నల్లటి వలయాలు దూరం ఇలా..!
తగినంత నిద్ర లేకపోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. దీన్ని నివారించాలంటే కీరదోస బాగా పనిచేస్తుంది. కీరదోస రసాన్ని కళ్ల కింద రాసి పావు గంట తర్వాత కడిగేయాలి.
• చెంచా చొప్పున టొమాటో, నిమ్మరసం కలిపి సమస్య ఉన్న చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. పచ్చిపాలలో దూదిని ముంచి కళ్ల చుట్టు రాసి పావు గంట తర్వాత కడిగేయాలి.
• గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా చేసి కళ్ల చుట్టూ రాయాలి. పావు గంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేస్తే ఫలితం ఉంటుంది. రెండు చెంచాల తేనె తీసుకుని కళ్ల కింద రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
• గులాబీ నీళ్లు అలసిపోయిన కళ్లను తాజాగా ఉంచుతాయి. చర్మపు రంగును తిరిగి తీసుకొస్తాయి. వీటన్నింటితోపాటూ నల్లనివలయాలనూ దూరంచేస్తాయి.
No comments:
Post a Comment