Wednesday, August 12, 2015

ఆరోగ్యఫలం.

పీచూ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే ఖర్జూరపండ్లను ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల పొట్ట, కాలేయ, మూత్రనాళ, క్లోమ, అండాశయ క్యాన్సర్లు రావనీ వచ్చినా వాటిని నివారించే శక్తి కూడా వీటికి ఉందనీ తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఖర్జూరంను పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను తక్షణ ఉపశమనం పొందవచ్చు.అంతే కాదు, ఇందలో న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది పీరియడ్స్ లోపాలను తగ్గించడానికిఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
* వారానికి మూడుసార్లు ఖర్జూరాలను తింటే మలబద్ధకం తగ్గుతుందట.
* ఎడారిఫలాల్లో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం... వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* ఖర్జూరాల్లోని నికోటిన్ పేగుకు సంబంధించిన వ్యాధుల్ని రానీయకుండా చేస్తుంది. పేగులో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బ్యాక్టీరియా పెరిగేలానూ చేస్తాయివి. ఇందులోని అమైనో ఆమ్లాలు జీర్ణక్రియకూ దోహదపడతాయి.
* ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు, రక్తహీనతనీ నివారిస్తాయి. తద్వారా అలసటనీ నీరసాన్నీ తగ్గిస్తాయి.
* ఖర్జూరాల్లో సల్ఫర్ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలూ, సైనస్‌లతో బాధపడేవాళ్లకి ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు.
* ఖర్జూరాల్లో చక్కెరలూ, ప్రొటీన్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండటంవల్ల బరువు తక్కువగా ఉండేవాళ్లకు పుష్ఠినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి సుమారుగా 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి.
* ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరుని ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకే వయసురీత్యా కాస్త మందకొడిగా ఉండే వృద్ధులకు ఇవి మంచి ఆహారం.
* గుండె పనితీరునీ మెరుగుపరుస్తాయివి. ముఖ్యంగా గుండె బలహీనంగా ఉన్నవాళ్లు రాత్రిపూట ఎండుఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తని పేస్టులా చేసుకుని తినడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృద్రోగాలు రాకుండా చేస్తాయి.
* ఖర్జూరాలు లైంగికశక్తికీ తోడ్పడతాయి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాల్ని నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకులపొడి జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే పురుషులకు ఎంతో మేలు.
* దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడేవాళ్లు ఖర్జూరపండ్లు తింటే, వాటిల్లోని పొటాషియంవల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది.
* దంతాలమీద ఉండే ఎనామిల్ పూతను సంరక్షించడంలో ఖర్జూరాల్ని మించినవి లేవు. నిజానికి ఈ ఎనామిల్ ఎముకకన్నా దృఢమైన హైడ్రాక్సీఎపటైట్స్ అనే పదార్థాలతో రూపొందుతుంది. అయినప్పటికీ ఆహారంలోని బ్యాక్టీరియా కారణంగా అది కొంచెంకొంచెంగా పోతుంటుంది. అదే ఖర్జూరాల్ని ప్రతిరోజూ తినడంవల్ల అందులోని ఫ్లోరిన్ దంతాలమీద పాచి చేరకుండా చూడటంతోబాటు ఎనామిల్‌తో చర్యపొంది హైడ్రాక్సీఫ్లోరోఎపటైట్‌గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది.
* రోజుకో ఖర్జూరం తినడం కళ్లకీ మంచిదే. ఇందులో పుష్కలంగా ఉండే ఎ-విటమిన్ రేచీకటినీ నివారిస్తుంది.
* గర్భిణుల ఆరోగ్యానికి ఎడారిఫలాలు ఎంతో మేలు. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచించేలా చేయడంతోబాటు, బిడ్డపుట్టాక పాలు పడేందుకూ కారణమవుతాయి. గర్భస్థశిశువులో జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకూ సాయపడతాయి.
* వీటిల్లో ఉండే ఫ్లేవొనాయిడ్ పాలీఫినాలిక్ యాంటీఆక్సిడెంట్లు టానిన్‌లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లూ పొట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి. కొత్తిమీర జ్యూస్ హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహఆయపడుతుంది. అలాగే, పీరియడ్స్ లో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

Thursday, August 6, 2015

రాగులతో మేలైన ఆరోగ్యం...!

తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావా ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగులను మన మెనూలో చేర్చడం ద్వారా ఈ లాభాలు పొందవచ్చు.
రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి.
రాగి జావని డైట్‌లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్‌ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు.
రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కూడా రాగులు కంట్రోల్‌ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రాగులది ప్రధాన పాత్ర.
రాగుల్లోని అమినోఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వుపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెసా్ట్రల్‌ను రాగులు పోగొడతాయి. హైపర్‌ టెన్షన్‌, బ్లడ్‌ప్రెషర్‌ని రాగులు చక్కగా నియంత్రిస్తాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్‌, అమినో యాసిడ్స్‌ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్‌ తలనొప్పిలాంటివి దరికి చేరవు. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది.
కాల్షియంతో పాటు ఐరన్‌, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌తో పాటు ముఖ్యమైన అమినోయాసిడ్స్‌ ఉంటాయి. అందుకే రాగులతో చేసిన ఆహారం తినటం వల్ల కండరాలు గట్టిగా ఉంటాయి.
రాగుల్లో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్‌ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ్ట్ట

Sunday, July 19, 2015

సహజ అందానికి తేనె ...!



సహజ అందానికి తేనె ...!
తేనె సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. చెంచా తేనెలో రెండు చెంచాల బాదంనూనె, అరచెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తరవాత కడిగేయాలి.
• తేనె, నిమ్మరసం మిశ్రమం మొటిమలను తగ్గిస్తుంది. రెండు చెంచాల తేనెకి చెంచా నిమ్మరసం చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమల సమస్య ఉండదు.
• రెండు చెంచాల తేనెకి చెంచా ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాసి పావుగంట తరవాత శుభ్రం చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది. చెంచా తేనె, రెండు చెంచాల చొప్పున పాలూ, కీరదోస గుజ్జూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా తేనెకి రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో శుభ్రం చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.

నల్లటి వలయాలు దూరం ఇలా..!

నల్లటి వలయాలు దూరం ఇలా..!
తగినంత నిద్ర లేకపోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. దీన్ని నివారించాలంటే కీరదోస బాగా పనిచేస్తుంది. కీరదోస రసాన్ని కళ్ల కింద రాసి పావు గంట తర్వాత కడిగేయాలి.
• చెంచా చొప్పున టొమాటో, నిమ్మరసం కలిపి సమస్య ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. పచ్చిపాలలో దూదిని ముంచి కళ్ల చుట్టు రాసి పావు గంట తర్వాత కడిగేయాలి.
• గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా చేసి కళ్ల చుట్టూ రాయాలి. పావు గంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేస్తే ఫలితం ఉంటుంది. రెండు చెంచాల తేనె తీసుకుని కళ్ల కింద రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
• గులాబీ నీళ్లు అలసిపోయిన కళ్లను తాజాగా ఉంచుతాయి. చర్మపు రంగును తిరిగి తీసుకొస్తాయి. వీటన్నింటితోపాటూ నల్లనివలయాలనూ దూరంచేస్తాయి.

Saturday, July 18, 2015

" నడుం నొప్పి" కి చిన్న చిన్న జాగ్రత్తలు

" నడుం నొప్పి" కి చిన్న చిన్న జాగ్రత్తలు
******************************************
జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం లో నడుము నొప్పిని అనుభవించే ఉంటారు . దానికి ఎన్నో కారణాలు . కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది .

ఈ రోజుల్లో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలి విధానమే. ఒక ప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి ఆధునిక యుగంలో యుక్తవయస్కులను సైతం బాధిస్తుంది. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లే సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగడం వల్ల, నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

కారణాలు:
**********

నడుము నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పు. (కార్టిలేజ్‌ వెన్నుపూసలు సులువుగా కదలడానికి తోడ్పడుతుంది) కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్లనొప్పి వస్తుంది. నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే. ఇంతేకాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నడుము నొప్పి..... ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే కొన్ని పనులకు... ముఖ్యంగా స్త్రీలు వంట పనులు చేస్తున్నప్పుడు వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు ఇది కలుగుతుంది.

- స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉప యాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం .
- పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
- కంప్యూటర్స్‌ ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం.
- తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం,
- ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పివస్తుంది.
- ఉద్యోగంలోని అసంతృప్తి అనారోగ్యాన్ని పెంచిపోషిస్తుందంటున్నాయి అధ్యయనాలు. వెన్నునొప్పికీ ఉద్యోగంలో ఎదుర్కునే అసంతృప్తులకు సంబంధం ఉందంటున్నాయి క్వీన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు. తక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్న తోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నవారిలో వెన్నునొప్పి తగ్గడానికి చాలాకాలం పడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు:
**********

నడుము నొప్పి తీవ్రంగా ఉండి వంగటం, లేవటం, కూర్చోవటం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించ రాకుండా ఉంటుంది.

జాగ్రత్తలు:
**********

- సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
- నడుము నొప్పి నివారణకు ప్రతిరోజు వ్యాయా మం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
- ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చు న్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
- వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
- సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
- నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
- శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
- శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
- స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
- పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి.

నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు
* కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
* వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
* మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.
* మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
* ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
* కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
* అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
* ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్స :
********
బుటాల్జిన్ అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున వాడినట్లయితే ఈ నడుము నొప్పి తగ్గుతుంది. అంటే వీటిని ప్రతి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి కాకపోతే బెరిన్ టాబ్లెట్లను రోజుకు రెండు చొప్పున వాడినా నడుము నొప్పి బాధ తగ్గతుంది.

దీనికి కొన్ని రకాల పైపూత మందులు(Dolorub, Zobid gel , Nobel gel etc.) కూడా వచ్చాయి. అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒకవేళ ఈ మందులు వాడినప్పటికీ నడుము నొప్పి తగ్గకపోయినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఆమ్లా - హనీ డ్రింక్

వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఆమ్లా - హనీ డ్రింక్  
కావాల్సిన పదార్ధాలు 
1) ఉసిరి రసం - 2 స్పూన్స్ 
2) తేనె - 1 స్పూన్ 
3) గోరువెచ్చని నీరు - 1 గ్లాస్
వాడే విధానం 
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉసిరి రసం , ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి. ఇలా చేస్తే ఇమ్యునిటి పవర్ పెరుగుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ బయటికి విడుదల అవుతాయి.

For Diabetes Type 2 Sufferers - Try this and report back...

For Diabetes Type 2 Sufferers - Try this and report back...
Cut the ends off of a few okra, put in a cup with water overnight, the next day remove the okra and drink the water...Diabetes will go away and so will your shots...
Everything created by God.Tested on humans,the results, according to tests were miraculous! One volunteer said that their blood glucose decreased from 300 to 150.Another, fell from 195 to 94-and even said that the okra water played the role of insulin,very well done".Share this, as it will surely help many!!!