Friday, July 12, 2013

ఔషధమూలిక గోరింటాకు:-


గోరింటాకు అంటే అదేదో ఆడవాళ్ళకు సంబంధించిన విషయం అనుకోకండి. ఆయుర్వేదం పరంగా గోరింటాకు ఒక ఔషధం. గోరింటాకును రుబ్బి గోర్లపై భాగంలో పెట్టుకోవడం వలన గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. అరిచేతిలోనూ, అరికాళ్ళలోనూ పెట్టుకోవడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ శరీరంలో ఇతర భాగాలకు సంబంధించిన నాడులు ఉంటాయి. ఆయుర్వేదంలో కొన్ని పద్ధతుల ద్వారా గోరింటాకును శరీరంలోకి ఔషధంగా తీసుకోవడం వలన అల్సర్ మొదలైన రోగాలను నయం చేయడమే కాకుండా, పేగులను శుభ్రపరుస్తుందని ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. శరీరంలో వేడి బాగా పెరిగినప్పుడు గోరింటాకును అరికాళ్ళ నిండ పట్టించుకుంటే వేడి తగ్గిపోతుంది. మార్కెట్‌లో గోరింటాకుతో చేసిన నూనె దొరుకుతుంది. శరీరానికి గాయమై రక్తం కారుతున్న సమయంలో, కాసింత గోరింటనూనెను గాయమైన భాగం మీద రాస్తే కాసేపట్లోనే విడిపోయిన చర్మం కలిసిపోయి, గాయం అతి త్వరగా మనిపోతుంది.

గోర్లు, శరీరంలో వేడి కేవలం ఆడవాళ్ళకే ఉండవు, మగవారికి కూడా ఉంటాయి. తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఎవరి గోర్లైనా పుచ్చిపోతాయి. ఆరోగ్యం కోసం గోరింటాకు అందరూ పెట్టుకోవాలి. గోరింటాకు ఆడవాళ్ళకే అని ఎక్కడ చెప్పలేదు. వ్రతం, పూజలు, వివాహాల సమయంలో, పెద్ద పెద్ద క్రతువులు చేసే సమయంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు.

ఇక్కడ గోరింటాకు అంటే బయట దుకాణాల్లో మెహంది లేక గోరింటాకు పోడి కాదు. గోరింటకు చెట్టు నుంచి కోసి రుబ్బిన ఆకుకే ఔషధ గుణాలు ఉంటాయని మర్చిపోకండి. పెట్టుకొవలసిన చోట పెట్టుకోకుండా మోచేతులు, మోకాళ్ళ వరకు పెట్టుకున్నా ఉపయోగం లేదని గుర్తించండి. అందరి ఆరోగ్యమే దేశసౌభాగ్యం.

No comments:

Post a Comment