నేత్రదానం
మీద సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ అనర్ధాలు జరుగుతున్నాయి.
ఎందుకంటే నేత్రదానం చేయకపోతే ఇప్పుడు మాత్రమే నష్టం. కానీ దాని గురించి
తెలుసుకోక పొతే వచ్చే తరం, ఆ తర్వాత తరం... అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి
తరతరాలు నష్టం కలగటానికి ఇది ప్రధాన కారణం. అందకే నేత్రదానం పట్ల ప్రతి
ఒక్కరిలో అవగాహన ఉండాలి.నేత్రదానం అనేది 1 సంవత్సరం నుండి వందసంవత్సరాల పైబడినవారు కూడా చేయగల ఏకైక దానం.నేత్రదానం అంటే కళ్ళు మొత్తం స్వీకరించరు కేవలం కంటి పైన గల ఒక పొర మాత్రమే స్వీకరిస్తారు.
నేత్రాలను నేత్రదాత మరణించిన 3 నుండి 5 గంటలలోపు మాత్రమే సేకరించాలి. కనుక వెంటనే దగ్గరలోని ఐ బ్యాంక్ కు సమాచారం ఇవ్వాలిఎయిడ్స్, పచ్చ కామెర్లు, రేబిస్ (కుక్కకాటు) మినహా మిగతా ఏ కారణం తో మరణించినా నేత్రదానం చేయవచ్చు.నేత్రదానం చేయాలి అనుకుంటే అందుకు దగ్గరలో ఉన్న నేత్రనిధికి వెళ్లి మీ
పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ కార్డు
మీదగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవటం మంచిది.
కార్నియా అనేది మన కంటిమీద ఉండే
ఒక పొర. కంటిలోకి కాంతి కిరణాలు వెళ్లాలంటే ఈ పొర గుండా మాత్ర మే
కంటిలోపలకు వెళ్తాయి. మన శరీరంలో ఏ అవవయం చెడిపోయినా ఆపరేషన్ చేసి
బాగుచేయవచ్చు. కానీ లివర్ (కాలే యం), కార్నియా చెడిపోతే ఏమీ చేయలేము.
కేవలం వేరొకరు దానం చేస్తే మాత్రమే తిరిగి చూపు పొందటానికి మార్గం ఉంటుంది.
అందుకు నేత్రదానం ఒక్కటే మార్గం.మన శరీరంలో అన్ని అవయవాలు ఆక్సిజన్
(ప్రాణ వయవు)ను రక్తం ద్వారా స్వీకరిస్తాయి. కానీ ఈ కార్నియా ఒక్కటే నేరుగా
గాలి నుండి ఆక్సిజన్‌ను స్వీకరిస్తుం ది. అందుకే నేత్రదాత మరణించిన వెంటనే
అన్ని అవయవాలు చనిపోతే కేవలం ఈ కళ్ళు మాత్రం 6 గంటల వరకు గాలిలోని
ఆక్సిజన్‌ను స్వీకరిస్తూ బ్రతికి ఉంటాయి.నేత్రనిధి కేంద్రాల కోసం మీకు దగ్గరలోని ఐ బ్యాంక్ యొక్క చిరునామా కోసం క్రింది అడ్రస్‌ను సంప్రదించండి.
Dr S .Chandu
phone : 9440017115
E-mail : drschandu@dr.com , drschandu@gmail.com
Eye bank association of India
Plot No: 12, BNR Colony,
Road No: 14, Banjarahills, Hyderabad - 500034
Phone: 040 23545454, 23544504
Website: www.ebai.org
E-mail: ebai@vsnl.net, admin@ebai.org
No comments:
Post a Comment