Friday, March 15, 2013

మెడిటేషన్ అంటే ఏమిటి...? ఎలా, ఎప్పుడు చేయాలి?


మెడిటేషన్ అంటే ఏమిటి...? ఎలా, ఎప్పుడు చేయాలి?

ప్రాణం ఉన్న ఏ జీవానికైనా ఆరోగ్యం ముఖ్యం. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినప్పుడు ఏ ఆరోగ్యసమస్యలు లేకుండా జీవించగలడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు హాయిగా ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానం. ఆనందం, తృప్తి వంటి భావనలు ఒక్కో మనిషిలో ఒక్కోవిధంగా ఉంటాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో మెడిటేషన్‌ గా పిలవబడే దానిని మన పూర్వీకులు ధ్యానంగా చెప్తారు. దీని ద్వారానే మనలోని ఆత్మకుజ్ఞానం లభిస్తుందని, మనకుగల పరిమితులు, సామర్ధ్యాలు తెలుసుకో గలుగుతామంటారు పెద్దలు. నిజమే...ఏకాగ్రతతో మెడిటేషన్(ధ్యానం) చేస్తే అనేక లాభాలున్నాయి... మనలో దాగివున్న నిగూఢ శక్తులను అది వెలికి తీసి, మనలోని సామర్థ్యానికి మరింత మెరుగు పెడుతుంది ఈ మెడిటేషన్(ధ్యానం)... అయితే ఇలా పొందిన పరిజ్ఞానం ముందుగా మనగురించి మనం పూర్తిగా తెల్సుకున్నపుడే మనలోని మంచి గుణాలని బహిర్గతం చేసుకోవచ్చు.

ప్రశాంతమైన జీవితానికి మెడిటేషన్ బాగా సహాయపడుతుంది. అసలు మెడిటేషన్ అంటే ఏమిటి? మనమంటే ఏమిటో తెలుసు కోవడం. మన మైండ్‌ ప్రశాంతంగాను, విశాలంగాను, రిలాక్స్ గాను, ఒత్తిడిలేకుండా వుండాలంటే కనీసం రోజుకు 15నుండి 20 నిమిషాలపాటు ధ్యానం చేయాలి. ధ్యానానికి రోజులో ఉదయం, సాయంత్రం వేళలు అనుకూలమైనవి. కనుక నేటినుండే మీరు మీ ధ్యానాన్ని మొదలుపెట్టండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి నివ్వండి. మంచి మనసు కలిగి వుండటం సంతోషానికి ప్రధానం అన్నది మరవకండి.

ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్‌ చేయడం అలవర్చుకోండి. మెడిటేషన్‌ చేయడమంటే హిమాలయ పర్వతాలెక్కి తపస్సు చేయడమంత కష్టమైన పనేమీ కాదు. రోజుకు రెండుసార్లు అంతగా వీలుగాకపోతే ఒకసారైనా చేయవచ్చు. కొద్ది సమయంలోనే మీరు ఒకచోట నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కూర్చోండి. మెడిటేషన్‌ కొనసాగించడానికి ఎన్నో పద్ధతులు వున్నాయి. అందుకు మీ ఎదురుగా ఒక కొవ్వొత్తిని వెలిగించి పెట్టుకుని దాని వంకే చూస్తూ మెడిటేషన్‌ చేయవచ్చు. మీకు నచ్చిన ఒక పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తూ చేయవచ్చు. మీరు ఎంచుకునే పద్ధతి ఏదైనప్పటికీ మెడిటేషన్‌లో మీరు చేయాల్సింది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ప్రశాంతంగా కూర్చుని మీతో మీరు గడపడం. మెడిటేషన్‌ అంటే ఇదే. ఆత్మావలోకనం ఏర్పరుచుకోవడం, కాస్సేపు ఇలా గడపటానికి మీరు ఏ ప్రదేశాన్నయినా ఎంచుకోవచ్చు. అది మీ ప్రశాంతతకు భగం కలిగించకుండా వుంటే చాలు.

ప్రపంచం ఎలా నడుస్తోందో మనం తెలుసుకోవాలంటే ధ్యానంచేయాల్సిందే అంటాడు గౌతమ బుద్ధుడు. ఇది నిజం కూడా.. ధాన్యం తెలివినిస్తుంది. ధ్యానం చేయకపోతే, అంతాతెలియనిస్ధితి ఏర్పడి మనిషి అభివృద్ధి అసాధ్యమన్నది కొందరి భావన. మన సమాజంలో ప్రస్తుతం మన ఒత్తిడి తగ్గించడానికి అనేక ధ్యానపద్ధతులు నేర్పిస్తున్నారు మెడిటేషన్ ఎక్స్ పర్ట్స్. ఇవి ఎలా చేయాలి... వాటి ఉపయోగాలేంటంటే...

మెడిటేషన్ (ధ్యానం) చేసేటప్పుడు మీవీపును నిటారుగా సౌకర్య వంతంగా పెట్టి కూర్చొని, కళ్ళు మూస్కొని, తేలికగా శ్వాసను పీల్చండి. ఈ ధ్యాన పద్ధతిలో శ్వాస మీ ప్రవేశించటం, బయటకు వదలటం ప్రక్రియను శ్రద్దగా గమనించాలి. దీనినే శ్వాస మీద ధ్యాస అని పిలుస్తాం. రోజూ ధ్యానాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు చేస్తే మనిషిలో ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతుంది.

ఇక మానసిక ధాన్యంతో మనసును ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంచుకోవచ్చు. నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని, ప్రశాంతతని ఆశ్వాదిస్తూ...ఈ ధ్యానం రోజూ 10 నిమిషాల చొప్పున రెండుసార్లు చేస్తే చాలు. మనసు, శరీరం రెండు అనుసంధానించబడి ఊహించ లేని శక్తి కల్గి మనలో తీవ్ర నమ్మకాన్ని పెంచుతుంది. . ధ్యానించేటపుడు ఎంత ప్రధానమైన పని అయినా సరే వదిలేసి పాజిటివ్‌ ఆలోచనలోకి వెళ్లాలి.


ఊహా ధ్యానం మరో పద్దతి. రోజులో 20-30 నిమిషాల సమయం పూర్తి విశ్రాంతిలో ఉంటూ, ఆహ్లాదా న్నిచ్చే చిత్రాలు, బొమ్మలు, పెయింటింగ్‌లు చూస్తూ వుండండి.అవి మీ మనస్సుల్లో నేల కొన్ని ఆందోళనల్ని తగ్గించి...పూర్తిస్థాయి విశ్రాంతిని కలిగిస్తాయి. కనుక ఈ ధ్యానం చేయాలనుకుంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా ఏ ప్రదేశంలో అయినా చేయవచ్చు.

Thursday, March 14, 2013

మూత్రపిండాలు


మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు... శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలు కావచ్చు.. ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు.. శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కడ్నీ సమస్యలను అరకట్టవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. కిడ్నీని పదిలంగా ఉంచే కొన్ని ఆహారాలు మీ కోసం... బెర్రీస్: బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. మనకు తెలిసినంత వరకూ బెర్రీస్ అత్యధిక న్యూట్రిషన్ కలిగినటువంటి ఆహారం. ఇది బరువును తగ్గించుటలో సూపర్ గా పనిచేస్తుంది. బెర్రీస్ ను తీసుకోవడం ద్వార మూత్రపిండాలను శక్తివంత చేసి ఆరోగ్యం ఉండేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ది చేసి రక్తంలోని హానికర విషపదార్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది.


Tuesday, March 12, 2013

జ్యూస్‌


ఇటీవల ఆరోగ్యం గురించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. మనం తినే ఆహారం, తీసుకునే పలు రకాల పళ్ల రసాలు ఇవన్నీ ఏ మేరకు ఉపకరిస్తాయన్నది గ్రహించుకోవాలి. మనలో చాలామంది డాక్టర్ల సలహా పేరుతో ఇష్టం వచ్చినట్టు పళ్ల రసాలు తాగేస్తుంటారు. అవి తీసుకోవడంలోనూ ఓ పద్ధతంటూ ఉంటుంది. ఏవి తీసుకుంటే నిజంగా మంచి ఆరోగ్యాన్నిస్తాయో తెలుసుకుందాం...

*
క్యారెట్‌, అల్లం, ఆపిల్‌ జ్యూస్‌లతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
*
ఆపిల్‌, గుమ్మడి జ్యూస్‌తో క్యాన్సర్‌ను అరికట్ట వచ్చు, కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవచ్చు. అంతేగాక కడుపు నొప్పి, తలనొప్పి తగ్గుతుంది.
*
టొమాటో, క్యారెట్‌, ఆపిల్‌ జ్యూస్‌లతో శరీర రంగు మెరుగవుతుంది, నోటి దుర్వాసనలు పోతాయి.
*
కాకర, ఆపిల్‌, పాలు జ్యూస్‌తో నోటి దుర్వాసనలు పోతాయి, శరీరంలో మంటలు తగ్గుతాయి.
*
కమలాలు, అల్లం, గుమ్మడి జ్యూస్‌తో చర్మసౌం దర్యం పెరుగుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది.
*
పైన్‌ఆపిల్‌, ఆపిల్‌, పుచ్చపండు జ్యూస్‌ తీసుకోవడం పొత్తికడుపు, కిడ్నీలకు ఎంతో ఉపకరం.
*
ఆపిల్‌, గుమ్మడి, కివీపండు జ్యూస్‌ తీసుకుంటే చర్మ సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది.
*
బీర, అరటిపండు జ్యూస్‌తో శరీరంలో షుగర్‌ సం బంధిత ఇబ్బందులు ఉండవు.
*
క్యారెట్‌, ఆపిల్‌, బీర, మామిడి జ్యూస్‌ తీసుకుంటే శరీరం వేడి, రక్తపోటు తగ్గుతాయి.
*
తేనె, ద్రాక్ష, పుచ్చపండు, పాలు.. వీటితో పాటు విటమిన్లు అధికంగా ఉండే సి విటమిన్‌ బి2 తీసు కుంటే, కణాలు ఎంతో చురుగ్గా పనిచేస్తాయి.
*
బొప్పాయి, పైన్‌ ఆపిల్‌, పాలలో విటమిన్‌ సి ఇ లు అధికంగా ఉంటాయి. చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.
*
అరటిపండు, పైన్‌ ఆపిల్‌, పాలలో విటమిన్‌లు అధికంగా ఉండి, పౌష్టికత కలిగి ఉండడంతో జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

* ఆరోగ్యానికి అల్లం


* ఆరోగ్యానికి అల్లం

అల్లం మసాలా దినుసుగా వాడడం వలన ఆహారానికి రుచి, సువాసన కలగడమే కాకుండా శరీరానికి మందుగా కూడా పనిచే స్తుందని శాస్తజ్ఞ్రులు నిర్ధారించారు. ముఖ్యంగా అల్లం ఏ రూపంలో వాడినా పైత్యాన్ని తగ్గిస్తుం ది. రక్తం గడ్డ కట్టటాన్ని అరికట్టడం, రక్తంలో చక్కెర, కొవ్వు, పదార్థాలను అదుపుచేయటం, కీళ్లవాపులు, నొప్పులు, తగ్గించు కోవడం, సూక్ష్మజీవుల పెరు గుదలను నిరోధించటం వంటి వాటిలో అల్లం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.

గృహవైద్యంలో అల్లానికి ప్రత్యేకస్థానం ఉంది. ఎన్నో రకాలుగా అల్లాన్ని వాడవచ్చు. ప్రపం చ మంతటా కూడా ఆహారంలో సుగంధానికి ఉప యోగిస్తారు. సాస్‌లు , సలాడ్లు, జామ్‌లు, పచ్చళ్లు, ఊరగాయలు, మిఠాయిలు, బేకరీ వస్తువులు, వీటన్నింటి త యారీలో అల్లాన్ని వినియోగిస్తు న్నారు. అల్లాన్ని ఎండబెట్టి పొడిచేసి కొన్ని పదార్థాలలో వాడుతు న్నారు. అల్లాన్ని నేరుగా వాడడమే కాకుండా దీనినుంచి లభించే పదార్థాలను విరివిగా ఉపయోగి స్తున్నారు. అల్లం నుంచి తీసిన ఒలిమొరెజిన్‌ చిక్కని నూనె వంటివి అల్లం ఘూటుకు కారణభూతం . దీనినుంచే జింజెరిన్‌ అనే ఎసెన్స్‌ను తయారు చేస్తా రు.

ఈ ఎసెన్స్‌ కాన్డ్‌పుడ్‌ ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచేం దుకు తోడ్పడు తుంది. అంతేకాక జీర్ణ కోశాన్ని, మొదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. అందువలన ఎక్కువగా జీర్ణశక్తికి తోడ్పడే మందు లలో, టానిక్‌లలో మాత్రలలో అల్లము అవసర మవు తున్నది. మత్తుపదార్ధాలైన జింజర్‌ బీర్‌, జింజర్‌వైన్‌, జింజర్‌పల్‌ మున్నగు పరిశ్రమలలో అధిక ప్రాధా న్యతను ఇస్తున్నారు .

అల్లం నుంచి తయారైనదే శొంఠి. అల్లం పొట్టుతీసి సున్నపునీటిలో శుద్ధిచేసి ఎండబెడితే శొంఠిగా రూ పాంతరం చెందుతుంది. తేమ తొలగినందున శొం ఠి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. సంస్కృ తంలో అ ల్లాన్ని మహౌశధ అనేవారు కాని రానురాను పర్యా య పదాలైనా ఆర్థ్రకం, శృంగి భేరి, అని పిలుస్తు న్నారు. శాస్ర్తీయనామం జింజిబర్‌ అఫిసినాలిస్‌. దీని నుంచే ఆంగ్లంలో జింజర్‌ అనే పదం పుట్టింది. హిం దీలో అద్రక్‌ అంటారు. జింజిబరెని కుటుంబం. పసుపు, అలం తోబుట్టువు. స్వస్థలం దక్షిణ, తూర్పు ఆసియా. బహువార్షిక గుల్మం. మనం వాడే అల్లం ఈ మొక్క భూగర్భకాండమైన కొమ్ము. కొమ్ము నాటిన 8 నెలలకు కోతకు వస్తుంది.

ఈ కొమ్ము ద్వారానే ప్రవర్థనం చెందుతుంది. సా ధారణంగా వచ్చే పడిశం, దగ్గు, ఉబ్బ సంతో కూడిన ఆయాసం వంటి వాటిని అల్లంగాని, శొంఠినిగాని వాడి తేలికగా తగ్గించుకోవచ్చు. తలనొప్పి, గొంతు నొప్పి వంటి నొప్పులను శొంఠిని నీటి లో అరగదీసి పైపూతగా వాడడం అ నాది నుంచి ఉంది. శొంఠిని కాఫీలో గాని, టీలో కాని కలిపి సేవిస్తే జలుబు భారం, తలనొప్పి తొలగిపోతాయి.

* కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం..!!


* కంటిచూపును మెరుగుపరిచే ఖర్జూరం..!!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎంతో తియ్యని ఖర్జూరాన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా, ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ కనీసం ఒక్కటైనా తీసుకోగలిగితే ఎన్నో సహజ పోషకాలను సులువుగా పొందవచ్చంటున్నారు.ముఖ్యంగా ఖర్జూరాల్లో క్యాల్షియం, సల్ఫర్‌, ఇనుము, పొటాషియం , ఫాస్పరస్‌, మ్యాంగనీస్‌, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు సమౄఎద్ధిగా లభిస్తాయి. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి కూడా వీటికి ఎక్కువగా ఉంది. అలాగే ఇందులోని విటమిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఊపిరితి త్తులు కూడా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇనుము వల్ల రక్తహీనత సమస్య అదుపులో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

* గ్యాస్ట్రిక్‌ సమస్యలకు తులసి


* గ్యాస్ట్రిక్‌ సమస్యలకు తులసి

సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. తులసి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే తులసిని సర్వరోగ నివారిణి అంటారు. ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు చూద్దాం..

తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. పాలతో మాత్రం తీసుకోకూడదు. పొద్దున్నే అల్పాహారానికి అరగంట ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకు మూడు సార్లు కూడా సేవించవచ్చు. మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాలపొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు కొద్దిగా తులసి విత్తనాలను పెరుగు లేదా తేనెతో కలిపి నాకిస్తే అవి తగ్గుముఖం పడతాయి.

నల్ల తులసి రసాన్ని మిరియాలపొడిలో వేసి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి సేవిస్తే గ్యాస్ట్రిక్‌ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది . నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇరవై ఐదు గ్రాముల తులసి రసాన్ని రెండు గ్రాముల నల్ల ఉప్పును కలిపి నాలుగు రోజులు క్రమంగా తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఆస్థమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది.

* గుండె ఆరోగ్యం


* గుండె ఆరోగ్యం

గుండె రక్తనాళాలలో ఏర్పడే గడ్డలు క్రమేణా రక్తనాళాలను గట్టిపడేసి రక్తప్రవాహం గుండెకు ఆపేస్తాయి. ఇదే సమయంలో శరీరం తనను తాను రక్షించుకునేటందుకు వ్యాయామం చేసే వ్యక్తులయితే, గుండెకు సమాంతరంగా వెళ్ళే రక్తనాళాలను ఉపయోగించి రక్తం సరఫరా చేస్తాయి. ఈ సమాంతర రక్త ప్రసరణ జరుగకుంటే, గుండె పూర్తిగా విఫలమైనట్లే. ఫలితంగా గుండె బలహీనపడటం దాని చర్య తగ్గిపోవటం జరుగుతుంది. గుండెకుగల వ్యాయామ సామర్ధ్యాన్ని మెటబాలిక్ ప్రక్రియగాను మరియు స్ట్రెస్ టెస్ట్ గా పరీక్షలు చేస్తారు.

బ్లాక్ అయిన రక్తనాళాలకు సమాంతర రక్త సరఫరా ఎలా చేయాలి? గుండెకు సమాంతర రక్తనాళాలతో రక్త సరఫరా చేయవచ్చునని పరిశోధకులు చెపుతున్నారు. గుండెపోటు సమయంలో రక్తనాళాలలో గడ్డలు ఏర్పడతాయి. బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్ మిలిటస్ మొదలగు వ్యాధులు అధికంగా వుండే వారిలో శరీరంలో రక్తస్రావం కూడా జరుగుతుంది. ఈ రక్తపుగడ్డలు చిన్నపాటి ధమనులలో నిలబడిపోతాయి. దీనితో రక్త సరఫరా ఆగి ప్రధాన అవయవం డిస్టల్ కండరానికి పోషణ అందదు. ఇది కనుక అధిక సమయం కొనసాగితే, అవయవం మొద్దుబారి, గుండె పోటు వస్తుంది. అయితే, సమాంతరంగా ఏర్పడే రక్తనాళాలు సహజ రక్తనాళాలకంటే బలహీనంగా వుండి రక్తాన్ని అధికంగా తీసుకు వెళ్ళ లేవు. వ్యాయామాలు చేయని వారిలో గుండె విఫలత చెందితే పరిణామాలు మరింత వేగంగా వుంటాయని వైద్యులు చెపుతారు. ఫలితంగా గుండె బలహీనపడి వైద్యానికి సైతం కష్టమవుతుంది.

గుండె ఆరోగ్యానికి ఆహారాలు ఏమి తీసుకోవాలి? ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిక బరువు, లావు ఎక్కటం అనే సమస్యలను అనారోగ్యాన్ని కలిగించే అధికమైన లేదా విపరీతమైన కొవ్వు పేరుకోటంగా చెపుతుంది. అధిక బరువుకు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధికబరువున్న వారిలో ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం, చెడు కొల్లెస్టరాల్ పెరగటం వుంటుంది. ఈ రిస్కు తగ్గించటానికి గాను ఆరోగ్యకరమైన ఆహారాలు, శారీరక వ్యాయామం తేలికైన పరిష్కార మార్గాలు.

అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు - పండ్లు, కూరగాయలు - వీటిలో పీచు అధికంగా వుంటుంది. అది కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది. కేరట్లు, టమాటాలు, బెర్రీలు, ఆరెంజస్, పపయా, వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే పండ్లు తినాలి. తృణ ధాన్యాలు - గోధుమ, వివిధ రకాల ధాన్యాలు గోధుమ బ్రెడ్, రోటి, పస్తా, బ్రౌన్ రైస్, ఓట్స్, రాగి, జోవార్, బజ్రా వంటివి తినాలి. మొలకెత్తిన విత్తనాలు, కిడ్నీ బీన్స్, బఠాణీలు, మొదలైనవి నీటిలో కరిగే పీచు కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది. అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి వుంటాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చల్లుకొని తింటే మంచి ఫలితం వుంటుంది.

తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులు - వెన్న తీసిన పాలు, పెరుగు, ఇంటిలో తయారు చేసిన పనీర్ మొదలైనవి అధిక కాల్షియం కలిగి శరీర కొవ్వు తగ్గిస్తాయి. చేపలలో సల్మాన్, టూనా జాతివి ఒమేగా 3 కలిగి వుంటాయి కనుక అవి మంచి కొల్లెస్టరాల్ పెంచుతాయి. సోయా ఉత్పత్తులు రక్తనాళాలలో గడ్డలను కరిగిస్తాయి. గ్రీన్ టీ తాగితే...మంచి కొల్లెస్టరాల్ పెరుగుతుంది.

ఈ ఆహారాలు తింటూ, ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాలపాటు తగినంత శారీరక వ్యాయామాలు వేగంగా నడవటం, జాగింగ్, స్విమ్మింగ్, సైకిలింగ్, మొదలైనవి చేస్తే కేలరీలు ఖర్చు అయి బరువు తగ్గిపోతారు. ఇక గుండె ఆరోగ్యంగా కొట్టుకుంటుంది.

* మిరియాలు



* మిరియాలు
సుగంధద్రవ్యాలలో రారాజు మిరియం.అందుకే దీన్ని కింగ్ ఆఫ్ స్పైసెస్ అన్నారు. ప్రపంచంలో మిరియాలకు పుట్టినిల్లు నూటికి నూరుపాళ్లూ భారతదేశమే. మిరపకాయ పరిచయం లేని రోజుల్లో వంటకాల్లో మిరియాన్నే విరివిగా వాడేవారట పూర్వీకులు. ముందొచ్చిన చెవులకన్నా... అన్న టైప్‌లో మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం పెప్పర్పేరుతో టేబులెక్కి కేక పుట్టిస్తోంది. పోపులపెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దలమాట. జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కుదిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచటం, గొంతును శుభ్రపరచటం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా .... ఏ వ్యాధికైనా ఒకే మందు... అదే మిరియం. వేల రకాల వంటకాలకైనా మేలిమిరుచిని తీసుకువచ్చే ఘనాపాఠి మిరియం.

మిరియాలంటే నల్లటివే తెలుసు మనకు. కాని వీటిలో తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి, అరుదుగా గులాబిరంగువి కూడా ఉంటాయి. పీచు, ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్లలో లభించే మిరియాన్ని కాలామిర్చి అని కూడా అంటారు. మిరియాల మొక్క శాస్త్రీయనామం పైపర్ నీగ్రమ్ లిన్. ఇది 10-15 సెంటిమీటర్ల వరకు పెరిగే తీగ జాతికి చెందినది. మిరియాలు గుండ్రంగా ఆకుపచ్చగా ఉండి పండినప్పుడు ఎర్రగాను, ఎండినప్పుడు ముడతలు పడి నల్లగా అవుతాయి. నవంబర్ - ఫిబ్రరి నెలలో ఈ పంట కోతకు వస్తుంది.

కేరళలో విరివిగా పండే ఈ పంటను మన రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో, కాఫీ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. మనం కాస్త చిన్న చూపు చూశామని కినుక వహించిందేమో, ఒకప్పుడు మిరియాల పంటలో అగ్రస్థానంలో ఉన్న మన దేశ స్థానాన్ని ఇప్పుడు వియత్నాం దేశానికి అప్పగించింది. వాడకంలో ఆ స్థానాన్ని అమెరికా కొట్టేసింది. పోటాపోటీగా ఎవరెంత ముందుకు వచ్చినా మన తె లుగింటి మనసులో ఈ దినుసుకు ఎప్పటికీ అగ్రస్థానమే.

* ఏలకులు


* ఏలకులు
హాట్‌కైనా, స్వీట్‌కైనా టేస్టులో భిన్నమైన రుచిని తేవడంలో ఘనాపాఠి దినుసు ఏలకులు.సుగంధ ద్రవ్యాలలో రారాణిగా పేరొందిన ఏలకులు వంటింటి షెల్ఫ్‌లో లవంగంతో చేరి గాజు సీసాలో ఘాటుగా జోడీ కట్టినా నా రూటే సెపరేట్అన్నట్టుగా ఉంటుంది.

ఇలాచీఅని ఇష్టంగా పిలుచుకునే ఏలకులను ప్రాచీనకాలంలోనే మనవారు సుగంధ ద్రవ్యంగా వాడినట్టు చరిత్ర చెబుతోంది. 2వ శతాబ్దంలో సుశ్రుతుడు రాసిన చరకసంహితలోను, 4వ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలోనూ ఏలకుల ప్రస్తావన ఉన్నట్టు తెలుస్తోంది.కార్డ్డమమ్అని పిలిచే ఆంగ్లేయులూ ఏలకుల పంటలో ఘనాపాఠిగానే పేరుతెచ్చుకున్నారు.

మన దేశంలో ఏలకుల ఉత్పత్తిలో అగ్రస్థానం సిక్కిం కొట్టేసినప్పటికీ దక్షిణ భారతదేశంలో నీలగిరి కొండలు ఏలకులకు జన్మస్థానంగా చెబుతారు. శ్రీలంక, బర్మా, చైనా, టాంజానియా... ప్రపంచంలో ఎన్నిచోట్ల ఏలకులు పండినా, భారతదేశపు ఏలకులు అత్యుత్తమైనవిగా పేరుగాంచాయి. అంతేకాదు ప్రపంచంలో ఏలకులను అత్యధికంగా పండించేది మన దేశమే. కుంకుమపువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరున్న ఏలకులను గ్రీకులు, రోమన్లు అత్తరు తయారీలో వాడేవారట.

ఏలకుల మొక్క పొదలాగ మూడు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కను విత్తనాల ద్వారా లేదా కణుపుల ద్వారా పెంచవచ్చు. నాటిన మూడేళ్ల తర్వాత ఉత్పత్తిని ఇస్తుంది. ఈ కాయలను సగం పండగానే కోస్తారు. వీటిని ఎండలో కాని, యంత్రాల సాయంతో గాని ఆరబెడతారు. ఉత్తమమైన వాటిని గ్రేడ్ చేస్తారు. నలుపు, తెలుపు, పచ్చని రంగులలో ఉండే ఏలకులలో ఆకుపచ్చనివి అన్నింటికన్నా అత్యుత్తమమైనవి.

అరేబియన్ దేశాలలో ఏలకులను కాఫీతోను, మిగిలిన దేశాలలో తేయాకుతోనూ కలిపి పానీయంగా సేవిస్తారు. మిఠాయి, కేక్, పేస్ట్రీలలోనే కాదు మన దేశంలో ఘాటైన వంటల్లో మసాలా దినుసుగానూ ఏలకులను వాడతారు.

ఏలకులను సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగానూ వాడతారు. అజీర్తి, మలబద్దకం, అల్సర్లు, ఆస్తమా, జలుబు, సైనస్, కలరా, తలనొప్పి, చెడు శ్వాస.. వంటి ఎన్నో ఆరోగ్యసమస్యలకు ఏలకులు దివ్యౌషధం.

Sunday, March 10, 2013


* జీడిపప్పు


* జీడిపప్పు

జీడిపప్పు లేని పాయసాన్ని ఊహించుకోవడమే చాలా మందికి కష్టం. కలవారింట కమ్మని వంటలలో చేరిపోయే జీడిపప్పు వంట రుచి చూడకపోతే సర్వం కోల్పోయినట్టుగా ఇంకొంతమంది ముఖాలు మాడ్చుకుంటారు. వంటలలో ఈ దినుసు పడిందంటే కాస్త కాస్ట్లీవారన్న అభిప్రాయానికి చేరువచేస్తుంది ఈ దినుసు. తెలుగు వారిచేత కాజు, జీడిపప్పుగా పిలుచుకునే క్యాషోనట్ అనకార్డియేసి కుటుంబానికి చెందినది. బహుశా మన గుండెకు, గుండె పై భాగానికి శక్తి తెచ్చే గుణాలు మెండుగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టి ఉంటారు.

గుండె బలానికి, కండ బలానికి మేలైనదిగా ఎంచుకుని ఇష్టంగా తినే జీడిపప్పు భారతదేశంలోనూ విరివిగానే పండుతోంది. కాని దీని నేటివ్ ప్లేస్ మాత్రం ఉత్తర దక్షిణ అమెరికాలుగా చెబుతున్నారు. పోర్చుగీసు వారు భారత దేశంలో అడుగుపెట్టి, వ్యాపారాలు చేసుకునే రోజుల్లో ఈ దినుసును మనకు పరిచయం చేశారని చరిత్ర చెబుతోంది. అయితే పచ్చివి కాకుండా వేయించిన జీడిపప్పును పరిచయం చేశారట. వారి ద్వారా ఈ మొక్క మన దేశంలో ముందుగా గోవాలో అడుగుపెట్టి, ఆ తర్వాత దక్షిణ తూర్పు ఆసియా, ఆఫ్రికాలోనూ వ్యాపించిందని చెబతుంటారు. ఆ తర్వాత ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడే జీడిచెట్లు వేళ్లూనుకుపోయాయి.

ఎత్తు తక్కువైనా తనలో విశాలత్వం ఎక్కువ అని చెప్పడానికేమో ఈ చెట్టు బహుసుందరంగా ఉంటుంది. ప్రతి పువ్వు లేత ఆకుపచ్చలో ఉండి, క్రమంగా ఎరుపు, పసుపు రంగులోకి మారుతుంది.

ప్రకృతిలో జీడిపండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో వస్తాయి. ఈ పండ్లను తింటే వగరుగా ఉంటాయి. ఈ జీడిరసం బట్టల మీద పడితే మాత్రం ఆ మరక ఎన్ని డిటెర్జెంట్లు రాసినా వదలదు. చర్మం మీద పడినా కొంచెం ప్రమాదమే అంటారు. అందుకే వీటితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో ఉండే అనకార్డిక్ ఆమ్లాలు దంత సమస్యలను తగ్గిస్తాయట. వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అతిసార వల్ల కలిగే విరేచనాలు తగ్గుతాయి. ఈ జీడిపప్పు ఆయిల్‌ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోగిస్తారు.

జీడి పిక్కలను జీడిపప్పుగా తయారు చేసే పరిశ్రమలు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పుగోదావరిలోని మోరి గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉపాధి పొంతున్నాయి. ఈ జీడిపప్పు ఎగుమతి ద్వారా భారత దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యమూ లభిస్తుంది.