Friday, September 19, 2014

సొరకాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:-

* సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం అని అందరూ ఒప్పుకుంటారు. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో, వారు సొరకాయను తిని, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుకోండి.

* బరువు తగ్గిస్తుందిం వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది . ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. కాబట్టి బాటిగార్డ్ ను జ్యూస్ లా తయారుచేసి, త్రాగి బరువు తగ్గించుకోండి.

* కిడ్నీ సమస్యలున్నవారు, ఆల్రెడీ మీరు డయాలసిస్ చేసుకంటున్నట్లేతే, ఈ గ్రీన్ బాటిల్ గార్డ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే. డయాలసిస్ చేసుకొనే వారిలో ఇది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచతుంది.

* అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సొరకాయను ముక్కలుగా చేసి, జ్యూస్ చేసి, చిటికెడు ఉప్పు వేసి, మూడురోజులు తీసుకొన్నట్లైతే, కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది.

* నిద్రలేమి సమస్య?ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే, ఈ గ్రీన్ వెజిటేబుల్ ను డిన్నర్ లో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నిద్రలేమి వారికి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఉడికించి లేదా జ్యూస్, చేసి తీసుకోవచ్చు.

* పీచు పదార్థం ప్రధానంగా ఉండడం వల్ల సొరకాయ, అజీర్ణానికి చక్కటి ఔషధంగా పని చేస్తుంది. మలబద్ధకం, మొలలు వంటి అనేక రకాల రోగాలను సొరకాయ నివారిస్తుంది.

* ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగితే ఎంతో మంచిది. మూత్రంలో యాసిడ్‌ అధికంగా ఉన్న కారణంగా మూత్రనాళంలో ఉండే మంటను ఇది తగ్గిస్తుంది. అయితే వైద్యుని పర్యవేక్షణ మాత్రం మరువకూడదు.

* ఆయుర్వేదం ఏం చెబుతోందంటే... ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు సొరకాయ రసం తాగినట్లయితే జుట్టు చిన్నవయసులోనే నెరవకుండా కాపాడుతుంది.

* శరీరం పొడిబారకుండా, నిగనిగ మెరవడానికి సొరకాయ సహాయపడుతుంది. మీ చర్మం అంతర్గతంగా పరిశుభ్రపడడానికి ప్రకృతి సిద్ధంగా లభించే ఔషధంగా సొరకాయను వాడవచ్చు. అనేక రకాల చర్మ సంబంధమైన రుగ్మతల నుంచి సొరకాయ కాపాడుతుంది. శరీరంపై వచ్చే మచ్చలను తొలగించడానికి కూడా సొరకాయ దోహదపడుతుంది.

* తీవ్రమైన అతిసార, మధుమేహం, కొవ్వు అధికంగా ఉన్న, వేయించిన పదార్థాలు తినడం వల్ల సంభవించే విపరీతమైన దాహానికి మంచి విరుగుడుగా సొరకాయ పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. అలసటపాలు కాకుండా కాపాడుతుంది.

* సొరకాయ నిలువెల్లా నీరు నిండి ఉండడం వల్ల ఆహార పదార్థంగా వండి తిన్నప్పుడు సులభంగా త్వరగా అరిగిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవికాలంలో ఉదయం పూట ఒక గ్లాసు సొరకాయ రసం తాగడం వల్ల వడదెబ్బనుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పని చేయడానికి అయినా వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

No comments:

Post a Comment