Sunday, February 14, 2016

చెవి రోగాలు - ( Ear Dieseses ) నివారణ

* ఉత్తరేణి సమూల భస్మం నూనెతో కలిపి చెవిలో 4 నుంచి 5 చుక్కలు వేసిన కర్ణ రోగములు అన్ని హరించి పొతాయి.
* జిల్లేడు ఆకు, వావిలాకు , మునగాకు , కాకరాకు , తులసి ఆకు , గుంటగలగర ఆకు , ఆమూదపు ఆకు రసం తీసి మంచి నూనెలో వేసి కాచిన తరువాత చెవిలొ వేస్తుంటే చెవుడు తగ్గిపోతుంది.

* జిల్లేడు ఆకు రసంలో నువ్వుల నూనె పోసి కాచి రసం ఇగిరిన తరువాత వడపోసుకొని చెవిలొ వేసుకుంటే చక్కగా వినపడుతుంది.
* గోరువెచ్చగా ఉన్న వేపనూనె 2 చుక్కలు ఉదయం , సాయంత్రం వేస్తూ ఉంటే చెవుడు తగ్గిపొతుంది.
* ఉత్తరేణి ఆకురసం , మిరియాలు నూరి ఆ రసం చెవిలొ పోసిన చెవి నొప్పి తగ్గిపోతుంది .
* ఉల్లిపాయ రసం 1, 2 చుక్కలు చెవిలొ వేసి ఉల్లిపాయ వేడిచేసి నూరి చెవికి కడితే చెవినొప్పి తగ్గిపొతుంది.
* మెదడు బలహీనత వలన వచ్చిన చెవుడు కు 3 గ్రా ఎండు నల్ల ద్రాక్ష పండ్లు , 3 గ్రా ధనియాలతో కలిపి నమిలి మింగుతూ ఉంటే చెవుడు తప్పక పోతుంది.
* బావంచాలు , పిల్లితేగలు, సమంగా చుర్ణించి మంచి నీళ్ళతో తీసుకుంటే చెవుడు తగ్గును.
* నీటిపిప్పిలి ఆకు రసం చెవిలొ పిండుతుంటే క్రమంగా చెవుడు తగ్గిపొతుంది .
* ఉత్తరేణి భస్మం , మంచి సున్నం కలిపి నూనెలో వేసి కాచి చెవిలొ వేస్తే చెవుడు , ఇతర బాధలు అన్ని పొతాయి.
* 2 లేక 3 చుక్కలు తమలపాకు రసం చెవిలొ వేస్తుంటే చెవినొప్పి తగ్గుతుంది .
చెవిలొ చీము నివారణ కొరకు -
* బీరాకు రసం 2 చుక్కలు రోజు ఒక పూట చెవిలొ వేస్తే చెవిలొ పుండు , చీము కారుట తగ్గిపొతుంది.
* రసకర్పూరమ్ నువ్వుల నూనెలో కాచి 2 చుక్కలు చెవిలొ వేసిన చీము కారడం తగ్గిపొతుంది.
* వేప ఆకులు నీళ్ళలో వేసి మరిగించి బయటకు వచ్చే ఆవిరి చెవికి పట్టిన చీము , నొప్పి పొతుంది.
* ఆవు పంచితం 2 నుంచి 3 చుక్కలు చెవిలొ వేస్తే చీము కారడం తగ్గుతుంది .
* కొబ్బరి నూనెలో ఇంగువ వేసి కాచి 2 చుక్కలు చెవిలొ వేస్తే చీము తగ్గుతుంది
* నీరుల్లి రసం కొంచం వేడి చేసి 2 చుక్కలు చెవిలొ వేసిన చీము, నొప్పి తగ్గిపోతాయి .
* మందార ఆకుల రసం తో మంచి నూనె చేర్చి నూనె మిగిలేట్టుగా కాచి 2 చుక్కలు చెవిలొ వేస్తూ ఉంటే చీము కారడం , చెడు వాసన రావడం తగ్గిపోతాయి .
* దానిమ్మ పండు రసం వెచ్చ చేసి 2 చుక్కలు వేస్తే పోటు , చీము, దురద తగ్గిపోతాయి .
* చేమంతి ఆకు రసం 2 చుక్కలు వేస్తే చీము కారడం తగ్గిపొతుంది. చెవిలొ పురుగులు చచ్చిపోతాయి.
చెవిలొ కురుపులు - నివారణ
* సబ్జా ఆకు రసం 2 చుక్కలు చెవిలొ వేస్తే కురుపులు , చెవిలొ పోటు పొతుంది.
* వేపాకు రసం , తేనే సమంగా వెచ్చ చేసి 2 చుక్కలు చెవిలొ వేస్తే చెవిలొ కురుపులు మానతాయి.
* బీరఆకు రసం 2 బొట్లు చెవిలొ వేస్తే పుండ్లు, కురుపులు మానతాయి.

Friday, February 12, 2016

ఉపిరితిత్తుల రోగులకు అత్యద్బుత రసాయనం .

తయారీ విధానం -
తాజాగా ఉండే నల్లద్రాక్ష పండ్లు తెచ్చి బాగా కడిగి నీరు వంచి శుభ్రమైన చేతులతో పిసకాలి. తరువాత శుభ్రమైన గుడ్డలో వడపోసి రసం తీసుకోవాలి . ఆ రసం 16 కిలొలు ఉండాలి. అందులో 3 కిలొల పటికబెల్లం చూర్ణం 3 కిలొల మంచి తేనే కలిపి శుభ్రమైన కొత్తకుండ లొ పోయాలి. అందులొ ఇంకా ఒక్కొటి 25 గ్రాముల చొప్పున నాగకేసర చూర్ణం , దొరగా వేయించిన పిప్పిళ్ళ చూర్ణం , శుద్ది చేసిన చిత్రమూలం చూర్ణం , వావిలి గింజల చూర్ణం , ఆకుపత్రి చూర్ణం , యాలుకల చూర్ణం , దాల్చినచెక్క చూర్ణం దోరగా వేయించిన మిరియాల చూర్ణం , లవంగాల చూర్ణం , జాజికాయల చూర్ణం పోసి కుండపైన మూకుడుతో మూసి వాసిన కట్టు కట్టాలి. పదార్దాలు కుండలో నిండుగా ఉండకూడదు . కుండలో నాలుగో వంతు ఖాళీగా ఉండాలి. కుండ మూతకు శీల మన్నుతో లేపనం చేయాలి .
తరువాత ఎండాకాలం లొ అయితే 3 వారాల పాటు , వర్ష, శీతాకాలలో అయితే ఒక నెలరొజుల పాటు ఆ కుండను ఒక మూలగా కదిలించకుండా భద్రపరచాలి. పైన తెలిపిన సమయానికి కుండలో పదార్దాల మద్య రసయనిక చర్య జరిగి ఆ పదార్దం అంతా అద్బుతమైన అమృత రసాయనం అవుతుంది. తరువాత మూత తీసి కుండలోని పదార్థాన్ని కదలకుండా పై పై తేట నీళ్లని వేరే పాత్రలోకి వంచుకోవాలి.ఈ రసాయనాన్ని గాజు సీసాల్లో నిలువ ఉంచుకొవాలి. పూటకు 25 గ్రాముల మోతాదుగా రోజు రెండుపూటలా సేవించాలి .
ఉపయొగాలు -
* ఉపిరితిత్తులు బలహీనత తగ్గిపొతుంది.
* సహజశక్తి కలుగుతుంది.
* రక్తం శుభ్రపడి కొత్తరక్తం పుడుతుంది.
* ఆస్తమా , క్షయ , ఉపిరితిత్తులు కాన్సర్ , అజీర్ణ రోగులుకు ఇది అమృతం కన్నా ఎక్కువుగా పనిచేస్తుంది .
* శరీరానికి ధృడమైన , శాశ్వతమైన బలం , యవ్వనం , రంగు లభిస్తాయి.
* శరీరకాంతి, బుద్ధిబలం, వీర్యవృద్ధి , కళ్లకు చలువ కలుగుతాయి.
పైన చెప్పిన మూలికలు, చూర్ణం లు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అవుతాయి.

ఎలర్జీ తగ్గుట కొరకు -

శరీరం నందు రక్తంలో తేడా వచ్చి రక్త శుద్ది లేనప్పుడు , శరీరంలో పైత్యం పెరిగిపోయినప్పుడు దాని ప్రభావం శరీరం పైన పడుతుంది. అప్పుడు దద్దుర్లు , చర్మరోగాలు వస్తాయి.

దద్దుర్లు తగ్గించేందుకు సులభ యోగాలు -
* ప్రతిరోజు జీలకర్ర, ధనియాలు , ఎండుద్రాక్ష ఒక్కొటి 10 గ్రాముల చొప్పున కొంచం నీళ్లతో నూరి గుడ్డలో వడపోసుకొని పిండుకొని తాగండి.ఇలా రోజుకీ రెండుమూడు సార్లు చేస్తే పైత్యం ద్వారా వచ్చిన దద్దుర్లు పొతాయి.
* ప్రతిరోజు ఉదయం పూట 1 కప్పు పాలలొ ఒకటి లేక రెండు చుక్కలు ప్రశస్తమైన పలుచటి వేపనూనె కలిపి 20 గ్రాముల పటికబెల్లం చూర్ణం కలిపి తాగండి. దీనితో పాటు 30 వేపాకులు , 3 మిరియాలు 1 టీస్పూన్ మంచి పసుపు ఈ మోతాదుగా ఎంత ఎక్కువైనా కలిపి మంచినీళ్ళు పోసి మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేయండి . అది వంటికి రాసుకొని గంట లేక రెండు గంటల పాటు అలాగే ఉంచి సున్నిపిండితో స్నానం చేస్తూ ఉంటే క్రమంగా రక్తశుద్ది , చర్మశుద్ధి జరిగి బాధ నివారణ జరుగుతుంది.
* ఒక కప్పు పాలలో మంచి ప్రశస్తమైన వేపనూనె 2 చుక్కలు వేసి 20 గ్రాముల పటికబెల్లం పొడి కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే రక్తశుద్ది జరిగి చర్మవ్యాదులు పోతాయి .
* మారేడు ఆకులని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణం గా తయారుచేసుకుని పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా రెండుపూటలా మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని రకాలు చర్మవ్యాదులు హరించి పొతాయి.
* చింతపండును నీళ్లలో కలిపి బాగా పిసికి గుజ్జుని పిండి తీసివేసి ఆ రసాన్ని వంటికి పట్టిస్తూ పైత్యం పెరగడం వలన వచ్చిన దద్దుర్లు పొతాయి.
* నిమ్మరసంలో తులసి ఆకులు వేసి మెత్తగా మర్దించి దద్దుర్ల పైన లేపనం చేస్తే దద్దుర్లు హరించి పోతాయి .
* గరికరసం 4 బాగాలు , ఆవనూనె 1 బాగము కలిపి తైలము మిగిలే టట్లు సన్నసెగ మీద వండాలి. తరువాత వడపోసి ఆ తైలాన్ని చర్మవ్యాదుల పైన లేపనం చేస్తూ ఉండాలి. దీనితో పాటు ప్రతిరోజు రెండుపూటలా గరికరసం 10 గ్రా మోతాదుగా సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే సకల చర్మవ్యాదులు పాముకుబుసం విడిచినట్లు శరీరం నుంచి తొలగిపోతాయి.
* పటికబెల్లం పొడి 24 గ్రా , కటుకరోహిని పొడి 12 గ్రాములు కలిపి నూరి ఉంచుకొని పూటకు ఒక గ్రాము చొప్పున రెండు పూటలా మంచి నీళ్ల అనుపానంతో పుచ్చుకుంటూ ఉంటే క్రమంగా దద్దుర్లు , దురదలు తగ్గిపోతాయి .

గుండెకి బలం కలిగించే ఆహార పదార్దాలు -

గుండెకి బలం కలిగించే ఆహార పదార్దాలు -
* కొబ్బరి నీళ్ళు , కొబ్బరి పచ్చడి.కోడిగుడ్డు
* గులాబీ , గౌజుబాన్ , ఉసిరికాయ .
* అంజీర్ , ఆక్రోట్, యాలుకలు .
* కస్తూరి, ముద్ద కర్పూరం , కుంకుమ పువ్వు.
* జాజికాయ, దాల్చిన చెక్క, తేనే .
* ద్రాక్షరసం, తీపిదానిమ్మ, , కూరల్లో పసుపు .
* వస, లవంగాలు, లవంగపట్ట.
* వాము, వెల్లుల్లి, కొత్తిమీర , మిరియాలు.
* కరకచుర్ణం , ఆవునెయ్యి, శొంటి.
గుండె జబ్బు నివారించే ఔషధం -
* శొంటి కషాయం వేడివేడిగా కొద్దికొద్దిగా సేవిస్తూ ఉంటే గుండె శూలలు( నొప్పి ) , వాత రోగాలు, అజీర్ణం , కడుపు నొప్పి, దగ్గు , ఒగర్పు మొదలయిన బాధలన్ని పటాపంచలు అవుతాయి.
* తెల్ల మద్ది చెట్టు బెరడు తెచ్చి చూర్ణం కొట్టి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి అతి మెత్తని చూర్ణం గా తయారుచేయాలి. రోజు 5 గ్రా చూర్ణం లొ 5 గ్రా ఆవునెయ్యి గాని లేక ఆవుపాలు గాని లేక బెల్లపు పానకం గాని ఏదో ఒకటి కలిపి పుచ్చుకుంటూ ఉంటే గుండె రోగాలు , జీర్ణ జ్వరాలు , రక్తం కక్కుకునే రక్తపిత్త వ్యాధి, హరించి పోయి పరిపూర్ణ ఆయుషు , ఆరోగ్యం కలుగుతాయి.
* చెరువుల్లో పెరిగే తామర గడ్డలను తెచ్చి పైన చెప్పిన విధంగా అతిమెత్తని చూర్ణం గా తయారుచేసి ఆ చూర్ణాన్ని రెండు పూటలా 5 గ్రా మోతాదుగా తేనే కలిపి సేవిస్తూ ఉంటే గుండె రోగాలు , శ్వాసరోగాలు , ఎక్కిళ్ళు హరించి పొతాయి.
* గుంట గలిజేరు రసంలో వాముని నానబెట్టి , తరువాత నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని అందులో ఇంగువ చూర్ణం ఒక చెంచా కలుపుకొని దానిని ధనియాల కషాయంతో రెండు పూటలా వారం రోజుల పాటు సేవిస్తూ ఉంటే గుండెలో నొప్పి తగ్గుతుంది.
* పాలతో కలిపిన అన్నం ఎక్కువ తినాలి .
* ఉసిరికాయల పై బెరడు 100 గ్రా , పటికబెల్లం పొడి 100 గ్రా రెండు కలిపి మెత్తగా నూరి పూటకు 5 గ్రా మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల గుండె జబ్బులు హరించి పొతాయి.
* తెల్ల మద్ది చెక్క చూర్ణం పూటకు 5 గ్రా చొప్పున తేనెతో కలుపుకుని సేవిస్తూ ఉంటే అన్ని రకాల గుండెజబ్బులు హరించి పొతాయి. గుండెకి బలం చేకూరుతుంది.
* రోజు ఉదయం , మధ్యాహ్నం సమయాల్లో ఒక నిమ్మ పండు రసంలో 50 గ్రా నీళ్లు , 20 గ్రా కలకండ పొడి కలిపి తాగుతూ ఉంటే గుండె దడ , నీరసం , కడుపులో మంట, మూత్రం బిగింపు, మలబద్ధకం తగ్గిపోతాయి.
గమనిక -
ఆయుర్వేదం నందు యే ఔషధం అయినా ఒక మండలం ( 41 రోజులు ) తప్పక విడవకుండా వాడవలెను . అప్పుడు మాత్రమే దానియొక్క ప్రభావం చూపించును.

Tuesday, February 2, 2016

సైనసైటిస్ కొరకు కొన్ని సులభ యోగాలు -

* రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.
* తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.

గోవుతో వైద్యం .

* ఆవుపాలు - 

ఇవి మధురంగా సమ శీతోష్న్ం గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

* ఆవుపెరుగు - గర్భిణి స్త్రీకి వరం .

వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

* ఆవు వెన్న -

ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

* ఆవునెయ్యి -

ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

* ఆవుపేడ -

ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.

* గుధస్తానంలో తిమ్మిరి కొరకు -

ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .

* వంటి దురదలకు -

అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి .

* కడుపులోని క్రిములకు -

20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.

ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .

* ఆవుముత్రం -


* ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి .

* గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

* వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.

* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

* ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

* ప్రతిరోజు ఉదయమే గొముత్రాన్ని 30 గ్రా మొతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.

రక్తపోటు ( BP ) కొరకు సులభయోగాలు -

రక్తపోటు ( BP ) కొరకు సులభయోగాలు -
* శొంటి పొడుము , ధనియాలు పాలతో గాని , అల్లము , జీలకర్ర, ధనియాలు కషాయం చేసి చల్లర్చినది ఒక మండలం ( 41 రోజులు ) తాగవలెను.
* వెల్లుల్లి రసం పాలలొ కలిపి రెండు పూటలా త్రాగవలెను . వాటి మోతాదు వెల్లుల్లి రసం 10 చుక్కలు , పాలు ఒక ఔన్స్ కలిపి ఒక మండలం త్రాగవలెను . ఇది ఒక్క రక్తపోటు కొరకే కాకుండా పక్షవాతముకి కూడా పనిచేయును . వాతవ్యాదులు దగ్గరకి రానివ్వదు.
* శొంటి పొడుము ని రెండు రెట్లు పంచదార గాని బెల్లం న గాని పాకం పట్టి ఉంచుకొనవలెను. తరువాత దానిని రోజు కుంకుడు కాయ అంత తినుచుండిన చాలా మంచిది.
* బావన అల్లం , బావన జీలకర్ర మూడు పూటలా రెండు కలిపి ఒక చెంచా తీసుకొనవలెను.
గమనిక -
వాతం కలగజేసే పదార్దాలను అనగా చామగడ్డ, వేరుసెనగ వంటి వాటిని తినకుండా ఉన్నచొ ఔషదం శక్తివంతంగా పనిచేస్తుంది.
* జటా మామ్సి అనే మూలిక తెచ్చి దానిని మెత్తగా దంచి చూర్ణం చేసుకొని పూటకు 2 గ్రాముల మొతాదుగా మంచి నీళ్లతో వెసుకుంటూ ఉంటే LOW BP తగ్గిపొతుంది.
* నల్ల ఈశ్వరి వేరుని పొడిచేసి పుటకు 250 మిల్లి గ్రాముల చొప్పున మంచి నీళ్లతో రోజుకీ రెండుపూటలా సేవించిన రక్తపోటు నివారించ బడును.

వెంట్రుకలు వూడి పోతున్నందుకు -- నివారణా పద్దతులు .

వెంట్రుకల సమస్యలు - నివారణా పద్దతులు .
వెంట్రుకలు వూడి పోతున్నందుకు -
* మినుములు , మెంతులు సమానంగా మెత్తగా రుబ్బి, ఆ పేస్టు ని తలకు పట్టించి అరగంట తరువాత కుంకుడు కాయలతో స్నానం చేయండి . తొందరలొనే మీ సమస్య నివారించ బడుతుంది .
* గొరింట పువ్వులు , ఆకులు దంచి రసం తీసి కొబ్బరి నూనె తో కాచి వడపోసుకొని ఆ నూనె ని తలకు రాసుకుంటూ ఉంటే వెంట్రుకుల కుదుళ్ళు గట్టిపడి వుడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడి వూడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా నిగనిగలాడుతూ అందంగా వుంటాయి.
* మంచి నీళ్లలో తగినంత పొగాకు వేసి బాగా నానబెట్టి పిసికి ఆ నీటిని తల వెంట్రుకలకు రాస్తూ వుంటే వెంట్రుకలు రాలడం తగ్గిపొతుంది.
* ఉల్లిపాయ గింజలని నీళ్లతో నూరి తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకలు ఉడి పొవడం ఆగిపొయి వెంట్రుకలు వొత్తుగా పెరుగుతాయి.
* పల్లేరు పువ్వులు , నువ్వుల పువ్వులు సమానంగా తెచ్చి వాటికి సమానంగా నెయ్యి, తేనే కలిపి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి.
* కరకపొడి , ఉసిరికపొడి ,తానికాయ పొడి, నీలిఆకు పొడి, లోహ భస్మం ఇవన్ని సమబాగాలుగా కలిపి గుంటగలగర ఆకు రసంతో , గొర్రె మూత్రంతో మర్దించి వెంట్రుకలకు పూస్తూ ఉంటే ఆకాలంలో వెంట్రుకలు నెరవడం ఆగిపొయి నెరిసిన వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి.
* వెంట్రుకలు మృదువుగా ఉండాలి అంటే మెంతికూర ఆకులను మంచినీళ్ళతో నూరి ఆ ముద్దను తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకల గరుకుతనం పోయి మృదుత్వం వస్తుంది.
* రేగి చెట్టు ఆకులు నీళ్లతో నూరి ఆ ముద్దను తలకు రుద్దుకొని స్నానంచేస్తూ ఉంటే వెంట్రుకలు పగలకుండా చక్కగా వొత్తుగా పెరిగి మృదువుగా ఉంటాయి.
* ఆలివ్ ఆయిల్ లొ గాని , కొబ్బరి నూనె లొ గాని నూనెకి సమానంగా మందార పువ్వుల రసం పోసి ఆ రసం అంతా ఇగిరించి మిగిలిన నూనెని తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు చక్కగా ఎదుగుతాయి.
* వెల్లుల్లిపాయల పొట్టుని కాల్చిన మసిని , ఆలివ్ అయిల్ లో కలిపి రెండు రోజులు నిలువ ఉంచి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు వంకర వంకరగా పెరుగుతాయి.
* మూసాంబరం అన్ని పచారి షాపుల్లో దోరికిద్ధి. దానిని రెండు వంతుల గాటు సారాయిలో కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* పిచ్చి పుచ్చకాయ విత్తుల నుంచి తీసిన నూనెని నిత్యం తలకు మర్దిస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు అన్ని నల్లగా నిగనిగలాడుతూ మారిపొతాయి.
తరువాతి పొస్ట్ లో అందమయిన వెంట్రుకల కోసం షాంపూ పొడి , లిక్విడ్ హెర్బల్ షాంపూ మొదలయిన వాటిని వివరిస్తాను.
************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************