Monday, January 27, 2014

కంటి కింది చారలకు కీర....!


చిన్న వయసులోనే కళ్ల కింద నల్లచారలొస్తే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని తొలిదశలోనే గుర్తించి ఇంటివైద్యాన్ని చేసుకుంటే తగ్గుముఖం పడతాయి.
- మార్కెట్‌లో నిత్యం మనకందరికీ అందుబాటులో ఉండేవి కీరా దోసకాయలు. తాజా కీర దోసను తీసుకుని అప్పటికప్పుడు ముక్కలుగా కోసి కాసేపు కళ్ల మీద ఉంచుకోవాలి.
- కీర దోస రసాన్ని కళ్ల కింది నల్లచారలకు పట్టించి.. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఉపశమనం లభిస్తుంది.
- దోసరసంలో బంగాళదుంప రసాన్ని కలిపి ఇలాగే చేయొచ్చు. దీనివల్ల కూడా నల్లచారల సమస్య తగ్గుతుంది.
- నల్లచారలకు మరింత మంచి ఫలితాన్ని అందించే జ్యూస్‌లలో టొమాటో జ్యూస్ ఒకటి. టొమాటోలోని ఔషధగుణాలు శరీరం మీదున్న నల్లమచ్చల్ని తొలగించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌తో మర్దన చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలకు నీటితో శుభ్రం చేసుకోవాలి.
- టీ బ్యాగ్స్‌తో కూడా కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. చల్లటి నీటిలో టీ బ్యాగ్స్‌ను ముంచి, కళ్ల కింద కాసేపు ఉంచితే మంచిది.
- మార్కెట్‌లో దొరికే ఆల్మండ్ ఆయిల్ చక్కటి ఔషధం. జుట్టుకు మాత్రమే కాదు. కళ్ల కింద నలుపు చారల్ని వదిలించుకునేందుకు ఈ నూనెను వాడుకోవచ్చు.
- ఆరెంజ్ జ్యూస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ జ్యూస్‌లో కాస్త గ్లిజరిన్ కలిపి వారానికి మూడుసార్లు రాసుకుంటే ఊహించని ఫలితం వస్తుంది.
ఇవన్నీ చేస్తూనే మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, కంటినిండా నిద్రపోవడం, సమతులాహారాన్ని తీసుకోవడంతో పాటు వీలైనన్ని మంచినీళ్లను తాగితే కళ్ల చారల సమస్య నుంచి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు.

Friday, January 24, 2014

‘త్రిఫలచూర్ణం’


కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను కలిసి ‘త్రిఫలాలు’ అంటారు. వాటిని ఎండబెట్టి, విడివిడిగా పొడిచేసి, సమానంగా కలుపుకుంటే చక్కటి ‘త్రిఫలచూర్ణం’ తయారవుతుంది.
ఇలా చేయండి.. కళ్లు ఎంత రిలాక్స్ అవుతాయో.. సైట్ ఎలా తగ్గుతుందో మీరే చూడండి!!
చిన్న ఏజ్‌లోనే భూతద్ధాల్లాంటి కళ్లజోడ్లు వాడాల్సిన పరిస్థితి చాలామందికి ఏర్పడుతోంది... ముఖ్యంగా ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్‌లూ గంటల తరబడి వాడేసేయడం, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహారం లోపించడం వంటి కారణాల వల్ల దాదాపు అన్ని వయస్సుల వారూ ఎంతోకొంత దృష్టి సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు.
మనం చాలా తక్కువ పట్టించుకునేది eyes. కారణం అవి ఎప్పుడూ ప్లాబ్లెం రావు, చిన్న చిన్న ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఏ జెంటామైసిన్ వంటి dropsనో కళ్లల్లో వేసుకుంటే తగ్గిపోతాయన్న నమ్మకం కొద్దీ వాటి పట్ల శ్రద్ధ పెట్టనే పెట్టం.

సరైన పోషణ లేకపోయినా చాలా ఎక్కువ రోజులు మనకు కోపరేట్ చేసే విజన్ ఒక్కసారి తగ్గడం మొదలెడితే దాన్ని ఆపడం చాలా కష్టం, ఎంత కళ్లజోడు పవర్ పెంచుకుంటూ పోయినా..
సో, భారతీయులకు ప్రాచీనకాలం నుండి కళ్ల విషయంలో వస్తున్న ఓ అద్భుతమైన సొల్యూషన్ త్రిఫల పౌడర్‌తో కళ్లని bath చేయించడం.
చేయాల్సింది ఇలా..
త్రిఫల పౌడర్ ప్రతీ ఆయుర్వేదిక్ స్టోర్‌లో లభిస్తుంది.. ప్రతీ రోజూ ఉదయం పూట దీన్ని ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అర టీస్పీన్ పౌడర్‌ని ఓ కప్ వాటర్‌లో వేసి గోరువెచ్చగా boil చేసి నైట్ వరకూ అలాగే ఉంచాలి. నైట్ పడుకోబోయే ముందు దాన్ని వడగట్టి రెండు కాటన్ ముక్కలు తీసుకుని ఆ వాటర్‌లో ముంచి కళ్లపై పెట్టుకుని కళ్లల్లోకి త్రిఫల వాటర్ వెళ్లే విధంగా కాటన్ ని వేళ్లతో ప్రెస్ చేస్తుండాలి. కాసేపటికి కళ్లు డ్రై అవగానే మళ్లీ కాటన్ ప్రెస్ చేస్తే మరికొన్ని చుక్కలు కాటన్ నుండి కళ్లల్లో పడతాయి.
ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత ఓ 20-25 నిముషాలు టివి గానీ, మోనిటర్ గానీ, ఫోన్ స్క్రీన్ గానీ చూడకండి. అందుకే పడుకోబోయే ముందు ఇలా చేస్తే ఇంకా బెటర్.
లాభాలివి: త్రిఫల bath వల్ల కంటి నరాలు బలపడతాయి. విజన్ మెరుగుపడుతుంది, వయస్సుతో పాటు దృష్టి తగ్గడం అన్న సమస్యలే రావు. పెద్ద వాళ్లకైతే కేటరాక్ట్ వంటి సమస్యలూ తొలగిపోతాయి.
ఇలా ఓ 4-5 రోజులు ఫాలో అయ్యాక స్వయంగా మీకే తేడా తెలుస్తుంది, నమ్మకం వస్తుంది. . సో కావాలంటే ట్రై చేయండి. త్రిఫల వాటర్ తాగడం వల్ల వేరే ఉపయోగాలూ ఉన్నాయి
నల్లమోతు శ్రీధర్

Sunday, January 19, 2014

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్ పౌష్టికాహార లోపం, కాలుష్యాలు దాడి చేయడం వల్ల, షాంపూలు, తలకు వేసుకునే రంగులతో రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. మరి దీన్ని ఆపడం ఎలా? అది మీ చేతుల్లోనే ఉంది. అందుకు బెస్ట్ మెడిసిన్ కూరల్లో వాడే కరివేపాకు. అదెలాగంటే...
పొడవు, మందం బట్టి జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి. ఇందులో నానబెట్టిన మెంతుల్ని ఆ నీళ్లతో సహా కలపొచ్చు. ఈ పేస్ట్‌ను మాడుకు రాసుకుని రెండు గంటల పాటు ఉంచుకోవాలి. రాసుకున్న మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి. జుట్టు జిడ్డుగా అతుక్కున్నట్టు ఉంటుంది గాని ఆరిన తరువాత బాగానే ఉంటుంది. ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే మైల్డ్ షాంపూ వాడొచ్చు.
జుట్టు ఆరిన తరువాత దువ్వితే జుట్టుకు కరివేపాకులేమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి జుట్టుకు వేసుకుంటే పట్టుకుచ్చులా మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం. అంతేకాదు ఎక్కువ జుట్టు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది.

Sunday, January 12, 2014

ఔషధమూలిక గోరింటాకు

గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.
గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.
ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.

Saturday, January 11, 2014

పల్లీల్లో పోషకాలు ఫుల్‌


పల్లీలంటే ఇష్టంగా తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందరికీ ఇష్టమైన పల్లీల్లో బోలెడన్ని పోషకాలున్నాయి. రుచిలో వీటికి సాటి లేదనే చెప్పవచ్చు. చక్కటి రుచితో పచ్చడి, పొడి ఇలా ఏ రూపంలోనైనా పల్లీ టేస్టే వేరు. పోషకాల సంగతి పక్కనపెడితే ఇందులో అధికంగా ఉండే మోనోశాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటిని మంచి పోషకాలుగా అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్‌ కారకాలు పేరుకోకుండా క్యాన్సర్లను అదుపులో ఉంచుతాయి.
పల్లీల్లో ఉండే రెస్‌వెట్రాల్‌ అనే పాలిఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసే శక్తిని కలిగివుంటుంది. ప్రతి వందగ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చర్మానికి హానికలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్‌, నియాసిన్‌, థయామిన్‌, విటమిన్‌ బి6, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి పల్లీలో ఫుల్లుగా పోషకాలు ఉన్నాయని తెలిసిందికదా... చక్కగా మీరూ, మీ పిల్లలూ రోజుకు ఓ గుప్పెడు పల్లీలు తినడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.