Friday, October 24, 2014

కాకర కాయ మహాత్మ్యం

కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది.కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.

1. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.

2. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాది
నయమవుంతుంది.

3. షుగర్‌ వ్యాది గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను
ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది.

4. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారో
గ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే చాలు.

5. మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు.

6. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి
తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం
కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.

7. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు.కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.

8. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు...