Tuesday, June 3, 2014

సున్ని పిండి తయారు చేసుకునే పద్ధతి

 సున్ని పిండి ఒక ఆరోగ్య సౌందర్య సాధనం.శనగపిండి, పెసరపిండి వీటికి తోడు కచ్చూరాలని బజారులో దొరుకుతాయి వాటిని కలిపి దంచుకుని, దీనికి కొద్దిగా షీకాయిపొడి కాని, కుంకుడు కాయ పొడి కాని కలిపివాడుకోవచ్చు.దీనిని నిత్యమూ వాడుకోవచ్చు. ఒళ్ళు రుద్దుకుని నీళ్ళు పోసుకుంటే చర్మం నిగనిగ లాడుతుంది. తలంటు పోసుకున్నపుడు దీనిని జుట్టుకు పట్టించి రుద్దుకుంటే బాగుంటుంది.సున్నిపిండి కలిపేటపుడు కొద్దిగా మందార ఆకులు కూడా కలిపిన కుంకుడు కాయ రసంతో తల రుద్దు కుంటే జిడ్డు తొందరగా వదులుతుంది.తలంటు పోసుకునే ముందు ఒంటికి నూని రాసుకుని ఆ తరవాత తడిసిన సున్నిపిండి రాసుకుని కొద్దిగా ఆరిన తరవాత స్నానం చేస్తే ఒంటినున్న మట్టి పోతుంది.మట్టి శరీరం మీద చెమటతో కలిసి నల్లగా పేతుకుపోతుంది, ఇది పోవాలంటే, సబ్బు వల్ల కాదు. ఈ మట్టి మూలంగా ఫంగస్ ఏర్పడి చర్మ వ్యాధులు కూడా రావచ్చు. మగవారికి, అందునా ఒంటినిండా రోమాలున్నవారికి శుభ్రపరచు కోవటం కష్టం , అందుకు వారు నూనె రాసుకుని కొద్దిసేపు తర్వాత ఈ సున్నిపిండితో రుద్దుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు సౌందర్యానికి సౌందర్యం !


No comments:

Post a Comment