Saturday, July 9, 2016

సునాముఖి


మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉప యోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి. దీని శాస్త్రయనామం కాసియా అంగుష్టిఫోలియా. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలస్ధానం మధ్య ఆఫ్రికా అటవీ ప్రాంతాలు, అరబ్‌ దేశాలు. కానీ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు సునాముఖికి పట్టుకొమ్మలని చెప్పవచ్చు. ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్‌ సెన్నా, టిన్నెర్‌వెల్లీ సెన్నా అనీ, హిందీలో సనాయె, సనాకపట్‌ అనీ, కన్నడలో నెలవరికె, సోనాముఖి అనీ, మళయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అనీ, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అనీ, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అనీ, సంస్కృతంలో స్వర్ణపత్రి అనీ, గుజరాతీలో నట్‌ కి సానా అనీ వ్యవహరిస్తారు. ఇది చాలా చిన్నగా పొదలా పెరిగే మొక్క. దీని ఎత్తు సమారుగు 2 నుంచి 3 అడుగులుండి, సన్నని ఆకుపచ్చని కాండంతో ప్రతి పాయకీ 4-5 జతల ఆకులతో దట్టంగా రెమ్మలు విస్తరించినట్టు పెరుగుతుం ది. సునాముఖి పువ్వులు చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. పొడవుగా ఎదిగే కాడతో 6-7 విత్త నాలు ముదురు కాఫీ రంగులో ఉంటాయి. సునా ముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారుచేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో యిన్‌ఫెక్షన్స్‌ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తు ల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకీ, అలాగే ఊపిరి తిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికీ, కీళ్ళనొపðలకీ, ఉబ్బసవ్యాధికి, ఆయు ర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడు తున్నారు. షట్షాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరం గా సునాముఖితో తయారుచేయబడు తున్నవే. అంతే కాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగా లని కూడా అరికడుతుంది. సునాముఖి వేరు నుండి తయారు చేయబ డిన ఔష ధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందిం చడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాల లోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక దీనిని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు సాగుచేస్తున్నారు. ఇది సాధారణంగా ఎర్రమట్టి నేలల్లో, ఓండ్రుమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. పత్తి పండే నేలల్లో దీని దిగుబడి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. సునాముఖి ఆకుల్లో డయాన్‌త్రోన్‌ డైగ్లుకోసైడ్‌ అనబడే కొత్త గ్లైకో సైడ్‌ అలోవెూడిన్‌ కనుగొన్నారు. దీని కాయలలో రేయిన్‌, క్రైసోఫానిక యాసిడ్‌ల ఆంత్రాసిన్‌ గ్లైకోసైడ్‌, సైన్నోసైడ్‌ ఏ.బిలు లభ్య మవుతాయి. బీజదళాల్లో క్రిసోఫనోల్‌, పైసియాన్‌, అలో ఎవెూడిరియిన్‌, రీయామ్‌ ఎవెూడిన్‌లు, ఆకులు, విత్తనాలలో పెన్నోసైడ్‌ కాల్షియం, లభ్యమవుతు న్నట్టు శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు. అయినప్పటికీ దీనిలో లభ్య మయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడ్‌ ఎ,బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి. సునాముఖీ మొక్కల్ని గుజరాత్‌లో సముద్రతీర ప్రాంతంలో విస్తా రంగా పెంచుతున్నారు. ఇతర పంటలతో పాటు దీనిని కూడా పెంచుతూ కొందరు రైతులు ఆదాయాన్ని పొందుతు న్నారు. సునాముఖి ఆకులు గృహవైద్య చిట్కాల్లో కూడా విని యోగించడం ఆంధ్రప్రదేశ్‌లో చాలా మందికి పూర్వం నుండీ వాడుకగా ఉన్న విషయం అందరికీ తెలిసినదే. సునాముఖి ఆకు ల్ని కొబ్బరినూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ వుంటే, కేశాలు ఒత్తుగా పెరిగి, దృఢంగా ఉంటాయి. జుట్టురాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్యసాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖస్థానం ఉందని చెప్పవచ్చు.

హనుమంతుని ఫలం ఔషధ గుణాలు

హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. [3]. తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి ఒక నెల వరకూ హనుమంతుని ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు [4]. కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు హనుమంతుని ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది. తలలో పేలకు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.
కేన్సర్ కు వాడే విధానం
కేన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి

Thursday, June 16, 2016

క్యాన్సర్ కు అద్భుత ఔషధం నిమ్మకాయ

క్యాన్సర్ అని నిర్ధారణ అయిందంటే ఇక 'ప్రాణం క్యాన్సల్' అనే భావన ఉంది. క్యాన్సర్ వ్యాధి ఏ మాత్రం ముదిరినా బ్రతకటం కష్టం. ముదరకముందే నిర్ధారణ జరిగి తగిన చికిత్స లభిస్తేనే బ్రతికే అవకాశముంది. చికిత్సలో కీమోథెరపీ ముఖ్యమైనది. ఈ కీమోథెరపీ కంటే 10వేల రెట్లు గుణాన్ని నిమ్మకాయ ఇస్తుందని వైద్య పరిశోధనలలో తేలింది. నమ్మశక్యం గాకున్నా నిమ్మకాయ ద్వారా క్యాన్సరు నయమవుతుందనేది సత్యం. నిమ్మరసం కలిపిన నీరు త్రాగితే చాలు, క్యాన్సరుకు దూరంగా ఉండవచ్చు. క్యాన్సరు వ్యాధిగ్రస్తులకు కూడా నిమ్మరసం ద్వారా వ్యాధి నయం చేయవచ్చు. ఈ వ్యాస అనువాదకర్త యొక్క బంధువుకు వరంగల్ ఎం.జి.ఎం.ఆసుపత్రిలో తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది. చికిత్స విజయవంతమై రోగి బాగయినాడు. శస్త్రచికిత్స చేసిన డాక్టరు "ఈ పేషంటుకు క్యాన్సరు కూడా ఉంది. దానికి కూడా శస్త్రచికిత్స త్వరలో చేయించుకోమని, లేకుంటే ఏడాదికంటే ఎక్కువకాలం బ్రతకడని" రోగి బంధువు (వ్యాసకర్తతో) తో చెప్పాడు. ఆ బంధువు ఈ వార్తను ఎవరికీ చెప్పలేదు. ఇది జరిగి 25 సంవత్సరాలయింది. ఆ రోగి ఒక వ్యవసాయదారుడు. అతను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకు (రోగికి) యుక్త వయసు నుండే ప్రతి నిత్యం నిమ్మకాయ ముక్కను చప్పరించే అలవాటు ఉందని తెలిసింది. ఇంట్లో నిమ్మచెట్లు, కాయలు ఏడాది పొడవునా లభిస్తాయి. ఇప్పుడా వ్యక్తికి 75 ఏళ్ల వయసు. చక్కటి ఆరోగ్యంతో ఇంకా వ్యవసాయ పనులు చేస్తూనే ఉన్నాడు. నిమ్మకాయ ఆయనను బ్రతికించిందని డాక్టర్లతో సహా చాలామంది చెపుతున్నారు.
నిమ్మకాయను, నిమ్మరసాన్ని ఏ రకంగా వాడినా అద్భుతమైన ప్రయోజనం కలిగిస్తున్నాయి. నిమ్మకాయను లేదా పండు నుండి 2-3 నిమ్మ తొనలను (Thin slices) తాగే నీళ్ళలో వేసుకొని ఆ నీటిని దినమంతా త్రాగడం అలవాటు చేసుకోవచ్చు. లేదా ఒక నిమ్మకాయ రసం ఓ బిందెడు నీళ్ళలో కలుపుకొని రోజూ త్రాగటం అలవాటు చేసుకోవచ్చు. ఇది క్యాన్సరును అద్భుతంగా నిరోధిస్తుంది. కీమోథెరపీ కంటే పదివేల రెట్లు శక్తివంతమైన ఔషధమిది. దీనివల్ల శరీరంపై ఇతర దుష్ప్రభావాలు (Side Effects) ఏవీ ఉండవు. ఇప్పుడు క్యాన్సరు చికిత్స శరీరంపై ఎన్నెన్నో దుష్ప్రభావాలను కల్గించడం అందరికీ తెలుసు.
నిమ్మకాయ గుణాన్ని ప్రపంచంలోని అత్యంత పెద్ద ఔషధ కంపెనీ (Institute of Health Sciences, 819, N.L.I.C., Cause Street, Baltimore, Md 1201) నిర్ధారించింది. ఈ ఔషధ కంపెనీ వారు 1970 నుండి పరిశోధనలు జరుపుతున్నారు. After more than 20 Laboratory tests జరిపిన పిదప వారీ నిర్ధారణకు వచ్చారు. క్రింది ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
It destroys the malignant cells in 12 Cancers including Colon, Breast, Prostate, Lung and Pancreas. The Compounds of this tree showed 10,000 times better than the product Adriamycin, a drug normally used Chemotherapeutic in the world, slowing the growth of Cancer cells. And what is even more astonishing : This type of therapy with lemon extract only destroys malignant cancer cells and it does not affect healthy cells.
ఇదీ పై ఔషధ కంపెనీవారి నిర్ధారణ. మనం మన తోటివారికి దీని తెలియచేయటం ద్వారా క్యాన్సరు వ్యాధి రహిత ప్రపంచాన్ని నిర్మాణం చేద్దాం.

జలుబుకు తులసి ఆకుల టీ


'జలుబు తగ్గేందుకు మందులు వాడితే వారం, వాడకపోతే ఏడు రోజులు పడుతుంది' అంటారు. ఇది సరదాగా అనే వాడుక మాట. మామూలుగా జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాదు. గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఇలా టీ పెట్టుకుని, తరచుగా తాగుతూ ఉంటే, మంచి ఉపశమనం లభిస్తుంది.
కాస్త అల్లం, వాము, జీలకర్ర, తులసి ఆకులు, మిరియాలు, బెల్లం(పంచదార బదులుగా) టీ పొడిలో వేసి, మరిగించి, మరిగాకా, పాలు పొయ్యండి. ఇలా కాచిన టీ ను తరచుగా త్రాగితే, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Sunday, June 12, 2016

లబందతో సర్వరోగ నివారణ

 .సర్వరోగాగాలను నివారించే శక్తి కలబందకు ఉందని అదొక
దివ్యఔషధం అని అరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఇంటికి ధిష్ఠి తగలకుండా పెంచుకునే ఈ మొక్క అందానికి,
ఆరోగ్యానికి మరెన్నో లాభాలు చేచూకూర్చుతుందని
ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కలబంద తో ఆరోగ్యానికి,
అందానికి లాభాలను చూద్దాం : కలబందలో 99,.3 శాతం నీరు,
ఏ, బి, కాంప్లెక్స్ విటమిన్లు, ఎంజైమ్స్, మినరల్స్,
ఆంద్రోక్వినొన్ష్, కార్టాసిలిక్ యాసీడ్, అమైనోయాసిడ్సు ఉంటాయి.
కలబంద మిశ్రమం రాసుకుంటే అనేక ధీర్ఘకాలిక రోగాలను
శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు అందుకే ఏ ఇంట
చూసినా కలబంద కనువిందు చేస్తుంది. కలబంద జెల్ ద్వారా
కీళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు, గజ్జి, తామర, మొటిమలు,
సూర్య రశ్మి నుండి వేడి రక్షణ, కీటకాలు, కుట్టినప్పుడు
ప్రధమచికిత్గా వాడుకోవచ్చు. అంతేకాదు కలబంద ఆకులను
సేకరించి గుజ్జును పాల మీగడ, కొబ్బరి నూనె, ఉప్పు వంటి
పధార్థాలన్నింటిని కలుపుకోవాలి. కలబంద రసం పది టీ
స్పూన్లు, నాలమీగడ ఐదు స్పూన్లు, కొబ్బరి నూనెరెండు
స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ ను కలపాలి. కలబంద
గుజ్జు ఒక గ్లాసు, మంచినీరు అరగ్లాసు, తగినంత తేనె,
ఉప్పు తీసుకోవాలి. కలబంద గుజ్చు, మంచినీరు తేనె
ఉప్పులను బాగా మిశ్రమం చేసి శుభ్రమైన పలుచడి వస్త్రతో
పడగట్టాలి. ఉపయోగాలు : కలబంధ రసం తాగడం వల్ల శరీరంలో
గుండె, కెన్సర్, హెపటైటిస్ కిడ్నీ సమస్యలు నివారిస్తుంది.
చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చెవి, ముక్కు, గొంతు
సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.. కలబంద రసం
తాగడం వల్ల శరీరంలో అంతర్గత వ్యాధులు తొలగిపోతాయి.
ఇందులో బ్యాక్టీరియా వైరస్ వ్యాధులు నివారించే శక్తి ఉంది.
పెప్టిక్ అల్సర్ (కడుపులో మంట), గొంతు సమస్యల
నుంచి ఉపశమనం ఉంటుంది. కలబంద రసంలో ముల్లాని
మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై
పూస్తే చర్మంలోనున్న మృతకణాలు మటుమాయం
చేస్తుంది. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును
పెంపొందిచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో
మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15
నిమిసాలు తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే
ముకం పై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును
సంతరించుకుంటుంది.

పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర

పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తలు అధ్య‌య‌నంలో నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జ‌రుగుతుందని శాస్త్రవేత‌లు తెలిపారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందని శాస్త్రవేత‌లు తెలిపారు.

వీరంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నారు.వీరికి ఈ మందుతో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్క‌వ మోతాదులో ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్నిఇవ్వ‌డం జ‌రిగింది. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమంతప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు ప్ర‌మాదం ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గమ‌నించారు. దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని శాస్త్రవేత‌లు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురిత‌మ‌య్యింది.

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే Health Drink

శరీర సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడి , వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
తయారీ విధానం 
నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చని నీరు - 1 గ్లాస్
తులసి ఆకుల పేస్టు - 1 స్పూన్
పుదినా ఆకుల పేస్టు - 1 స్పూన్
కొత్తిమీర పేస్టు - 1 స్పూన్
అల్లం రసం - 1/2 స్పూన్
నిమ్మరసం - 1 స్పూన్
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - చిటికెడు
పై వాటిని బాగా మిక్స్ చేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్త్ డ్రింక్ రెడీ అవుతుంది.
smile ఎమోటికాన్ వాడే విధానం smile ఎమోటికాన్
ఉదయం బ్రష్ చేసాక తీసుకోవాలి. ఒక అరగంట ఏమి తినకుండా ఉండాలి.లేదంటే సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు.వీలైన వాళ్ళు రెండు పూటలా తీసుకోవచ్చు.
ఈ వ్యాధులతో బాధపడేవారికి ప్రయోజనకారిగా ఉంటుంది 
అధికబరువు , కొలెస్ట్రాల్ , డయాబెటిస్ , మొటిమలు , స్కిన్ ఎలర్జీ , లివర్ , కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్,
బీపి సమస్యలు , పైల్స్ , గ్యాస్ సమస్యలు , పొట్టలో బాక్టీరియా , అమీబియాస్, కిడ్నీలో రాళ్లు , కాన్సర్ , HIV , PCOD , ఋతుచక్ర సమస్యలు , తెల్లబట్ట , శ్వాస సమస్యలు , అస్తమా , మోకాళ్ళు & కీళ్ళనొప్పులు, విషజ్వరాలు , దగ్గు , జలుబు మొదలైన రోగాలను తొందరగా తగ్గిస్తుంది.