Wednesday, May 14, 2014

నేత్రదానం

నేత్రదానం మీద సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ అనర్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేత్రదానం చేయకపోతే ఇప్పుడు మాత్రమే నష్టం. కానీ దాని గురించి తెలుసుకోక పొతే వచ్చే తరం, ఆ తర్వాత తరం... అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి తరతరాలు నష్టం కలగటానికి ఇది ప్రధాన కారణం. అందకే నేత్రదానం పట్ల ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలి.నేత్రదానం అనేది 1 సంవత్సరం నుండి వందసంవత్సరాల పైబడినవారు కూడా చేయగల ఏకైక దానం.నేత్రదానం అంటే కళ్ళు మొత్తం స్వీకరించరు కేవలం కంటి పైన గల ఒక పొర మాత్రమే స్వీకరిస్తారు.
నేత్రాలను నేత్రదాత మరణించిన 3 నుండి 5 గంటలలోపు మాత్రమే సేకరించాలి. కనుక వెంటనే దగ్గరలోని ఐ బ్యాంక్‌ కు సమాచారం ఇవ్వాలిఎయిడ్స్‌, పచ్చ కామెర్లు, రేబిస్‌ (కుక్కకాటు) మినహా మిగతా ఏ కారణం తో మరణించినా నేత్రదానం చేయవచ్చు.నేత్రదానం చేయాలి అనుకుంటే అందుకు దగ్గరలో ఉన్న నేత్రనిధికి వెళ్లి మీ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ కార్డు మీదగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవటం మంచిది.
కార్నియా అనేది మన కంటిమీద ఉండే ఒక పొర. కంటిలోకి కాంతి కిరణాలు వెళ్లాలంటే ఈ పొర గుండా మాత్ర మే కంటిలోపలకు వెళ్తాయి. మన శరీరంలో ఏ అవవయం చెడిపోయినా ఆపరేషన్‌ చేసి బాగుచేయవచ్చు. కానీ లివర్‌ (కాలే యం), కార్నియా చెడిపోతే ఏమీ చేయలేము. కేవలం వేరొకరు దానం చేస్తే మాత్రమే తిరిగి చూపు పొందటానికి మార్గం ఉంటుంది. అందుకు నేత్రదానం ఒక్కటే మార్గం.మన శరీరంలో అన్ని అవయవాలు ఆక్సిజన్‌ (ప్రాణ వయవు)ను రక్తం ద్వారా స్వీకరిస్తాయి. కానీ ఈ కార్నియా ఒక్కటే నేరుగా గాలి నుండి ఆక్సిజన్‌ను స్వీకరిస్తుం ది. అందుకే నేత్రదాత మరణించిన వెంటనే అన్ని అవయవాలు చనిపోతే కేవలం ఈ కళ్ళు మాత్రం 6 గంటల వరకు గాలిలోని ఆక్సిజన్‌ను స్వీకరిస్తూ బ్రతికి ఉంటాయి.నేత్రనిధి కేంద్రాల కోసం మీకు దగ్గరలోని ఐ బ్యాంక్‌ యొక్క చిరునామా కోసం క్రింది అడ్రస్‌ను సంప్రదించండి.

Dr S .Chandu
phone : 9440017115
E-mail : drschandu@dr.com , drschandu@gmail.com
Eye bank association of India
Plot No: 12, BNR Colony,
Road No: 14, Banjarahills, Hyderabad - 500034
Phone: 040 23545454, 23544504
Website: www.ebai.org
E-mail: ebai@vsnl.net, admin@ebai.org

రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి !Dr S Chandu

రక్త దానం (Blood donation) అనేది దాదాపుగా ప్రాణ దానం లాంటిది. రోగ నివారణ కోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు.ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటె ఎక్కువ hemoglobin ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటె తక్కువ hemoglobin ఉంటే అది రక్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు.
ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడ కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = ఆర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే సుమారు 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అంతా పోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితి రావచ్చు.ఏటా మన రాష్ట్రంలో 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే.మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రక్తదానం చేయడమం టే ఓ ప్రాణాన్ని కాపాడడమే.ప్రతీ పది నిముషములకు మన రాష్ట్రంలో ఎక్కడోచోట ఒకరికి రక్తం అవసరమ వుతుంది. ప్రతి రోజూ కనీసం 38,000 మంది రక్తదాతల అవసరం ఉంది.
అత్యధికంగా కోరుకునే రక్తం ‘ఒ’ గ్రూప్‌ , మన రాష్ట్రంలో ఏటా కొత్తగా 2.5 లక్షల మంది క్యాన్సర్‌ బాధితులుగా తేలుతున్నారు.కెమోథెరపీ చికిత్స సందర్భంగా తరచూ వారికి రక్తం అవసరం ఉంటుంది.రక్తదానం ఎంతో సురక్షిత ప్రక్రియ.ప్రతీసారి కూడా స్టెరెైల్‌ నీడిల్‌ను ఉపయోగిస్తారు. ఒకసారి ఉపయోగించిన దాన్ని మళ్ళీ ఉపయోగించరు.
రిజిస్ట్రేషన్‌, మెడికల్‌ హిస్టరీ, డొనేషన్‌, రిఫ్రెష్‌మెంట్‌ అనే నాలుగు తేలిక పాటి దశల్లో రక్తదానం పూర్తవుతుంది
రక్తదానం చేసే వారికి ముందుగా టెంపరేచర్‌, బీపీ, పల్స్‌, హిమోగ్లోబిన్‌ తదితర పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలిగ్గా పూర్తయ్యేవే.రక్తదాన ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది.
మన శరీరంలో 10 - 12 యూనిట్ల రక్తం ఉంటే, సుమారుగా 1 యూనిట్‌ రక్తా న్ని దానం చేయవచ్చు. దాని వల్ల దాత శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఆరోగ్యవంతుడెైన దాత ప్రతీ 56 రోజులకు ఒకసారి ఎరర్రక్త కణాలను డొనేట్‌ చేయవచ్చుఆరోగ్యవంతుడెైన దాత కనీసం 7 రోజుల విరామంతో సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేయవచ్చు.రక్తానికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, ఇతర అంటువ్యాధుల సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాతే దాన్ని అవసరమైన వారికి ఎక్కిస్తారుమన శరీరం మొత్తం బరువులో రక్తం బరువు 7 శాతం దాకా ఉంటుంది.
రక్తం నుంచి ఎరర్రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్‌ అనే భాగాలను విడదీసి ఎవరికి ఏది అవసరమో వారికి అది అందిస్తారు. ఒక్కసారి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడవచ్చు. డొనేట్‌ చేసిన ప్లేట్‌లెట్స్‌ను సేకరించిన ఐదురోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుందిమీరు గనుక 18 ఏళ్ళ వయస్సులో రక్తదానం చేయడం ఆరంభిస్తే, 60ఏళ్ళు వచ్చేసరికి మీరు 30 గ్యాలన్ల రక్తాన్ని దానం చేయవచ్చు. కనీసం 500 మంది ప్రాణాలు కాపాడవచ్చు.దేశంలో 7 శాతం మంది మాత్రమే ‘ఒ’ నెగెటివ్‌ కలిగి ఉన్నారు. వారి రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చు. గ్రహీత గ్రూప్‌ తెలియని పరిస్థితుల్లో, అప్పుడే పుట్టిన శిశువులకు రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఈ గ్రూప్‌ రక్తం అవసరం ఉంటుంది.దేశంలో కనీసం 35 శాతంమంది ‘ఒ’ పాజిటివ్‌ గ్రూప్‌ను కలిగి ఉన్నారు. రక్తంలోని ప్రధాన గ్రూప్‌లు ఎ,బి, ఎబి, ఒదేశంలో 0.4 శాతం మంది ఏబి- బ్లడ్‌గ్రూప్‌ను కలిగి ఉన్నారు. వీరి రక్తంలోని ప్లాస్మాను ఎవరికైనా ఉపయోగించచ్చు.రక్తాన్ని దానం చేసే 3 గంటల ముందు మంచి భోజనాన్ని తీసుకోండి. దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
దానం చేసే రోజు ముందు పొగ త్రాగడం మానండి. దానం చేసిన 3 గంటల తరువాత మీరు పొగ త్రాగవచ్చు
దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.

పూర్తి వివరాలకు , మీ సందేహాలకు ఈ చిరునామాలో సంప్రదించండి
Dr S Chandu
phone : 9440017115
Email : drschandu@dr.com , drschandu@doctor.com
Institute Of Transfussion Medicine & Research
phone : 040 - 23300352, 23328956, 23319491
Nims Backside Compound, Road No 1,
Banjara Hills, Hyderabad - 500034

Saturday, May 10, 2014

సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము.

వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు మళ్ళుతుంది.శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ క్రింది సహజ పోషకాలు ఇచ్చే పానీయాలను సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,స
ోడియం,కాల్షియం లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2) మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును.ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను త్వరగా జీర్ణం చేయును.ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.
3) సబ్జా నీరు: మహిళలకు అవసర మయ్యె పాలేట్, నియాసిన్, చర్మాన్నిఅందంగా ఉంచే విటమిన్ E అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4) పుచ్చకాయ : గుండెజబ్బులు రాకుండా చేసే పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే LYKOPIN సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
5) తాటి ముంజలు :6 అరటి పండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
6) నిమ్మరసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది.విటమిన్ సి ఎక్కువ
7) చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి. ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.
8) రాగి జావ: ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల, acidity ని తగ్గిస్తుంది.
ఈ పానీయాలను సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.

Sunday, May 4, 2014

వేగంగా బరువు తగ్గించే వెజిటేబుల్స్

బరువు తగ్గించుకోవడం కోసం క్రాష్ డైట్ లేదా మోనో డైట్ చేయడం అంత మంచి పరిష్కార మార్గం కాదు. ఖచ్చితంగా బరువు తగ్గాలని నిర్ణయించుకొన్నవారు, సరైన ఆహారాలు తీసుకోవడం వల్ల అవి శరీరానికి కావల్సిన శక్తిని అందివ్వడంతో పాటు, శరీరంలో చేరిన అదనపు కొవ్వును కరిగించే విధంగా సహాయపడాలి. బరువు తగ్గాలనుకొనేవారు తక్కువ క్యాలరీలు, అదే విధంగా తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. శరీరంలో అదనపు కొవ్వును కరిగించే ఆహారాలు వివిధ రకాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు, శరీరం మంచి ఒక ఆకృతిని పొందవచ్చు.
అటువంటి స్లిమ్ బాడీ పొందాలంటే, సిట్రస్ పండ్లు, నిమ్మ, బెర్రీస్ వంటివి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. అదే విధంగా కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. ఉదాహరణకు : కీరదోసకాయ వంటివి రెగ్యులర్ డైట్ లో ఉండాల్సినటువంటి ఒక వెయిట్ లాస్ వెజిటేబుల్. కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడానికి ఒక హెల్తీ వెజిటేబుల్. బెల్ పెప్పర్ కూడా బరువు తగ్గిస్తుంది. ఎల్లో, రెడ్ మరియు గ్రీన్ బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ లు జీవక్రియలు చురుకుగా పనిచేసి, క్యాలరీలను తగ్గిస్తుంది. ఇంకా శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తాయి. ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ బీన్స్, ఆకుకూరలు, మరియు బ్రొకోలీ వంటివి అదనపు పౌండ్ల బరువును తగ్గించేస్తాయి. కాబట్టి, నేచురల్ గా మీ బరువు తగ్గించే కొన్ని రకాల వెజిటేబుల్స్ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు, రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తే తప్పనిసరిగా బరువు తగ్గుతారు. వ్యాయామం వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
కాకరకాయ: కాకరకాయలో చేదు కలిగిన వెజిటేబుల్స్ లో ఇది ఒకటి. కాకరకాయ రసం లేదా కాకరకాయ బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంతో పాటు, బరువు కూడా తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది.
కీరదోసకాయ: కీరదోసలో నీటి నీరు 90శాతం ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీలుంటాయి. ఈ జ్యూసీ వెజిటేబుల్ బరువు తగ్గాలనే డైటర్స్ కు ఒక బెస్ట్ వెజిటేబుల్.
ఆకుకూరలు: గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను వైయిట్ లాస్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సినటువంటి ఒక సూపర్ ఫుడ్. ఆకుకూరలతో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . ఇవి చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గడానికి ఇది ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.
సొరకాయ: సొరకాయలో ఫైబర్ కంటెంట్ మరియు నీరు అధికంగా ఉంటుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. కాబట్టి, మీ దినచర్యను బాటిగార్డ్(సొరకాయ)జ్యూస్ తో ప్రారంభించండి. జ్యూస్ చేసిన తర్వాత వడగట్ట కుండా అలాగే తీసుకోవడం వల్ల మీకు అవసరం అయ్యే ఫైబర్ అందుతుంది. క్యాలరీలు తగ్గించడంలో ఫైబర్ అద్భుతంగా సహాయపడుతుంది.
బ్రొకోలీ: ఇది మరొక గ్రీన్ వెజిటేబుల్. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని ఉడికించి లేదా ఆవిరి పట్టించి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ న్యూట్రీషియన్స్ అందుతాయి. దాంతో ఎక్కువ ప్రయోజనం.
గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. గ్రీన్ బీన్స్ లోని యాంటీఆక్సిడెంట్స్ బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.
బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్: ఇది ఒక ఫ్యాట్ బర్నింగ్ వెజిటేబుల్. ఇదుంలో యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్లు ఉన్నాయి. ఇవి బరువు తగ్గాలనుకొనే వారికి చాలా అవసరం అవుతాయి.
ఉల్లిపాయ: నమ్మలేకపోతున్నారు కదూ? కళ్ళలో నీళ్ళు పెట్టించే ఈ ఉల్లిపాయ, బరువు తగ్గించడానికి సహాయపడుతుందంటే ఆశ్చర్యమే . బరువు తగ్గించడంతో పాటు బ్లడ్ ప్రెజర్, చెడు కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.
క్యాబేజ్: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో ఫైబర్ మరియు నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది పొట్టను నిండుగా ఉంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్యారెట్: క్యారెట్ లో విటమిన్ ఎ, సి మరియు కె, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీర ఆరోగ్యానికి మరియు చర్మ ఆరోగ్యానికి ఒక హెల్తీ వెజిటేబుల్.
సెలరీ: సెలరీని వెయింట్ లాస్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ మరియు నీటికంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నింపుతుంది మరియు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది.
టమోటో: టమోటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది బరువు తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాలన్ ను కరిగించడంలో, బౌల్ ను శుభ్రం చేయడంలో మరియు చర్మసంరక్షణకు గొప్పగా సహాయపడుతుంది.

పోపులపెట్టే ఫస్ట్ ఎయిడ్ కిట్


మన వంటింట్లో ఉండే మామూలు దినుసులే ఎన్నో చిన్న చిన్న రుగ్మతలను తగ్గించి ఆరోగ్యాన్ని ఉత్సాహంగా ఉంచుకొంటుంది. మనం రోజూ వాడే పదార్థాలతో కలిగే ప్రయోజనాలు...
పసుపు :
నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.
మిరియాలు :
స్వచ్ఛమైన తేనెలో కాస్తంత అల్లం రసంతో పాటు నాలుగైదు మిరియాలు తీసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇంకా ఇది ఆకలిని కూడా పెంచుతుంది.
కొత్తిమీర :
మనం ఆహారంలో వేసుకునే కొత్తిమీర జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.
కాస్తంత కొత్తిమీర రసాన్ని కొద్దిగా అల్లం రసంతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
కడుపులో ఉబ్బరంగా ఉన్నప్పుడు కాస్తంత కొత్తిమీర రసం, అల్లం రసం ఒక గ్లాసు నీళ్లలో కలిపి తాగాలి. దాంతో కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
ఏలకులు :
నోటి దుర్వాసనను ఏలకులు సమర్థంగా అరికడతాయి.
దాంతో పాటు వికారం, తలనొప్పికి కూడా ఏలకులు మంచి మందుగా పనిచేస్తాయి.
కళ్లు మంటలు, దురదలు తగ్గడానికి కూడా, ఏలకులు బాగా పనిచేస్తాయి.
వెల్లుల్లి :
వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
వెల్లుల్లిని వాడినప్పుడు అందులోని అలిసిన్ అనే పదార్థం (ఇదే వెల్లుల్లికి ఘాటైన వాసన ఇస్తుంది) అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇంకా రక్తనాళాల్లోని కొవ్వును తగ్గిస్తుంది.
శనగలు :
కఫం తగ్గించడానికి శనగలు బాగా పనిచేస్తాయి.
ఒక టేబుల్‌స్పూన్ శనగపిండిని ఒక చెంచా తేనెతో కలిపి రోజూ రాత్రివేళ తీసుకుంటే ఆ మిశ్రమం జీర్ణ సంబంధమైన అనేక సమస్యలను నివారిస్తుంది.

అనేక రోగాలపై కత్తి - అత్తిపత్తి


ఈ మొక్కను మీరంతా చూసే ఉంటారు. ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకుని కొంత సమయం తరువాత వాటంతట అవే మళ్ళి విచ్చుకుంటాయి. వర్షా కాలంలో మన గ్రామాల చుట్టూ నీటి తడి ఉన్న ప్రదేశాలలో ఈ మొక్క పెరుగుతుంది. ఇందులో ముళ్ళు లేని మొక్క, ముడ్లు ఉన్న మొక్క అనే రెండు రకాలు ఉంటాయి. ముడ్లున్న అత్తా పత్తి భూమి నుండి జానెడు మొదలు మూరడు వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మకుల్లగా చిన్నగా ఉంటాయి.
కొమ్మలకు ముళ్ళుంటాయి. పూలు ఎరుపు కలిసిన ఉదారంగులో ఉంటాయి. ముడ్లు లేని అట్టి పత్తి నేలపై పరచుకుని ఉంటుంది, ఇది కూడా నీరున్న ప్రాంతాలలో పెరుగుతూనే ఉంటుంది. నెల పైన రెండు ముడు గజాల దాకా పాకుతుంది. దీనికి పసుపు రంగు పూలు ఉంటాయి, సన్నటి కాయలు ఉంటాయి, కాయల్లో గింజలు లక్క రంగులో ఉంటాయి.
అత్తిపత్తి కి అనేక పేర్లు
సంస్కృతంలో లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు.
అత్తిపత్తి-గుణ గణాలు
ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ది చేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది, ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది, పాత వ్రణాలనుమాన్పుతుంది, మేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగాన్ని, స్త్రీరోగాలను హరించి వేస్తుంది.
వీర్య హినతకు – బ్రహ్మాస్త్రం
అత్తిపత్తి గింజలు, చింతగింజల పప్పు, నీరుగోబ్బి గింజలు సమంగా తీసుకుని మర్రి పాలలో ఒక రాత్రి నానా పెట్టి తరువాత గాలికి అరపెట్టి మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండబెట్టి నిలువ చేయాలి. రెండు పుటలా ముడు మాత్రలు నీటితో వేసుకుని వెంటనే నాటు అవు పాలు కండ చెక్కర కలిపి తాగాలి.
నలబై రోజుల్ ముత్రములో వీర్యము పోవడం, శిఘ్రస్తలనం, నపుంసకత్వం, అన్గాబలహింత హరించి ధాతుపుస్టి కలుగుతుంది.
ఆహార నియమాలు: వేడి, పులుపు, కారం పదార్దాలు నిషేదించి భ్రహ్మచర్యం పాటించాలి.

ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు
ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రం పోయటం వల్ల గాని, లేక సెగ రోగామున్న వారితో సంబోగం జరపడం వల్ల గాని, ఈ సుఖ రోగం కలుగుతుంది.
ఆ సమస్యకు అత్తిపత్తిఆకు, మంచిగందం పొడి, సమంగా తీసుకుని కలబంద గుజ్జుతో మెత్తగా నూరి మాత్రలు కత్తి నీడలో గాలికి బాగా ఎండబెట్టి నిలువ ఉంచుకోవాలి. రోజు రెండు పుటలా పుటకు ఒక మాత్ర మంచి నీటితో వేసుకుంటుంటే సెగ తగ్గటమే కాక విర్య వృద్ది కలుగుతుంది.
నారికురుపులు నశించుటకు
అత్తిపత్తి ఆకులూ మెత్తగా నూరి నారి కురుపులుపై వేసి కట్టుకడుతూ ఉంటె అవి నశించి పోతాయి.

ఆహార నియమాలు: గొంగోర, వంకాయ, మాంసం, చేపలు నిషేధం.
ఆగిన బహిష్టు-మరలా వచ్చుటకు
అత్తిపత్తి ఆకు పొడి ఒక బాగము, పటిక బెల్లం పొడి రెండు బాగాలు కలిపి పుటకు అర చెంచ పొడి మంచి నీటితో సేవిస్తూ ఆగిన బహిష్టు మరల వస్తుంది, రాగానే చూర్ణం వాడటం ఆపాలి.
ఆహార నియమాలు: బెల్ల నువ్వులు, గంజి, తీపి పదార్ధాలు వాడాలి.
వీర్య స్తంభనకు
అత్తిపత్తి వేర్లను మేక పాలతో గాని, గొర్రె పాలతో గాని, గంధంలా నూరి ఆ గంధాన్ని ఫురుషులు తమ అరికాళ్ళకు మర్దించుకుని ఆ తరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటి వరకు విర్యపతనం కాదు.
బోదకాలి మంట, పోటుకు
అత్తిపట్టిఆకు 5గ్రా., మిరియాలు 9 ఒక కప్పు నీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి పరగడుపున 40 రోజుల పాటు సేవించాలి, దీనితో పాటు... అత్తిపత్తి ఆకును ముద్దగా నూరి బోధకాలిపై పట్టులాగా వేసి కట్టు కడుతూ ఉంటె మాట, పోటు,బాద తగ్గిపోతాయి.
ఆహార నియమాలు: మాంసం, చేపలు, నంజుపధర్ధాలు నిషేధం.
స్త్రీల యోని బిగువకు
అత్తిపత్తి ఆకు తేనెతో మెత్తగా నూరి యోనికి పట్టిస్తూ ఉంటె యోని బిగువగా మారుతుంది.
ఆహార నియమాలు: తీపి పదార్ధాలు సేవించాలి.
స్త్రీల స్తనాల బిగువుకు
అత్తిపత్తి సమూలఛుర్నం, అస్వగంద దుంపల చూర్ణం సామగా కలిపి వుంచుకుని రాత్రి పుట తగినంత పొడిని నీటితో నూరి స్తనలపై పట్టించి ఉదయం కడుగుతూ ఉంటె జారిన స్తనాలు బిగువుగా మారతాయి.
ఆహార నియమాలు: పాలు, నెయ్యి, పండ్లు, తీపి తినాలి.
చల్ది, మశూచికములకు
అత్తిపత్తి ఆకు 30గ్రా.. మిరియాలు 2 గ్రా.. ఈ రెంటిని మెత్తగా నూరి ఒక గ్రాము బరువుగల మాత్రలు చేసి గాలికి నీడలో ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. రెండు పుటలా ఒక మాత్ర గోరువెచ్చని నీటితో సేవిస్తూ చెల్దికురుపులు మసూచికంగండమాల హరించి పోతాయి.
ఆహార నియమాలు: చేపలు, మాంసం, వేడి పదార్ధాలు నిషేధం.
నీళ్ళవిరేచనాలు-రక్తమొలలు
అత్తిపత్తి సమూల చూర్ణం 3 నుండి 5 గ్రా పంచదార ఒక చెంచా కలిపి రెండు పుటల సేవిస్తుంటే అతిసారా విరేచనాలు, రక్త మొలలు హరించి పోతాయి:
ఆహారనియమాలు: విరేచనకర పదార్ధాలు నిషేధం.
సిగ్గు విడచిన – స్త్రీ పురుషులకు
సూర్య గ్రహణము లేక చంద్రగ్రహనము రోజున అత్తిపత్తి ధూపదీప నైవేద్యలతో పూజించి వేరు తెచ్చి కడిగి ఆరపెట్టి దాన్ని రాగి తాయేత్తులోపెట్టి మొలకు గాని చేతికి గాని కట్టిఉంచితే అంతకుముందువరకు సిగ్గు లేకుండా బరితెగించి ప్రవర్తిచే స్త్రీ పురుషులు క్రమంగా తమ తప్పును తామే తెలుసుకుని సిగ్గు పడతారు.
అతిముత్రమునకు-అత్తిపత్తి
పచ్చని పూలు పుసే అత్తిపత్తి చెట్టు కాడలను, తాటి కలకండను సమంగా కలిపి మెత్తగ్గా నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసి గాలిలో నీడకు బాగా అరపెట్టి రెండు పుటలా మర్రి చెక్క కషాయంతో ఒక మాత్ర సేవిస్తూ ఉంటె అతి మూత్రం హరిస్తుంది.
వ్రణాలకు-అత్తపత్తి
అత్తపత్తి ఆకులు ముద్దగా నూరి అందులో కొంచెం పసుపు కలిపి నూరి కురుపులుపైన, పుడ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటె క్రమంగా వ్రణాలు మాడిపోతాయి.
అత్తపత్తితో-అద్బుత కాటుక
అత్తపత్తి చెట్టును సమూలంగా ఒక కేజీ తెచ్చి కడిగి నలగొట్టి అందులో 4 కేజీల నీళ్ళుపోసి ఒక రాత్రి నానబెట్టి ఉదయం పొయ్యి మీద పెట్టి ఒక కేజీ కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి ఆ కషాయంలో ఒక కేజీ నువ్వుల నునే పోసి తైలం మిగిలే వరకు మళ్ళి మరగ బెట్టాలి.
తరువాత ఆ నూనెతో దీపం వెలిగించి పైన మంటతగిలేలా మట్టిముకుడు గాని, రాగి పళ్ళెం కాని పెట్టి మసి పారించాలి. తరువాత ఆ మసిని తీసి ఆవునెయ్యి కలిపితే కాటుక అవుతుంది. రోజు రాత్రి కళ్ళకు పెట్టుకుంటుంటే పొరలు, పూతలు మసకలు తగ్గిపోతాయి.

కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించే అనాసపండు

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్ధాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాసపండు 85 శాతం నీటిని కలిగి ఉంది. దీనిలో చక్కెర నిల్వలు 13 శాతం, ధాతు శక్తి 0.05 శాతం, పీచు పదార్ధం 0.35 శాతం ఉన్నాయి. పైగా విటమిన్ ఎ, బి, సిలు కూడా ఉన్నాయి.
పొట్టను తగ్గిస్తుంది:
ఈ రోజుల్లో పొట్ట పెద్ద సమస్యగా మారింది. పొట్టను తగ్గించేందుకు అనాసపండు బాగా ఉపయోగపడుతుంది. యువతీ, యువకుల నుంచీ అందరి పొట్టను తగ్గించే శక్తి ఈ అనాసపండుకి ఉంది. ఒక అనాసపండుని చిన్నచిన్న ముక్కలుగా కోసి, నాలుగు టీ స్పూన్‌ల వాము పొడి అందులో వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. తర్వాత రాత్రంతా దానిని అలాగే ఉంచి మర్నాడు ఉదయాన్నే వడకట్టి ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి.
ఇదేవిధంగా పది రోజులు వరుసగా తాగితే పొట్ట తగ్గడం మొదలవుతుంది. అనాసపండు గర్భ సంచిని ముడుచుకు పోయేలా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి గర్భిణిలు ఈ పండును దూరంగా ఉంచాలి.
పిల్లలకు ఔషధం వంటిది:
అనాసపండు పచ్చకామెర్లను నయంచేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది మూత్ర పిండాలలోని రాళ్ళను కరిగిస్తుంది. ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి మొదలైన వాటిని తగ్గిస్తుంది. పిత్తాన్ని పోగొడుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు నేత్ర దృష్టిని మెరుగు పరుస్తుంది. పిల్లలచేత తరచుగా ఈ పండు రసం తాగిస్తే ఆకలి పెరుగుతుంది. ఎముకల పెరుగుదల, శారీరక పెరుగుదల ఏర్పడతాయి.
అనాస ఆకుల రసం కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది. అనాస ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
మూత్ర పిండాల్లోని రాళ్ళను కరిగిస్తుంది:
అనాసపండు ముక్కలను తేనెలో కలిపి తింటుంటే శారీరక శక్తి పెరుగుతుంది, నిగారింపును సంతరించుకుంటుంది. అనాసపండును తరచుగా తింటుండడం వల్ల మూత్ర పిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అనాసపండు రసాన్ని రోజుకి నాలుగు సార్లు ఒక ఔన్సు మోతాదుగా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అదే రసాన్ని గొంతులో పోసుకుని కాసేపు అలాగే ఉంచుకుని మింగుతుంటే గొంతు నొప్పి, గొంతు పుండు తగ్గిపోతాయి.
జీర్ణ శక్తిని వృద్ధి చేస్తుంది:
అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. కడుపు నిండుగా ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న అనాస ముక్కను తింటే చాలు జీర్ణమైపోతుంది. దీని రసంలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉండడం వల్ల త్వరగా జీర్ణ శక్తి పెరుగుతుంది.

స్థూలకాయం-ఆహార విధానము

ఆహార నియమాలు
పొట్టలో గ్యాస్ తయారయ్యే శనగపిండి పదార్ధాలు(మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు, శనగపిండితో చేసిన తీపి పదార్ధాలు మొదలగునవి), మైదాతో తయారయ్యే మైసుర్ బజ్జీలు, మైద రొట్టెలు, మైదా పూరీలు మొదలగునవి సేవించరాదు.
ఆచరించవలసిన ఆహార ఔషధాలు
త్రిపలాదిచూర్ణం తీసుకుని పావు చెంచా నుండి ఒక చెంచా వరకు క్రమంగా పెంచుతూ తేనెతో గాని,
గోరు వెచ్చని నీటితో గాని వేడి శరీరం గలవారు మజ్జిగతో గాని సేవిస్తూ తమ బరువును తగ్గించుకోవాలి.
ఆహారసేవన విదానము
పొట్టలో అజీర్ణం కాకుండా, ఆ ఆజిర్ణము వలన గ్యాస్, మంట పుట్టకుండా ఉంచటానికి, ఆహారము సేవించేటపుడు ప్రతీ ముద్దను పదిహేను నుండి ముప్పై రెండు సార్లు బాగా నమలి మింగాలి, అలా చేయడం వలన నోటిలోని లాలాజలం గ్రంధుల నుండి లాలరసం ఉత్పన్నమయ్యి ఆహారంతో బాగా కలిపి నోటిలోనే కొంతబాగం ఆహారం జీర్ణం కావడం ప్రారంభం అవుతుంది. దీనివలన కొత్తగా కొవ్వు పెరుగకపోగా అప్పటికే పెరిగి ఉన్న కొవ్వు కుడా క్రమంగా తగ్గుతుంది.
అనవసర కొవ్వుకు-ఔషద తైలం
త్రిపలాద్యతైలంను తీసుకుని దానిని రెండు పుటలా స్నానానికి గంట ముందు గోరువెచ్చగా కొవ్వు పెరిగిన అవయవాలుపై మర్దన చేస్తూ ఉంటె క్రమంగా అధిక కొవ్వు హరించిపోతుంది.

జుట్టు రాలకుండా ఉండాలంటే.....

మృదువైన శిరోజాల కోసం ఈ చిట్కాలు పాటించండి. మన వంటింట్లో ఉండే మెంతులు మన శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తాయి.
జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను నివారించడానికి పావు కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి, ఉదయాన్నే పెరుగుతో సహా రుబ్బుకుని తలకు పూతలా వేసుకుని అరగంట తర్వాత తలారా స్నానం చేయాలి. దీనివల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలను చాలావరకూ తగ్గించవచ్చు.
అలాగే తలలో ఏవైనా ఇన్‌ఫెక్షన్లు ఉంటే అలాంటి వాటిని తగ్గించడానికి తలకు వేప నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలకు వేపాకును మెత్తగా నూరి పట్టించినా కూడా సమస్యను నివారించవచ్చు. గోరింటాకును ఇలా వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
అలాకాకున్నా వేపాకుల్ని గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి, ఆ నీటితో తలను కడుక్కున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అరటిపండు గుజ్జును తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జును కూడా ఇలా తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు. ఇంకా తలస్నానం చేసేముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి తలకు రుద్దుకుని మర్దనా చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తలకు బాగా రక్తప్రసరణ జరిగి జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి.

స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా?


ఉరుకుల పరుగుల జీవన విధానం వల్ల ఇప్పుడు ఎక్కువ శాతం మందిలో స్థూలకాయం పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి అన్వేషణ పెరిగింది. అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నప్పుడు మొదట వినపడే మాట, 'మొలకలు తినండి' అనే! ఆ తరువాత పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు... వగైరా వగైరా. మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి. కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు ఆరోగ్యకరమే! కానీ, ఏ విధంగానో తెలుసుకోవాలిగా! మొలకలు పోషకాహారంగా ఎల్లప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ముల్లంగి, ఆల్ఫాల్ఫా, క్లోవర్, సోయాగింజలు, బ్రఖోలి అద్భుతమైన మాంసకృతులను కల్గి విస్తృత శ్రేణిలో వివిధ పోషకాహారాలతో చక్కటి ఆరోగ్యాన్ని కల్గించడానికి సహాయపడతాయి. మొలకల వల్ల అత్యవసర వైద్యసంబంధ లాభాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మొలకలు మనల్ని కొన్ని రకాల వ్యాధుల నుండి కాపాడే సామర్థ్యం కల్గి ఉన్నాయని కనుగొన్నారు. మొలకలు తిన్నందు వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు క్రింద తెలపబడ్డాయి: సమృద్ధిగా అత్యవసర పోషకాలు: మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు, మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. ఎంజైముల అద్భుతమైన మూలాలు: మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి. అధిక మాంసకృతులు: మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు. నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది. ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి. తేలికగా జీర్ణమౌతాయి: మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఉత్తమమైనవి. బరువు తగ్గడానికి ఎంతో మంచివి: మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో ఉండి, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించుకొనే ప్రణాళికకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహార ప్రణాళికలో మొలకలను జత చేయండి. మొలకల్లో కొవ్వు వుండదు. ప్రోటీన్లకు మొలకలు పెట్టింది పేరు. సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు తయారు చేసుకోవడానికి మార్గాలే! గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. ఫైబర్‌, ఐరన్‌, నియాసిన్‌, కేల్షియమ్‌ -ఇవన్నీ మొలకల్లో పుష్కలం. శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి. కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది. మొలకల్లో లభ్యమయ్యే విటమిన్‌ బి, డి శరీరానికి చాలా అవసరం. ఇందులోని ఫాస్పరస్‌ పళ్లకు, ఎముకలకు ఉపయోగ పడుతుంది.

Friday, May 2, 2014

తెల్ల జుట్టు

1) వెల్లుల్లి పొట్టు -10 g ,ఆలివ్ నునే -100 ml వెల్లుల్లి పొట్టు ను బూడిద చేసి ఆలివ్ నూనెలో కలిపి 10 రోజులు ఉంచాలి .తరువాత రాత్రి పూట తలకు నూనె రాసుకొని ఉదయం తల స్నానం చెయ్యాలి.
2) బోడతరం తైలం ¼ spoon సేవిస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారును .
3) చిన్న పిల్లల్లో వెంట్రుకలు తెల్లగా మారడాన్ని బాలనెరుపు అంటారు . ఇది తగ్గడానికి తేనే,నెయ్యి,పాలు,గోమూత్రం కలిపి రోజు రెండు పూటలు త్రాగాలి
4) బోడతరం కషాయం 100 ml ,నువ్వుల నునే 100ml చిన్న మంటమీద తైలం చెయ్యాలి .దీనిని గోరఖ్ నాద్ తైలం అంటారు .ఈ తైలం ను 3 చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేయాలి.మరియు భోజనానికి గంట ముందు spoon తైలం సేవించాలి
5) తిప్పతీగ,ఉసిరి,పల్లేరుకాయలు సమానంగా చూర్ణం చేసి spoon పొడిని spoon తేనే కలిపి తినాలి.
6) కామంచి ఆకురసం ,గుంటగలగర రసం సమానంగా కలిపి తలకు రాయాలి .తరువాత స్నానం చెయ్యాలి .ఇలా 15 రోజులు చెయ్యాలి
7) బోడతరం పూల చూర్ణం ,spoon తేనే లో కలిపి రోజు సేవించాలి
8) త్రిఫల చూర్ణం ,నీలి ఆకుల చూర్ణం, లోహ చూర్ణం, గుంటగలగర చూర్ణం ఈ నాల్గింటిని గొర్రె మూత్రం లో నానబెట్టి తలకు రాయాలి .ఇది గొప్ప అనుభవం. దీనిని కేసరంజక చూర్ణం అంటారు.

బట్టతల


బూరుగు చెట్టు జిగురు ,నేలతాడి దుంపలు ,తామర గింజలు అన్నిటిని గుజ్జు చేసి బట్టతల ఫై రాయాలి
జటామాంసి-100 g ,పుష్కరమూలం-100g ,నల్లనువ్వులు-100g ,సుగందపాల వేర్లు-100 g ,తామర గింజలు 100g కొద్దిగా నీరు కలిపి గుజ్జుగా చేయాలి దీనిలో నెయ్యి 500 g కలిపి దీనిని తలకు పట్టించాలి
అతిమధురం 20 g ,చెంగల్వ కోష్టు-20g ,సారపప్పు-20g,మినపప్పు-20 g ,తెల్ల గురివిందలు-20 g ,సైందవలవణం-20 g,అన్నిటిని చూర్ణం చేసి దీనిలో కొబ్బరి పాలు వేసి గుజ్జు చేసి బట్టతలకు రాయాలి
కలబంద రసం లో జీలకర్ర,పసుపు కలిపి 90 రోజులు సేవిస్తే బట్టతలఫై జుత్తు వచ్చును
మర్రి ఊడలు-50g,జటామాంసి 50g నూరి పేస్టు చేసి బట్టతల ఫై రాయాలి
ఉసిరి,నల్ల నువ్వులు,పల్లేరుకాయలు నూరి లేపనంగా రాయాలి
బట్టతల ఫై ముల్లంగి ముక్కతో రుద్దితే మళ్ళి వెంట్రుకలు వస్తాయి
అతిమడురం 20g, చెంగల్వ కోస్టు 20g,సారపప్పు 20g, మినపప్పు 20g ,తెల్లగురివిందలు 20g, సైందవ లవణం 20g, దీనిలో కొబ్బరి పాలు కలిపి మెత్తగా గుజ్జు చేసి రాత్రి పూట తలకు మర్దన చెయ్యాలి
మర్రి ఊడలు 50g, జటామాంసి 50g, నూరి తలకు రాయాలి
ఉసిరి, నల్లనువ్వులు, పల్లేరు కాయలు నూరి తలకు రాయాలి 2 గంటలు తరువాత కడగాలి.100రోజులు చెయ్యాలి

అశ్వగంధ

శుద్ధి చేసే విదానం : వేరును పాలతో మరిగించి తరువాత ఎండబెట్టాలి . ఇలా 7 సార్లు చేయాలి .
తగ్గించే వ్యాధులు :
1) బరువు తగ్గుట: 3 రోజులకు ఒకసారి spoon చొప్పున ఆకుల రసం ఉదయం పరగడుపున తీసుకోవాలి .ఇలా 15 సార్లు పాటిస్తే అధిక బరువు తగ్గును.
2) మానసిక వత్తిడి : వేరు పొడిని spoon చొప్పున పాలతో 40 రోజులు రెండు పూటలు తీసుకోవాలి .
3) గర్బసంచి శుభ్రపరుచును : వేరు పొడిని రెండు పూటలు పాలతో 40 రోజులు తీసుకొంటే స్త్రీలకూ గర్భసంచి శుభ్రం అగును.
4) తెల్లరక్త కణాలను పెంచును : శుద్ధి చేసిన అశ్వగంధ వేరు పొడిని రెండు పూటలు పాలతో 120 రోజులు తీసుకొంటే తెల్లరక్త కణాలు పెరుగును .
5) కాన్సర్ తగ్గించును : శుద్దిచేసిన వేరు పొడిని నిత్యం పాలతో తీసుకొంటే cancer తగ్గుతుంది .మరియు రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
6) high BP తగ్గించును : వేరు పొడి-100 గ్రాములు మరియు మిరియాలు -50 గ్రాములు రెండిటిని పొడి చేసి రెండు పూటలు నీటితో సేవిస్తే high BP తగ్గును.
7) క్షయ వ్యాధి తగ్గును : అశ్వగంధ వేరు పొడి,పిప్పళ్ళు ,పటిక పంచదార మూడింటిని సమానంగా కలిపి తేనెతో రెండు పూటలు తినాలి .
8) సెగగడ్డలు తగ్గడానికి : ఆకులను నూరి సెగగడ్డలు ఫై రాస్తే తగ్గుతుంది .

సుగందపాల

రసాయనాలు: హెమిడేస్మాల్,హేమిడేస్టిరాల్,రెసిన్,సపోనిన్
1) రక్త శుద్ధి కోసం : వేరు పొడిని నీటితో 40 రోజులు సేవిస్తే రక్తశుద్ది జరుగును.
2) high BP : వేరు పొడిని నీటితో సేవించాలి .
3) మూత్ర నాళ సమస్యలను తగ్గించును:వేరు పొడి నీటితో 40 రోజులు సేవిస్తే మూత్ర నాళ సమస్యలు తగ్గును
4) వాత నొప్పులు తగ్గును: వేరు పొడిని నీటితో 40 రోజులు సేవిస్తే శరీరానికి వచ్చే అన్ని రకాల వాత నొప్పులు తగ్గును.