ఆయుర్వేదం ప్రకారం తులసీలో ఎన్నో గుణాలు దాగివున్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండటం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలను నివారిస్తుంది.
తులసీ ఆకుల రసం లేదా ఆకులు వేడి వేసి మరగ కాచిన వేడి నీళ్లలో ముంచి వెలువడు ఆరోమాటిక్ ఆవిర్లు పీల్చినచో జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, ఊపిరి తిత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆకుల ఇన్‌ఫ్యూజన్ శరీరానికి రాసుకుంటే చికెన్ ఫాక్స్, మీజిల్స్ వంటి అంటు వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. అజీర్తి, కలరా, విరేచనాలను అరికడుతుంది. రోజ్ వాటర్‌తో కలిపి చుకకలుగా వాడినచో ముక్కు నుంచి రక్తస్రావం, కంటి, చెవి సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.
నోటి దుర్వాసనను నివారిస్తుంది. దంత సమస్యలను నివారించడంతో పాటు దంత సమస్యలకు వాటి పటిష్టతకు, చర్మం కాంతివంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది
Saturday, January 17, 2015
వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా? గ్రేప్ జ్యూస్ తాగండి!
వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టాలా.. అయితే గ్రేప్ జ్యూస్ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ద్రాక్షరసం ఎక్స్‌ఫ్లోట్‌కు సహాయపడుతుంది. నిజానికి, చర్మంపై ద్రాక్ష రసం వంటకాలను రాస్తే ఎక్స్ ఫ్లోట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
చర్మంతో పాటు ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించుటకు, ముడతలకు తగ్గించడంలో గ్రేప్ జ్యూస్ ఉత్తమమంగా పనిచేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ద్రాక్షరసం సహజంగా చర్మం తేమగా ఉంచుతుంది.
ముఖానికి ఒక టేబుల్ స్పూన్ ద్రాక్ష రసం రాసి, 15 నిముషాల తర్వాత వెచ్చని నీటితో కడగాలి. అప్పుడు చర్మం తేమగా ఉంటుంది. కళ్లచుట్టూ డార్క్ వలయాలను తొలగించుకోవాలంటే.. విత్తనాలు లేని ద్రాక్షను తీసుకుని కట్ చేసి కనురెప్పల మీద ఉంచాలి. ఈ విధంగా చేయటం ద్వారా డార్క్ వలయాలు తొలగిపోతాయి.

Subscribe to:
Posts (Atom)