Tuesday, October 15, 2013

Drs Chandu

మన చర్మం రంగు అనేక కారణాల వల్ల తన సహజత్వాన్ని కోల్పోతుంది ఈ చర్మపు రంగు మారడానికి గల కొన్ని కారణాలు ... చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు., ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి కొన్ని చిట్కాలు #

1) కేరెట్ గుజ్జును, ముల్తానా మట్టితో (ఫుల్లర్ మట్టి) కలిపి ఒక చిక్కటి గుజ్జుగా తయారు చేయండి. ఒక విటమిన్ సి బిళ్ళను పొడి చేసి కలపండి. మీ ముఖం పైన పూసి, కడగడానికి ముందు ఇరవై నిముషాల పాటు ఉంచండి. ఇలా ప్రతి వారం చేయండి.
2) 4 టీ స్పూనుల పాల పిండిని తీసుకొని, హైడ్రోజన్ పెరాక్సైడ్ తో కలిపి పేస్ట్ లా చేయండి. దీనికి గ్లిసరిన్ కలిపి చర్మం రంగు మారిన ప్రదేశాలలో పూయండి. దీనిని 15-20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరిన్ ఔషధాల దుకాణాల్లో సులువుగా లభ్యమౌతాయి.
3) ఒక బంగాళదుంపను తోలు తీసి కొన్ని చుక్కల నీటిని దాని పైన వేయండి. చర్మం పైన మచ్చలుగా ఉన్న ప్రాంతంలో రుద్దండి. బంగాళదుంప రసం చర్మం పై ఉన్న మచ్చల రంగును తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
4) ఓట్ మీల్ పొడిని, పెరుగుతో కలిపి కొన్ని చుక్కల నిమ్మరసం, టమోటా రసం కూడా కలపండి. ఆశించిన ఫలితాలను సాధించడానికి వారానికొకసారి దీనిని ప్రభావిత ప్రాంతాలలో పూయండి.
5) తులసి ఆకులను, నిమ్మరసంతో కలిపి చర్మం రంగులోని మచ్చలను తగ్గించడానికి ప్రభావితప్రాంతాలలో పూయండి.
6) ఆలివ్ ఆయిల్ లో కలిపిన పంచదారతో మీ శరీర౦ పై రుద్దండి. పంచదార పూర్తిగా కరిగే దాక రుద్దాలి. దీన్ని మీ చేతులు, కాళ్ళు, మెడ, శరీరంలోని ఇతర ప్రభావిత ప్రాంతాలలో వాడవచ్చు.
7) నిమ్మరసం, తేనే, బాదం నూనె ప్రతీదీ ఒక టీ స్పూన్ తీసుకోండి. సహజసిద్ధమైన మెరిసే చర్మం కోసం దీనిని మీ ముఖంపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేయండి.
తగినన్ని మంచి నీళ్ళు తాగడం వలన మీ శరీరంలోని మలినాలు తొలిగిపోతాయి. తద్వారా అన్ని చర్మ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది
9) పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స.
10) మజ్జిగతో మొహాన్ని కడగడం వలన కూడా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు.

No comments:

Post a Comment