Saturday, April 13, 2013

సర్జరీ లేకుండానే సైనసైటిస్ మాయం


సర్జరీ లేకుండానే సైనసైటిస్ మాయం

తలనొప్పి, ముక్కు దిబ్బడ, నీరు కారటం, దగ్గు, జలుబు సైనసైటిస్ లక్షణాలు. వాతావరణం మారినపుడల్లా వైరస్, బాక్టీరియా, ఇన్ఫెక్షన్‌ల వల్ల సైనసైటిస్ వ్యాధి వస్తుంటుంది. ఇటీవల 90 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సైనసైటిస్‌కు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హోమియోలో అద్భుత చికిత్స ఉందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ మురళీ అంకిరెడ్డి.
సాధారణంగా సైనసైటిస్ వ్యాధి మనిషిని తీవ్రంగా బాధిస్తుంది. ఈ వ్యాధిని మూడు విభాగాలుగా చూడవచ్చు.

అక్యూట్ సైనసైటిస్ అంటే ఒక వారం రోజులుంటుంది. సబ్ అక్యూట్ అంటే 4 నుంచి 8 వారాలుంటుంది. క్రానిక్ అంటే దీర్ఘకాలిక సైనసైటిస్ అంటారు. ఈ వ్యాధి 8 నుంచి 10 వారాలుంటుంది. ఒక్క అమెరికాలోనే సైనసైటిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య 2.4 కోట్ల మంది ఉన్నారు. ఈ వ్యాధికి ఆపరేషన్ చేయించినా ఈ సమస్య మళ్లీ వస్తూనే ఉంటుంది.హోమియో అద్భుత చికిత్సతో రోగి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా సౖౖెనసైటిస్ వ్యాధిని నయం చేయవచ్చు. ముఖంలో కళ్ల దగ్గర, ముక్కు పక్క భాగం ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగం ఇన్ఫెక్షన్‌లతో వాచిపోవడాన్ని సైనసైటిస్ అంటారు. సైనసైటిస్‌లలో ఫ్రాంటల్, పారానాసల్, ఎత్మియిటల్, యాగ్జిలరీ, స్పినాయిడల్ రకాలున్నాయి.

కారణాలు
ఇన్ఫెక్షన్‌లు, బాక్టీరియా, వైరస్, ఫంగస్‌ల వల్ల సైనసైటిస్ వస్తుంటుంది. ఉపరితల శ్వాసకోశ వ్యాధులు, ముక్కులో దుర్వాసన, అలర్జీ, పొగ, విషవాయువుల కాలుష్యం, వాతావరణ కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణ మార్పులు, చలికాలం, వర్షాకాలం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మంచు ప్రదేశాలు, నీటిలో ఈదటం, జలుబు, గొంతునొప్పి, పిప్పిపన్ను, టాన్సిల్స్ వాపు, రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది.

లక్షణాలు
ముఖం భారంగా ఉండటం, తలనొప్పి, బరువు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో నొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారటం, గొంతులోనికి ద్రవం కారటం, గొంతు గరగర, దగ్గు, జలుబు, చెవిలో చీము పట్టడం, కోపంగా ఉండటం, మానసిక స్థైర్యం కోల్పోవటం, అలసట, విసుగు, పనిపై శ్రద్ధ లేకపోవటం సైనసైటిస్ లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ
ఎక్స్‌రే, సీటీ స్కాన్‌తోపాటు సైనస్ భాగంలో నొక్కితే నొప్పి వస్తే సైనసైటిస్ ఉందని గుర్తించవచ్చు.

దుష్పరిణామాలు
దీర్ఘకాలికంగా సైనసైటిస్ వ్యాధితో బాధపడే వారు కనురెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగి ఉండటం, కన్ను నరం దెబ్బతిన్నపుడు చూపు కోల్పోవటం, వాసన తెలియక పోవటం, తరచూ జ్వరం రావటం, ఎదుగుదల లోపాలు రావచ్చు.

సైనసైటిస్‌ను గుర్తించే ప్రశ్నావళి
మీరు పది రోజుల కంటే ఎక్కువగా ఈ కింది వాటిలో ఏ సమస్యతోనైనా బాధపడుతున్నారా? ఈ కిందివాటిలో మీకు ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే సైనసైటిస్ ఉన్నట్లే. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
ముఖభాగంలో నొప్పి ఉందా? అవును /కాదు
తలనొప్పి వస్తుందా? అవును /కాదు
ముక్కు దిబ్బడ ఉందా? అవును /కాదు
పసుపు ముక్కుస్రావాలు వస్తున్నాయా? అవును /కాదు
తీవ్ర జ్వరం ఉందా? అవును /కాదు
నోటి దుర్వాసన వస్తుందా? అవును /కాదు
పంటినొప్పి ఉందా? అవును /కాదు
ఎలా నివారించాలి?
మీ నోటిని తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తుండాలి. అలర్జీకి సంబంధించిన దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టూ ఎలాంటి నీరు, బురద లేకుండా ఉంచుకోవాలి. ఈతకొలనులో ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎందుకంటే ఈ నీరు ముక్కు లోపలి దళసరి చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువగా చల్లని పదార్థాలు, చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవడం మంచిది. వేడి ఆవిరి పట్టడం వల్ల సైనసైటిస్ సమస్యను కొంతవరకు నివారించవచ్చు.

హోమియో చికిత్స
హోమియోపతి ద్వారా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా సైనసైటిస్‌ను నివారించవచ్చు. హోమియోలో కానిస్టూషనల్ ట్రీట్‌మెంట్ ద్వారా ఎలాంటి సైడ్ఎఫెక్టులు లేకుండా సైనస్ బాధితులకు స్వస్థత కలిగించవచ్చు. సైనసైటిస్‌కు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మంచి మందులున్నాయి. ముఖ్యంగా కలిబైక్, కాలిసల్ఫ్, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, సాంగ్‌న్యురియా, రెయ్‌నా, మైనర్, స్పైజిలియా వంటి హోమియోమందులున్నాయి.

No comments:

Post a Comment