండి..
దోసకాయ ముక్కలను మెత్తగా రుబ్బి అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గులాబీనీరు జోడించి ఆ మిశ్రమాన్ని ముఖం, వీపు భాగానికి మర్దన చేయాలి. దానివల్ల మృతకణాలు, జిడ్డు తొలగిపోతాయి. అంతేకాదు ఇది మంచి టోనర్‌లా పని చేస్తుంది.
చెంచా నిమ్మరసంలో అరచెంచా పాలు, దోసకాయరసం కలిపి ముఖానికి రద్దితే... చర్మం తాజాగా కనిపిస్తుంది. దోసకాయ రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది అన్ని చర్మతత్వాల వారికీ నప్పుతుంది.
బంగాళాదుంపలను తరిగి, మెత్తగా రుబ్బి రసం తీయాలి. దాన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు కడిగేసుకుంటే చర్మం తాజాగా కనిపిస్తుంది. చిన్న టమాటా ముక్కను ముఖానికి రుద్దుతూ ఉంటే నల్లమచ్చలు, తొలగిపోయి చర్మానికి తేమ అందుతుంది.
రెండు చెంచాల టమాటా రసంలో చెంచా తేనె కలిపి ముఖం, మెడకు మర్దన చేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేస్తే జిడ్డు తొలగి.. చర్మం మృదువుగా తయారవుతుంది.
మోచేతుల నలుపు తగ్గాలంటే క్యారెట్‌ను ఉడికించి ముద్దగా చేసి అందులో పంచదార లేదా ఉప్పు కలిపి ఆ ప్రాంతంలో బాగా మర్దన చేస్తే సరి. క్యారెట్ ముద్దకు కమలా రసం పంచదార కలిపి ముఖానికి, మెడకు ఇరవై నిమిషాల పాటు మర్దన చేస్తే జిడ్డు తొలగిపోయి.. చర్మం కాంతులీనుతుంది.

కొవ్వు లేని ఆహారం
వ్యాయామంతోపాటు..
పదార్థాల ఎంపికలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడే శరీరంలో
పేరుకొన్న అధిక కొవ్వు తగ్గుతుంది. అదనంగా ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
చూడచక్కని రూపం మన సొంతమవుతుంది. అవేంటో చూడండి మరి.
పసుపు:
వంటకాల్లో నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతాఇంతా కాదు. యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలున్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను తగ్గించే గుణం పసుపు సొంతం. కాలేయంలో చేరిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి నెట్టివేస్తుంది. నాళాల్లో రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడుతుంది. దాంతో గుండె ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది.
కరివేపాకు:
కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు.. అదనంగా పేరుకోకుండా చేసే శక్తి కరివేపాకు రెమ్మల సొంతం. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌నూ కరిగిస్తుంది. అందుకే వూబకాయంతో బాధపడేవారు రోజు కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలంటూ సూచిస్తున్నారు నిపుణులు.
ఆవనూనె:
ఇతర నూనెలతో పోల్చుకుంటే ఆవనూనెలో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువ. దాంతో శరీరంలో అధిక కొవ్వు చేరదు. అంతేకాదు ఈ నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, ఓలిక్, లినోలిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలను దూరం చేస్తాయి. అందుకే ఆవనూనెను తరచూ తీసుకోవాలి.
క్యాబేజీ:
ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. తరచూ క్యాబేజీ తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదమూ తగ్గుతుంది. కండరాల దృఢత్వమూ సొంతమవుతుంది. రక్తాన్నీ శుద్ధిచేయడం.. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడం.. ఇలా శరీరానికి ఎన్నో విధాల మేలుచేస్తుంది క్యాబేజీ.
మొలకెత్తిన పెసలు:
వీటిలో 'ఎ','బి','సి','ఇ' విటమిన్లు, ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం.. మాంసకృత్తులు, పీచు.. వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు.. శరీర బరువును అదుపులో ఉంచుతాయి మొలకెత్తిన పెసలు. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతమూ అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.
తేనె:
పంచదారతో పోలిస్తే.. తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా.. వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చినచెక్క.. కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. ఏం చేయాలంటే.. గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరగడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.
క్యారెట్:
క్యారెట్ శరీరంలోని చెడుకొవ్వు నిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ శాతమూ అదుపులో ఉంచుతుంది. పీచుపదార్థాన్ని అందించే ఈ కాయగూరను వారంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నేరుగా తినే ప్రయత్నం చేయండి.
గుడ్లు:
శరీరానికి అవసరమైన పోషకాలే కాదు.. ఇందులోని విటమిన్ 'బి12' కొవ్వు కారకాలతో పోరాడుతుంది. ఫలితంగా కొవ్వుకరిగిస్తుంది.
గ్రీన్‌టీ:
అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు.. గ్రీన్‌టీ తప్పనిసరిగా తాగాలి.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో అధికకెలొరీలను తగ్గించడమే కాదు.. దృఢమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది గ్రీన్‌టీ.

కొవ్వును తగ్గించే కొత్తిమీర
కొత్తిమీరను కూరల్లో కొంచెం వేస్తాం. కొన్నిసార్లు వేసినా, వేయకపోయినా
ఒకటేనని అనుకుంటాం. అది కేవలం రుచికి, సువాసన కోసమే అనుకుంటే పొరబాటు.
దానిని ఆహారంలో నిత్యం తీసుకోవడం వల్ల ఎంతో మేలు.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. దానిలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక శక్తికి ఇతోధికంగా సాయపడతాయి. దాన్లోని డొడిసెనోల్ అనే పదార్థం పేగుల్లో ఏర్పడే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తుంది.
గ్లాసుడు నీళ్లు, మజ్జిగలో చెంచా కొత్తిమీర రసం, చిటికెడు జీలకర్ర కలిపి మధ్యాహ్నం కానీ, రాత్రి పడుకొనే ముందు కానీ తీసుకుంటే... శరీరానికి విటమిన్ 'ఎ', 'బి1', 'బి2', 'సి', ఇనుము సమృద్ధిగా అందుతాయి. అవి శరీర నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.
అజీర్ణంతో బాధపడేవారు.. ఈ రసంలో, జీలకర్ర, నిమ్మరసం చిటికెడు ఉప్పు కలిపి పుచ్చుకుంటే మంచిది. గర్భిణులు రోజూ రెండు మూడు చెంచాల రసం... నిమ్మరసంతో కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి తగ్గుతాయి. పేగుపూత, కడుపులో మంట గలవారు కొత్తిమీరను పెరుగులో కలిపి తరచూ తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి.
నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలున్నవారు ఆకులను నమిలి మింగితే త్వరగా గుణం కనిపిస్తుంది. కామెర్లు వచ్చినపుడు పథ్యంగా దీన్ని కూరల్లో వేసి తీసుకొంటే త్వరగా కోలుకుంటారు.
కొత్తిమీరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ధనియాలను చారులా కాచి తీసుకుంటే విరేచనాలు, జ్వర తీవ్రత తగ్గుతాయి. నెలసరి సమయంలో అధికంగా రుతుస్రావం అవుతుంటే ధనియాల కషాయాన్ని రోజుకి రెండుసార్లు పుచ్చుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.

నాజూకు నడుముకు నప్పే ఆహారం
వ్యాయామం చేయకపోవడం.. ఆహార నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల నడుం
చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. ఫలితంగా పొట్ట వస్తుంది. అది మరిన్ని సమస్యలకు
దారితీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆహారం విషయంలో ఆచితూచి
వ్యవహరించాలి.
తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాగులు, జొన్నలు, ఓట్స్... తదితరాల్లో తక్కువ కెలొరీలుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఫలితంగా మధుమేహం, కొవ్వును నియంత్రించిన వారమవుతాం.
పొట్ట వల్ల మధుమేహం సమస్య వచ్చే అవకాశం ఉందని... పైగా వారి సంఖ్య రాన్రాను పెరుగుతోందని స్పానిష్ వైద్య నిపుణులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఇందుకు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లే ముఖ్య కారణం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు నియంత్రించాలంటే ఆలివ్ నూనెను తరచూ వంటకాల్లో ఉపయోగించాలి.
నీళ్లు ఎక్కువగా తాగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తరచూ తీసుకోవాలి. ముఖ్యంగా దోసకాయ, బొప్పాయి, పుచ్చకాయ, నారింజ.. సొరకాయ, బీరకాయ.. వంటివి తరచూ తీసుకుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.
ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోగలిగితే.. నడుము చుట్టూ కొవ్వు పేరుకోదు. ముఖ్యంగా ఎర్రటి క్యాబేజీ, టమాటా, యాపిల్, ఎర్రక్యాబేజీ, చెర్రీ.. వంటివి ఎక్కువగా తీసుకోగలగాలని సూచిస్తున్నారు ఇటలీ వైద్యులు.
తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.

డిప్రెషన్‌కు హోమియోలో మేలైన మందు
కొందరు చిన్న చిన్న సంఘటనలకు కూడా తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు
లోనవుతుంటారు. వారికి సరియైన సమయంలో చికిత్స ఇప్పించకపోయినట్లయితే సమస్య
మరింత తీవ్రమయి ఇతరులను గుర్తుపట్టలేని స్థితికి వస్తారు. డిప్రెషన్ కాస్తా
మానసిక వ్యాధిగా మారుతుంది. అయితే ఈ సమస్యకు హోమియోలో మంచి వైద్యం
అందుబాటులో ఉంది . ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి తదితర అంశాలు డిప్రెషన్‌కు
కారణమవుతుంటాయి. కొందరు డిప్రెషన్ నుంచి సులభంగానే బయటపడతారు. కొందరిలో మాత్రం ఏళ్ల తరబడి ఉంటుంది. సాధారణంగా డిప్రెషన్ మూడు రకాలుగా ఉంటుంది.
1) మేజర్ డిప్రెషన్ :
చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. ఇది వ్యక్తి జీవితవిధానంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. చదువు, నిద్ర, ఆహారం విషయంలో, ఇతర పనులతోనూ సంబంధం కలిగి ఉంటుంది. జీవితాంతం వేధించే సమస్య ఇది.
2) డిస్‌థిమియ:
ఇది కొంచెం తక్కువ స్థాయిలోఉంటుంది. కానీచాలా ఏళ్ల వరకు ఉంటుంది. డిస్‌థిమియాతో బాధపడుతున్న వారు రోజువారీ పనులను చేసుకోగలుగుతారు. కానీ ఉత్సాహంగా చేయలేరు.
3) బై పోలార్ డిజార్డర్ :
దీనిని మానిక్ డిప్రెషన్ అని కూడా అంటారు. దీనిలో డిప్రెషన్, సివియర్ డిప్రెషన్‌తో పాటు కొన్నిసార్లు మానియా కూడా ఉంటుంది.
లక్షణాలు:
ఆందోళన, ఆత్రుత, చిరాకు, తప్పు చేశాననే భావన, నిరాశ, సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, చనిపోవాలనే ఆలోచనలు, కొన్ని సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటి లక్షణాలు డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో కనిపిస్తాయి.
బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తికి మాట్లాడటంలో ఇబ్బంది, పనిలో తొందరపాటు, పనిమీద ఆసక్తి లేకపోవడం, నిద్రలేమి, సరియైన నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. డిప్రెషన్ లక్షణాలు వ్యక్తులను బట్టి, సమస్య తీవ్రతను బట్టి మారుతుంటాయి.
కారణాలు :
జన్యుపరమైన కారణాల వల్ల డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి.
మెదడులోని కొన్ని రసాయన మార్పుల వల్ల(న్యూరోట్రాన్స్‌మిటర్స్‌లో మార్పు) డిప్రెషన్‌కు లోనవుతారు.
మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులు, విడాకులు, దగ్గరి వ్యక్తులు చనిపోవడం లాంటి సమస్యలు డిప్రెషన్‌కు కారణమవుతాయి.
ఆరోగ్యపరమైన ఇబ్బందులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
స్టిరాయిడ్స్, నార్కోటిక్స్ వంటి మందుల వాడకం వల్ల డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది.
మానసిక వ్యాధులు, ఆందోళన, స్కిజోఫ్రినియా వల్ల నిరాశ, నిస్పృహలకు గురికావచ్చు.
చికిత్స :
సాధారణ డిప్రెషన్‌ను తగ్గించడానికి కౌన్సెలింగ్, యాంటీడిప్రెసెంట్ మందులు బాగా ఉపకరిస్తాయి. ఎలక్ట్రో కంవల్సివ్ థెరపీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్స వల్ల మెదడులో రసాయనిక మార్పులు జరుగుతాయి. తద్వారా డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయి. యోగా, ధ్యానం వంటివి రోగిని సాధారణ స్థితికి తీసుకురావడానికి బాగా ఉపకరిస్తాయి. హోమియో వైద్య విధానంలో శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించి మూల కారణాన్ని తొలగించేందుకు అవసరమైన మందులను ఇవ్వడం జరుగుతుంది.
బెల్లడొన :
కోపం, నవ్వడం, పండ్లు కొరకడం, మతిస్థిమితం లేని వారిగా ప్రవర్తించడం, దయ్యాలు, జంతువులు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయనే భావన వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు. ఏదీ లేకపోయినా ఏదో ఉందీ అని అరవడం, అసభ్యంగా మాట్లాడటం, నిద్రలేమి, శబ్దం వల్ల సమస్య ఎక్కువకావడం, రాత్రివేళ తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఈ మందు ఇవ్వవచ్చు.
కోనియం :
జ్ఞాపకశక్తి తగ్గడం, తొందరగా బాధపడే స్వభావం, కోపం, గట్టిగా అరవడం, ఎదురు మాట్లాడితే భరించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపకరిస్తుంది. అర్జెంటమ్ నైట్రికం : తెలియని ఆందోళన, ఎప్పుడూ మత్తుగా ఉన్నట్లు అనిపించడం, తలనొప్పి, ఆరోగ్యం గురించి ఆందోళన, ఒకచోట కుదురుగా ఉండలేకపోవడం, అతితొందర వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన మందు.
హయోసయామస్ :
ఆత్రుత, నిలకడలేకపోవడం, భయపడే స్వభావం, అసూయ, అనుమానం, ఎక్కువగా మాట్లాడటం, ఏడ్చే స్వభావం, కోపం, రాత్రివేళ సమస్య అధికం కావడం, నడిచినపుడు, ముందుకు వంగినపుడు ఉపశమనంగా అనిపించడం, చిరాకు, నోరు ఎండిపోవడం, మూత్రాశయ ఇబ్బందులు, తలనొప్పి, పడుకున్నప్పుడు దుప్పటి కప్పుకోకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి దివ్యౌషధం.
స్ట్రామోనియం :
అధికంగా మాట్లాడే స్వభావం, అతిగా నవ్వడం, పాటలు పాడుతూ ఉండటం, ఎక్కువ వెలుతురును చూసినపుడు సమస్య అధికం కావడం, చీకటి అంటే భయం, పొడవుగా ఉన్నానని అనుకోవడం, దయ్యాలు, జంతువులు కనిపిస్తున్నాయనే భావన, శబ్దాలు వినిపిస్తున్నాయని అనడం, చిన్న వస్తువులు పెద్దగా కనిపించడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు.

మెదడులోని కొన్ని రసాయన మార్పుల వల్ల(న్యూరోట్రాన్స్‌మిటర్స్‌లో

వాతాన్ని తగ్గించే విషగర్భతైలం
ఆయుర్వేద వైద్య విధానంలో విషద్రవాలను కడుపులోకి అలాగే చర్మ మర్ధనానికి
కూడా ఉపయోగిస్తారు. అంటే కొన్ని రకాల మూలికలు, మరికొన్ని రకాల ఖనిజ
రసాయనాలను తీసుకుంటారు. ఎక్కువ సంఖ్యలోనూ, ఎక్కువ మోతాదులోనూ అలాగే ఎక్కువ
విషలక్షణాలు ఉన్న మూలికలను తీసుకుని తయారు చేసే తైలాన్ని " మహా విషగర్భ తైలం'' అంటారు.
తక్కువ సంఖ్యలోనూ, తక్కువ మోతాదులోనూ అలాగే తక్కువ విషలక్షణాలు ఉన్న మూలికలను వినియోగించి తయారు చేసే తైలాన్ని " లఘు విషగర్భ తైలం'' అంటారు. తైలం తయారీకి మూలికలు, ఖనిజ రసాయనాలు కలిపిన ఒక ముద్దను తయారు చే సుకుని అందుకు నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకుంటారు. ఆ తరువాత నూనెకు నాలుగు రెట్లు 16 భాగాల ద్రవాంశం కోసం ముందు కషాయాన్ని తయారు చేసుకుంటారు.
మహా విషగర్భ తైలం
ఈ తైలం తయారు చేసుకోవడానికి ఉమ్మెత్త విత్తులు, వావిలి విత్తులు, చేదు సొరకాయ విత్తులు, గలిజేరు వేర్లు, ఆముదం విత్తులు, అశ్వగంధ, చిత్రమూలం, మునగ పట్ట, కాకమాచీ, లాంగలీ దుంప, వేపపట్ట, వెర్రిపుచ్చ వేర్లు, దశమూలాలు, శతావరీ, సారిబా, ముండీ, విదారీకంద, స్నుహీ, అర్క, కర్కాటక శృంగి, గన్నేరు వేర్లు, కాకజంఘ వేర్లు, ఉత్తరేణు వేర్లు, బలా, అతిబలా, నాగబలా, మహాబలా, అడ్డసరం, తిప్పతీగె, ప్రసారిణీ మొదలైన మూలికలకు నీరు చేర్చి కషాయం సిద్ధం చేసుకుంటారు.
అలాగే విషముష్టి (శుద్ధి చేయనివి), శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, రాస్నా, కోష్టు, హరితాలకం, తుంగముస్తలు, దేవదారు, వత్సనాభి, యవక్షారం,సర్జక్షారం, పంచలవణాలు, మైల తుత్తం, కాయఫలం, పాఠా, భారంగీ, నవసారం, వెర్రిపుచ్చ, జవాసా, జీరక మూలికలను చూర్ణం చేసుకుని, తడిపి ముద్ద చేస్తారు. తైలపాక వి«ధి ప్రకారం నువ్వుల నూనెను కూడా తీసుకుంటారు.
పైన తెలిపిన అన్ని ద్రవాలను తగిన పాత్రలో కలిపి పొయ్యి పైన ఉంచుతారు. మూలికల ముద్ధ మాడిపోకుండా, కషాయ ద్రవం ఇగిరిపోయి తైలాంశం మాత్రమే మిగిలేంతవరకు ఉడికించి తైలాన్ని జాగ్రత్తగా తయారు చేస్తారు.
ఉపయోగాలు
ఈ తైలాన్ని చర్మం పైన మర్ధనకే ఉపయోగిస్తారు. ప్రధానంగా బాగా నొప్పి కలిగించే వాత వ్యాధుల్లో అంటే ఆమవాతం, సంధివాతం, కటివాతం, అర్థాంగ వాతం, గృధ్రసీ వాతం, దండాపతానకం వంటి సమస్యలకు ఈ తైలాన్ని వాడతారు.
దీర్ఘకాలికంగా పక్షవాతం ఉన్నవారిలో కాళ్లూ చేతులు బిగుసుకుపోయి ఉంటాయి. వీరికి ఫిజియోథెరపీ కష్టంగా ఉంటుంది. ఈ స్థితిలో ఈ తైలంతో రోజూ మర్ధన చేస్తే ఆ సమస్య తొలగిపోతుంది.
వాత వ్యాధుల కారణంగా శరీరం బిగుసుకుపోయే గుణం చలికాలం మరింత ఎక్కువవుతుంది. ఈ స్థితిని ఈ తైలం నివారిస్తుంది. అయితే ఎండాకాలం ఈ తైలాన్ని వాడకపోవడం మంచిది. అలాగే ఒంటిపైన మంటగా, పొగలుగా ఉన్న వారు కూడా ఈ తైలాన్ని వాడకూడదు.
నొప్పిని తగ్గించే గుణం ఉండడం వల్ల ఈ తైలాన్ని చెవినొప్పికి చుక్కల మందుగా కూడా వాడవచ్చు. అలాగే వినికిడి లోపం, చెవిలో శబ్ధాలు రావడం వంటివి కూడా ఈ తైలంతో తగ్గుతాయి. అయితే ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
లఘు విషగర్భ తైలం
లఘు అనే పదం లేకుండా చాలా మంది కేవలం విషగర్భ తైలం అని కూడా పిలుస్తారు. ఈ తైలం తయారీకి అవసరమైన ద్రవం కోసం ఈసబ్గోల్ కషాయం, గన్నేరు వేర్లు క షాయం, ఉమ్మెత్త స్వరసం, నిర్గుండీ స్వరసం, జటామాంసీ కషాయం, ఇవన్నీ కలిపి తీసుకుంటారు.
మూలికల ముద్దకోసం ఉమ్మెత్త విత్తులు, కోష్టు, ప్రియంగు పూలు, వత్సనాభి, పిచ్చి కుసుమ వేళ్లు, రాస్నా, గన్నేరు వేర్లు, మాల్కంగినీ విత్తులు, మిరియాలు, దంతీ, జటామాంసీ, చిత్రమూలం, పచ్చ ఆవాలు, దేవదారు, పసుపు, కస్తూరి పసుపు, ఆముదం వేర్లు, లక్షా, త్రిఫలా, మంజిష్ఠా చూర్ణాలను సమానంగతా తీసుకుంటారు. వీటన్నిటినీ తైలపాక నిష్పత్తిలో నువ్వుల నూనె చేర్చి తైలం మిగిలేలా ఉడికిస్తారు.
దీని వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మహా విషగర్భ తైలం లాగే ఉంటాయి. కాకపోతే తీక్షణత తక్కువగా ఉంటుంది. అందువల్ల సున్నితులకు ఇది ఉత్తమం. పైగా వేడి వాతావరణంలోనూ ఈ తైలాన్ని వాడవచ్చు.
విషముష్టి తైలం:
ఈ తైలం తయారీకి ప్రత్యేకించి విషముష్టి గింజలు మాత్రమే తీసుకుంటారు. దీనికి జొన్న కలి (కాంజికం) చేర్చి కషాయం తయారు చేస్తారు. ముద్ద కోసం విషముష్టి గింజల పొడినే వాడతారు. నువ్వుల నూనెతో పాటు ఆముదం కూడా జతచేస్తారు. అన్నిటినీ తైలపాక నిష్పత్తిలో కలిపి తైలం మిగిలేలా ఉడికిస్తారు. దీని ఉపయోగాలు విషగర్భ తైలంలాగే ఉంటాయి.

Subscribe to:
Posts (Atom)