తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావా ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగులను మన మెనూలో చేర్చడం ద్వారా ఈ లాభాలు పొందవచ్చు.
రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి.
రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి.
రాగి జావని డైట్‌లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది. ప్రతి రోజూ రాగి డైట్‌ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు.
రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
రాగులంటే కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధ్యానం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా రాగులు కంట్రోల్ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రాగులది ప్రధాన పాత్ర.
రాగుల్లోని అమినోఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వుపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెసా్ట్రల్‌ను రాగులు పోగొడతాయి. హైపర్ టెన్షన్, బ్లడ్‌ప్రెషర్‌ని రాగులు చక్కగా నియంత్రిస్తాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్, అమినో యాసిడ్స్ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పిలాంటివి దరికి చేరవు. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది.
కాల్షియంతో పాటు ఐరన్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్‌తో పాటు ముఖ్యమైన అమినోయాసిడ్స్ ఉంటాయి. అందుకే రాగులతో చేసిన ఆహారం తినటం వల్ల కండరాలు గట్టిగా ఉంటాయి.
రాగుల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది.
వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ్ట్ట
వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ్ట్ట
No comments:
Post a Comment