Sunday, July 19, 2015

సహజ అందానికి తేనె ...!



సహజ అందానికి తేనె ...!
తేనె సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. చెంచా తేనెలో రెండు చెంచాల బాదంనూనె, అరచెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తరవాత కడిగేయాలి.
• తేనె, నిమ్మరసం మిశ్రమం మొటిమలను తగ్గిస్తుంది. రెండు చెంచాల తేనెకి చెంచా నిమ్మరసం చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమల సమస్య ఉండదు.
• రెండు చెంచాల తేనెకి చెంచా ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాసి పావుగంట తరవాత శుభ్రం చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది. చెంచా తేనె, రెండు చెంచాల చొప్పున పాలూ, కీరదోస గుజ్జూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా తేనెకి రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో శుభ్రం చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.

నల్లటి వలయాలు దూరం ఇలా..!

నల్లటి వలయాలు దూరం ఇలా..!
తగినంత నిద్ర లేకపోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. దీన్ని నివారించాలంటే కీరదోస బాగా పనిచేస్తుంది. కీరదోస రసాన్ని కళ్ల కింద రాసి పావు గంట తర్వాత కడిగేయాలి.
• చెంచా చొప్పున టొమాటో, నిమ్మరసం కలిపి సమస్య ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. పచ్చిపాలలో దూదిని ముంచి కళ్ల చుట్టు రాసి పావు గంట తర్వాత కడిగేయాలి.
• గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా చేసి కళ్ల చుట్టూ రాయాలి. పావు గంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేస్తే ఫలితం ఉంటుంది. రెండు చెంచాల తేనె తీసుకుని కళ్ల కింద రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
• గులాబీ నీళ్లు అలసిపోయిన కళ్లను తాజాగా ఉంచుతాయి. చర్మపు రంగును తిరిగి తీసుకొస్తాయి. వీటన్నింటితోపాటూ నల్లనివలయాలనూ దూరంచేస్తాయి.

Saturday, July 18, 2015

" నడుం నొప్పి" కి చిన్న చిన్న జాగ్రత్తలు

" నడుం నొప్పి" కి చిన్న చిన్న జాగ్రత్తలు
******************************************
జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం లో నడుము నొప్పిని అనుభవించే ఉంటారు . దానికి ఎన్నో కారణాలు . కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది .

ఈ రోజుల్లో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలి విధానమే. ఒక ప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి ఆధునిక యుగంలో యుక్తవయస్కులను సైతం బాధిస్తుంది. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెన్నుముక, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లే సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగడం వల్ల, నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది.

కారణాలు:
**********

నడుము నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పు. (కార్టిలేజ్‌ వెన్నుపూసలు సులువుగా కదలడానికి తోడ్పడుతుంది) కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్లనొప్పి వస్తుంది. నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే. ఇంతేకాకుండా టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీంతో నడుము నొప్పి ఏర్పడుతుంది. చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య నడుము నొప్పి..... ఇంట్లో రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే కొన్ని పనులకు... ముఖ్యంగా స్త్రీలు వంట పనులు చేస్తున్నప్పుడు వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు ఇది కలుగుతుంది.

- స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉప యాగించిన కుర్చీలలో అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం .
- పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
- కంప్యూటర్స్‌ ముందు ఎక్కువ సేపు కదలకుండా విధులు నిర్వర్తించటం.
- తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం,
- ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం లేదా ప్రక్కకు తొలగటం వలన నడుము నొప్పివస్తుంది.
- ఉద్యోగంలోని అసంతృప్తి అనారోగ్యాన్ని పెంచిపోషిస్తుందంటున్నాయి అధ్యయనాలు. వెన్నునొప్పికీ ఉద్యోగంలో ఎదుర్కునే అసంతృప్తులకు సంబంధం ఉందంటున్నాయి క్వీన్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు. తక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటున్న తోటి ఉద్యోగస్తులతో పోల్చుకుంటే వృత్తి జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్నవారిలో వెన్నునొప్పి తగ్గడానికి చాలాకాలం పడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది.

లక్షణాలు:
**********

నడుము నొప్పి తీవ్రంగా ఉండి వంగటం, లేవటం, కూర్చోవటం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించ రాకుండా ఉంటుంది.

జాగ్రత్తలు:
**********

- సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
- నడుము నొప్పి నివారణకు ప్రతిరోజు వ్యాయా మం, యోగా, డాక్టర్‌ సలహ మేరకు చేయాలి.
- ముఖ్యంగా స్పాంజి ఉన్న కుర్చీల్లో కూర్చు న్నప్పుడు సరైన భంగిమల్లోనే కూర్చోవాలి.
- వాహనాలు నడిపేటప్పుడు సరైన స్థితిలో కూర్చోవాలి.
- సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, ఒకేసారి హటాత్తుగా వంగటం చేయకూడదు.
- నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
- శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
- శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
- స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
- పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. స్థూల కాయం తగ్గించుకోవాలి.

నడుం నొప్పికి చిన్న చిన్న జాగ్రత్తలు
* కుర్చీలో నిటారుగా కూర్చోండి. భుజాలు ముందుకు వాలినట్లుగా ఉండకుండా వెనక్కి ఉండేలా చూసుకోండి.
* వీపు పై నుంచి కింద వరకు కుర్చీకి ఆనుకుని ఉండేలా చూసుకోండి.
* మోకాళ్ళని సరియైన దిశలో మలుచుకుని ఉంచండి. కాలు పక్కకు వంచి కూర్చోవడం చేయకండి.
* మోకాళ్లని హిప్స్ కంటే కొంచెం ఎత్తులో ఉండేలా పెట్టుకుని కూర్చుంటే మరీ మంచిది.
* ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
* కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
* అధిక బరువు ఉంటే వెంటనే తగ్గించుకోండి.
* ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్స :
********
బుటాల్జిన్ అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున వాడినట్లయితే ఈ నడుము నొప్పి తగ్గుతుంది. అంటే వీటిని ప్రతి 8 గంటలకు ఒకసారి మాత్రమే వాడాలి. ఇవి కాకపోతే బెరిన్ టాబ్లెట్లను రోజుకు రెండు చొప్పున వాడినా నడుము నొప్పి బాధ తగ్గతుంది.

దీనికి కొన్ని రకాల పైపూత మందులు(Dolorub, Zobid gel , Nobel gel etc.) కూడా వచ్చాయి. అయితే ఇటువంటి వాటిని జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒకవేళ ఈ మందులు వాడినప్పటికీ నడుము నొప్పి తగ్గకపోయినట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.

వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఆమ్లా - హనీ డ్రింక్

వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఆమ్లా - హనీ డ్రింక్  
కావాల్సిన పదార్ధాలు 
1) ఉసిరి రసం - 2 స్పూన్స్ 
2) తేనె - 1 స్పూన్ 
3) గోరువెచ్చని నీరు - 1 గ్లాస్
వాడే విధానం 
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉసిరి రసం , ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి. ఇలా చేస్తే ఇమ్యునిటి పవర్ పెరుగుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ బయటికి విడుదల అవుతాయి.

For Diabetes Type 2 Sufferers - Try this and report back...

For Diabetes Type 2 Sufferers - Try this and report back...
Cut the ends off of a few okra, put in a cup with water overnight, the next day remove the okra and drink the water...Diabetes will go away and so will your shots...
Everything created by God.Tested on humans,the results, according to tests were miraculous! One volunteer said that their blood glucose decreased from 300 to 150.Another, fell from 195 to 94-and even said that the okra water played the role of insulin,very well done".Share this, as it will surely help many!!!

Wednesday, July 15, 2015

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలను స్టోర్ చేయడం చాలా సులభం. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి. 100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు. పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. ఇందులో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా కలిగి ఉన్నాయి. ఇవి ఎక్కువ ఫైబర్(పీచుపదార్థాల) ను కలిగి ఉండి జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతాయి. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు..మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు. కర్జూరంలో అధిక శాతంలో అంటే అరటి పండులో కంటే ఎక్కుంగా పొటాషియం కలిగి ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాపడుతుంది. బ్లడ్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. కర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె నొప్పిని రాకుండా అడ్డుకోవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే ఐరన్ క్రోనిక్ అనీమీయా రాకుండా కాపాడుతుంది. కర్జూరంలో విటమిన్స్ కన్నా అమీనో యాసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాపడుతాయి. కర్జూరంలో ఇంకా పెక్టిన్ అనే రసాయనం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్ ను అదుపులో ఉంచుతుంది. కర్జూరాలను తరచూ తినడం వల్ల ఆబ్డామినల్ క్యానర్ రాకుండా కాపాడుతుంది. అంతే కాదు కర్జూరాలు గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరం. వారు ఇవి తినడం వల్ల ప్రసవం సులభతరం అవుతుంది. గర్భిణీ స్త్రీకి కావల్సిన కె విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కర్జూరంలో దంతక్షయాన్ని పోగొడుతాయి. ఇందులో ఉండే ప్లోయిరిన్ దంతాలు గంటిగా ఉండేలా సహాపడి, త్వరగా ఊడిపోకుండా కాపాడుతాయి. ఇంకా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెక్స్యూవల్ స్టామినా ను పెంచుతుంది. ఎముకల పెరుగుదలకు బాగా సహాపడుతుంది. ఇన్నిఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కర్జూరాలను కేక్స్, కుక్కీస్ లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం. కాబట్టి కర్జూరాలను మీ రెగ్యులర్ డైయట్ లో చేర్చి ఆరోగ్యంగా అందంగా జీవించండి