Saturday, June 11, 2016

• సోయాపాలు.

బరువు తగ్గాలన్నా.. ఎముకలు బలంగా ఉండాలన్నా.. ఈస్ట్రోజన్‌లోపాన్ని అధిగమించాలన్నా సోయాపాలు మేలంటున్నారు నిపుణులు. 

ఎందుకంటే....!

ఈ పాలల్లో ఫ్యాటీ ఆమ్లాలూ, మాంసకృత్తులూ, పీచు, విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినందివ్వడమేకాదు, చురుగ్గా పనిచేసేందుకూ తోడ్పడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల మోనో, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడతాయి.

* ఇందులోని ఒమెగా 3, 6 ఫ్యాటీయాసిడ్లు, అత్యంత శక్తిమంతమైన ఫైటో - యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. దీనివల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతమవుతుంది.

* సహజంగానే చక్కెర తక్కువగా ఉంటుంది సోయాపాలల్లో. అంతేకాదు కెలోరీల పరంగా ఇది వెన్నతీసిన పాలతో సమానం! కాబట్టి బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరానికి పీచూ అందుతుంది కాబట్టి.. తరచూ ఆకలి కూడా ఉండదు.

* మెనోపాజ్‌ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోతుంటుంది. హృద్రోగం, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు వీళ్లని వేధిస్తుంటాయి. సోయాపాలు ఇలాంటివాటికి చక్కటి ఉపశమనం. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరిస్తుంది.

* వయసు పెరిగేకొద్దీ చాలామంది మహిళల్లో కనిపించే మరో సమస్య ఆస్టియోపోరోసిస్‌. ఆ సమస్య తీవ్రతను కొంతవరకూ తగ్గించుకోవాలంటే.. సోయాపాలు సరైన పరిష్కారం. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌ ఎముకలకు తగిన క్యాల్షియం క్యాల్షియం అందేలా తోడ్పడుతుంది.

No comments:

Post a Comment