Thursday, April 11, 2013

స్థూలకాయం-ఆహార విధానము


స్థూలకాయం-ఆహార విధానము

ఆహార నియమాలు
పొట్టలో గ్యాస్ తయారయ్యే శనగపిండి పదార్ధాలు(మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు, శనగపిండితో చేసిన తీపి పదార్ధాలు మొదలగునవి), మైదాతో తయారయ్యే మైసుర్ బజ్జీలు, మైద రొట్టెలు, మైదా పూరీలు మొదలగునవి సేవించరాదు.

ఆచరించవలసిన ఆహార ఔషధాలు
త్రిపలాదిచూర్ణం తీసుకుని పావు చెంచా నుండి ఒక చెంచా వరకు క్రమంగా పెంచుతూ తేనెతో గాని,
గోరు వెచ్చని నీటితో గాని వేడి శరీరం గలవారు మజ్జిగతో గాని సేవిస్తూ తమ బరువును తగ్గించుకోవాలి.

ఆహారసేవన విదానము
పొట్టలో అజీర్ణం కాకుండా,  ఆ ఆజిర్ణము వలన గ్యాస్, మంట పుట్టకుండా ఉంచటానికి, ఆహారము సేవించేటపుడు ప్రతీ ముద్దను పదిహేను నుండి ముప్పై రెండు సార్లు బాగా నమలి మింగాలి,  అలా చేయడం వలన నోటిలోని లాలాజలం గ్రంధుల నుండి లాలరసం ఉత్పన్నమయ్యి ఆహారంతో బాగా కలిపి నోటిలోనే కొంతబాగం ఆహారం జీర్ణం కావడం ప్రారంభం అవుతుంది.  దీనివలన కొత్తగా కొవ్వు పెరుగకపోగా అప్పటికే పెరిగి ఉన్న కొవ్వు కుడా క్రమంగా తగ్గుతుంది.

అనవసర కొవ్వుకు-ఔషద తైలం
త్రిపలాద్యతైలంను తీసుకుని దానిని రెండు పుటలా స్నానానికి గంట ముందు గోరువెచ్చగా కొవ్వు పెరిగిన అవయవాలుపై మర్దన చేస్తూ ఉంటె క్రమంగా అధిక కొవ్వు హరించిపోతుంది.

No comments:

Post a Comment