Sunday, May 15, 2016

వాము మొక్క

వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది
వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానపుడు 'కాసింత వాము వేణ్ణీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది' అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో (జంతికలు, మురుకులు) వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దది
ఔషధోపయోగాలు
వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.
గొంతులో బాధ: వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.
మూత్రాశయంలో రాళ్ళు: వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్‌ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్లిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది.
చనుబాలు వృద్ధి: ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి.
జలుబు, తలనొప్పి: జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.
ఆస్తమా: ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.
గుండె వ్యాధులు: గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
కీళ్ళ నొప్పులు: వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
కాలిన గాయాలకు: కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది.
దంత సమస్యలకు: పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి.
దగ్గు: దగ్గు వచ్చినపుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు

Saturday, May 7, 2016

కంటి చుట్టూ ఉన్న నరాలు ఆరోగ్యంగా ఉండడానికి చిట్కాలు

1) మన కళ్ళు చుట్టూ ఉన్న ప్రకృతిని చూడడానికి దేవుడు ప్రసాదించిన వరం.దేవుడు ఇచ్చిన ప్రతి అవయవాన్ని కాపాడుకోవడం మన భాద్యత.
2) కళ్ళు అతి సున్నితమైన అవయవాలు.అవయవాల్లో ఎక్కువ అలిసిపోయేవి కళ్ళు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు చూస్తూ అలిసిపోతూ ఉంటాయి.
3) మొబైల్ రేడియేషన్ , కంప్యూటర్ రేడియేషన్ , టీవీ రేడియేషన్ , తగినంత నిద్ర లేకపోవడం, న్యూట్రిషన్ లోపం ఇవ్వన్ని కళ్ళను ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి.వీటిని తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
4) ప్రతి రోజు సాయంత్రం లేదా కళ్ళు అలసటకు గురి అయినప్పుడు కొంచెం కొబ్బరి నూనె తీసుకొని వేడి చేసి , గోరు వెచ్చగా అయ్యాక , కళ్ళు మూసి రెప్పలపై , కనుబొమ్మలపై , కంటి చుట్టూ చాలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
5) ఇలా చేయడం వల్ల కంటి చుట్టూ ఉన్న నరాలు బలంగా తయారవుతాయి.కళ్ళ కింద నలుపు , వలయాలు , కంటి కింద ముడతలు తగ్గుతాయి.
6) కంటి ఆరోగ్యం బాగుండాలంటే A విటమిన్ ఉన్న పండ్లు , కూరగాయలు
ఆహరంలో భాగం చేసుకోవాలి.రోజులో తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.మొబైల్ , కంప్యూటర్ అవసరానికి మాత్రమే వాడుకోవాలి.
7) ముఖ్యంగా క్యారట్ , బీట్స్ , ఆకుకూరలు , బొప్పాయి , పాలు , గ్రుడ్లు , చేపలు , సోయాబీన్స్ లాంటివి తీసుకోవాలి.
ఇలా పాటిస్తే కంటి చూపు మెరుగుపడి , కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆరోగ్య చిట్కాలు

రాత్రి నీటిలో నానబెట్టిన బాదంను మరుసటి రోజు ఉదయం పరగడుపు తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది . ఇందులో విటిమన్స్, మినిరిల్స్ అధికంగా ఉంటాయి . ఇంకా మెగ్నీషియం, మరియు ఐరన్ కూడా అధికంగా ఉంటాయి . ఇందులో ఉండే ఎంజైమ్స్ రెస్పిరేటర్ హీలింగ్ పవర్ ను నయం చేస్తాయి . కాబట్టి మీరు బ్రొకైటిస్ తో బాధపడుతుంటే బాదంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.