Sunday, May 15, 2016

వాము మొక్క

వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది
వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దది
ఔషధోపయోగాలు
వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు

Saturday, May 7, 2016

కంటి చుట్టూ ఉన్న నరాలు ఆరోగ్యంగా ఉండడానికి చిట్కాలు

1) మన కళ్ళు చుట్టూ ఉన్న ప్రకృతిని చూడడానికి దేవుడు ప్రసాదించిన వరం.దేవుడు ఇచ్చిన ప్రతి అవయవాన్ని కాపాడుకోవడం మన భాద్యత.
2) కళ్ళు అతి సున్నితమైన అవయవాలు.అవయవాల్లో ఎక్కువ అలిసిపోయేవి కళ్ళు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు చూస్తూ అలిసిపోతూ ఉంటాయి.
3) మొబైల్ రేడియేషన్ , కంప్యూటర్ రేడియేషన్ , టీవీ రేడియేషన్ , తగినంత నిద్ర లేకపోవడం, న్యూట్రిషన్ లోపం ఇవ్వన్ని కళ్ళను ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి.వీటిని తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
4) ప్రతి రోజు సాయంత్రం లేదా కళ్ళు అలసటకు గురి అయినప్పుడు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని వేడి చేసి , గోరు వెచ్చగా అయ్యాక , కళ్ళు మూసి రెప్పలపై , కనుబొమ్మలపై , కంటి చుట్టూ చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
5) ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నరాలు బలంగా తయారవుతాయి.కళ్ళ కింద నలుపు , వలయాలు , కంటి కింద ముడతలు తగ్గుతాయి.
6) కంటి ఆరోగ్యం బాగుండాలంటే A విటమిన్ ఉన్న పండ్లు , కూరగాయలు
ఆహరంలో భాగం చేసుకోవాలి.రోజులో తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.మొబైల్ , కంప్యూటర్ అవసరానికి మాత్రమే వాడుకోవాలి.
7) ముఖ్యంగా క్యారట్ , బీట్స్ , ఆకుకూరలు , బొప్పాయి , పాలు , గ్రుడ్లు , చేపలు , సోయాబీన్స్ లాంటివి తీసుకోవాలి.
ఇలా పాటిస్తే కంటి చూపు మెరుగుపడి , కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరోగ్య చిట్కాలు

రాత్రి నీటిలో నానబెట్టిన బాదంను మరుసటి రోజు ఉదయం పరగడుపు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది . ఇందులో విటిమన్స్, మినిరిల్స్ అధికంగా ఉంటాయి . ఇంకా మెగ్నీషియం, మరియు ఐరన్ కూడా అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే ఎంజైమ్స్ రెస్పిరేటర్ హీలింగ్ పవర్ ను నయం చేస్తాయి . కాబట్టి మీరు బ్రొకైటిస్ తో బాధపడుతుంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

Sunday, February 14, 2016

చెవి రోగాలు - ( Ear Dieseses ) నివారణ

* ఉత్తరేణి సమూల భస్మం నూనెతో కలిపి చెవిలో 4 నుంచి 5 చుక్కలు వేసిన కర్ణ రోగములు అన్ని హరించి పొతాయి.
* జిల్లేడు ఆకు, వావిలాకు , మునగాకు , కాకరాకు , తులసి ఆకు , గుంటగలగర ఆకు , ఆమూదపు ఆకు రసం తీసి మంచి నూనెలో వేసి కాచిన తరువాత చెవిలొ వేస్తుంటే చెవుడు తగ్గిపోతుంది.

* జిల్లేడు ఆకు రసంలో నువ్వుల నూనె పోసి కాచి రసం ఇగిరిన తరువాత వడపోసుకొని చెవిలొ వేసుకుంటే చక్కగా వినపడుతుంది.
* గోరువెచ్చగా ఉన్న వేపనూనె 2 చుక్కలు ఉదయం , సాయంత్రం వేస్తూ ఉంటే చెవుడు తగ్గిపొతుంది.
* ఉత్తరేణి ఆకురసం , మిరియాలు నూరి ఆ రసం చెవిలొ పోసిన చెవి నొప్పి తగ్గిపోతుంది .
* ఉల్లిపాయ రసం 1, 2 చుక్కలు చెవిలొ వేసి ఉల్లిపాయ వేడిచేసి నూరి చెవికి కడితే చెవినొప్పి తగ్గిపొతుంది.
* మెదడు బలహీనత వలన వచ్చిన చెవుడు కు 3 గ్రా ఎండు నల్ల ద్రాక్ష పండ్లు , 3 గ్రా ధనియాలతో కలిపి నమిలి మింగుతూ ఉంటే చెవుడు తప్పక పోతుంది.
* బావంచాలు , పిల్లితేగలు, సమంగా చుర్ణించి మంచి నీళ్ళతో తీసుకుంటే చెవుడు తగ్గును.
* నీటిపిప్పిలి ఆకు రసం చెవిలొ పిండుతుంటే క్రమంగా చెవుడు తగ్గిపొతుంది .
* ఉత్తరేణి భస్మం , మంచి సున్నం కలిపి నూనెలో వేసి కాచి చెవిలొ వేస్తే చెవుడు , ఇతర బాధలు అన్ని పొతాయి.
* 2 లేక 3 చుక్కలు తమలపాకు రసం చెవిలొ వేస్తుంటే చెవినొప్పి తగ్గుతుంది .
చెవిలొ చీము నివారణ కొరకు -
* బీరాకు రసం 2 చుక్కలు రోజు ఒక పూట చెవిలొ వేస్తే చెవిలొ పుండు , చీము కారుట తగ్గిపొతుంది.
* రసకర్పూరమ్ నువ్వుల నూనెలో కాచి 2 చుక్కలు చెవిలొ వేసిన చీము కారడం తగ్గిపొతుంది.
* వేప ఆకులు నీళ్ళలో వేసి మరిగించి బయటకు వచ్చే ఆవిరి చెవికి పట్టిన చీము , నొప్పి పొతుంది.
* ఆవు పంచితం 2 నుంచి 3 చుక్కలు చెవిలొ వేస్తే చీము కారడం తగ్గుతుంది .
* కొబ్బరి నూనెలో ఇంగువ వేసి కాచి 2 చుక్కలు చెవిలొ వేస్తే చీము తగ్గుతుంది
* నీరుల్లి రసం కొంచం వేడి చేసి 2 చుక్కలు చెవిలొ వేసిన చీము, నొప్పి తగ్గిపోతాయి .
* మందార ఆకుల రసం తో మంచి నూనె చేర్చి నూనె మిగిలేట్టుగా కాచి 2 చుక్కలు చెవిలొ వేస్తూ ఉంటే చీము కారడం , చెడు వాసన రావడం తగ్గిపోతాయి .
* దానిమ్మ పండు రసం వెచ్చ చేసి 2 చుక్కలు వేస్తే పోటు , చీము, దురద తగ్గిపోతాయి .
* చేమంతి ఆకు రసం 2 చుక్కలు వేస్తే చీము కారడం తగ్గిపొతుంది. చెవిలొ పురుగులు చచ్చిపోతాయి.
చెవిలొ కురుపులు - నివారణ
* సబ్జా ఆకు రసం 2 చుక్కలు చెవిలొ వేస్తే కురుపులు , చెవిలొ పోటు పొతుంది.
* వేపాకు రసం , తేనే సమంగా వెచ్చ చేసి 2 చుక్కలు చెవిలొ వేస్తే చెవిలొ కురుపులు మానతాయి.
* బీరఆకు రసం 2 బొట్లు చెవిలొ వేస్తే పుండ్లు, కురుపులు మానతాయి.

Friday, February 12, 2016

ఉపిరితిత్తుల రోగులకు అత్యద్బుత రసాయనం .

తయారీ విధానం -
తాజాగా ఉండే నల్లద్రాక్ష పండ్లు తెచ్చి బాగా కడిగి నీరు వంచి శుభ్రమైన చేతులతో పిసకాలి. తరువాత శుభ్రమైన గుడ్డలో వడపోసి రసం తీసుకోవాలి . ఆ రసం 16 కిలొలు ఉండాలి. అందులో 3 కిలొల పటికబెల్లం చూర్ణం 3 కిలొల మంచి తేనే కలిపి శుభ్రమైన కొత్తకుండ లొ పోయాలి. అందులొ ఇంకా ఒక్కొటి 25 గ్రాముల చొప్పున నాగకేసర చూర్ణం , దొరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం , శుద్ది చేసిన చిత్రమూలం చూర్ణం , వావిలి గింజల చూర్ణం , ఆకుపత్రి చూర్ణం , యాలుకల చూర్ణం , దాల్చినచెక్క చూర్ణం దోరగా వేయించిన మిరియాల చూర్ణం , లవంగాల చూర్ణం , జాజికాయల చూర్ణం పోసి కుండపైన మూకుడుతో మూసి వాసిన కట్టు కట్టాలి. పదార్దాలు కుండలో నిండుగా ఉండకూడదు . కుండలో నాలుగో వంతు ఖాళీగా ఉండాలి. కుండ మూతకు శీల మన్నుతో లేపనం చేయాలి .
తరువాత ఎండాకాలం లొ అయితే 3 వారాల పాటు , వర్ష, శీతాకాలలో అయితే ఒక నెలరొజుల పాటు ఆ కుండను ఒక మూలగా కదిలించకుండా భద్రపరచాలి. పైన తెలిపిన సమయానికి కుండలో పదార్దాల మద్య రసయనిక చర్య జరిగి ఆ పదార్దం అంతా అద్బుతమైన అమృత రసాయనం అవుతుంది. తరువాత మూత తీసి కుండలోని పదార్థాన్ని కదలకుండా పై పై తేట నీళ్లని వేరే పాత్రలోకి వంచుకోవాలి.ఈ రసాయనాన్ని గాజు సీసాల్లో నిలువ ఉంచుకొవాలి. పూటకు 25 గ్రాముల మోతాదుగా రోజు రెండుపూటలా సేవించాలి .
ఉపయొగాలు -
* ఉపిరితిత్తులు బలహీనత తగ్గిపొతుంది.
* సహజశక్తి కలుగుతుంది.
* రక్తం శుభ్రపడి కొత్తరక్తం పుడుతుంది.
* ఆస్తమా , క్షయ , ఉపిరితిత్తులు కాన్సర్ , అజీర్ణ రోగులుకు ఇది అమృతం కన్నా ఎక్కువుగా పనిచేస్తుంది .
* శరీరానికి ధృడమైన , శాశ్వతమైన బలం , యవ్వనం , రంగు లభిస్తాయి.
* శరీరకాంతి, బుద్ధిబలం, వీర్యవృద్ధి , కళ్లకు చలువ కలుగుతాయి.
పైన చెప్పిన మూలికలు, చూర్ణం లు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అవుతాయి.

ఎలర్జీ తగ్గుట కొరకు -

శరీరం నందు రక్తంలో తేడా వచ్చి రక్త శుద్ది లేనప్పుడు , శరీరంలో పైత్యం పెరిగిపోయినప్పుడు దాని ప్రభావం శరీరం పైన పడుతుంది. అప్పుడు దద్దుర్లు , చర్మరోగాలు వస్తాయి.

దద్దుర్లు తగ్గించేందుకు సులభ యోగాలు -
* ప్రతిరోజు జీలకర్ర, ధనియాలు , ఎండుద్రాక్ష ఒక్కొటి 10 గ్రాముల చొప్పున కొంచం నీళ్లతో నూరి గుడ్డలో వడపోసుకొని పిండుకొని తాగండి.ఇలా రోజుకీ రెండుమూడు సార్లు చేస్తే పైత్యం ద్వారా వచ్చిన దద్దుర్లు పొతాయి.
* ప్రతిరోజు ఉదయం పూట 1 కప్పు పాలలొ ఒకటి లేక రెండు చుక్కలు ప్రశస్తమైన పలుచటి వేపనూనె కలిపి 20 గ్రాముల పటికబెల్లం చూర్ణం కలిపి తాగండి. దీనితో పాటు 30 వేపాకులు , 3 మిరియాలు 1 టీస్పూన్ మంచి పసుపు ఈ మోతాదుగా ఎంత ఎక్కువైనా కలిపి మంచినీళ్ళు పోసి మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేయండి . అది వంటికి రాసుకొని గంట లేక రెండు గంటల పాటు అలాగే ఉంచి సున్నిపిండితో స్నానం చేస్తూ ఉంటే క్రమంగా రక్తశుద్ది , చర్మశుద్ధి జరిగి బాధ నివారణ జరుగుతుంది.
* ఒక కప్పు పాలలో మంచి ప్రశస్తమైన వేపనూనె 2 చుక్కలు వేసి 20 గ్రాముల పటికబెల్లం పొడి కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే రక్తశుద్ది జరిగి చర్మవ్యాదులు పోతాయి .
* మారేడు ఆకులని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణం గా తయారుచేసుకుని పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా రెండుపూటలా మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని రకాలు చర్మవ్యాదులు హరించి పొతాయి.
* చింతపండును నీళ్లలో కలిపి బాగా పిసికి గుజ్జుని పిండి తీసివేసి ఆ రసాన్ని వంటికి పట్టిస్తూ పైత్యం పెరగడం వలన వచ్చిన దద్దుర్లు పొతాయి.
* నిమ్మరసంలో తులసి ఆకులు వేసి మెత్తగా మర్దించి దద్దుర్ల పైన లేపనం చేస్తే దద్దుర్లు హరించి పోతాయి .
* గరికరసం 4 బాగాలు , ఆవనూనె 1 బాగము కలిపి తైలము మిగిలే టట్లు సన్నసెగ మీద వండాలి. తరువాత వడపోసి ఆ తైలాన్ని చర్మవ్యాదుల పైన లేపనం చేస్తూ ఉండాలి. దీనితో పాటు ప్రతిరోజు రెండుపూటలా గరికరసం 10 గ్రా మోతాదుగా సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే సకల చర్మవ్యాదులు పాముకుబుసం విడిచినట్లు శరీరం నుంచి తొలగిపోతాయి.
* పటికబెల్లం పొడి 24 గ్రా , కటుకరోహిని పొడి 12 గ్రాములు కలిపి నూరి ఉంచుకొని పూటకు ఒక గ్రాము చొప్పున రెండు పూటలా మంచి నీళ్ల అనుపానంతో పుచ్చుకుంటూ ఉంటే క్రమంగా దద్దుర్లు , దురదలు తగ్గిపోతాయి .

గుండెకి బలం కలిగించే ఆహార పదార్దాలు -

గుండెకి బలం కలిగించే ఆహార పదార్దాలు -
* కొబ్బరి నీళ్ళు , కొబ్బరి పచ్చడి.కోడిగుడ్డు
* గులాబీ , గౌజుబాన్ , ఉసిరికాయ .
* అంజీర్ , ఆక్రోట్, యాలుకలు .
* కస్తూరి, ముద్ద కర్పూరం , కుంకుమ పువ్వు.
* జాజికాయ, దాల్చిన చెక్క, తేనే .
* ద్రాక్షరసం, తీపిదానిమ్మ, , కూరల్లో పసుపు .
* వస, లవంగాలు, లవంగపట్ట.
* వాము, వెల్లుల్లి, కొత్తిమీర , మిరియాలు.
* కరకచుర్ణం , ఆవునెయ్యి, శొంటి.
గుండె జబ్బు నివారించే ఔషధం -
* శొంటి కషాయం వేడివేడిగా కొద్దికొద్దిగా సేవిస్తూ ఉంటే గుండె శూలలు( నొప్పి ) , వాత రోగాలు, అజీర్ణం , కడుపు నొప్పి, దగ్గు , ఒగర్పు మొదలయిన బాధలన్ని పటాపంచలు అవుతాయి.
* తెల్ల మద్ది చెట్టు బెరడు తెచ్చి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి అతి మెత్తని చూర్ణం గా తయారుచేయాలి. రోజు 5 గ్రా చూర్ణం లొ 5 గ్రా ఆవునెయ్యి గాని లేక ఆవుపాలు గాని లేక బెల్లపు పానకం గాని ఏదో ఒకటి కలిపి పుచ్చుకుంటూ ఉంటే గుండె రోగాలు , జీర్ణ జ్వరాలు , రక్తం కక్కుకునే రక్తపిత్త వ్యాధి, హరించి పోయి పరిపూర్ణ ఆయుషు , ఆరోగ్యం కలుగుతాయి.
* చెరువుల్లో పెరిగే తామర గడ్డలను తెచ్చి పైన చెప్పిన విధంగా అతిమెత్తని చూర్ణం గా తయారుచేసి ఆ చూర్ణాన్ని రెండు పూటలా 5 గ్రా మోతాదుగా తేనే కలిపి సేవిస్తూ ఉంటే గుండె రోగాలు , శ్వాసరోగాలు , ఎక్కిళ్ళు హరించి పొతాయి.
* గుంట గలిజేరు రసంలో వాముని నానబెట్టి , తరువాత నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని అందులో ఇంగువ చూర్ణం ఒక చెంచా కలుపుకొని దానిని ధనియాల కషాయంతో రెండు పూటలా వారం రోజుల పాటు సేవిస్తూ ఉంటే గుండెలో నొప్పి తగ్గుతుంది.
* పాలతో కలిపిన అన్నం ఎక్కువ తినాలి .
* ఉసిరికాయల పై బెరడు 100 గ్రా , పటికబెల్లం పొడి 100 గ్రా రెండు కలిపి మెత్తగా నూరి పూటకు 5 గ్రా మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల గుండె జబ్బులు హరించి పొతాయి.
* తెల్ల మద్ది చెక్క చూర్ణం పూటకు 5 గ్రా చొప్పున తేనెతో కలుపుకుని సేవిస్తూ ఉంటే అన్ని రకాల గుండెజబ్బులు హరించి పొతాయి. గుండెకి బలం చేకూరుతుంది.
* రోజు ఉదయం , మధ్యాహ్నం సమయాల్లో ఒక నిమ్మ పండు రసంలో 50 గ్రా నీళ్లు , 20 గ్రా కలకండ పొడి కలిపి తాగుతూ ఉంటే గుండె దడ , నీరసం , కడుపులో మంట, మూత్రం బిగింపు, మలబద్ధకం తగ్గిపోతాయి.
గమనిక -
ఆయుర్వేదం నందు యే ఔషధం అయినా ఒక మండలం ( 41 రోజులు ) తప్పక విడవకుండా వాడవలెను . అప్పుడు మాత్రమే దానియొక్క ప్రభావం చూపించును.