Sunday, July 28, 2013

ఆరోగ్య రహస్యాల తులసి:--

తులసి అంటే మనం పూజచేసి దణ్ణం పెట్టుకోవటం, తీర్థంలో తులసి వేసి లోపలికి పుచ్చుకోవటమే తెలుసు కొందరికి. కానీ తులసి ఆరోగ్య ప్రదాయిని అని, తులసివల్ల చాలా లాభాలు ఉన్నాయని కానీ కొంతమందికి తెలియవు. మన పెద్దలు వీటివల్ల లాభాలు తెలుసుకుని మనకి చెప్పి ఉన్నారు, వాటిలో కొన్నిటిని నేను మీకు అందిస్తున్నాను.

మ్నపెరట్లో ఉన్న తులసి మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే మరికొంచం శ్రద్ధగా నీళ్ళు పోసి పెంచుకుంటాము.

మనదేశంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. తులసిని గురించి తెలియనివారు ఉండరని నా అభిప్రాయం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఇంటి ముందు వేప చెట్టు, ఇంటి వెనుక తులసి చెట్టు ఉంటే ఎటువంటి వ్యాధులు మనదరి చేరవు, అన్నట్టుగా దర్శనమిస్తూనే ఉంటాయి.

"మన దేవాలయాలలో పూజారి ఇచ్చే తీర్థంలో తులసిదళం ఉంటుంది. తీర్థం ఇస్తూ ఈ మంత్రం జపిస్తారు......

అకాల మృత్యు హరణం
సర్వ వ్యాధి నివారణం
సమస్త పాప క్షయ కరం
శ్రీదేవి పాదోదకం పావనం శుభం" ll.......అంటూ మూడు సార్లు తీర్థం ఇస్తారు.
అంటే....తులసి తీర్థం సర్వరోగ నివారిణి అని, ఇంటి దగ్గర తులసి తీర్థం తీసుకోకపోయినా....దేవాలయంలో తీర్థం తీసుకుంటే సకల రోగాలు నివారించబడతాయి అని అర్ధం.......

తులసి... రసం తీసుకుని ప్రతీరోజు 2 చెమ్చాలు పుచ్చుకుంటే రక్తపుష్టి కలిగి, శరీరమునకు కాంతి వస్తుంది.

తులసి రసం 2 చెమ్చాలు, తేనె 1 చెమ్చా కలిపి ప్రతీరోజు పుచ్చుకుంటే----గుండెల్లో ఉన్న (శ్లేష్మం) కఫం, దానికి సంభందించిన వ్యాధులు దూరమవుతాయి.

ఒక గుప్పెడు తులసి ఆకులను---రెండు చేతులతో బలంగా నలిపి, రసం పిండి, ఆ రసాన్ని---తేలు, తేనెటీగ, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు---ఆ
ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గి, విషప్రభావం తగ్గుతుంది.

ప్రతీరోజు క్రమం తప్పకుండా 10 లేక 15 తులసి ఆకులను నమిలి, తింటూ ఉంటే, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వ్యాధినిరోధక శక్తి---పాము విషాన్ని కూడా హరిస్తుంది.

తులసిరసం వల్ల దగ్గు, ఆయాసం, గొంతునుండి పిల్లికూతలు రావటం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చును.

తులసిరసం కంటికింద రాసుకుంటే-----నల్లని వలయాలు, ఉబ్బులు తగ్గుతాయి.

తులసిరసం, నిమ్మరసం కలిపి పైపూతగా పూస్తే---గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.

తులసిరాసాన్ని పంచదారతో కలిపి ప్రతీరోజు పడుకునే ముందు తీసుకుంటే, బాగా నిద్రపడుతుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔషధము.

తులసిరసంని ప్రతీరోజు క్రమంతప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ని & రక్తపోటుని నిరోధిస్తుంది.

తులసి ఆకుల కషాయాన్ని పరగడుపునే త్రాగితే, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, వెన్నెముక నొప్పి, పొత్తికడుపు మంట వంటి వాటిని నివారించవచ్చును.

తులసిఆకులు ఎండపెట్టి, పోడిచేసుకుని, కొద్దిగా వేడినీటిలో కలిపి, పేస్టు లాగా చేసి ముఖానికి పట్టిస్తే, చర్మ సౌందర్యం పెరిగి శరీరము కాంతివంతంగా, సున్నితంగా తయారగును......

Saturday, July 27, 2013

Brown rice , ముడి బియ్యము

Brown rice , ముడి బియ్యము
దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రదేశంలో సాధారణంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం అన్నం. ప్రతి రోజూ తినే అన్నం గురించి, దానికోసం వాడే బియ్యం గురించి ఆలోచించం మనం. అంటే దానిలోని పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారనంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేస్తే అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి. బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు.కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు.

పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాల బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది.

రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది.

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పేరు పొందింది. బ్రౌన్ రైస్ లో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది పీచు సమృద్ధిగా ఉండటం వలన బ్రౌన్ రైస్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. టె౦పుల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు బ్రౌన్ రైస్ తిన్నందున రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనులలో ఫలకం చేరే స్థాయిని తగ్గించి, గుండె జబ్బులు వృద్ది చెందకుండా కాపాడుతుందని కనుగొన్నారు.

శరీర బరువును సాధారణంగా ఉంచుతుంది బ్రౌన్ రైస్ లో పీచు సమృద్ధిగా ఉన్నందున, మీరు అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమే కాక ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనాలలో తేలిందేమిటంటే పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపుగా సాధారణంగా ఉంటుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు బ్రౌన్ రైస్ ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది.

రక్తంలో చక్కరను నియంత్రిస్తుంది బ్రౌన్ రైస్ లో ఉన్న పీచు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి టైపు 2 రకం డయాబెటిస్ ను నిర్వహించడంలో సహాయం చేస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన మెగ్నీషియం బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా ఉంది. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, వేరొక అత్యవసర పోషకం కాల్షియంను గ్రహించడానికి కూడా అవసరం.

ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున, ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అనేక అధ్యయనాలలో తేలిందేమిటంటే బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది ఒక అమెరికా పత్రికలో జీర్ణాశయాంతర వైద్య శాస్త్రంపై ప్రచురించిన అధ్యయనం ప్రకారం బ్రౌన్ రైస్ వంటి కరగని పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు స్త్రీలలో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయం చేస్తాయని తేలింది.

ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థను నిర్వహిస్తుంది బ్రౌన్ రైస్ లో ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థ కు అవసరమైన మాంగనీసు సమృద్ధిగా ఉంది. ఈ పోషకం కొవ్వు ఆమ్లాలు సంశ్లేషణ, కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడం ద్వారా సెక్స్ హార్మోనుల ఉత్పత్తికి కూడా సహాయ పడుతుంది.

ఆహార అవసరాలు ఒక రోజుకు 3 సార్లు ధాన్యాహారం తీసుకోనవలసినదిగా సిఫార్సు చేయబడింది. ప్రతి ½ కప్పు బ్రౌన్ రైస్ ఈ మూడు కప్పులకు సమానం, కాబట్టి బ్రౌన్ రైస్ తినడం మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చేందుకు మంచి మార్గమౌతుంది.

మొటిమలు తగ్గాలంటే...

మొటిమలు తగ్గాలంటే...

మొటిమలు మిమ్మల్ని విపరీతంగా బాధిస్తున్నాయా! అయితే ఇంట్లో తయారుచేసుకోగలిగిన ఈ ఫేస్‌ప్యాక్‌లను ఓ సారి ట్రై చేసి చూడండి.
- కమలాపండు(సంత్రా), టమాట రసాన్ని సమపాళ్లలో కలపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. అరిన తరువాత కడిగేయండి. ఇలా రోజు చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు, నల్లమచ్చలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.
- ఎండబెట్టిన కమలాపండు(సంత్రా) తొనలు, ఎల్లిపాయలకు సరిపడా నీళ్లు కలుపుతూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించండి.
- పుదీనా ఆకులను మెత్తగా ఫెస్ట్‌లా చేసుకొని ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మొటిమలు మాయమైపోతాయి.
- రోజ్‌వాటర్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ముఖంపై అప్లై చేయాలి. 15-30 నిమిషాల తరువాత నీళ్లతో కడిగేయాలి.
- దోసకాయను తీసుకొని దానికి ఓట్‌మిల్, మూడు టీస్పూన్స్ తేనేను కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిని ముఖానికి మాస్క్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత కడిగేస్తే మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా అవుతుంది.

Saturday, July 20, 2013

మగబిడ్డ అయితే...గర్భవతి లక్షణాలు



గర్భవతి అయిన ప్రతి మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు పుట్టేది ఆడపిల్లా లేక మగ పిల్లాడా ? అనే కుతూహలం కలుగుతూనే వుంటుంది. సాధారణంగా మహిళలు తమకు మగబిడ్డ కావాలని, పురుషులు, ఆడపిల్ల కావాలని కోరుతూంటారు. మరి ఈ విషయంలో సహజంగానే ముందుగా ఎవరు పుడతారు అనేది తెలుసుకోవాలంటే గర్భవతికికలిగే కొన్ని లక్షణాలు పరిశీలించండి. మగ బిడ్డ పుట్టేటట్లయితే, గర్భవతిలో కొన్ని లక్షణాలు కనపడతాయి. మగ పిల్లాడు కలిగేటందుకు గల లక్షణాలు 1. గర్భధారణలో వికారం - చాలామంది గర్భవతులు ఆడపిల్ల పుట్టేటపుడు ఏ రకమైన అసౌకర్యాలు వుండక, ఏ లక్షణాలు కనపడకుండా వుంటాయని ఆడపిల్లలు పుట్టకముందునుంచే చాలా బుద్ధిమంతులుగా వుంటారని, అయితే, కడుపులో వున్నది కనుక మగపిల్లాడయితే అల్లరి లేదా కదలికలు అధికంగా వుండటంతో అనేక సార్లు వాంతులు అవుతాయని, మొదటి త్రైమాసికంలో ఉదయపువేళ వికారం అధికంగా వుంటుందని చెపుతారు. 2. మగపిల్లడు కలిగే మహిళలకు పొట్ట బాగా కనపడుతుంది. ఆడపిల్ల అయితే, మహిళ పొట్ట అధికంగా కనపడదు. వెనుక నుండి చూస్తే అసలు ప్రెగ్నెంట్ గానే కనపడరు. పిరుదులు, తొడలు ఏ మాత్రం మార్పు చెందవు. పొట్టమాత్రమే ఉబ్బి కనపడుతుంది. 3. మగబిడ్డను కనుక మీరు మోస్తూంటే, మీ బరువు అధికంగా వుండదు. కనపడే బరువు బేబీది మాత్రమే. మీరు బరువుగా గుండ్రంగా, మంచి రంగుగా వుండరు. ఉదాహరణకు ఆడపిల్లను కన్న అయిశ్వర్య రాయ్ బిడ్డను ప్రసవించినప్పటికి గర్భం ధరించిన చిహ్నాలు కనపడుతున్నాయి. మగబిడ్డను కన్న మలైకా ఆరోరా మగబిడ్డను కన్న కొద్ది నెలల కాలంలో తన పూర్వపు రూపం పొందింది. 4. మగ బిడ్డను కనే మహిళ గర్భధారణ దశలో అందచందాలు సంతరించుకోదు. కాని ఆడపిల్ల కనుక కడుపులో వున్నట్లయితే, ఆమె అందం వెలిగి పోతూంటుంది. ఎర్రటి బుగ్గలు, మంచి నిగారింపు ఆమె శరీరంలో కనపడుతుంది. మరి మగబిడ్డను ప్రసవించే తల్లి పాలిపోయిన ముఖంతో గర్భ ధారణ దశ అంతా బలహీనంగా వుండి అలసిపోతూ వుంటుంది. 5. గర్భవతికి ఆహారాలంటే ఇష్టంగా వుంటుంది. తగ్గిన పోషకాలను భర్తీ చేసుకుంటూ వుండటానికి ఇది సహజమే. అయితే, మహిళ ఈ సమయంలో పులుపు సహజంగానే ఇష్టపడుతుంది కాని మగబిడ్డ పుట్టేటపుడు ఆమెకు పులుపు మరింత అధికంగా తినాలనిపిస్తుంటుంది. పైన తెలిపిన అంశాలు మగ బిడ్డ పుడతాడా లేక ఆడబిడ్డ పుడుతుందా ? అనే దానికి సంపూర్ణం కాకపోయినప్పటికి, చివరకు మీరు చక్కగా చేసే ఊహ సరైనదికూడా కావచ్చు.

Friday, July 19, 2013

వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు

వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు
మినుములు ,మెంతులు ,ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను.ఆరిన తరువాత కుంకుడు రసం తో స్నానం చేయవలెను అలా చేసిన తరువాత 3 రోజుల్లోనే అద్బుత ఫలితం కలుగుతుంది.

చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ


చర్మ సంరక్షణకు సౌందర్యపోషణ
సౌందర్యపోషణ
చర్మ సంరక్షణకు
తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.
మరీ వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
వెల్లుల్లి రసం తెగిన, కాలిన గాయలను, మచ్చలను తగ్గిస్తుంది.
దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది.
కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.
పావుకప్పు ఓట్లు, పాలపొడి, చిక్కటి గంజి తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా కలుపుకోవాలి. స్నానానికి ఇరవై నిముషాలముందు శరీరమంతా పట్టించుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
మీ చర్మం ముడతలు, పగుళ్ళు గా ఉన్నట్లయితే మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి.
మొదట ఒక మంచి చర్మ వ్యాధుల నిపుణుని కలవండి. మీకున్న సమస్య చిన్నదేనా లేదా ప్రమాదకరమైనదా అనేది నిర్ధారించుకోవాలి. క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనప్స్ చేయించుకుంటుంటే మంచిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి.
వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.
స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.
మాయిశ్చరైజర్ ఉన్న సబ్బును వాడాలి. స్నానం చేసిన అనంతరం మాయిశ్చరైజ్ లోషన్‌ను పూసుకుంటే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.
పోషక విలువలున్న ఆహార పదార్ధాలతో సమతుల ఆహారం తీసుకుంటే అది చర్మానికి అందాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక చర్మసంబంధిత వ్యాధులకు గురికాకుండా రక్షిస్తుంది.
చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.
శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం చేయడం కూడా చర్మసౌందర్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది
.

వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్

వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్
ఆతి మధురం 10 గ్రా .
చిన్న యాలకులు 10 గ్రా
లవగంగాలు 10 గ్రా
ఆకుపత్రి - 10 గ్రా
శొంటి - 10 గ్రా
పిప్పళ్ళు - 10 గ్రా
మిరియాలు - 10 గ్రా
ఎండు ఖర్జూరాలు - విత్తనం తీసినవి 20 గ్రా
సారపప్పు - 20 గ్రా
ధనియాలు - 20 గ్రా
వకుడుకాయలు - 20 గ్రా
వేలవేము చూర్ణం 20 గ్రా

ఎండుద్రాక్ష లేక ఎండు కిస్ మిస్ 200 గ్రా ( గింజలు లేనివి )
కండచక్కెర - 200 గ్రా

పై పదార్దాలు విడివిడిగా చుర్నలుగా చేసుకొని అందులో ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది .

రోజు ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి 20 గ్రాముల మోతాదుగా తింటూ అనుపానంగా ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర కలిపి త్రాగుతువుండాలి .

ఫలితాలు : హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల వల్ల , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు హరిన్చిపోయి , బక్కచిక్కిన బలహీన స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .

కిడ్నీలో రాళ్లు


కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?

కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారా.. అయితే ప్రతి రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు పరిశోధకులు.

కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు.

కాని కొందరిలో ఇవి జీర్ణవ్యవస్ధకు సంబంధించిన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి ఈ సప్లిమెంట్ల కన్నా సహజసిద్ధమైన సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తీసుకోమని సూచిస్తుంటారు వైద్యనిపుణులు.

అయితే మిగిలిన సిట్రస్ ఫలాల కన్నా నారింజపండ్లలోని సిట్రేట్లు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. మూత్రం ఆమ్లత్వాన్ని తగ్గించడం ద్వారా ఈ సిట్రేట్లు రాళ్లు ఏర్పడడాన్ని నివారిస్తాయి.


Drs Chandu

మీ శరీర చర్మం ప్రకాశవంతంగా , అందంగా కనిపించేందుకు చిట్కాలు #

1) ఒక చెంచా తేనెకు ఒక చెంచా విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి,శరీరానికి పట్టించాలి. అరగంట తర్వాత మసాజ్ చేస్తూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్నందిస్తుంది. అద్భుతమైన యవ్వనమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
2) అరటిపండు గుజ్జుకు, రెండు చెంచాల ఓట్స్ పొడి మరియు రెండు చెంచాల రోజ్ వాటర్ మిక్స్ చేసి శరీరానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
3) ఒక గుడ్డులోని సొన మరియు ఒక టేబుల్ స్పూన్ కివి జ్యూస్ మరియు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల విటమిన్ ఇ వల్ల మరింత ఎక్స్ ట్రా అందాన్ని పొందవచ్చు.
4) మహిళల మేని మెరుగుకు ఈ విటమిన్‌ ఎంతో అవసరం. ప్రీరాడి కల్స్‌ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. లైటనింగ్‌ రాడ్‌గా పిలవ బడే ఈ విటమిన్‌ అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది. పొద్దుతిరుగుడు నూనె, బాదం పప్పులు, పాలకూ,టమోటో, బొప్పా యి, ఆలివ్‌ నూనె వంటి వాటిలో ఈ విటమిన్‌ అత్యధికంగా లభిస్తుంది.

కలువల్లాంటి కళ్ళు కోసం 6 చిట్కాలు



అరటీస్పూన్ కీరారసమలో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షిణీయంగా ఉంటాయి.
కళ్ళు చాల సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఎక్రీం పడితే ఆక్రిం రసెయ్యకూడదు.ఇలా చెయ్యడం వల్ల మీ కళ్ళు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.
గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈమిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజా మెరుస్తాయి .
కాళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కాళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతలునుండి విముక్తి పొందవచ్చు .
నిద్రలేమి,అలసట , ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి కొందరికి.ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి.పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచేస్తుంది.

కొత్తిమీర Drs Chandu

కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలోను మరియు గార్నిష్ కు ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. కొత్తిమీరను ఒక తేలికపాటి మిరియాలతో కలిపి వివిధ వంటకాల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచి వస్తుంది. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అయితే ఆరోగ్య పరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంటుంది. ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. కొత్తిమీర కొన్ని అస్వస్థతలకు ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాము.
తాజా కొత్తిమీరలో అంతర్లీనంగా ఉన్న హెల్త్ సీక్రెట్స్:
1) కంటి లోపాలు: తాజా కొత్తిమీరలో విటమిన్-C, విటమిన్-A,యాంటి ఆక్సిడెంట్లు,భాస్వరం వంటి ఖనిజాలు గొప్ప వనరులుగా ఉండుటవల్ల కళ్ళ ఒత్తిడికి,దృష్టి లోపములకు,కండ్ల కలక, కంటి వృద్ధాప్యం వంటి వాటి నివారణకు సహాయకారిగా ఉంటుంది. కొత్తిమీర ఆకులను తీసుకోని నలిపి వాటిని నీటిలో వేసి కాచి ఒక శుభ్రమైన వస్త్రంతో ద్రవాన్ని వడకట్టాలి. ఆ ద్రవంను కొన్ని చుక్కలు తీసుకోని రాస్తే కన్ను నీరు కారటం, కంటి దురద,నొప్పి వంటివి తగ్గుతాయి.
2) ముక్కు నుంచి రక్తస్రావం జరిగితే : 20 గ్రాముల తాజా కొత్తిమీర ఆకులు, కొద్దిగా కర్పూరం తీసుకోని రెండింటిని బాగా నలిపి రసం తీయాలి. ఈ రసంను రక్తస్రావం ఆపడానికి ముక్కు రంధ్రాలలోకి రెండు చుక్కలు వేయాలి. అంతేకాక ముక్కు నుండి రక్తస్రావం ఆపడానికి నుదుటిపైన ఈ పేస్ట్ ను రాయవచ్చు. తాజా కొత్తిమీర ఆకులు వాసన కూడా సహాయకారిగా ఉంటుంది
3) చర్మ వ్యాధులు: తాజా కొత్తిమీరలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, క్రిమి సంహారిణి లక్షణాల కారణంగా కొన్ని చర్మ వ్యాధులచికిత్సలో సహాయపడుతుంది. దద్దుర్లు నుండి ఉపశమనం పొందడానికి రసం త్రాగటం లేదా చర్మం మీద పేస్ట్ ను రాయటం చేయండి. చర్మం మీద బొబ్బలు / దద్దుర్లు కోసం తాజా కొత్తిమీర రసం & తేనె కలిపి ఆ పేస్ట్ ను ప్రభావితమైన చర్మ ప్రాంతంలో రాయాలి. రాసిన 15 నిముషాలు తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.
4) గర్భధారణ సమయంలో వికారం మరియు వాంతులు (వేవిళ్ళు): అనేక మంది గర్భిణీ స్త్రీలకు గర్భం ప్రారంభంలో వికారం మరియు వాంతులు ఎదురవుతాయి. ఈ పరిస్థితి లో ఒక కప్పు కొత్తిమీర,ఒక కప్పు పంచదార,నీరు వేసి మరిగించి చల్లారిన తర్వాత త్రాగాలి.
5) చిన్న పోక్స్: కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్,యాంటీ సూక్ష్మజీవి మరియు యాంటీ సంక్రమణ భాగాలు మరియు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇనుము మరియు విటమిన్-C కూడా ఉండుట వల్ల విముక్త వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. కొంత ఉపశమనం మరియు చిన్న పాక్స్ నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది.
6) నోటి పుళ్ళు: కొత్తిమీరలో ఉన్న ముఖ్యమైన నూనె సిత్రోనేలోల్ ఒక అద్భుతమైన క్రిమినాశకంగా పనిచేస్తుంది. నోటిలో గాయాలను మరియు హీనస్థితిలో ఉన్న పూతలను నిరోధిస్తుంది. ఇది యాంటీ సూక్ష్మజీవి మరియు స్వస్థత ప్రభావాలను కలిగి ఉంటాయి.
7) కొలెస్ట్రాల్ స్థాయి మీద ప్రభావం: తాజా కొత్తిమీరలో ఒలియిక్ ఆమ్లం,లినోలెనిక్ ఆమ్లం,స్టియరిక్ ఆసిడ్,పల్మిటిక్ ఆమ్లం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్-C) రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన మంచి వనరులుగా ఉన్నాయి. అంతేకాకుండా ధమనులు మరియు సిరలు లోపల పొర వెంబడి ఉన్న కొలెస్ట్రాల్ నిక్షేపాలను తగ్గించి తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
8) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తాజా కొత్తిమీరలో ముఖ్యమైన నూనెలు మరియు సమృద్ధిగా వాసన కలిగి ఉండుట వలన అద్భుతమైన ఆకలికి పనిచేస్తుంది. పొట్టలో ఎంజైమ్లు మరియు జీర్ణ రసాల స్రావాల ఉద్దీపనకు సహాయపడుతుంది. అందువలన ఇది జీర్ణక్రియకు మరియు పెరిస్తాలిటిక్ మోషన్ ఉద్దీపనకు సహాయపడుతుంది. కొత్తిమీర అనోరెక్సియా చికిత్సను అందించడంలో కూడా సహాయపడుతుంది.

Wednesday, July 17, 2013

వెల్లుల్లి చేసే మేలు


* వెల్లుల్లి చేసే మేలు
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని నానుడి. కేవలం ఉల్లి మాత్రమే కాదు వెల్లుల్లి కూడా ఇదే తరహా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. మసాలా దినుసులలో ఒకటిగా ఉన్న వెల్లుల్లిని రుచి కోసం, ఆరోగ్యం కోసం శతాబ్దాలుగా వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఇచ్చే లబ్ధి కారణంగా ఒక విశేష దినుసుగా పేరు పొందింది.

పువ్వులా ఉండే వెల్లుల్లి రేకులను రెబ్బలు అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు ఎంతో ఘాటై న వాసన కలిగిన ఇవి వండినప్పుడు ఆ ఘా టును కోల్పోతాయి కానీ శరీరానికి ఆరోగ్యకరమైన లాభాలనే అందిస్తాయి. వెల్లుల్లిలో అమినో ఆసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్‌, పొటాషియం, ఐరన్‌, జింక్‌, కాపర్‌, సోడియం, పాస్ఫరస్‌, విటమిన్‌ సి, బి6, నియాసిన్‌ ఫ్రూక్టో జ్‌, గ్లూకోజ్‌తో పాటుగా ఇతర ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ వంటివి ఉంటాయి.

ఆరోగ్య లాభాలు...
గుండె వ్యాధులను నివారిస్తుంది.. గుండెకు సం బంధించిన వ్యాధులు సాధారణంగా ఎక్కు వ స్థాయి బ్లడ్‌ కొలెస్ట్రాల్‌, బిపి, బ్లడ్‌ షుగర్‌ వంటి వాటి మూలంగా వస్తాయి. వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్‌ అనే పదార్ధం అద్భుతమైన యాంటీ ఆక్సిడెం ట్లు తయారు కావడానికి దోహదం చేస్తుంది. ఇది రక్తంపై బాగా పని చేస్తుంది. రక్తంలో ఉండే బాడ్‌ కొలెస్ట్రాల్‌ రక్తనాళాలను ధ్వంసం చేస్తుంది. ఈ బాడ్‌ కొలెస్ట్రాల్‌ పెరగకుండా నివారించడం లో వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. దీనితో గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఒక వెల్లుల్లి రెబ్బను నూరి పడుకునే ముందు మిం గితే అది ఎంతో ఉపయుక్తం. అంతేకాదు, వెల్లుల్లి బ్లడ్‌ షుగర్‌ స్థాయిని తగ్గించే ఇన్సులిన్‌ను పెంచుతుందని అధ్యయనాలు రుజువు చేశాయి. అలాగే బిపి పెంచే కార్యకలాపాలను కూడా నిలవరించడం ద్వారా బిపిని తగ్గించడంలో వెల్లుల్లి సాయపడుతుంది.

కాన్సర్‌ పై పోరాటం...
వెల్లుల్లి పచ్చిగా తినడం ఎంతో మంచిదని రుజువైంది. దీనిని చితక్కొట్టినప్పుడు డియాలిల్‌ డైసలె్ఫైడ్‌, అలిల్‌ ట్రై సలె్ఫైడ్‌ వంటి కాంపౌండ్లు ఏర్పడి రొమ్ము, ఉదరం, బ్లాడర్‌, ప్రోస్టేట్‌ కాన్సర్లపై పోరడటానికి పని చేస్తాయి. కాన్సర్‌ కణాలు ఏర్పడకుండా వెల్లుల్లి నిరోధిస్తుంది. దీనితో ట్యూమర్ల పెరుగుదల కూడా నిదానిస్తుంది. కాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు మంచి రోగనిరోధక శక్తి ఉండాలి. వెల్లుల్లి దీనిని ఇస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది...
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఎక్కువ. వెల్లుల్లిలో ఉండే అల్లియమ్‌ బాక్టీరియా, ఫంగ స్‌, వైరస్‌ల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో సాయపడుతుంది. జలుబును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాలిన గాయాలున్న వారిలో, కోసుకొని గాయాలైన వారిలో ఇన్ఫెక్షన్‌ కలిగించే బాక్టీరియా పెరగకుండా వెల్లుల్లి నిరోధిస్తుంది. అలాగే జర్ణకోశంలో ఉండే ఇన్ఫెక్షన్లను కూడా ఇది నిరోధిస్తుంది.

గర్భిణీలకు మంచిది...
వెల్లుల్లిలో ఉండే ఆరోగ్యకరమైన న్యూట్రియంట్లు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని రోగనిరోధక వక్తిని పెంచే గుణాల వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అంతేకాదు, గర్భస్థ సమయంలో పిల్లల బరువు పెంచడంతో ఎంతో సమర్ధంగా పని చేస్తుందని రుజువైంది. గర్భిణీలలో మూత్ర విసర్జనను పెంచి లోపల ఉన్న టాక్సిన్లు విడుదలయ్యేందుకు దోహదం చేస్తుంది. అయితే మంచి చేస్తుందని ఎక్కువగా తీసుకోవడమూ మంచిది కాదు. వెల్లుల్లిలో ఉన్న ఒకే ఒక్క దుర్గణం అది కలిగించే ఘాటైన వాసన. దీనివల్ల నోటి నుంచి, శరీరం నుంచి కూడా దుర్వాసన వెలువడుతుంది. అందుకే దీనిని తగ్గించేందుకు వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే పచ్చి వెల్లుల్లి కన్నా ఉడకబెట్టిన వెల్లుల్లి తక్కువ వాసనను కలిగి ఉంటుంది.

Friday, July 12, 2013

ఔషధమూలిక గోరింటాకు:-


గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.

గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.

ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.

Friday, July 5, 2013

పోపు పెట్టెలో దాగివున్న పది ఆరోగ్య సూత్రాలు!

పోపు పెట్టెలో దాగివున్న పది ఆరోగ్య సూత్రాలు!

1. చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

2. అల్లం పైత్యానికి విరుగుడు :
అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.

3. వెల్లుల్లి గుండెకు నేస్తం
పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.

4. కుంకుంపువ్వు అందం ఆరోగ్యం
ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.

5. లవంగాలు శ్వాసకు మేలు :
లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.

6. జీర్ణశక్తికి జీలకర్ర
జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.

7. ఆవాలు
ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.

8. నల్లమిరియాలు
ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

9. పచ్చి ఏలకులు
ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.

10. ఫెన్నల్
ఇది మరువంలాంటి మొక్క. దీన్ని కూరల్లో వాడుతారు. ఫెన్నెల్స్ డైయూరిటిక్ గుణం కలిగి ఉంది. ఇది ఋతుస్రావ సమయంలోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. పొత్తికడుపులకు ఉపశమనాన్నిచ్చే శక్తి ఫెన్నల్ తైలానికి ఉంది. పాలిచ్చే తల్లులలో పాలు సమృద్ధిగా వుండడానికి ఎంతో తోడ్పడుతుంది.

ఊపిరితిత్తులకు ఊపిరినిచ్చే పసుపు..

ఊపిరితిత్తులకు ఊపిరినిచ్చే పసుపు..


వంటింట్లో పోపుల పెట్టెలో ఉండే పసుపు ఊపిరితిత్తులకు ఊపిరినిస్తుందంటే నమ్ముతారా.. నమ్మాల్సిందే అంటున్నారు పరిశోధకులు. పసుపుకు చాలా సుగుణాలున్నాయి. ఏ చిన్న గాయమైనా వెంటనే పసుపును అద్దితే ముటుమాయమవుతుంది. గొప్ప యాంటిబయాటిక్‌గా ఇది పనిచేస్తుంది.

ఇప్పుడు నెలల తక్కువ పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగా పనిచేయని అపాయకర పరిస్థితుల నుండి కూడా పసుపు చక్కటి రక్షణనిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పసుపు పలు జబ్బులకు ఔషధంలాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అయితే పసుపు ఊపిరితిత్తులకు ఊపిరి ఇవ్వగలదు. పసుపులో ఉండే కుర్కుమిన్‌ అనే పదార్ధానికి నెలల తక్కువ పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగా పనిచేయక అపాయకర పరిస్థితి ఏర్పడితే, అలాంటి సమయంలో ఊపిరితిత్తులకు ఊపిరిని అందించగల శక్తి ఉందని తాము నిర్వహించిన పరిశోధనల్లో స్పష్టమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ కుర్కుమిన్‌ అనే పదార్ధానికి వాపును తగ్గించే గుణం ఉందని, ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుందని, హానికారక సూక్ష్మజీవులను పసుపు నశింపజేస్తుందని పరిశోధకులు అంటున్నారు.