Wednesday, January 27, 2016

* మూలికలతో షాంపూ పొడి -

ఉసిరికాయ బెరడు , వేపాకులు , తెల్ల చందనం, బాదంపాలు, యష్టి మధూకమ్ ఇవి సమాన బాగాలుగా తీసుకుని పొడి చేయించి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచుకొని స్నానానికి వెళ్లబోయే ముందు వెంట్రుకలను పాయలుగా విడదీసి ఈ పొడిని కుదుళ్ళ మద్య చల్లాలి. పది నిమిషాల తరువాత సన్నటి పళ్ళుగల దువ్వెనతో వెంట్రుకలను దువ్వేయాలి. అప్పుడు ఈ పొడితో పాటు వెంట్రుకలను అంటి ఉన్న జిడ్డు, మురికి బయటకు వచ్చేస్తుంది. తరువాత తలారా స్నానం చెయవచ్చు.
యష్టి మధూకమ్ పచారి షాపుల్లో దొరుకుతుంది.
లిక్విడ్ హెర్బల్ షాంపు -
కుంకుడు కాయల పొడి , గుంతగలగరాకు , నిమ్మ కాయ చెక్కలు, టీ పొడి, సామ్బరేణి ఆకులు వీటిలో అన్నింటిని గాని , లేక దొరికిన వాటిని కాని గుప్పెడు తీసుకుని ఒక లోటాడు వేడి నీళ్లలో వేయాలి . తరువాత గిలక్కొట్టి షాంపూ లా వాడవచ్చు.
* బిరుసు జుట్టుకు -
మహా నీలి బృంగరాజ తైలం 3 చెంచాలు
నిమ్మరసం 1 చెంచా .
కోడిగుడ్డు పచ్చసోన 1 చెంచా .
తేనే 1 చెంచా .
వీటన్నింటిని తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి కొంచం సేపు ఆగి స్నానం చేయాలి . నిమ్మరసం వెంట్రుకల పైన ఉండే కెరటిన్ పొరని వుబ్బెలా చేసి వెంట్రుకలను మృదువుగా మెరిసేలా చేస్తుంది . కోడిగుడ్ల సోన వెంట్రుకలకు కావలసిన ప్రోటీన్స్, సల్ఫర్ సమకూరుస్తుంది.
గమనిక -
* మహా నీలి బృంగరాజ తైలం ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది.
* తేనే వలన వెంట్రుకలు ఎర్రబడటం అన్నది అపోహే .
* కొడిగుడ్డు సొన వాడలేని వారు ప్రత్యామ్నాయంగా పెరుగు వాడుకొవచ్చు.
* జుట్టు ముదురు రంగులో కనిపించడం కోసం -
గుంటగలగర ఆకు , సంబరేణి మొక్క , మరువం వీటిని పేస్ట్ లా చేసి తలకు పట్టించి స్నానం చేయాలి
* గొరింటాకు, నీలిచెట్టు ని నలుగగొట్టి తీసిన రసం , చండ్ర చెట్టు సారం వీటితో మంచి హెర్బల్ డై తయారు అవుతుంది.
* గొరింటాకు ని యధాతధంగా నూరి పేస్టు లా ఉపయోగించ వచ్చు.
* టీ ఆకులని నీళ్లలో వేసి వాటి సారం మొత్తం నీళ్లలో దిగేంత వరకు మరగనిచ్చి ఆ నీళ్లని ఉపయోగించాలి. ఫలితం కొరకు మూడు నుంచి నాలుగు సార్లు ప్రయోగించవలసి ఉంటుంది. అలాగే వీటితో పాటు నిమ్మరసం పూస్తే వెంట్రుకల పై ప్రభావం తొందరగా కనిపిస్తుంది. చాలాకాలం వరకు ఉంటుంది.
జాగ్రత్తలు -
* వేడినీటితో తలస్నానం చేయరాదు .
* మానసిక అందోళన వల్ల కూడా వెంట్రుకల సమస్యలు వస్తాయి.
* శరీరంలోని అధిక కొవ్వు కూడా వెంట్రుకలకు రక్తప్రసరణ అడ్డుకుంటుంది.
కావున తగుజాగ్రత్తలు తీసుకుని సమస్యలు నుండి బయటపడగలరు అని ఆశిస్తున్న.

No comments:

Post a Comment