Sunday, July 19, 2015

సహజ అందానికి తేనె ...!



సహజ అందానికి తేనె ...!
తేనె సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది. చెంచా తేనెలో రెండు చెంచాల బాదంనూనె, అరచెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తరవాత కడిగేయాలి.
• తేనె, నిమ్మరసం మిశ్రమం మొటిమలను తగ్గిస్తుంది. రెండు చెంచాల తేనెకి చెంచా నిమ్మరసం చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మొటిమల సమస్య ఉండదు.
• రెండు చెంచాల తేనెకి చెంచా ముల్తానీ మట్టిని కలిపి ముఖానికి రాసి పావుగంట తరవాత శుభ్రం చేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది. చెంచా తేనె, రెండు చెంచాల చొప్పున పాలూ, కీరదోస గుజ్జూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చెంచా తేనెకి రెండు చెంచాల టొమాటో గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో శుభ్రం చేస్తే చర్మానికి నిగారింపు వస్తుంది.

No comments:

Post a Comment