Thursday, January 28, 2016

తెల్ల వెంట్రుకలు నల్లబడటానికి అద్బుత యోగాలు

* మొదటి పద్దతి -
తగినన్ని పచ్చి ఉసిరిక కాయలు కాని , ఎండు ఉసిరికాయలు కాని తీసుకుని ముందుగా లోపలి విత్తనాలు తీసివేయాలి . కాయలపైన ఉండే పై బెరడుని ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం పూట ఆ నీళ్లు పారబోసి కాయల బెరడు ని ఏడు సార్లు మంచి నీళ్లతో కడగాలి. తరువాత ఆ బెరడుని ఒక పాత్రలో వేసి తగినంత ఆవునెయ్యి కలిపి పొయ్యిమీద పెట్టి , ఆ బెరడు ముక్కలు మెత్తగా అయ్యేదాక ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన బెరడుని అన్నంలో కలుపుకుని గాని లేక విడిగా గాని తినాలి . ఇలా నెలకు అయిదారు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి. అంతే కాకుండా శరీరానికి మంచి బలం , అద్బుతమైన సౌందర్యం చేకురతాయి.
* రెండో పద్దతి -
ఉసిరికాయల బెరడుని పింగాణి గిన్నెలొ పోసి అవి మునిగేంత వరకు రాత్రిపూట గుంటగలగర ఆకు రసం పోసి ఉదయాన్నే ఎండబెట్టాలి. ఇలా వారం రోజులపాటు గుంటగలగర ఆకు రసం పోయడం పగలు ఎండబెట్టటం చేయాలి . ఎనిమిదో రోజు న ఆ ఎండిన బెరడు ముక్కలని మెత్తటి చూర్ణం గా దంచి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి జాగ్రత్త చేసుకోవాలి .
ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం 3 గ్రా చొప్పున తేనెతో కలిపి సేవిస్తుంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* మూడొ పద్దతి -
బోడసరం చెట్టు పువ్వులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ప్రతిరోజు ఆ చూర్ణాన్ని ఉదయం పూట 5 గ్రా మోతాదుగా తేనెతో కలిపి తింటూ ఉంటే మెదడుకి , శిరస్సుకి అమితమైన బలం కలిగి తెల్లవెంట్రుకలు నల్లబడతాయి. దాంతో పాటు మానసిక జబ్బులు తగ్గిపోతాయి . జ్ఞాపకశక్తి, ధారణాశక్తి పెరుగుతుంది.
* నాలుగో పద్దతి - అత్యుతమ కేశ తైలం .
మంచి కొబ్బరినూనె అరకిలొ తెచ్చి అందులొ 5 నిమ్మ పండ్ల రసం పిండి సన్నటి సెగ తగిలేలా పొయ్యిమీద పెట్టాలి. క్రమంగా నిమ్మరసం ఇగిరిపొయి నూనె మాత్రమే మిగులుతుంది. దాన్ని వడపోసుకొని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను తలకు రాస్తూ ఉంటే క్రమంగా వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి పేలు , చుండ్రు, దురద నశించి తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా , ఒత్తు గా , పొడవుగా పెరుగుతాయి.

వెంట్రుకల సమస్యలు - నివారణా పద్దతులు .

వెంట్రుకలు వూడి పోతున్నందుకు -
* మినుములు , మెంతులు సమానంగా మెత్తగా రుబ్బి, ఆ పేస్టు ని తలకు పట్టించి అరగంట తరువాత కుంకుడు కాయలతో స్నానం చేయండి . తొందరలొనే మీ సమస్య నివారించ బడుతుంది .
* గొరింట పువ్వులు , ఆకులు దంచి రసం తీసి కొబ్బరి నూనె తో కాచి వడపోసుకొని ఆ నూనె ని తలకు రాసుకుంటూ ఉంటే వెంట్రుకుల కుదుళ్ళు గట్టిపడి వుడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడి వూడి పొవడం ఆగిపొతుంది. క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా నిగనిగలాడుతూ అందంగా వుంటాయి.
* మంచి నీళ్లలో తగినంత పొగాకు వేసి బాగా నానబెట్టి పిసికి ఆ నీటిని తల వెంట్రుకలకు రాస్తూ వుంటే వెంట్రుకలు రాలడం తగ్గిపొతుంది.
* ఉల్లిపాయ గింజలని నీళ్లతో నూరి తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకలు ఉడి పొవడం ఆగిపొయి వెంట్రుకలు వొత్తుగా పెరుగుతాయి.
* పల్లేరు పువ్వులు , నువ్వుల పువ్వులు సమానంగా తెచ్చి వాటికి సమానంగా నెయ్యి, తేనే కలిపి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు విపరీతంగా పెరుగుతాయి.
* కరకపొడి , ఉసిరికపొడి ,తానికాయ పొడి, నీలిఆకు పొడి, లోహ భస్మం ఇవన్ని సమబాగాలుగా కలిపి గుంటగలగర ఆకు రసంతో , గొర్రె మూత్రంతో మర్దించి వెంట్రుకలకు పూస్తూ ఉంటే ఆకాలంలో వెంట్రుకలు నెరవడం ఆగిపొయి నెరిసిన వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి.
* వెంట్రుకలు మృదువుగా ఉండాలి అంటే మెంతికూర ఆకులను మంచినీళ్ళతో నూరి ఆ ముద్దను తలకు పట్టిస్తూ ఉంటే వెంట్రుకల గరుకుతనం పోయి మృదుత్వం వస్తుంది.
* రేగి చెట్టు ఆకులు నీళ్లతో నూరి ఆ ముద్దను తలకు రుద్దుకొని స్నానంచేస్తూ ఉంటే వెంట్రుకలు పగలకుండా చక్కగా వొత్తుగా పెరిగి మృదువుగా ఉంటాయి.
* ఆలివ్ ఆయిల్ లొ గాని , కొబ్బరి నూనె లొ గాని నూనెకి సమానంగా మందార పువ్వుల రసం పోసి ఆ రసం అంతా ఇగిరించి మిగిలిన నూనెని తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు చక్కగా ఎదుగుతాయి.
* వెల్లుల్లిపాయల పొట్టుని కాల్చిన మసిని , ఆలివ్ అయిల్ లో కలిపి రెండు రోజులు నిలువ ఉంచి తలకు రాస్తూ ఉంటే వెంట్రుకలు వంకర వంకరగా పెరుగుతాయి.
* మూసాంబరం అన్ని పచారి షాపుల్లో దోరికిద్ధి. దానిని రెండు వంతుల గాటు సారాయిలో కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* పిచ్చి పుచ్చకాయ విత్తుల నుంచి తీసిన నూనెని నిత్యం తలకు మర్దిస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు అన్ని నల్లగా నిగనిగలాడుతూ మారిపొతాయి.

మొటిమల నివారణా పద్దతులు -

* కస్తూరి పసుపు , నిమ్మకాయల రసంలో అరగదీసి రాసిన మొటిమలు తగ్గుతాయి .
* మంజిష్ట తేనెతో అరగదీసి పూస్తే పోతాయి .
* చందనం , జాజికాయ , మిరియాలు నూరి పూస్తే పొతాయి.
* గేదే వెన్నను మొటిమలపైన పూయు చున్న పొతాయి.
* రక్తచందనం , పచ్చి పసుపు , గేదే పాలతో నూరి పూస్తే మొటిమలు పొతాయి.
* శొంటి , లవంగాలు, బాగుగా నూరి పట్టిస్తే మొటిమలు పొతాయి.
* వెల్లుల్లి రసం మొటిమల పైన రాస్తే తగ్గుతాయి .
* బియ్యం కడిగిన నీళ్ళు ముఖానికి రాస్తూ 10 నిమిషాలు అయిన తరువాత కడుగుచుండిన మొటిమలు పొతాయి.
* పచ్చపెసల పిండి , హారతి కర్పూరం , సుగంధి పాల వీటిని సమబాగాలుగా కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని ప్రతి రాత్రి ముఖానికి రాస్తూ ఉంటే మొటిమలు , మచ్చలు పోయి ముఖానికి మంచి కాంతి , సౌందర్యం పెరుగుతాయి.
* 50 గ్రా వాముతో , 40 గ్రా పెరుగు కలిపి మెత్తటి పేస్ట్ లాగా నూరి రాత్రి పూట ఫేస్ పేస్ట్ లా నూరి రాత్రి పూట ముఖానికి అవసరం అయినంత వరకు ప్యాక్ లా వేసుకుంటూ ఉంటే మొటిమలు పూర్తిగా నివారించ బడుతాయి.
* అతివస , శ్రీగంధం సమబాగాలుగా తీసి , ఆవుపాలతో నూరి 7 రోజులు ముఖానికి పూసిన మొటిమలు హరించును.
* తులసి ఆకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించిన మొటిమలు పోవును .
* తులసిఆకులు , పుదినా , వేపాకు మెత్తగా నూరి ముఖానికి పుసిన మొటిమలు హరించును.
* బాదంపాలు లేక రసం పుసిన మొటిమలు పోవును .
* బొప్పాయి కాయ రసం రాస్తే మొటిమలు హరించును. కడిగితే జిడ్డు పొతుంది.
* ప్రతిరోజు పడుకునే ముందు పుదిన రసం రాసి అరగంట తరువాత కడిగిన తగ్గును .
* పోకచేక్కతో గంధం తీసి రాసిన మొటిమలు పోవును .
* చిక్కుడు ఆకుల రసం పుసిన ముఖము పైన అన్ని మచ్చలు పోవును .
* వేడినీళ్ళతో నిమ్మరసం పిండి టీస్పూన్ గ్లిసరిన్ కలిపి పట్టించి అరగంట తరువాత కడిగిన పోవును

Wednesday, January 27, 2016

* మూలికలతో షాంపూ పొడి -

ఉసిరికాయ బెరడు , వేపాకులు , తెల్ల చందనం, బాదంపాలు, యష్టి మధూకమ్ ఇవి సమాన బాగాలుగా తీసుకుని పొడి చేయించి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకొని స్నానానికి వెళ్లబోయే ముందు వెంట్రుకలను పాయలుగా విడదీసి ఈ పొడిని కుదుళ్ళ మద్య చల్లాలి. పది నిమిషాల తరువాత సన్నటి పళ్ళుగల దువ్వెనతో వెంట్రుకలను దువ్వేయాలి. అప్పుడు ఈ పొడితో పాటు వెంట్రుకలను అంటి ఉన్న జిడ్డు, మురికి బయటకు వచ్చేస్తుంది. తరువాత తలారా స్నానం చెయవచ్చు.
యష్టి మధూకమ్ పచారి షాపుల్లో దొరుకుతుంది.
లిక్విడ్ హెర్బల్ షాంపు -
కుంకుడు కాయల పొడి , గుంతగలగరాకు , నిమ్మ కాయ చెక్కలు, టీ పొడి, సామ్బరేణి ఆకులు వీటిలో అన్నింటిని గాని , లేక దొరికిన వాటిని కాని గుప్పెడు తీసుకుని ఒక లోటాడు వేడి నీళ్లలో వేయాలి . తరువాత గిలక్కొట్టి షాంపూ లా వాడవచ్చు.
* బిరుసు జుట్టుకు -
మహా నీలి బృంగరాజ తైలం 3 చెంచాలు
నిమ్మరసం 1 చెంచా .
కోడిగుడ్డు పచ్చసోన 1 చెంచా .
తేనే 1 చెంచా .
వీటన్నింటిని తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి కొంచం సేపు ఆగి స్నానం చేయాలి . నిమ్మరసం వెంట్రుకల పైన ఉండే కెరటిన్ పొరని వుబ్బెలా చేసి వెంట్రుకలను మృదువుగా మెరిసేలా చేస్తుంది . కోడిగుడ్ల సోన వెంట్రుకలకు కావలసిన ప్రోటీన్స్, సల్ఫర్ సమకూరుస్తుంది.
గమనిక -
* మహా నీలి బృంగరాజ తైలం ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.
* తేనే వలన వెంట్రుకలు ఎర్రబడటం అన్నది అపోహే .
* కొడిగుడ్డు సొన వాడలేని వారు ప్రత్యామ్నాయంగా పెరుగు వాడుకొవచ్చు.
* జుట్టు ముదురు రంగులో కనిపించడం కోసం -
గుంటగలగర ఆకు , సంబరేణి మొక్క , మరువం వీటిని పేస్ట్ లా చేసి తలకు పట్టించి స్నానం చేయాలి
* గొరింటాకు, నీలిచెట్టు ని నలుగగొట్టి తీసిన రసం , చండ్ర చెట్టు సారం వీటితో మంచి హెర్బల్ డై తయారు అవుతుంది.
* గొరింటాకు ని యధాతధంగా నూరి పేస్టు లా ఉపయోగించ వచ్చు.
* టీ ఆకులని నీళ్లలో వేసి వాటి సారం మొత్తం నీళ్లలో దిగేంత వరకు మరగనిచ్చి ఆ నీళ్లని ఉపయోగించాలి. ఫలితం కొరకు మూడు నుంచి నాలుగు సార్లు ప్రయోగించవలసి ఉంటుంది. అలాగే వీటితో పాటు నిమ్మరసం పూస్తే వెంట్రుకల పై ప్రభావం తొందరగా కనిపిస్తుంది. చాలాకాలం వరకు ఉంటుంది.
జాగ్రత్తలు -
* వేడినీటితో తలస్నానం చేయరాదు .
* మానసిక అందోళన వల్ల కూడా వెంట్రుకల సమస్యలు వస్తాయి.
* శరీరంలోని అధిక కొవ్వు కూడా వెంట్రుకలకు రక్తప్రసరణ అడ్డుకుంటుంది.
కావున తగుజాగ్రత్తలు తీసుకుని సమస్యలు నుండి బయటపడగలరు అని ఆశిస్తున్న.

గోవుతో వైద్యం .

* ఆవుపాలు - 

ఇవి మధురంగా సమ శీతోష్న్ం గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.

* ఆవుపెరుగు - గర్భిణి స్త్రీకి వరం .

వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.

* ఆవు వెన్న -

ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.

* ఆవునెయ్యి -

ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .

* ఆవుపేడ -

ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.

* గుధస్తానంలో తిమ్మిరి కొరకు -

ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .

* వంటి దురదలకు -

అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి .

* కడుపులోని క్రిములకు -

20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.

ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .

* ఆవుముత్రం -


* ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి .

* గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.

* వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.

* గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.

* ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.

* ప్రతిరోజు ఉదయమే గొముత్రాన్ని 30 గ్రా మొతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.