బిడ్డలు పుట్టక పోవడానికి దోషం ఎవరిలో ఉంది?
ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, పనికి
మాలినదని ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. దంపతుల మధ్య
నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు, లేదా
ఇద్దరూ కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. దంపతులలో సంతానం
కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో
సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవరిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు
మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో లోపాలుండవచ్చు, లేదా 10%
వరకు దంపతులిద్దరిలోనూ ఇదమిద్దముగా చెప్పలేని కారణాలవల్ల సంతానం
కలగకపోవచ్చు. పెళ్లయి భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఏ విధమైన సంతాన
నిరోధకాలు వాడకుండా ఉన్నా మొదటి సంవత్సరంలోపు సంతానం కలగనట్లయితే వెంటనే
సంతాన సాఫల్యతా నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.
సంతాన లేమికి మగవారిలో ఉండే కారణాలు :
1. వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండుట.
2. వీర్య కణాల కదలిక, సారూప్యంలో అధికముగా తేడాలుండుట.
3. వీర్యంలో వీర్య కణాలు లేకపోవటం.
4. వీర్య కణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవటం.
5. హొర్మొన్ల శాతంలో తేడాలుండుట.
6. వీర్యకణాల అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు.
7. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు,
8. సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు,
ఆహారాలు :
చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు
తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో మగవారిలో
స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి.
వెల్లులి : ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది.
దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి.
అరటి : మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో
ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో
ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.
పాలకూర : ఫోలిక్ఆసిడ్ ఉంటుంది . ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.
మిరపకాయ : చాల మందికి మిరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని
ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మిరపని
ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన మెదడు బాగా
విశ్రాంతి తీసుకుంటది. మిరపలో సి, బీ , ఈ.. విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.
టమాటో : అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో
కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్(Licopan) చక్కని వీర్య శక్తి ,
మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం
చేసుకోవాలి.
పుచ్చ : దేనిలో సమ్రుదిగా ఉండే లీకోపాస్, నీటి శాతం
మగవారి ఫెర్టిలిటీ(male fertility) ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము
కౌంట్ ను పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైడ్రేషన్(hydration)
ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది.
విటమిన్ సి : మేల్ ఫెర్టిలిటీ
మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఇది కాపాడుతుంది.
ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం
లోని'సి' విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు
పొగత్రాగటం మానివేయాలి.
ఆపిల్ : దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు
తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం
కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది.
జీడిపప్పు : బోజనాల్లో జీడిపప్పు తీనడం
వలన కడుపు నిండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది
జింక్ ఫెర్టిలిటీ నీ మెరుగుపరుస్తాయి.
No comments:
Post a Comment