Saturday, July 9, 2016

సునాముఖి


మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉప యోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి. దీని శాస్త్రయనామం కాసియా అంగుష్టిఫోలియా. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలస్ధానం మధ్య ఆఫ్రికా అటవీ ప్రాంతాలు, అరబ్‌ దేశాలు. కానీ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు సునాముఖికి పట్టుకొమ్మలని చెప్పవచ్చు. ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్‌ సెన్నా, టిన్నెర్‌వెల్లీ సెన్నా అనీ, హిందీలో సనాయె, సనాకపట్‌ అనీ, కన్నడలో నెలవరికె, సోనాముఖి అనీ, మళయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అనీ, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అనీ, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అనీ, సంస్కృతంలో స్వర్ణపత్రి అనీ, గుజరాతీలో నట్‌ కి సానా అనీ వ్యవహరిస్తారు. ఇది చాలా చిన్నగా పొదలా పెరిగే మొక్క. దీని ఎత్తు సమారుగు 2 నుంచి 3 అడుగులుండి, సన్నని ఆకుపచ్చని కాండంతో ప్రతి పాయకీ 4-5 జతల ఆకులతో దట్టంగా రెమ్మలు విస్తరించినట్టు పెరుగుతుం ది. సునాముఖి పువ్వులు చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. పొడవుగా ఎదిగే కాడతో 6-7 విత్త నాలు ముదురు కాఫీ రంగులో ఉంటాయి. సునా ముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారుచేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో యిన్‌ఫెక్షన్స్‌ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తు ల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకీ, అలాగే ఊపిరి తిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికీ, కీళ్ళనొపðలకీ, ఉబ్బసవ్యాధికి, ఆయు ర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడు తున్నారు. షట్షాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరం గా సునాముఖితో తయారుచేయబడు తున్నవే. అంతే కాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగా లని కూడా అరికడుతుంది. సునాముఖి వేరు నుండి తయారు చేయబ డిన ఔష ధం విరోచనాలను అరికట్టడంలోను, జీర్ణశక్తిని పెంపొందిం చడంలోను, ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాల లోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికీ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక దీనిని సాంధ్రవ్యవసాయ పద్దతిలో చాలా మంది రైతులు సాగుచేస్తున్నారు. ఇది సాధారణంగా ఎర్రమట్టి నేలల్లో, ఓండ్రుమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. పత్తి పండే నేలల్లో దీని దిగుబడి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. సునాముఖి ఆకుల్లో డయాన్‌త్రోన్‌ డైగ్లుకోసైడ్‌ అనబడే కొత్త గ్లైకో సైడ్‌ అలోవెూడిన్‌ కనుగొన్నారు. దీని కాయలలో రేయిన్‌, క్రైసోఫానిక యాసిడ్‌ల ఆంత్రాసిన్‌ గ్లైకోసైడ్‌, సైన్నోసైడ్‌ ఏ.బిలు లభ్య మవుతాయి. బీజదళాల్లో క్రిసోఫనోల్‌, పైసియాన్‌, అలో ఎవెూడిరియిన్‌, రీయామ్‌ ఎవెూడిన్‌లు, ఆకులు, విత్తనాలలో పెన్నోసైడ్‌ కాల్షియం, లభ్యమవుతు న్నట్టు శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు. అయినప్పటికీ దీనిలో లభ్య మయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడ్‌ ఎ,బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి. సునాముఖీ మొక్కల్ని గుజరాత్‌లో సముద్రతీర ప్రాంతంలో విస్తా రంగా పెంచుతున్నారు. ఇతర పంటలతో పాటు దీనిని కూడా పెంచుతూ కొందరు రైతులు ఆదాయాన్ని పొందుతు న్నారు. సునాముఖి ఆకులు గృహవైద్య చిట్కాల్లో కూడా విని యోగించడం ఆంధ్రప్రదేశ్‌లో చాలా మందికి పూర్వం నుండీ వాడుకగా ఉన్న విషయం అందరికీ తెలిసినదే. సునాముఖి ఆకు ల్ని కొబ్బరినూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ వుంటే, కేశాలు ఒత్తుగా పెరిగి, దృఢంగా ఉంటాయి. జుట్టురాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్యసాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖస్థానం ఉందని చెప్పవచ్చు.

హనుమంతుని ఫలం ఔషధ గుణాలు

హనుమంతుని ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్, రొమ్ము కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్, శ్వాసకోస కేన్సర్, క్లోమ గ్రంధి కేన్సర్ వంటి మరణాంతక కేన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు. పెద్ద ప్రేగు కేన్సర్ చికిత్సలో వినియోగించే ఖీమో ధెరఫీ కన్నా 10,000 రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు కేన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు. ఈ వృక్షభాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు 22 పరిశొధనలు జరిగాయి. కేన్సర్ వ్యాధినుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అమెరికాలోని కొందరు వైద్యులు, కేన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు. అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవికులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును, ఆకులను, వ్రేళ్ళను, పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు. [3]. తమిళనాడు దిందిగుల్ జిల్లాలో కొన్ని తెగలు చర్మవాధికి ఒక నెల వరకూ హనుమంతుని ఫల ఆకులను స్త్రీ మూత్రంతో ముద్దగా చేసి చర్మానికి పూసుకుంటారు [4]. కడుపులో పురుగులను హరించుటలోను, జ్వరాలు తగ్గించుటలోను, తల్లిపాలు పెరుగుటకు, జిగట విరేచనాలకు హనుమంతుని ఫలాల జ్యూస్ ఉపయోగపడుతుంది. తలలో పేలకు గింజల చూర్ణం ఉపయోగపడుతుంది. నిద్రలేమికి, కండరాల సమస్యలకు, అల్ప రక్తపోటు కు వీటి చెట్టు బెరడు, ఆకులు ఉపయోగపడతాయి. అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు, పానీయాలు, స్వీట్లు మొదలగువాటిలో వాడతారు.
కేన్సర్ కు వాడే విధానం
కేన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతి రోజు 5 గ్రాములు 200 మిల్లీ లీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయిన తర్వాత దించి వడబోసుకొని త్రాగాలి. దీనిని ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగాలి