రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్ పౌష్టికాహార లోపం, కాలుష్యాలు
దాడి చేయడం వల్ల, షాంపూలు, తలకు వేసుకునే రంగులతో రకరకాల ప్రయోగాలు చేయడం
వల్ల జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. మరి దీన్ని ఆపడం
ఎలా? అది మీ చేతుల్లోనే ఉంది. అందుకు బెస్ట్ మెడిసిన్ కూరల్లో వాడే
కరివేపాకు. అదెలాగంటే...
పొడవు, మందం బట్టి జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి.
ఇందులో నానబెట్టిన మెంతుల్ని ఆ నీళ్లతో సహా కలపొచ్చు. ఈ పేస్ట్‌ను మాడుకు
రాసుకుని రెండు గంటల పాటు ఉంచుకోవాలి. రాసుకున్న మిశ్రమం త్వరగా ఆరిపోకుండా
ఉండేందుకు తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరు వెచ్చటి
నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి. జుట్టు జిడ్డుగా అతుక్కున్నట్టు
ఉంటుంది గాని ఆరిన తరువాత బాగానే ఉంటుంది. ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నట్టు
అనిపిస్తే మైల్డ్ షాంపూ వాడొచ్చు.
జుట్టు ఆరిన తరువాత దువ్వితే
జుట్టుకు కరివేపాకులేమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి
జుట్టుకు వేసుకుంటే పట్టుకుచ్చులా మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం.
అంతేకాదు ఎక్కువ జుట్టు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది.
thanks a lot sukku
ReplyDelete