* మొదటి పద్దతి -
తగినన్ని పచ్చి ఉసిరిక కాయలు కాని , ఎండు ఉసిరికాయలు కాని తీసుకుని ముందుగా లోపలి విత్తనాలు తీసివేయాలి . కాయలపైన ఉండే పై బెరడుని ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం పూట ఆ నీళ్లు పారబోసి కాయల బెరడు ని ఏడు సార్లు మంచి నీళ్లతో కడగాలి. తరువాత ఆ బెరడుని ఒక పాత్రలో వేసి తగినంత ఆవునెయ్యి కలిపి పొయ్యిమీద పెట్టి , ఆ బెరడు ముక్కలు మెత్తగా అయ్యేదాక ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన బెరడుని అన్నంలో కలుపుకుని గాని లేక విడిగా గాని తినాలి . ఇలా నెలకు అయిదారు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి. అంతే కాకుండా శరీరానికి మంచి బలం , అద్బుతమైన సౌందర్యం చేకురతాయి.
* రెండో పద్దతి -
ఉసిరికాయల బెరడుని పింగాణి గిన్నెలొ పోసి అవి మునిగేంత వరకు రాత్రిపూట గుంటగలగర ఆకు రసం పోసి ఉదయాన్నే ఎండబెట్టాలి. ఇలా వారం రోజులపాటు గుంటగలగర ఆకు రసం పోయడం పగలు ఎండబెట్టటం చేయాలి . ఎనిమిదో రోజు న ఆ ఎండిన బెరడు ముక్కలని మెత్తటి చూర్ణం గా దంచి జల్లెడ పట్టి వస్త్రగాలితం చేసి జాగ్రత్త చేసుకోవాలి .
ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం 3 గ్రా చొప్పున తేనెతో కలిపి సేవిస్తుంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతాయి.
* మూడొ పద్దతి -
బోడసరం చెట్టు పువ్వులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ప్రతిరోజు ఆ చూర్ణాన్ని ఉదయం పూట 5 గ్రా మోతాదుగా తేనెతో కలిపి తింటూ ఉంటే మెదడుకి , శిరస్సుకి అమితమైన బలం కలిగి తెల్లవెంట్రుకలు నల్లబడతాయి. దాంతో పాటు మానసిక జబ్బులు తగ్గిపోతాయి . జ్ఞాపకశక్తి, ధారణాశక్తి పెరుగుతుంది.
* నాలుగో పద్దతి - అత్యుతమ కేశ తైలం .
మంచి కొబ్బరినూనె అరకిలొ తెచ్చి అందులొ 5 నిమ్మ పండ్ల రసం పిండి సన్నటి సెగ తగిలేలా పొయ్యిమీద పెట్టాలి. క్రమంగా నిమ్మరసం ఇగిరిపొయి నూనె మాత్రమే మిగులుతుంది. దాన్ని వడపోసుకొని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను తలకు రాస్తూ ఉంటే క్రమంగా వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి పేలు , చుండ్రు, దురద నశించి తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా , ఒత్తు గా , పొడవుగా పెరుగుతాయి.
No comments:
Post a Comment