యోగాతో లాభాలెన్నో... యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసి
ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్నకొద్దీ శరీరం
తేలికవుతుంది, ఆలోచనలు దారికి వస్తాయి, జీవనశైలిలో మంచి మార్పొస్తుంది.
యోగా వల్ల కలిగే ముఖ్యమైన తొమ్మిది లాభాలు ఇవే...
ఆల్‌రౌండ్ ఫిట్‌నెస్
: శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతౌల్యత
ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా
జీవిస్తారనే దే ఆరోగ్యానికి కొలమానం. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం - ఇవన్నీ కలిసి ఒక ప్యాకేజ్‌గా దానికి దోహదపడతాయి.
బరువు తగ్గడం : దరికీ కావాల్సిందిదే. సూర్యనమస్కారాలు, కపాలభాతి
ప్రాణాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా యోగా
చేసేటపుడు మనకు తెలియకుండానే మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ ఏర్పడుతుంది.
దానివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
ఒత్తిడి నివారణ : ఉదయాన్నే
కొద్దిసేపు యోగా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.
శరీరంలోని మలినాలను వదిలించడంతో పాటు మనస్సు పరిశుభ్రంగా ఉండటానికి యోగా
ఉపయోగపడుతుంది.
ప్రశాంతత : ప్రకృతిలోని ప్రశాంతమైన, సుందరమైన
ప్రదేశాలంటే మన అందరికీ ఇష్టమే. కాని ప్రశాంతత కోసం ఎక్కడికో వెళ్లనవసరం
లేదు, అది మనలోనే ఉంటుంది. రోజుకోసారి లోపలికి ప్రయాణించి దాన్ని అనుభూతి
చెందవచ్చు. అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపరచడానికి యోగాను మించిన
సాధనమేదీ లేనేలేదు.
రోగనిరోధక శక్తి : శరీరం, మనసు, మేథ - అన్నీ
కలిస్తేనే ఆరోగ్యం. యోగా అవయవాలకు సరిపడా శక్తినిస్తుంది, కండరాలను దృఢం
చేస్తుంది. శ్వాస టెక్నిక్‌లు, ధ్యానం ద్వారా స్ట్రెస్ తగ్గి రోగనిరోధక
శక్తి పెరుగుతుంది.
అవగాహన : మన ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు.
గతం, భవిష్యత్తులకు సంబంధించిన అనేక అంశాలతో అది పరుగులు పెడుతూ
ఉంటుందేగాని వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. యోగ, ప్రాణాయామాల వల్ల ఈ సత్యం
అవగాహనలోకి వస్తుంది. దాంతో ఆలోచనలను నియంత్రించడం సులువు అవుతుంది.
అప్పుడే వర్తమానం మీద ఫోకస్ చెయ్యగలుగుతాం.
మెరుగైన సంబంధాలు :
జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు - ఇలా చుట్టూ ఉన్న
అన్ని బంధాలనూ మెరుగు చెయ్యడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ప్రశాంతమైన మనసు, అదుపులో ఉండే భావోద్వేగాల వల్ల ప్రేమ, అనుబంధాలు
దృఢమవుతాయి.
ఎక్కువ శక్తి : ఒకేసారి నాలుగు రకాల పనులు చెయ్యడంతో
రోజంతా పనిచేసిన తర్వాత పూర్తిగా అలసిపోయి, శక్తినెవరో లాగేసినట్టు
అయిపోతారు చాలామంది. కొద్దిసేపు యోగా చేస్తే మళ్లీ తాజాగా, ఉత్సాహంగా
ఉంటారు.
ఫ్లెక్సిబిలిటీ : ఉరుకులుపరుగులు నిండిన జీవనశైలి వల్ల
చిన్నాపెద్దా అందరికీ సాయంత్రానికల్లా ఒంటి నొప్పులు సాధారణమైపోయాయి. యోగా
కండరాలను బలోపేతం చేసి టోన్ చేస్తుంది. నడిచినా, నిలబడినా, కూర్చున్నా
సరైన భంగిమలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. దానితో ఒంటి నొప్పులు ద రికి
చేరవు.
‘very good website’
ReplyDeleteayurbless team
visit my ayurveda free treatment website: www.ayurbless.com
veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy useful...thanks for publising
ReplyDelete