Thursday, June 16, 2016

జలుబుకు తులసి ఆకుల టీ


'జలుబు తగ్గేందుకు మందులు వాడితే వారం, వాడకపోతే ఏడు రోజులు పడుతుంది' అంటారు. ఇది సరదాగా అనే వాడుక మాట. మామూలుగా జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాదు. గొంతులో ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఇలా టీ పెట్టుకుని, తరచుగా తాగుతూ ఉంటే, మంచి ఉపశమనం లభిస్తుంది.
కాస్త అల్లం, వాము, జీలకర్ర, తులసి ఆకులు, మిరియాలు, బెల్లం(పంచదార బదులుగా) టీ పొడిలో వేసి, మరిగించి, మరిగాకా, పాలు పొయ్యండి. ఇలా కాచిన టీ ను తరచుగా త్రాగితే, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

No comments:

Post a Comment