Saturday, March 29, 2014

త్రిఫల చూర్ణం ఉపయోగాలు

ఉపయోగాలు:
1. కళ్లకు, చేర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
2. జుట్టును త్వరగా తెల్లగా అవనివదు అలాగే జుట్టును బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
3. ముసలితనం త్వరగా రనివదు.
4. జ్ఞాపకశక్తిని బాగా వృది చేస్తుంది.
5. ఎర్ర రక్త కణాలను బాగా వృది చేస్తుంది.
6. ఇమ్మ్యూనిటి నీ బాగా శక్తివంతం చేస్తుంది.
7. ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
8. అసిడిటీ నీ తగ్గిస్తుంది.
9. ఆకలిని బాగా పెంచుతుంది.
10. యురినరి ట్రాక్ట్ ప్రొబ్లెమ్స్ నుంచి బాగా కాపాడుతుంది.
11. సంతాన సామర్ద్యాన్ని బాగా పెంచుతుంది.
12. శ్వాస కొస సంబందమైన ప్రొబ్లెమ్స్ రావు.ఒక వేల ఉన్నాకూడా కంట్రోల్ లో ఉంటాయి.
13. లీవర్ నీ చాల ఆరోగ్యంగా ఉంచుతుంది.
14. సరిరంలోని తొక్షిన్స్ నీ ఎలిమినేట్ చేస్తుంది.
15. కోలన్ నీ క్లీన్ గ ఉంచి కోలన్ కీ ఏమి వ్యాదులు రాకుండా రక్షిస్తుంది.
16. రక్తాన్ని సుద్ది చేస్తుంది.
17. మేతబోలిసం రేట్ నీ పెంచుతుంది.
18. అదిక బరువుని అరికడుతుంది.
19. శరీరంలోని లోని చెడు పదార్దాలను బయటకు పంపిస్తుంది.
20. కోలన్ నూ బాగా శుబ్రంగా ఉంచుతుంది అంటే కాకుండా కోలన్ కు సంబందించిన రోగాలు రాకుండా కాపాడుతుంది.
21. రక్తాన్ని సుద్దిచేస్తుంది.
22. మేతబోలిసం రేట్ నీ బాగా పెంచుతుంది.
23. అదిక బరువును అరికడుతుంది
24. శరీరంలోని బాక్టీరియా నీ వృద్ది కాకుండా ఆపుతుంది.
25. కాన్సర్ నీ కూడా నీరోదిస్తుంది.
26. కాన్సర్ సెల్స్ పెరగకుండా కాపాడుతుంది.
27. బీపీ నీ అదుపులో ఉంచుతుంది.
28. ఎలర్జీ నీ అదుపులో ఉంచుతుంది.
29. సీరుం కొలెస్ట్రాల్ నీ బాగా తగ్గిస్తుంది.
30. చక్కగా వీరోచనం అయేలా చేస్తుంది.
31. హ్ఐ వీ నీ కూడా నీరోదిన్చాగల శక్తీ త్రిఫల చుర్నంకి ఉంది.
32. నెత్త్రవ్యదులని నీరోదించే శక్తి త్రిఫలకు ఉంది.
33. గర్బవతులు ఈ త్రిఫల చూర్ణం వాడకూడదు.

అనాస పండుతో ఆరోగ్యం:-


1.అనాసపండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాసపండు. ఈ పండును తింటే శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది
2.పండిన అనాస పండు తింటూంటే పళ్ళనుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
3.జ్వరం, కామెర్లవంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాసరసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్‌ కారకమయిన పదార్థాలు తయారు కాకుండా, పేరుకుపోకుండా రక్షణనిస్తాయంటున్నారు వైద్యులు.
4.ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.
అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
5.గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారణ అవుతాయి
6.పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్తాయి.
7.పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
1.అనాసపండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న పండు అనాసపండు. ఈ పండును తింటే శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది
2.పండిన అనాస పండు తింటూంటే పళ్ళనుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
3.జ్వరం, కామెర్లవంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాసరసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్‌ కారకమయిన పదార్థాలు తయారు కాకుండా, పేరుకుపోకుండా రక్షణనిస్తాయంటున్నారు వైద్యులు.
4.ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.
అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
5.గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారణ అవుతాయి
6.పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్తాయి.
7.పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.

Wednesday, March 19, 2014

మొక్క జొన్నతో ఆరోగ్యం:-


1.మొక్క జొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణక్రీయను పెంపొందిస్తుంది.

2.మొక్క జొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.
3.మొక్క జొన్నలో కావాలసినన్ని లవణాలు లేదా మినరల్స్ ఉంటాయి. పసుపు రంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అదికం, మెగ్నిషియం, ఐరన్, కాఫర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో వుండి ఎమకులు గట్టిపడేలా చేస్తాయి
4.మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సంరంక్షణ : మొక్క జొన్నలో యాంటీ ఆక్సిడెంట్లువుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
5. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే దీనిలో వుండే లినోలె యాసీడ్ చర్మ మంటలను, లేదా ర్యాష్లను కూడా తగ్గిస్తుంది. రక్తహీనతను అరికడతాయి: రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది, మిరి మీరు తినే స్వీట్ మొక్కజొన్న విటమిన్ ల మరియు పోలిక్ యాసిడ్ లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.
6.గర్భవతులకు ఈ ఆహారం ప్రధానం గర్బవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి వుండాలి. దీనిలో వుండే పోలిక్ యాసిడ్ గర్బవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్లు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. పోలిక్ యాసీడ్ తగ్గితే అది బేబీ బరువును తక్కవ చేస్తుంది. కనుక మొక్క జొన్న తింటే తల్లికీ, బిడ్డకు కూడా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

Tuesday, March 4, 2014

జామాకుల టీ ని త్రాగండి అధిక బరువుని తగ్గించుకోండి:-

అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే అని చిరాకు పడుతున్నారా? డైటింగ్ చేద్దామనే తొక్కలో ఆలోచనలో పడ్డారా? తిండి తిప్పలు మానేసి రోగిష్టి బ్రతుకు బ్రతికే కంటే , కేలరీలు , విటమిన్ లు మీ చేతులారా వదిలేసుకోమాకండి. అయితే, సులువైన పద్దతులని పాటించి మంచి బలంగా, ఆరోగ్యం గా, నిత్య యవ్వనం గా, నవ్వుతూ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి.
అయితే చిన్న చిట్కా వైద్యం మీ పెరటు లోనే ఉంది. అదేమిటంటే జామ చెట్టు. ఒక వేళ మీ పెరటులోనే జామ చెట్టు ఉంటే ఇక ఎలాగెలో బరువు తగ్గడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ ని దూరం గా తరిమి తరిమి కొట్టవచ్చు.
* గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీ ని సేవించడం ద్వారా బోలెడు బోలెడు మంచి ఫలితాలు ఉంటాయి.
* ఈ టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
*శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు.
* జామాకుల టీ ని త్రాగితే శ్వాస సంబందిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
*జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి....నోటి పూత కూడా తగ్గుతుంది.
*ఇందులో ఉండే యాంటి యాక్షిడెంట్లు నొప్పులు, వాపులు నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి.
*కాబట్టి కాస్త వగరుగా ఉన్నా వారానికి ఒక్క సారి కనీసం త్రాగండి. మీ జీవితాలను సుఖమయం చేసుకోండి

కంటికి మేలు (యోగా): Useful info: Read completely

సర్వేంవూదియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కళ్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ సూక్తిని బట్టి మనకు అర్థం అవుతుంది. మారిన జీవన విధానంతో ... ఇంట్లో ఉన్నప్పుడు టీవీ ముందో, ఆఫీస్‌లో కంప్యూటర్ ముందో ఎక్కువ సేపు కూర్చోవడం తప్పనిసరి అవుతున్నది. పెద్దల మాట అటుంచితే... పిల్లలు ఆడుకోవడం కూడా కంప్యూటర్స్‌తోనే కావడంతో... కళ్లు విపరీతమైన అలసటకు గురవుతున్నాయి. టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌లను రెప్పవేయకుండా చూడటం వల్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. అయితే... కొన్ని యోగా ప్రక్రియల ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.
త్రాటక క్రియ
పద్మాసనంలోకానీ, వజ్రాసనంలోకానీ ధ్యానం చేసే విధంగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్లకు సమానమైన ఎత్తులో కొద్ది దూరంలో దీపం లేదా క్యాండిల్ ఉంచాలి. కళ్లు రెప్పవేయకుండా క్యాండిల్ వైపు చూడాలి. (పూర్వం / ఇప్పుడు మనం వెలిగించే కార్తీక దీపాల వెనుక ఈ ఉద్దేశ్యం ఉందేమో... ) కళ్లు మండటం లేదా నీళ్లు వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండాలి. కన్నీరు ఒకసారి కారిన తరువాత నెమ్మదిగా కళ్లు మూసుకుని కొద్దిసమయం పడుకోవాలి.

ఉపయోగాలు :
- కన్నీటి గ్రంథులు జాగృతం అవుతాయి.
- దృష్టి లోపాలు సరి అవుతాయి.
- ఏకాక్షిగత పెరుగుతుంది.
- మెడి పనిచేసి మనసును శాంతపరుస్తుంది.
- మానసిక నిగ్రహం అలవడుతుంది.
జాగ్రత్తలు :
- ముందు పది సెక్లతో మొదలుపెట్టాలి.
- ఇది చేసిన తరువాత తప్పక రిలాక్స్ అవ్వాలి. లేకపోతే తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
- ఎక్కువగా టీవీ చూడటం లేదా కంప్యూటర్ వాడకం వల్ల వచ్చే రెప్పలు వాల్చడం బాగా తగ్గుతుంది.
1. వజ్రాసనంలో నిటారుగా కూర్చొని రెండు చేతులను ఇరువైపులకు చాపాలి. పిడికిలి బిగించి, బొటనవేలును మాత్రమే పైకి లేపాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని .. శ్వాస వదులుతూ మెడ ఏమాత్రం కదలకుండా కళ్లను మాత్రమే కదిల్చి కుడి బొటనవేలివైపు చూడాలి. ఐదు సెకన్లపాటు ఉంచి, తిరిగి కళ్లను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు ఎడమవైపు, ఐదుసార్లు కుడివైపు చేయాలి.
2. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు పిడికిలి బిగించి బొటన వేలు ఎత్తి ఎడమ చేతిని ముఖానికి ఎదురుగా, కుడి చేతిని భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. ఇప్పుడు ముందుకు తెచ్చిన ఎడమచేతి బొటనవేలు వైపు చూడాలి. ఐదు సెక్లపాటు ఉంచి, తిరిగి కళ్లు యథాస్థానానికి తీసుకురావాలి. ఐదు సార్లు చేయాలి. ఇదేవిధంగా కుడిచేతితోనూ చేయాలి.
3. ముందుకు కాళ్లు చాచి నిటారుగా కూర్చోవాలి. ఎడమ చేతిని, ఎడమ తొడపై ఉంచి కుడిచేతిని 45 డిగ్రీల కోణంలో చాచి, పిడికిలి బిగించి బొటనవేలును పైకి ఎత్తాలి. ఇప్పుడు మెడ కదిలించకుండా కళ్లను మాత్రమే కదిలిస్తూ కుడిచేతి బొటనవేలుని చూడాలి. ఐదు సెకన్లు చూసిన తరువాత తిరిగి కళ్లను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు చేయాలి. ఎడమవైపు కూడా ఇదే పద్ధతిలో చేయాలి.
పామింగ్
సూర్యోదయం సమయంలో కానీ, సూర్యాస్తమం సమయంలో లేత ఎండలో సూర్యునికి ఎదురుగా నిల్చొని కొన్ని సెకన్లపాటు సూర్యున్ని చూడాలి. తరువాత రెండు చేతులను కొద్దిగా రబ్ చేసి.. కళ్లమీద మసాజ్‌లాగా చేయాలి. ఇలా చేయడంవల్ల కంటిచుట్టూ ఉన్న నరాలమీద ఒత్తిడి పెరిగి కంటి చూపు స్థిరంగా ఉంటుంది.

Monday, March 3, 2014

మూత్రపిండాల్లో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి, చికిత్స


మన మూత్రపిండాలు శరీరంలో ప్రవహిస్తున్న రక్తాన్ని శుద్ధం చేసి రక్తంలో ఉన్న వ్యర్ధాలను వేరు చేసి మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు పంపుతాయి. ఈ రక్తం లోని వ్యర్ధాలను మూత్రపిండాలలోకి చేర్చినప్పుడు ఉప్పు తో కూడిన వ్యర్ధాలు, మరియు ఇతర ఖనిజములు కలిగిన పదార్ధాలు కూడా మూత్రపిండాల్లో చేరుతాయి.
ఈ పదార్ధాలు పూర్తిగా మూత్రం ద్వారా బయటకు రాక కొద్ది కొద్దిగా మూత్రపిండాల్లో నిలువ ఉండి కొన్నాళ్ళకు రాళ్ళ రూపం దాల్చుతాయి. అందుకే ఎక్కువగా నీళ్ళు త్రాగమని డాక్టర్లు, పెద్దవారు చెబుతుంటారు. ఎక్కువ నీరు త్రాగితే ఈ నీరు కూడా కొంత భాగం మూత్ర పిండాల్లో చెరీ ఈ ఘన పదార్ధాలను మూత్రపిండాల్లో ఎక్కువ పేరుకు పోకుండా చేస్తుంది.
ఎప్పుడైతే మూత్రపిండాల్లో చేరిన ఈ రాళ్ళు పగిలిపోయి చిన్న చిన్న పంచదార గుళికల ఆకారంలో మారి మూత్రపు తిత్తి తో కలుపబడే సన్నటి నాళాళ్ళో ప్రవేశిస్తాయో ఆ సమయంలో విపరీతమైన నొప్పి బాధ కలుగుతుంది. ఈ రాళ్ళు మూత్ర పిండాల నుండి మూత్ర నాళాళ్ళోకి ప్రవేశించే సమయంలో విపరీతమైన నొప్పి, తరచూ మూత్రవిసర్జన జరగడం, మూత్రంలో రక్తం రావడం, వాంతులు అవ్వడం వంటివి సంభవిస్తాయి.
మీ కడుపులో కానీ, నడుములో కానీ అకస్మాత్తుగా నొప్పి అనిపిస్తే తగిన పరీక్షల కోసం వైద్యుడిని సంప్రదించడం అవసరం. మరో విషయం ఏమిటంటే కిడ్నీ రాళ్ళు ముందుగా గుర్తించడం జరుగదు. ఒక్కసారి నొప్పి అనిపించిన తరువాతనే వీటిని పరీక్షించి నిర్ధారించడం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సి‌టి స్కాన్, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్ వంటి పరీక్షల ద్వారా మూత్రపిండాల్లో రాళ్ళను గుర్తించవచ్చు.
ఒక వేళ మూత్రపిండాల్లో రాళ్ళు ప్రారంభదశలో ఉండి చిన్నవిగా ఉంటే వైద్యులు రోజుకు 10 గ్రాసుల నీళ్ళు త్రాగి, రాళ్ళు సహజంగా శరీరంనుండి బయటకు వెళ్ళేవరకూ వేచి ఉండాలని సూచిస్తారు. ఒకవేళ రాళ్ళు పెద్దవిగా ఉండి మూత్రం ద్వారా బయటకు రాలేని పరిస్తితి అయితే డాక్టర్లు తగిన పర్యాయ చికిత్సా మార్గాలను సూచిస్తారు.
మూత్ర నాళాలను సరళించి రాళ్ళను సులభంగా బయటకు పంపేందుకు దోహదపడే అనేక మందులు లభ్యం అవుతున్నాయి. వైద్యులు వీటిని ముందుగా వాడేందుకు సలహా ఇస్తారు.
పెద్ద రాళ్ళను పగులగొట్టి చిన్న ముక్కలుగా చేసేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రధానంగా శక్తి తో కూడిన షాక్ వెవ్స్ ను పంపి రాళ్ళను పగులగొట్టేపద్ధతి. దీని వలన రాళ్ళు చిన్నవిగా పగిలి సునాయాసంగా బయటకు వస్తాయి. ఈ పద్ధతిలో అయినా రాళ్ళు బయటకు వచ్చేటప్పుడు నొప్పి కలుగుతుంది. ఒక వేళ రాయి మూత్రపిండం నుండి బయటకు వచ్చి మూత్ర నాళాళ్ళో ఇరుక్కుంటే అటువంటి పరిస్థితిలో యుటెరోస్కొపీ అనే పద్ధతి ద్వారా ఓ చిన్న ట్యూబు ను మూత్ర నాలంలోనికి పంపి రాయిని చిన్న ముక్కలుగా చేసి బయటకు తీస్తారు. ఇక ఈ పద్ధతులద్వారా బయటకు రాని రాళ్ళను ఆపరేషన్ చేసి తొలగించటమే మార్గం.
మూత్రపిండల్లో రాళ్ళు కలగేందుకు కారణాలు:
ప్రధానంగా మూత్రపిండాల్లో రాళ్ళు మనం తినే, త్రాగే పదార్ధాలను బట్టి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతారు.
చాలా తక్కువ నీళ్ళు త్రాగే వారిలో కూడా ఈ రాళ్ళు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలానే అధిక ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్ధాలు తినడం. అంటే చాక్లెట్లు, అధిక కాల్షియం ఉన్న ఆకుకూరలు తిన్నా కొందరిలో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.
కాగా మగవారిలో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశాలు అధికం. మగవాళ్ళలో 40 సంవత్సరాల వయస్సులో ఈ రాళ్ళు ఏర్పడితే, అదే స్త్రీలలో 50 సంవత్సరాల వయసులో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. వంశపారపర్యంగా మూత్ర పిండాల్లో రాళ్ళు మనకు వచ్చే అవకాశం ఉంది. అలానే అధిక బరువు పెరగడం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు కలగడం మూలంగా కూడా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. అదే విధంగా ఎడారి ప్రాంతాల్లో నివసించే వారు అతి తక్కువ నీరు త్రాగడం, వేడి వాతావరణంలో ఉండటం మూలంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఆహారంలో ఉప్పు, సోడియం శాతం ను తక్కువతీసుకుంటే ఈ రాళ్లబారి నుండి తప్పించుకోవచ్చని వైద్యులు తెలుపుతారు. అలానే చాక్లెట్, కాఫీ, చిక్కుళ్ళు, కమలా పండ్లు, బంగాళా దుంపలు వంటి పదార్ధాలు తీసుకోకూడదు. అలానే కాల్షియం మెండుగా ఉన్న ఆహార పదార్ధాలను కూడా తీసుకోవడం మానివేయాలి.