Wednesday, September 30, 2015

అందమైన అధరాల కోసం..


లేత గులాబీరంగు పెదాలు ముఖారవిందాన్ని మరింత ఇనుమడింపజేస్తాయి. పరిసరాల ప్రభావం, ఎండ, జీవన విధానంలోని మార్పులు, రసాయనాలతో చేసిన లిప్‌స్టిక్స్‌ వాడటం, సిగరెట్లు కాల్చడం.. వంటి చర్యల వల్ల పెదాలు నల్లగా మారిపోతాయి. నల్లగా ఉన్న పెదాల్ని లేత గులాబీరంగులోకి మారాలంటే ఇంట్లోనే కొన్ని సులభమైన ప్రకృతి చికిత్సలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
  •  ఒక టీ స్పూన్‌ చల్లని పాలల్లో చిటికెడు పసుపు కలిపి రోజూ పెదాలపై నెమ్మదిగా రుద్దుతుంటే తిరిగి పెదాలు సహజరంగులోకి వచ్చి అందంగా కనపడతాయి. 
  •  ఒక టీ స్పూన్‌ బాదం ఆయిల్‌, సమంగా నిమ్మరసం కలిపి పెదాలపై రాసి పూర్తిగా ఆరిపోయే వరకూ ఉంచి నీటితో కడగాలి. ఇది పెదాలపై ఉన్న మురికిని నల్లని పొరలను శుభ్రపరచి అందంగా తీర్చిదిద్దుతుంది. 

  •  చాలా ఏళ్ల నుంచి బీట్‌రూట్‌ రసాన్ని పెదాలకు మంచి రంగు రావడానికి ఉపయోగిస్తున్నారు. బీట్‌రూట్‌ రంగు ఎర్రగా ఉండటం వల్ల పెదాలకు సహజమైన రంగు కలిగిస్తుంది. 
  •  తాజాగా ఉన్న క్యారెట్‌ జ్యూస్‌లో దూదిని తడిపి పెదాలకు రాయడం వల్ల కూడా ఎరుపు రంగులోకి మారి అందంగా కనబడతాయి. 
  •  తాజాగా ఉన్న గులాబీ రేకులను మెత్తగా నూరి రసం తీయాలి. ఈ రసంలో దూదిని తడిపి పెదాలపై రాయాలి. రసం తీయగా మిగిలిన గులాబీ రేకుల పేస్టును పెదాలపై 20-30 నిమిషాలపై ఉంచితే పెదాలు లేత గులాబీ రంగులోకి మారతాయి. 

Monday, September 28, 2015

అదిరేటి అందానికి....!

మొటిమలూ, మచ్చలూ, చర్మం ఎరుపు రంగులోకి మారడం, నిర్జీవంగా తయారవడం, నల్లగా అవడం వంటి ఎన్నో సమస్యలకు గంధం పరిష్కారం చూపుతుంది. ముఖానికి కొత్త నిగారింపూ అందిస్తుంది.
• ఎలాగో మీరే చూడండి..
• రెండు చెంచాల గంధం, చెంచా పసుపూ, మూడు చెంచాల తేనె కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖం, మెడకు రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మొటిమల సమస్య ఉపశమనాన్నిస్తుంది.
• నారింజ తొక్కల పొడి ఓ చెంచా, రెండు చెంచాల గంధం పొడికి మూడు చెంచాల గులాబీ నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.
• చెంచా చొప్పున గంధం, కలబంద గుజ్జు, కొబ్బరిపాలు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే దద్దుర్లూ, చర్మం కందిపోవడం వంటి సమస్యలు ఉండవు.
• చెంచాడు ముల్తానీ మట్టి, చెంచా గంధం, వీటికి సరిపడా గులాబీ నీళ్లు చేర్చి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పావు గంట తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. ఇది చక్కటి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. రక్తప్రసరణని మెరుగు పరుస్తుంది. ముఖంపై వలయాలు, మచ్చలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ని నిర్మూలిస్తుంది.
• కీరదోసా, బంగాళదుంపా, తేనె, పెరుగూ, గంధం.. ఇవన్నీ చెంచా చొప్పున కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే మురికి తొలగిపోయి మచ్చల్లేని ముఖం మీ సొంతమవుతుంది.
• చెంచా చొప్పున సెనగపిండీ, గంధం.. వాటికి తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. దాన్ని పూతలా వేసి పూర్తిగా ఆరాక కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.

కండరాల శక్తి కోసం..!



కండరాల శక్తి కోసం..!
కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే... బీట్‌రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరసగా కొన్నాళ్లపాటు బీట్‌రూట్ రసం తాగించడం వల్ల... కండరాలూ, శరీరం దృఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు. నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజిమతమై, రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్లా కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ బీట్‌రూట్ రసానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి. కనీసం వారానికి రెండు సార్లయినా బీట్‌రూట్‌ని ఆహారంలో తీసుకుంటే మంచిది.

Friday, September 25, 2015

జామపండు - ఆరోగ్య రహస్యాలు

జామపండు తినటానికి అందరు ఇష్టతారు, కానీ దీని వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆర్చర్యానికి గురవుతారు..!

1) అతితక్కువ క్యాలరీలు , తక్కువ కొలెస్ట్రాల్ కలిగి , ఎక్కువ పోషక విలువలు ఉన్న పండు జామపండు.

2) ఎక్కవ పీచు పదార్ధం (ఫైబర్) కలిగి ఉంటుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

3) వయసుకు ముందే ముఖం పై ముడతలు , చర్మంలో సాగుదల లేకుండా చేస్తుంది.

4) A , B , C , విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

5) కంటి సమస్యలు , కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా జామపండు కాపాడుతుంది.

6) స్త్రీలలో రుతుచక్ర సమస్యలు , బ్రెస్ట్ క్యాన్సర్ మరియు పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది.

7) జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి , అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

8) దీనిలో విటమిన్ ఎ , ఫ్లావనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్ , లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు , చర్మానికి , కంటికి చాల మంచిది.

9) అతినీలలోహిత కిరణాల నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామకాయ లో ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.

10) జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు , బీపి పెరగకుండా చేస్తాయి.
11) అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B 6 , B 9 ) , E , K విటమిన్స్ ఉంటాయి.ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచించారు.

* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు.

* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.

* జామపండు చెట్టులోని ఆకులను (కనీసం 20-25 ఆకులు) నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మహానారాయణ తైలం'



* ఈ తైలంతో నొప్పులకు కళ్లెం

శరీరంలోని కండరాలు బలహీనపడితే కీలక భాగాల పనితీరు కూడా కుంటుపడుతుంది. ఆ స్థితి రాకుండా నివారించే శక్తి తైల మర్ధనకు ఉంది. ఈ ప్రక్రియలో ఆయుర్వేద మూలికలతో తయారు చేసే తైలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆయుర్వేద తైలాల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా 'మహానారాయణ తైలం' గురించి తెలుసుకుందాం.

ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.

• తైలంలో...

ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .

• కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.

• తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.

• ద్రవాంశం: అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.

• తైలగుణాలు:

తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి.

బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

• ఏ వ్యాధులకు..?

వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.

పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది. నారాయణ తైలంతో పాటు ఆయుర్వేద పైద్యుడి పర్యవేక్షణలో చంద్రప్రభావటి, యోగరాజ గుగ్గులు వంటి సాధారణ ఔషధాలు కూడా తీసుకుంటే అద్భుత ఫలితాలు మీ సొంతమవుతాయి.

సర్వరోగ నివారణి పాలకూర

సర్వరోగ నివారణి పాలకూర
మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగి తీసుకోవాలి. మిగిలిని కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. పోషకాహార నిధి అయిన పాలకూరకు క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది. పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారిచడంలో తోడ్పడుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెడ్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్దిచేసే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. మహిళల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజ్ టెబుల్ సూప్ లోనూ, చపాతీలు చేసుకునే పిండీలోనూ, పకోడీల పిండోలోనూ, పన్నీర్ తో కలిపి వాడే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరల్లాగా వేపుడు చేసుకుని తినవచ్చు.

ముఖవర్చస్సు కోసం...!

ముఖవర్చస్సు కోసం...!
అందంగా ఉండేవారు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. కొంతమంది శరీర భాగాలన్నీ మంచి రంగుతో ఉండి ముఖం మాత్రమే నల్లగా ఉంటే భరించలేరు. ఇది ఆడవారి విషయంలోనే కాదు మగవారి విషయంలోనూ కనపడుతుంది. ముఖం నల్లగా ఉందనే మానసిక వేదన పోగొట్టుకునేందుకు అనేక ఆధునిక చికిత్సలు వచ్చినా ఎక్కువ శాతం అలనాటి సంప్రదాయ చికిత్సలకే మొగ్గు చూపుతున్నారు. వీటివల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. అందమైన ముఖవర్చస్సు కోసం కొన్ని సులభ చికిత్సలు పరిశీలిద్దాం...!
కొన్ని గులాబీ రేకులను మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. సుమారు ఒక టీ స్పూన్‌ పేస్టుకి రెండు టేబుల్‌ స్పూన్ల పాలు కలిపాక తర్వాత మళ్లీ నూరి ఫ్రిజ్‌లో పదినిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చిక్కని క్రీములాగా ఉండే ఈ పేస్టుని ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతమవుతుంది.
యాపిల్‌పై ఉండే తొక్క తీసి ముక్కలుగా తరిగి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే మచ్చలు ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల శెనగపిండిని, 2 టీ స్పూన్ల వెన్నను చిటికెడు పసుపు తీసుకుని బాగా కలపాలి. ముఖాన్ని ముందుగా చల్లని నీటితో కడిగి జిడ్డు లేకుండా మెత్తటి తువాలుతో తుడవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న పేస్టును ముఖమంతా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్‌ చేయాలి. ఆశించిన ఫలితం కలుగుతుంది.
నారింజ పండ్ల పైతోలు ఎండించి చేసిన పౌడర్‌ను కొంచెం తీసుకుని అందులోకి రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
తొలుత ముఖాన్ని సున్నిపిండితో కడగాలి. ఆ తర్వాత ఒక బౌల్‌లో బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసి దీనిలో బాగా పండిన అరటిపండును కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే శరీరఛాయ మరింతగా మెరుగవుతుంది.
ఈ ఫేస్‌ప్యాక్‌లన్నీ రోజూ ఉదయం స్నానానికి ముందు ఆచరించి ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. ముఖ్యంగా ప్రతి రోజూ ఎక్కువగా నీరు తాగాలి. దీంతో పాటు తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. దీనివల్ల మీరు ఆశించిన ఫలితం త్వరగా పొందుతారు.