Thursday, May 2, 2013

వేసవికాలం



వేసవికాలంలో : నీటిలో మిరియాల పొడివేసి, మరిగించి కాచిన కషాయాన్ని వేసవిలో
ప్రతిరోజూ తగినన్ని మాత్రము తాగుతుంటే వేసవి కాలములో వచ్చే గొంతునొప్పి, జ్వరము,దగ్గు పార్శ్యపు నొప్పి వంటి వ్యాధులు సమసిపోతాయి. - నీటిలో శొంఠివేసి, బాగా మరిగించి కాచిన కషాయాన్ని వేసవిలో ప్రతీరోజూ స్వీకరిస్తూ వుంటే వేసవిలో కలుగు అతితాపము తగ్గిపోవును. - పిప్పళ్ళు, కరక్కాయ, బెల్లము సమపాళ్లలో తీసుకొని కొద్దిగా తింటూవుంటే వేసవి బాధలకు విరుగుడుగా పనిచేస్తుంది. -అల్లాన్ని చిన్న ముక్కలు తరిగి, మెత్తగా నూరిన ఉప్పులో అద్దుకొని ప్రతిరోజూ ఉదయం పూట తింటుంటే ఆకలి పెరిగి, తాపము నివారించను. - ధనియాలపొడితో కాచిన కషాయము వడదెబ్బ అతివేడిలాంటి వేసవి బాధలను నిరోధించును -వడదెబ్బ తాపములాంటి వేసవి బాధల నివారణకు నిమ్మరసము ఉప్పు కలిసిన పానీయములు అధికంగా తాగుట మంచిది. - మామిడిరసములో తగినంత పచ్చకర్పూరం, చక్కెర కలిపి తాగిన అతిదాహము లాంటి వేసవి బాధలకు దూరంగా వుండవచ్చును. - వేసవిలో వచ్చే మామిడిలాంటి పళ్ళను విరివిగా తీసుకుంటే వేసవి బాధలకు విరుగుడు పనిచేయును. - పలుచని మజ్జిగలో కొద్దిగా ఉప్పుడాని, నిమ్మరసం గాని కిలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తాగుతూ ఉంటే అతి దాహబాధలు తగ్గిపోతాయి.

No comments:

Post a Comment