చిన్న వయసులోనే కళ్ల కింద నల్లచారలొస్తే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని
తొలిదశలోనే గుర్తించి ఇంటివైద్యాన్ని చేసుకుంటే తగ్గుముఖం పడతాయి.
- మార్కెట్‌లో నిత్యం మనకందరికీ అందుబాటులో ఉండేవి కీరా దోసకాయలు. తాజా కీర దోసను తీసుకుని అప్పటికప్పుడు ముక్కలుగా కోసి కాసేపు కళ్ల మీద ఉంచుకోవాలి.
- కీర దోస రసాన్ని కళ్ల కింది నల్లచారలకు పట్టించి.. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఉపశమనం లభిస్తుంది.
- దోసరసంలో బంగాళదుంప రసాన్ని కలిపి ఇలాగే చేయొచ్చు. దీనివల్ల కూడా నల్లచారల సమస్య తగ్గుతుంది.
- నల్లచారలకు మరింత మంచి ఫలితాన్ని అందించే జ్యూస్‌లలో టొమాటో జ్యూస్ ఒకటి. టొమాటోలోని ఔషధగుణాలు శరీరం మీదున్న నల్లమచ్చల్ని తొలగించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌తో మర్దన చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాలకు నీటితో శుభ్రం చేసుకోవాలి.
- టీ బ్యాగ్స్‌తో కూడా కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. చల్లటి నీటిలో టీ బ్యాగ్స్‌ను ముంచి, కళ్ల కింద కాసేపు ఉంచితే మంచిది.
- మార్కెట్‌లో దొరికే ఆల్మండ్ ఆయిల్ చక్కటి ఔషధం. జుట్టుకు మాత్రమే కాదు. కళ్ల కింద నలుపు చారల్ని వదిలించుకునేందుకు ఈ నూనెను వాడుకోవచ్చు.
- ఆరెంజ్ జ్యూస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ జ్యూస్‌లో కాస్త గ్లిజరిన్ కలిపి వారానికి మూడుసార్లు రాసుకుంటే ఊహించని ఫలితం వస్తుంది.
ఇవన్నీ చేస్తూనే మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం, కంటినిండా నిద్రపోవడం, సమతులాహారాన్ని తీసుకోవడంతో పాటు వీలైనన్ని మంచినీళ్లను తాగితే కళ్ల చారల సమస్య నుంచి బయట పడవచ్చు అంటున్నారు నిపుణులు.