ఆయుర్వేదం ప్రకారం తులసీలో ఎన్నో గుణాలు దాగివున్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండటం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలను నివారిస్తుంది.
తులసీ ఆకుల రసం లేదా ఆకులు వేడి వేసి మరగ కాచిన వేడి నీళ్లలో ముంచి వెలువడు ఆరోమాటిక్ ఆవిర్లు పీల్చినచో జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, ఊపిరి తిత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆకుల ఇన్‌ఫ్యూజన్ శరీరానికి రాసుకుంటే చికెన్ ఫాక్స్, మీజిల్స్ వంటి అంటు వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. అజీర్తి, కలరా, విరేచనాలను అరికడుతుంది. రోజ్ వాటర్‌తో కలిపి చుకకలుగా వాడినచో ముక్కు నుంచి రక్తస్రావం, కంటి, చెవి సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.
నోటి దుర్వాసనను నివారిస్తుంది. దంత సమస్యలను నివారించడంతో పాటు దంత సమస్యలకు వాటి పటిష్టతకు, చర్మం కాంతివంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment