Tuesday, April 29, 2014

ప్రకృతి


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..
ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు.
curd-పెరుగుతో పొట్ట క్షేమం
మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
Herbal Tea - హెర్బల్ టీ

తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.
cherries -చెర్రీతో కీళ్లు భద్రం
చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.
Turmeric - పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..
ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.

Ginger - ఆర్థరైటిస్‌కి అల్లం
జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
fish - నడుంనొప్పికి చేప
మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది?

 
బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవరిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో లోపాలుండవచ్చు, లేదా 10% వరకు దంపతులిద్దరిలోనూ ఇదమిద్దముగా చెప్పలేని కారణాలవల్ల సంతానం కలగకపోవచ్చు. పెళ్లయి భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఏ విధమైన సంతాన నిరోధకాలు వాడకుండా ఉన్నా మొదటి సంవత్సరంలోపు సంతానం కలగనట్లయితే వెంటనే సంతాన సాఫల్యతా నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.

సంతాన లేమికి మగవారిలో ఉండే కారణాలు :

1. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండుట.
2. వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికముగా తేడాలుండుట.
3. వీర్యంలో వీర్య కణాలు లేకపోవటం.
4. వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం.
5. హొర్మొన్ల శాతంలో తేడాలుండుట.
6. వీర్యకణాల అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.
7. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు,
8. సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు,

ఆహారాలు :

చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి.

వెల్లులి : ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది.
దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి.
అరటి : మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో
ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.
పాలకూర : ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.
మిరపకాయ : చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు బాగా విశ్రాంతి తీసుకుంటది. మిరపలో సి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.
టమాటో : అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్‌(Licopan) చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి.
పుచ్చ : దేనిలో సమ్రుదిగా ఉండే లీకోపాస్, నీటి శాతం మగవారి ఫెర్టిలిటీ(male fertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైడ్రేషన్‌(hydration) ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది.
విటమిన్ సి : మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది. ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి.
ఆపిల్ : దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది.
జీడిపప్పు : బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ నీ మెరుగుపరుస్తాయి.

Sunday, April 27, 2014

శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)

 

శరీరంలో పేరుకొనే వ్యర్థాలు(free radicles)... అందంతో పాటూ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి.

మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా...
బీట్‌రూట్‌ :
ఈ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. పైగా దీన్ని కూరగానే కాదు, పచ్చిగా, జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.
యాపిల్‌ :
రోజుకో పండు తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు. అదే సమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. దీన్నుంచి అందే విటమిన్లూ, ఖనిజాలూ, ఫ్లవనాయిడ్లూ కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతాయి.
దానిమ్మ :
దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.
యాంటి ఆక్షిడెంట్లు గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును.

తేనె సహజ ఔషధ గుణములు

తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు.
ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి.
చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.
గొంతులో గరగరలను తగ్గిస్తుంది. . నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,
తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి.
తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.
రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది.
తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది.
రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు.
వేడినీటిలో ఒక స్పూన్‌ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది.
తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,
యాన్తి బ్యాక్తెరియాల్ , యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన ,.. గాయాలు మానును .
తేనే ... వెనిగర్ తో కలిపి 'vermifuge ' గా వాడుదురు .
రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది .
రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది .
నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .
తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .
రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .
తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .

Tuesday, April 15, 2014

రక్తపోటును నివారించే చిట్కాలు:-

ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎవరిని పలకరించినా హై బి.పి ఉందని అంటున్నారు. హై బి.పి. నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. విషయమేమిటంటే మనలో చాలా మంది హై బి.పి. ఉందన్న విషయం తెలియకుండానే గడిపేస్తుంటాం. హై బి.పి. లక్షణాలు అంత తేలిగ్గా తెలియవు. హై బి.పి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు, దాని ప్రభావం శరీరానికి ముఖ్య అవయవాలైన గుండె, కిడ్నీల పైనే మొదట పడుతుంది, అంతే కాదు ఈ హై బి.పి. ఒక లెవెల్ దాటిందంటే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి. ఇలా ఒక్క కారణం చేత వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల భారీన పడకుండా బిపిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా పూర్తిగా హైబిపిని తగ్గించుకోవడానికి క్రింది ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి
1.పుచ్చకాయ :-
నియాసిన్‌, పాంటోథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ సి, మాంగనీస్‌లు దీనిలో అధికంగా ఉంటాయి. బి.పి.ని తగ్గిస్తుంది. హై బిపి నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.
2.అరటి పండ్లు:-
అరటిపండ్లు ఆన్లైన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం,అరటి వంటి పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తినడం మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించడం ద్వారా భవిష్యత్తులో ప్రతి సంవత్సరంను సేవ్ చేయవచ్చు. పొటాషియం అనేది శరీరంలోని ద్రవాల సంతులనం చేసి తక్కువ రక్తపోటుకు సహాయపడే ఒక ముఖ్యమైన ఖనిజం. మీరు ఐదు అరటిపండ్లను తినే విధంగా చూసుకోవాలి.
3.మొలకలు :-
మంచి ఆరోగ్య పోషకాలు ఉన్న ఆహారం అవసరం. పోషకాలు ఏ సమయంలోనైన లోపం జరిగితే తక్కువ రక్తపోటు కారణమయ్యే సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, పూర్తి పోషకాలున్న మొలకలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.
4.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు:-
ఆరెంజ్, కివి, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష మరియు స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు. మీ బ్లడ్ ప్రెజర్ సహజ నియంత్రణలో ఉండాలంటే, ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాలి.
5.పెరుగు:-
పెరుగును ఆస్వాదించండి ఒక రోజులో కేవలం ఒక చిన్న కుండలో మూడో వంతు పెరుగు ద్వారా అధిక రక్తపోటు అవకాశాలను తగ్గించవచ్చు. US మిన్నెసోటా విశ్వవిద్యాలయం సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం సహజ కాల్షియం రక్త నాళాలను ఎక్కువ అనువుగా చేయవచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. కొద్దిగా విస్తరించేందుకు మరియు ఒత్తిడి ఉంచడానికి అనుమతిస్తుంది. ప్రతి రోజు 120g పెరుగును15 సంవత్సరాల కాలం తిన్న వారిలో అధిక రక్తపోటు అభివృద్ధి 31 శాతం తక్కువ అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు.
6.నిమ్మకాయ :-
నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం , ఎందుకంటే నిమ్మకాయలో ఉండే విటమిన్ పి, బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది
7.వెల్లుల్లి:-
హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది.
8.కొత్తిమీర :-
కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది.
9.టమాటాలు:-
ఎర్రగా ఉండి మంచి రసాన్ని ఇచ్చే టమాటా పండులో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.
10.బంగాళాదుంప:-
బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్తపడాలి.
11.ఉసిరికాయ:-
ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మరొక ముఖ్య గమనిక :-
హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

Monday, April 14, 2014

రాగులు

రాగులు బలవర్దకమయిన ధాన్యం. రాగి సంగటి అనగానే గుర్తొచ్చేది రాయలసీమ. ఆ జిల్లాల్లో ఇప్పటికీ దానినే ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక ఒకప్పుడు దీనిని పొద్దున్నే జావగా చేసి పాలల్లో, మజ్జిగలో కలుపుకుని తాగేవారు మన పెద్దవాళ్ళు. అయితే ఇంకా చెప్పాలంటే మన ఇళ్ళల్లో కోళ్ళకు వీటినే బలమైన ఆహారంగా పెట్టేవారు ఒకప్పటి తరం వారు. ఎందుకంటే దీనిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంగటికీ రాగులతో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది. రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందామా..!
1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.

Saturday, April 12, 2014

చెరకు రసం

చెరకు రసం చక్కని పరిష్కారం:-
చెరకు రసం పిల్లాపెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో పొటాషియం అధికం. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం.
1.1. కామెర్లకు విరుగుడు:-
చెరకు రసం కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది. కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి.
2. కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు:-
చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.
3.మధుమేహానికి:-
మధుమేహం ఉన్నవారికి చెరకు రసం బాగా సహాయపడుతుంది . ఇది ముడి షుగర్ కన్నా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కన్నా ఈ చెరకు రసం చాలా మంచిది. మీరు బరువు తగ్గించే పనిలో ఉన్నా లేదా డయాబెటిక్ చెరకు రసం జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్ వల్ల శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దీకరిస్తుంది.
4.న్యూట్రిషియన్ బెనిఫిట్స్:-
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం.
5.జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి:-
మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ చెరకు రసం జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
6.క్యాన్సర్ నివారిణి:-
ఇందులో ఆల్కలీన్ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
7.రీహైడ్రేషన్:-
సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది

Wednesday, April 9, 2014

సబ్జా గింజల్లోని ఔషధ గుణాలేంటి..?

1.సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతుంది. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
2.అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుముఖం పడుతుంది.
3.మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
4.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
5.ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
6.ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
7.సబ్జా వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి