శరీరం నందు రక్తంలో తేడా వచ్చి రక్త శుద్ది లేనప్పుడు , శరీరంలో పైత్యం పెరిగిపోయినప్పుడు దాని ప్రభావం శరీరం పైన పడుతుంది. అప్పుడు దద్దుర్లు , చర్మరోగాలు వస్తాయి.
దద్దుర్లు తగ్గించేందుకు సులభ యోగాలు -
* ప్రతిరోజు జీలకర్ర, ధనియాలు , ఎండుద్రాక్ష ఒక్కొటి 10 గ్రాముల చొప్పున కొంచం నీళ్లతో నూరి గుడ్డలో వడపోసుకొని పిండుకొని తాగండి.ఇలా రోజుకీ రెండుమూడు సార్లు చేస్తే పైత్యం ద్వారా వచ్చిన దద్దుర్లు పొతాయి.
* ప్రతిరోజు ఉదయం పూట 1 కప్పు పాలలొ ఒకటి లేక రెండు చుక్కలు ప్రశస్తమైన పలుచటి వేపనూనె కలిపి 20 గ్రాముల పటికబెల్లం చూర్ణం కలిపి తాగండి. దీనితో పాటు 30 వేపాకులు , 3 మిరియాలు 1 టీస్పూన్ మంచి పసుపు ఈ మోతాదుగా ఎంత ఎక్కువైనా కలిపి మంచినీళ్ళు పోసి మిక్సీలో పేస్ట్ లాగా తయారు చేయండి . అది వంటికి రాసుకొని గంట లేక రెండు గంటల పాటు అలాగే ఉంచి సున్నిపిండితో స్నానం చేస్తూ ఉంటే క్రమంగా రక్తశుద్ది , చర్మశుద్ధి జరిగి బాధ నివారణ జరుగుతుంది.
* ఒక కప్పు పాలలో మంచి ప్రశస్తమైన వేపనూనె 2 చుక్కలు వేసి 20 గ్రాముల పటికబెల్లం పొడి కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే రక్తశుద్ది జరిగి చర్మవ్యాదులు పోతాయి .
* మారేడు ఆకులని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణం గా తయారుచేసుకుని పూటకు రెండున్నర గ్రాముల మోతాదుగా రెండుపూటలా మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని రకాలు చర్మవ్యాదులు హరించి పొతాయి.
* చింతపండును నీళ్లలో కలిపి బాగా పిసికి గుజ్జుని పిండి తీసివేసి ఆ రసాన్ని వంటికి పట్టిస్తూ పైత్యం పెరగడం వలన వచ్చిన దద్దుర్లు పొతాయి.
* నిమ్మరసంలో తులసి ఆకులు వేసి మెత్తగా మర్దించి దద్దుర్ల పైన లేపనం చేస్తే దద్దుర్లు హరించి పోతాయి .
* గరికరసం 4 బాగాలు , ఆవనూనె 1 బాగము కలిపి తైలము మిగిలే టట్లు సన్నసెగ మీద వండాలి. తరువాత వడపోసి ఆ తైలాన్ని చర్మవ్యాదుల పైన లేపనం చేస్తూ ఉండాలి. దీనితో పాటు ప్రతిరోజు రెండుపూటలా గరికరసం 10 గ్రా మోతాదుగా సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే సకల చర్మవ్యాదులు పాముకుబుసం విడిచినట్లు శరీరం నుంచి తొలగిపోతాయి.
* పటికబెల్లం పొడి 24 గ్రా , కటుకరోహిని పొడి 12 గ్రాములు కలిపి నూరి ఉంచుకొని పూటకు ఒక గ్రాము చొప్పున రెండు పూటలా మంచి నీళ్ల అనుపానంతో పుచ్చుకుంటూ ఉంటే క్రమంగా దద్దుర్లు , దురదలు తగ్గిపోతాయి .
No comments:
Post a Comment