* వెల్లుల్లి చేసే మేలు
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని నానుడి. కేవలం ఉల్లి మాత్రమే కాదు వెల్లుల్లి కూడా ఇదే తరహా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. మసాలా దినుసులలో ఒకటిగా ఉన్న వెల్లుల్లిని రుచి కోసం, ఆరోగ్యం కోసం శతాబ్దాలుగా వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఇచ్చే లబ్ధి కారణంగా ఒక విశేష దినుసుగా పేరు పొందింది.
పువ్వులా ఉండే వెల్లుల్లి రేకులను రెబ్బలు అంటారు. పచ్చిగా ఉన్నప్పుడు ఎంతో ఘాటై న వాసన కలిగిన ఇవి వండినప్పుడు ఆ ఘా టును కోల్పోతాయి కానీ శరీరానికి ఆరోగ్యకరమైన లాభాలనే అందిస్తాయి. వెల్లుల్లిలో అమినో ఆసిడ్లు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఐరన్, జింక్, కాపర్, సోడియం, పాస్ఫరస్, విటమిన్ సి, బి6, నియాసిన్ ఫ్రూక్టో జ్, గ్లూకోజ్‌తో పాటుగా ఇతర ఎస్సెన్షియల్ ఆయిల్స్ వంటివి ఉంటాయి.
ఆరోగ్య లాభాలు...
గుండె వ్యాధులను నివారిస్తుంది.. గుండెకు సం బంధించిన వ్యాధులు సాధారణంగా ఎక్కు వ స్థాయి బ్లడ్ కొలెస్ట్రాల్, బిపి, బ్లడ్ షుగర్ వంటి వాటి మూలంగా వస్తాయి. వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే పదార్ధం అద్భుతమైన యాంటీ ఆక్సిడెం ట్లు తయారు కావడానికి దోహదం చేస్తుంది. ఇది రక్తంపై బాగా పని చేస్తుంది. రక్తంలో ఉండే బాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ధ్వంసం చేస్తుంది. ఈ బాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా నివారించడం లో వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. దీనితో గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఒక వెల్లుల్లి రెబ్బను నూరి పడుకునే ముందు మిం గితే అది ఎంతో ఉపయుక్తం. అంతేకాదు, వెల్లుల్లి బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించే ఇన్సులిన్‌ను పెంచుతుందని అధ్యయనాలు రుజువు చేశాయి. అలాగే బిపి పెంచే కార్యకలాపాలను కూడా నిలవరించడం ద్వారా బిపిని తగ్గించడంలో వెల్లుల్లి సాయపడుతుంది.
కాన్సర్ పై పోరాటం...
వెల్లుల్లి పచ్చిగా తినడం ఎంతో మంచిదని రుజువైంది. దీనిని చితక్కొట్టినప్పుడు డియాలిల్ డైసలె్ఫైడ్, అలిల్ ట్రై సలె్ఫైడ్ వంటి కాంపౌండ్లు ఏర్పడి రొమ్ము, ఉదరం, బ్లాడర్, ప్రోస్టేట్ కాన్సర్లపై పోరడటానికి పని చేస్తాయి. కాన్సర్ కణాలు ఏర్పడకుండా వెల్లుల్లి నిరోధిస్తుంది. దీనితో ట్యూమర్ల పెరుగుదల కూడా నిదానిస్తుంది. కాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు మంచి రోగనిరోధక శక్తి ఉండాలి. వెల్లుల్లి దీనిని ఇస్తుంది.
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది...
వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. వెల్లుల్లిలో ఉండే అల్లియమ్ బాక్టీరియా, ఫంగ స్, వైరస్‌ల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలో సాయపడుతుంది. జలుబును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాలిన గాయాలున్న వారిలో, కోసుకొని గాయాలైన వారిలో ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియా పెరగకుండా వెల్లుల్లి నిరోధిస్తుంది. అలాగే జర్ణకోశంలో ఉండే ఇన్ఫెక్షన్లను కూడా ఇది నిరోధిస్తుంది.
గర్భిణీలకు మంచిది...
వెల్లుల్లిలో ఉండే ఆరోగ్యకరమైన న్యూట్రియంట్లు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిలోని రోగనిరోధక వక్తిని పెంచే గుణాల వల్ల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అంతేకాదు, గర్భస్థ సమయంలో పిల్లల బరువు పెంచడంతో ఎంతో సమర్ధంగా పని చేస్తుందని రుజువైంది. గర్భిణీలలో మూత్ర విసర్జనను పెంచి లోపల ఉన్న టాక్సిన్లు విడుదలయ్యేందుకు దోహదం చేస్తుంది. అయితే మంచి చేస్తుందని ఎక్కువగా తీసుకోవడమూ మంచిది కాదు. వెల్లుల్లిలో ఉన్న ఒకే ఒక్క దుర్గణం అది కలిగించే ఘాటైన వాసన. దీనివల్ల నోటి నుంచి, శరీరం నుంచి కూడా దుర్వాసన వెలువడుతుంది. అందుకే దీనిని తగ్గించేందుకు వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే పచ్చి వెల్లుల్లి కన్నా ఉడకబెట్టిన వెల్లుల్లి తక్కువ వాసనను కలిగి ఉంటుంది.

No comments:
Post a Comment