Wednesday, March 19, 2014

మొక్క జొన్నతో ఆరోగ్యం:-


1.మొక్క జొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణక్రీయను పెంపొందిస్తుంది.

2.మొక్క జొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్ అరికడుతుంది.
3.మొక్క జొన్నలో కావాలసినన్ని లవణాలు లేదా మినరల్స్ ఉంటాయి. పసుపు రంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్ అదికం, మెగ్నిషియం, ఐరన్, కాఫర్, ఫాస్పరస్ వంటివి కూడా వీటిలో వుండి ఎమకులు గట్టిపడేలా చేస్తాయి
4.మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సంరంక్షణ : మొక్క జొన్నలో యాంటీ ఆక్సిడెంట్లువుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
5. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే దీనిలో వుండే లినోలె యాసీడ్ చర్మ మంటలను, లేదా ర్యాష్లను కూడా తగ్గిస్తుంది. రక్తహీనతను అరికడతాయి: రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది, మిరి మీరు తినే స్వీట్ మొక్కజొన్న విటమిన్ ల మరియు పోలిక్ యాసిడ్ లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.
6.గర్భవతులకు ఈ ఆహారం ప్రధానం గర్బవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి వుండాలి. దీనిలో వుండే పోలిక్ యాసిడ్ గర్బవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్లు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. పోలిక్ యాసీడ్ తగ్గితే అది బేబీ బరువును తక్కవ చేస్తుంది. కనుక మొక్క జొన్న తింటే తల్లికీ, బిడ్డకు కూడా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది.

No comments:

Post a Comment