Thursday, September 11, 2014

జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు


జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉల్లిపాయ(ఉల్లిగడ్డ) తో పరిష్కారం  
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ , తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.తద్వారా తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి. ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల , జుట్టు బలంగా పెరుగుతుంది.జుట్టు లో ఉన్న ఫంగస్ ని హరింపచేసి చుండ్రును నివారిస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారుతుంది.ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. వారంలో 3 సార్లు ఉల్లిరసం తలకు పట్టిస్తే , రెండు నెలల్లో కొత్త జుట్టు రావడం గమనిస్తారు.
 అప్లై చేసే విధానం  
1)
ఉల్లిపాయలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి, ఒక బట్టలో తీసుకొని పిండితే రసం వస్తుంది.
2) ఈ రసాన్ని తలకు పట్టించి , మృదువుగా ఒక 5 నిముషాలు మసాజ్ చేయాలి.
3) 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
 తీసుకోవాల్సిన జాగ్రత్తలు  
1)
తల స్నానానికి హెర్బల్ షాంపూ మాత్రమే వాడాలి ( nuzen /himalaya /sesa ఈ మూడింట్లో ఒకటి ఎంచుకోవాలి )
2)
మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
3)
తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండేట్లు చూసుకోవాలి.
4)
రోజులో కనీసం 3 లీటర్ల నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.

ఇలా చేస్తే అందమైన జుట్టు మన సొంతం.

No comments:

Post a Comment